Rs 1
-
బంపర్ ఆఫర్ : రూపాయికే బైక్ బుక్
సాక్షి, ముంబై: కరోనా కాలంలో రవాణా సదుపాయాలు తగినంతగా లేక ఇబ్బందులు పడుతూ, ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికోసం ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. బ్యాంక్ కస్టమర్లుఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరోవైపు ఫెస్టివల్ ఆఫర్‌గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను సైతం బ్యాంక్ అందిస్తోంది. 3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పిస్తోంది. ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అలాగే 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. హోండా మోటార్ సైకిల్ షోరూమ్‌ల నుండి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి పండుగ ఆఫర్‌గా5 శాతం క్యాష్ బ్యాక ఆఫర్ కూడా ఉంది. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. రానున్న పండుగ సీజన్, కరోనా మహమ్మారి ప్రోటోకాల్స్, కార్డ్‌ల ద్వారా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈజీ ఫైనాన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లకు ప్రోత్సాహాన్నివ్వాలని భావిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. భారతదేశం అంతటా 36,000 దుకాణాలలో వినియోగదారుల డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కాగా ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై కూడా ఇటీవలఈఎంఐ ఆఫర్ అందించడం ప్రారంభించింది. -
రూ.1000 నోటుపై ప్రభుత్వం క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాన్ చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెడుతున్నారని వస్తున్న ఊహాగానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ఉద్దేశ్యమేమీ ప్రస్తుతానికి లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ స్పష్టంచేశారు. మళ్లీ రూ.1000 నోట్లను కొత్తగా తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తలపై ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత కొత్త రూ.2000 నోట్లను, రూ.500 నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కానీ కొత్త సిరీస్‌లో రూ.1000 నోట్లను మాత్రం మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇటీవల కాలంలో కొత్త రూ.1000 నోట్లను ప్రజల్లోకి మళ్లీ అందుబాటులోకి రానున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.200, రూ.500, రూ.2,000ల మధ్య ఉన్న అంతరాన్ని పూరించడానికి తిరిగి రూ.1,000 నోటును తీసుకురానున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ వీటిని తిరిగి చలామణిలోకి తెచ్చే ఆలోచనేమీ లేదని ప్రభుత్వం తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన చిల్లర కొరత సమస్యకు పరిష్కారంగా ఇటీవలే ఆర్బీఐ కొత్తగా రూ.200 నోట్లను, రూ.50 నోట్లను ప్రవేశపెట్టింది. -
రిలయన్స్, బీపీకి మరో రూ.1,700 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం కేజీ–డీ6 క్షేత్రాల నుంచి నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్రం మరో 264 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,700 కోట్లు) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 నుంచి దాదాపు ఆరేళ్లుగా లక్ష్యాలను సాధించలేకపోవడం వల్ల విధించిన మొత్తం పెనాల్టీ సుమారు 3.02 బిలియన్ డాలర్లకి(దాదాపు రూ. 19,500 కోట్లు) చేరిందని చమురు శాఖ తెలిపింది. వ్యయాల రికవరీని అనుమతించకపోవడం రూపంలో ఈ జరిమానా ఉంటోంది. వాస్తవానికి ఉత్పత్తిలో వాటాల ఒప్పందం (పీఎస్సీ) ప్రకారం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ ముందుగా తమకైన వ్యయాలను గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలోనుంచి తగ్గించుకుని మిగతా లాభాలను ప్రభుత్వంతో పంచుకుంటున్నాయి. అయితే, వ్యయాల రికవరీకి అనుమతించని పక్షంలో లాభాల్లో ప్రభుత్వ వాటా పెరుగుతుంది. 2011–12లో కేజీ–డీ6 బ్లాక్‌లోని ధీరూభాయ్–1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 35.33 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తయ్యింది. ఆతర్వాత నుంచి తగ్గుతూ ప్రస్తుతం 4 ఎంసీఎండీ కన్నా తక్కువకి క్షీణించింది. గడిచిన సంవత్సరాలకు సంబంధించి వ్యయాల రికవరీని అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్ఐఎల్, బీపీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. -
రూపాయికే 51 శాతం వాటా!
♦ ముంద్రా పవర్ ప్రాజెక్టులో ♦ ఆఫర్ చేస్తున్న టాటా పవర్ న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న ముంద్రా పవర్ ప్రాజెక్టును గట్టెక్కించేం దుకు టాటా పవర్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టులో 51% వాటాలను రూ.1 కే విక్రయిస్తామంటూ తమ దగ్గర్నుంచి విద్యుత్ కొనుగోలు చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది. మరికాస్త అధిక రేటుకు విద్యుత్‌ను కొనుగోలు చేసే హామీ లభిస్తే కేవలం 49% వాటా మాత్ర మే ఉంచుకుని, నిర్వహణకు మాత్రమే తాము పరిమితం అవుతామని ప్రాజెక్టును నిర్వహిస్తున్న టాటా పవర్ విభాగం కోస్టల్ గుజరాత్ పవర్ (సీజీపీఎల్) పేర్కొంది. గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్‌కి ఈ మేరకు లేఖ రాసింది.రూ. 2.26కే యూనిట్‌ను విక్రయించేలా 2006లో ప్రాజెక్టును టాటా దక్కించుకుంది. అయితే, బొగ్గు విషయంలో అంచనాలు తప్పడంతో అధిక ధర కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ముంద్రా నష్టాలు రూ. 6,457 కోట్లు కాగా, రుణభారం రూ. 10,159 కోట్లు. కంపెనీ చెల్లింపు మూలధనం రూ. 6,083 కోట్లు. -
నష్టాలను తగ్గించుకున్న టాటా స్టీల్
ముంబై: ప్రముఖ స్టీల్ మేకర్ టాటా స్టీల్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. నాలుగవ త్రైమాసికంలో నికర నష్టాలను తగ్గించుకుంది. గత ఏడాది ఇదేక్వార్టర్లో రూ.3042కోట్ల నికర నష్టాలతో పోలిస్తే భారీగా పుంజుకుంది. గత ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,168 కోట్ల నికర నష్టాన్ని ఆర్జించింది. ఆదాయం 30.42 శాతం పెరిగి రూ.35,305 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.27,071 కోట్లు. అయితే ఆదాయం రూ .31,618.40 కోట్లగా ఉండనుందని 14 మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో కంపెనీకి భారత వ్యాపారంలో రూ .17,113.13 కోట్లు నష్టపోగా ఐరోపా వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ .15,243.52 కోట్లు. ఈ త్రైమాసికంలో స్టీల్ సరఫరా 22శాతం పుంజుకోవడంతో ఆదాయంలో 25శాతం పెరుగుదలకు దారితీసిందని సంస్థ తెలిపింది. టాటాస్టీల్ నికర డెట్ రూ .77518 కోట్లుగా ఉంది. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేసిన గోకులం చిట్స్!
సాక్షి, చెన్నై: తమిళనాడుకు చెందిన గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఆదాయ పన్ను సిబ్బంది గత 4 రోజులుగా జరిపిన సోదాల్లో రూ.1,100 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తమిళనాడు ఆదాయ పన్ను విభాగం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడులోని పలువురు ప్రముఖులపై పంజా విసిరిన ఆదాయ పన్ను అధికారులు.. ఇటీవల గోకులం చిట్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు వందల మంది సిబ్బంది బుధవారం నుంచి చెన్నై, పుదుచ్చేరిల్లోని గోకులం చిట్స్ కార్యాలయాలు, ఆస్తులపై దాడులు నిర్వహించగా.. పలు విలువైన రికార్డులు లభించాయి. -
భారీ ఆర్డర్ దక్కించుకున్నజెఎంసీ
ముంబై: ప్రముఖ దేశీయ రియల్ఎస్టేట్ సంస్థ జెఎంసీ ప్రాజెక్టు ఇండియా భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. రూ.1,058కోట్ల విలువైన ఆర్డర్‌ను సాధించింది. మహారాష్ట్ర ధానేలో రూ 531 కోట్ల విలువైన నివాస భవనం ప్రాజెక్ట్ ఆర్డర్, బెంగుళూరులో రూ. 527 కోట్ల రెండు వాణిజ్య భవన నిర్మాణ ప్రాజెక్టును సాధించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లోతెలిపింది. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు సంస్థ డైరెక్టర్ , సీఎఫ్‌వో మనోజ్ తులసియాన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఆర్డర్ తీసుకునేటపుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు. అలాగే 2018 ఆర్థిక సంవత్సరానికిగాను 15-20 వృద్ధి సాధించనున్నట్టు చెప్పారు. ఈ ప్రకటనతో మార్కెట్లో ఈ కౌంటర్ ఒకదశలో4 శాతం లాభపడింది. కాగా దేశీయ ఇంజనీరింగ్ మరియు నిర్మాణ సేవల సంస్థ జెఎంసీ భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణంతోపాటు, నిర్మాణం రంగంలోని డిజైన్, సేకరణ, సరఫరా, సంస్థాపన, టెస్టింగ్ లాంటి ఇతర ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. -
పెంపుడు జంతువులతో రోడ్లపైకి వస్తే బాదుడే !
-
వేదాంత లాభం నాలుగు రెట్లు జంప్
ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నాలుగురెట్ల పెరుగుదలతోమ రూ. 1,866 కోట్లు నికర లాభాలను ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో ఇదే క్వార్టర్ నికరలాభం రూ 412 కోట్లుగా ఉంది. ఆపరేషన్ల నుండి మొత్తం ఆదాయం 30 శాతం పెరిగి రూ. 20,393 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇది రూ. 15,731 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) 77 శాతం దూసుకెళ్లి రూ. 5879 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 21.1 శాతం నుంచి 28.8 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు కూడా రూ. 49 కోట్ల నుంచి రూ. 897 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో జింక్ ఇండియా మెటల్ ఉత్పత్తి క్వార్టర్ ఆన్ క్వార్టర్ 44 శాతంపెరిగినట్టు తెలిపింది. బాక్సైట్ మరియు కంకర మైనింగ్ ప్రారంభ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. క్వార్టర్ 3లో కాపర్ ఇండియా ఉత్పత్తి 102 కేటీ గా నమోదైనట్టు వేదాంత తెలిపింది. -
‘ఒంటరి మహిళల భృతి’పై కొలిక్కిరాని కసరత్తు
వయోపరిమితి నిర్ధారణపై సర్కారు తర్జన భర్జన సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకం మార్గదర్శకాలపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతిని అందిస్తామని సర్కారు గత శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలులోకి రావాల్సి ఉన్నందున లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గత పక్షం రోజులుగా కసరత్తు చేస్తోంది. వివాహం చేసుకోని మహిళలు, వివాహమైనప్పటికీ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నవారు, విడాకు లు తీసుకున్న మహిళలు, జోగినులను ఒంటరి మహిళలుగా పరిగణించాలని అధికా రులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయా కేటగిరీల మహిళలకు కనీస వయసును 35గా నిర్ణయిస్తే మేలని ప్రభుత్వానికి సూచించారు. అయితే.. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో మరో రెండు కేటగిరీల మహిళలను ఒంటరి మహిళలుగా పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. అత్యాచారం, యాసిడ్‌దాడులకు గురైన మహిళలను కూడా దీనికింద పరిగణించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. తదుపరి సమావేశంలో తుది నిర్ణయం సెర్ప్ ప్రతిపాదించిన విధంగా కనీస వయ సు 35గా నిర్ణయిస్తే, అంతకన్నా తక్కువ వయసున్న మహిళల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కనీస వయో పరిమితిని 21, 30, 35 ఏళ్లుగా నిర్ణయిస్తే, ఎంతమందికి లబ్ధి చేకూర్చవచ్చనే విషయమై అంచనాలు సిద్ధం చేయాలని సెర్ప్ అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. ప్రతిపాదనలలో మార్పులు చేసి, తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని సెర్ప్ అధికా రులు భావిస్తున్నారు. -
‘జీవాల ఫెడరేషన్’కు రూ.1000కోట్లు
ఖమ్మంరూరల్: గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించిందని రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం యల్లారెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెల కాపరులను కాపరులుగా కాకుండా యజమానులుగా చేసేందుకు సీఎం కేసీఆర్ 20శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 14లక్షల గొర్రెల, మేకల పెంపకందారుల కుటుంబాలు ఉన్నాయని, మూడు వేల సంఘాలతో మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. భవిష్యత్‌లో కొత్తగా 4లక్షల మంది సభ్యులను చేర్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రూ.450 కోట్లు గొర్రెల కాపరులకు రుణాలు అందించేందుకు నిధులు మంజూరైయినట్లు, మరో రూ.600 కోట్లు త్వరలో మంజూరు అవుతాయని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రూ.50కోట్లు మంజూరయ్యాయన్నారు. సభ్యులకు రూ.లక్ష రుణం ఇస్తే అందులో 20శాతం లబ్ధిదారుని వాటా, మిగిలిన రూ.60వేలు రుణం అని చెప్పారు. గొర్రెలకు రూ.173తో ఇన్సూరెన్స్ చేయిస్తే ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒక్కో గొర్రెకు రూ.5వేల బీమా సొమ్ము వస్తుందన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న గొర్రెల, మేకల సంతలను, మాంసం విక్రయించే మార్కెట్లను ఆధునీకరించి ప్రతి 50కిలోమీటర్లకు ఒక అంగడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, మేకల మల్లిబాబుయాదవ్, సంఘం నాయకులు కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పాత నోట్లుంటే జైలే!
‘ఆర్డినెన్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ పెద్ద మొత్తంలో పాత నోట్లు కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు? ♦ పదికి మించి పాత నోట్లు ఉంటే రూ.పది వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు.. ఏది ఎక్కువైతే అది జరిమానా ♦ జనవరి 1–మార్చి 31 తేదీల మధ్య తప్పుడుసమాచారంతో నగదు డిపాజిట్ చేస్తే రూ.5 వేలు లేదా ఆ డిపాజిట్ మొత్తానికి ఐదింతల జరిమానా ♦ రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత అమలులోకి.. ఆ నోట్లుంటే నేరం.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత నోట్లు కలిగి ఉండడం క్రిమినల్ నేరం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్షార్హం. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లకే అనుమతి జరిమానా.. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. జైలు శిక్ష కూడా.. మార్చి 31 తర్వాత రద్దయిన పెద్ద నోట్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం? జనవరి 1 – మార్చి 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సదరు మొత్తానికి ఐదు రెట్లు జరిమానా నోట్ల డిపాజిట్ల లెక్క రూ.15.4 లక్షల కోట్ల రద్దు చేసిన నోట్లలో ఇప్పటి వరకు బ్యాంకులు, పోస్టాఫీసులకు చేరింది.. రూ. 14 లక్షల కోట్లు న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేసేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. పెద్ద నోట్లు ఉంటే భారీగా జరిమానా.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. పెద్దనోట్లను డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని నిర్దిష్ట రిజర్వ్‌బ్యాంకు కార్యాలయాల్లో నిర్దేశిత పత్రాలను సమర్పిం చి మార్చి 31 వరకు నగదు డిపాజిట్ చేసేం దుకు అవకాశం ఇచ్చిన విషయం విదితమే. విదేశాల్లో ఉన్న వారికి.. మారు మూల ప్రాంతాల్లో పనిచేసే భద్రతా బలగాల్లో పని చేసే వారికి.. సరైన కారణం చూపించే ఇతరు లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. నాలుగేళ్ల జైలు శిక్ష!: మార్చి 31 తర్వాత పెద్ద మొత్తంలో రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే ప్రతిపాదన కేబినెట్ ముందుకొచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బ్యాంకులకు తిరిగి చేరని రద్దయిన నోట్లను రప్పించడానికి చట్టబద్ధమైన మద్దతును అందించేందుకు ఆర్బీఐ చట్టానికి సవరణలు చేయడానికి తాజా ఆర్డినెన్స్ ఉపకరించనుంది. అలాగే నోట్ల రద్దుకు సంబంధించి నవంబర్ 8న జారీ చేసిన నోటిఫికేషన్ సరిపోదని, ఆర్బీఐకి జవాబుదారీతనం కల్పించేందుకు.. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఆర్డినెన్స్ సహకరించనుంది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. ఆయన ఆమోదం లభించిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిన తర్వాత ఆరు నెలల కాలంలో పార్లమెంట్ దీనిని చట్టంగా ఆమోదించాల్సి ఉంటుంది. 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,000, రూ.5,000/10,000 నోట్లను రద్దు చేసినప్పు డు కూడా ఇలాంటి ఆర్డినెన్స్‌నే తెచ్చారు. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ‘ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం’కింద రూ.11,724.53 కోట్ల వ్యయంతో 5,400 కి.మీ రోడ్లు, 126 చిన్న వంతెనల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.7034.72 కోట్లను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఆర్థిక శాఖ కేటాయిస్తుంది. రుణాల చెల్లింపునకు మరో 30 రోజుల గడువు ముంబై: పెద్ద నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరికొంత వెసులుబాటు ఇచ్చింది. రుణాలు తిరిగి చెల్లించేం దుకు ఇప్పటికే 60 రోజుల అదనపు గడువు ఇచ్చిన ఆర్బీఐ తాజాగా దానిని మరో 30 రోజులు పొడిగించి 90 రోజులు చేసింది. రూ.కోటి లోపు విలువైన, నవంబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్యన తిరిగి చెల్లించాల్సి ఉన్న పంట, గృహ, వాహన తదితర రుణాలకు ఇది వర్తిస్తుంది. నోట్ల రద్దు వల్ల అనేక మంది వ్యాపారులు, ప్రజలు తమకు రావాల్సిన నగదును పొందలేకపోయారు. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిపోవడంతో చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల వంటి లావాదేవీలు కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అదనపు గడువిచ్చారు. -
కేరళలో ‘కొబ్బరి’ రోడ్లు!
రోడ్ల నిర్మాణంలో కొబ్బరి ఉత్పత్తులు కొబ్బరి పట్టాలతో మట్టి కట్టలు కాసులు కురిపిస్తున్న వైనం ఏకంగా రూ.1,500 కోట్ల ఎగుమతులు రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: కేరళ. ఈ పేరు వింటూనే టక్కున గుర్తొచ్చేది కొబ్బరి. ఎటు చూసినా దట్టంగా కొబ్బరిచెట్లతో కళకళలాడుతూ ఉంటుందా రాష్ట్రం. కొబ్బరితో పసందైన వంటలకు పెట్టింది పేరైన కేరళ ఇప్పుడు దాన్ని భారీగా ఆదాయం సమకూర్చి పెట్టే పరిశ్రమగా కూడా మార్చుకుంటోంది. అందులో భాగంగా ఏకంగా రోడ్ల నిర్మాణంలో కూడా ‘కొబ్బరి’ని వాడుతోంది! కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవమే. కొబ్బరి ఉత్పత్తులను రోడ్ల నిర్మాణంలో విరివిగా వాడుతోంది కేరళ ప్రభుత్వం. ఎంతగా అంటే, వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయం పొందేంతగా! ప్రసుతం ఏటా దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు రోడ్ల నిర్మాణం నిమిత్తం కేరళ నుంచి ఎగుమతి అవున్నాయి. ఈ ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కేరళ!! ఏం చేస్తారంటే... రోడ్ల నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తారు, కాంక్రిట్ మిక్స్ మాత్రమే నాణ్యంగా ఉంటే చాలదు. రోడ్డు నిర్మాణానికి తోడ్పడే మట్టి కట్ట కూడా బలంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా వాన నీటికి మట్టి జారిపోయి రోడ్డు కుంగిపోవటమో, భారీ కోతకు గురవడమో జరుగుతుంది. ఈ సమస్యకు కొబ్బరినే తిరుగులేని పరిష్కారంగా మార్చుకుంది కేరళ. రోడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు ముందుగా ఎత్తుగా మట్టికట్ట వేసి దాని మీద తారో, కాంక్రిట్ మిక్సో వేస్తారు. ఆ కట్ట బలహీనపడకుండా కేరళ కొబ్బరి ఉత్పత్తులు కాపుకాస్తాయన్నమాట. అదెలాగంటే... మట్టికట్ట వేసేముందే దానికి రెండువైపులా కొబ్బరి నారతో చేసిన పట్టాలను పరుస్తారు. వాటిపై వట్టి వేర్లు, ప్రత్యేక రకం గడ్డి విత్తనాలు చల్లుతారు. వాటిపై వారం పాటు నీటిని పిచికారి చేస్తారు. తర్వాత దానిపై కొన్ని మట్టి పొరలు వేసి మిగతా రోడ్డు నిర్మాణాన్ని మామూలుగానే పూర్తి చేస్తారు. తర్వాత కొద్ది రోజుల్లోనే కొబ్బరి నార పట్టాల లోపలి నుంచి వట్టి వేర్లు, గడ్డి బయటకు చొచ్చుకుని వస్తాయి. వాటి వేర్లు మాత్రం లోలోపలికి బలంగా పాకిపోతాయి. అలా మట్టికట్టకు చక్కని పటుత్వం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో కొబ్బరి నార పట్టాలు జీర్ణమై మట్టిలో కలిసిపోతాయి. వేర్లు మాత్రం మరింత బలంగా మారతాయి. ఈ పరిజ్ఞానం విదేశీయులను బాగా ఆకట్టుకుంది. ఎంతగా అంటే... ప్రస్తుతం జర్మనీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలకు కేరళ నుంచి భారీగా కొబ్బరి నార పట్టాలు ఎగుమతవు తున్నాయి. రోడ్డు వేసే ప్రాంతంలో ఉన్న నేల స్వభావం ఆధారంగా ఈ పట్టాల డిజైన్ కూడా పలు రకాలుగా ఉంటుంది!! ప్రస్తుతం కేరళలో ఏకంగా 90 కంపెనీలు ఈ పట్టాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇటీవల ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణంలో ‘కేరళ’ పట్టాల వాడకం బాగా పెరిగింది. ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌లో కేరళకు చెందిన ‘చరన్కట్ట కాయర్’ కంపెనీ తన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది.‘రోడ్ల నిర్మాణంలో మట్టికట్టలను పరిరక్షించేందుకు ప్రస్తుతం సింథటిక్ వస్తువులు అందుబాటులో ఉన్నా అవి పర్యావరణానికి హాని చేసేవి. అందుకే వాటి బదులు పర్యావరణహితమైన కొబ్బరి నార పట్టా విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మున్ముందు మా ఎగుమతులు బాగా పెరుగుతాయి. దీనికి భారత కాయర్ బోర్డు సహకారం కూడా బాగుంది’ అని చరన్కట్ట కాయర్ సంస్థ ప్రతినిధి అరుణ్ తెలిపారు. పాపం పంచాయతీరాజ్! సాధారణంగా ఎగ్జిబిషన్ స్టాల్లో ఉత్పత్తుల గురించి, తమ విజయాల గురించి తెలిపే పుస్తకాలు, ఫొటోలు ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు వాటిని పంచిపెడతారు. అలాగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్లో పంచాయితీరాజ్ శాఖ కూడా ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో పంచాయితీరాశ్ శాఖ విజయాలు, రోడ్ల నిర్మాణానికి సూచనలు, సలహాలు, అనుభవాలతో కూడిన పుస్తకాలు, బ్రోచర్లను ప్రత్యేకంగా ముద్రించింది. కానీ ప్రతిదానికీ కేవలం ఒక్కో కాపీని మాత్రమే స్టాల్లో ఉంచింది. సందర్శకులంతా తమకో కాపీ కావాలంటుండటంతో సిబ్బందికి పాలుపోవడం లేదు. ‘పై అధికారులు మాకు అదనపు పుస్తకాలు, బ్రోచర్లు ఇవ్వలేదు. డిస్ప్లే కోసం ఒక్కో ప్రతే ఇచ్చారు. దయచేసి చూసి వెళ్లండంతే’ అని బదులిస్తున్నారు. కానీ సందర్శకుల బాగా పెరగడంతో అందరికీ సమాధానం చెప్పలేక ‘పుస్తకాలు, ఇతర ప్రచురణలు కేవలం డిస్ప్లే కోసం మాత్రమే’ అని కాగితాలపై రాసి స్టాల్ చుట్టూ అంటించారు! -
‘నోట్ల’ కష్టాలకు నెల..
రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నవంబర్ 8న అకస్మాత్తుగా ప్రక టన చేశారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లేవీ చెల్లబోవంటూ షాకిచ్చారు. ఈ నిర్ణ యం అమల్లోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీ కట్టడి కోసమంటూ నోట్లను రద్దు చేసినా.. సాధారణ ప్రజలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట గంటలకొద్ది క్యూలైన్లు. ‘నోట్ల’ సమస్య వల్ల దేశవ్యాప్తం గా వంద మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. నవంబర్ 8 500, 1,000 నోట్లను రద్దు చేస్తున్నటు ప్రధాని ప్రకటన. ఆ రోజు అర్ధరాత్రి నుంచే ఆ నోట్లు చెల్లబోవని వెల్లడి. డిసెంబర్ 30 వరకు పాత నోట్లు మార్చుకోవడానికి అవకాశం. ‘నోట్ల’లెక్కలు తేల్చడానికి మరుసటి రోజున బ్యాంకులకు సెలవు, రెండు రోజులపాటు ఏటీఎంల మూసివేత ప్రకటన. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లు, విమాన- రైల్వే టిక్కెట్లు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ సేవలకు మూడు రోజులపాటు (11వ తేదీ వరకు) పాత నోట్లతో చెల్లింపులకు అవకాశం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఒక్కొక్కరు రోజుకు రూ.4 వేలు పాత నోట్ల మార్పిడికి అవకాశం. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలు, బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు విత్‌డ్రా పరిమితులు. మొత్తంగా వారానికి రూ.20 వేలే తీసుకోగలిగేలా ఆంక్షలు. చెక్కులు, డీడీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలపై పరిమితి విధించలేదు. నవంబర్ 9 బ్యాంకులు,ఏటీఎంలు పనిచేయలేదు. ప్రజల్లో ఆందోళన. బ్యాం కుల్లో నగదు మార్పిడి కోసం ఏదైనా గుర్తింపుకార్డు ప్రతి సమ ర్పించాలంటూ నిబంధనలు. 11వ తేదీ అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు నిలిపివేత. రూ.2.5 లక్షలు దాటిన, లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను, జరిమానా వసూలు చేస్తామని ప్రకటన. నవంబర్ 10 కష్టాలు షురూ. డిపాజిట్లు, నగదు మార్పిడి కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లు జనంలోకి వచ్చాయి. ఏటీఎంల మూత. నవంబర్ 11 తొలిసారిగా తెరుచుకున్న ఏటీఎంలు. భారీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు లేకపోవడంతో.. అన్నీ వంద నోట్లే నింపిన అధికారులు. కొంత సేపటికే ఖాళీ. ప్రజలకు ఇబ్బందులు. పలు రంగాల్లో పాత నోట్ల వినియోగానికి ఇచ్చిన అవకాశాన్ని, టోల్ వసూలు నిలిపివేతను నవంబర్ 14 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ నిర్ణయం. నవంబర్ 12 బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద జనం అవస్థలు. నల్లధనం నియంత్రణకు మరిన్ని చర్యలుంటాయన్న ప్రధాని. నవంబర్ 13 ఆదివారం పనిచేసిన బ్యాంకులు. పెరిగిన క్యూలైన్లు. ఏటీఎం, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో జనంలో ఆగ్రహావేశాలు. నగదు మార్పిడి పరిమితి రూ.4,500కు, ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రూ.2,500కు, బ్యాంకుల్లో రోజుకు రూ.10వేల విత్‌డ్రా పరిమితిని ఎత్తివేస్తూ... వారానికి విత్‌డ్రా పరిమితి రూ.24,000కు పెంపు. కొత్త రూ.500 నోట్లు మార్కెట్లోకి. నవంబర్ 14 పెట్రోల్ బంకులు, ప్రభుత్వ సేవలు సహా పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. కరెంట్ ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. గురునానక్ జయంతి సందర్భంగా మూసి ఉన్న బ్యాంకులు. ఏటీఎంల వద్ద క్యూలైన్లు. పలు చోట్ల ఆందోళనలు వ్యక్తం చేసిన ప్రజలు ఠి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలను డిసెంబర్ 30వ తేదీ వరకూ ఎత్తివేస్తూ నిర్ణయం. నవంబర్ 15 కొనసాగిన క్యూలైన్లు. తొలి వారంలో ఏకంగా రూ.1,14,139 కోట్లు డిపాజిట్లు వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటన. నవంబర్ 17 నగదుమార్పిడి పరిమితి రూ.2,000కు కుదింపు. వివాహాల కోసం రూ.2.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ ప్రకటన. రైతులకు విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. టోల్ వసూళ్ల నిలిపివేతను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు తీసుకునే అవకాశం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఒకశాతం తగ్గించిన పలు బ్యాంకులు నవంబర్ 18 ‘నోట్ల రద్దు’తో 55 మంది మరణించారంటూ పార్లమెంటులో విపక్షాల గొడవ. ఢిల్లీలో ఆందోళనలు. నవంబర్ 22 బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేత. డిపాజిట్లకే అవకాశం. టోల్ వసూళ్ల నిలిపివేతను డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన. పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులు డిసెంబర్ 15 వరకు పొడిగింపు. నవంబర్ 25 రిజర్వుబ్యాంకు శాఖల్లో మాత్రం నోట్ల మార్పిడి కొనసాగిస్తూ ప్రకటన. అటు జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం 14 రోజుల్లో రూ.27,200 కోట్లు డిపాజిట్ అయినట్లు 26న కేంద్రం వెల్లడి నవంబర్ 28 మూడు వారాల్లో రూ.8.45 లక్షల కోట్లు పాత నోట్లు డిపాజిట్ అరుునట్లు ఆర్బీఐ ప్రకటన. కొనసాగిన క్యూలైన్లు. నవంబర్ 30 జన్‌ధన్ ఖాతాల్లోంచి నెలకు రూ.10 వేల విత్‌డ్రా పరిమితి విధించిన ఆర్బీఐ. డిసెంబర్ 1 తార స్థాయికి కష్టాలు. వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులకు ఇబ్బందులు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చిన బ్యాంకులు. పెట్రోల్ బంకులు, విమాన టికెట్లు వంటి వాటిలో పాత నోట్ల చెల్లుబాటు గడువును 2వ తేదీ అర్ధరాత్రి వరకు కుదింపు (తొలుత డిసెంబర్ 15 వరకు గడువిచ్చారు). డిసెంబర్ 6 నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి. డిసెంబర్ 7 బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు. డిసెంబర్ 8 ‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన -
నోట్ల రద్దుకు ప్రజామోదం..
ఈ నిర్ణయం జనశక్తి ప్రాముఖ్యతను తెలియజేసింది ప్రతిపక్షాలకు చర్చలో పాల్గొనే ఉద్దేశం లేదు పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దుకు ప్రజలంతా మద్దతిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. ‘జనశక్తి’ ప్రాముఖ్యతను తెలియజెప్పిందని అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెం ట్లో నోట్ల రద్దుపై చర్చ జరగాలని విపక్షాలు భావించడం లేదని, రాజ్యసభలో ఈ విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. తాను రెండుసార్లు రాజ్యసభకు హాజరైనా చర్చకు వారు అంగీకరించలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాలు ఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారి తీశాయని, అయినా వాటిపై పార్లమెంట్లో చర్చ నడిచిం దన్నారు. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైన నోట్ల రద్దు నిర్ణయంపై చర్చకు మాత్రం ప్రతిపక్షాలు అంగీకరించడం లేదని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయాలి పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ ఎకానమీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారని చెప్పారు. ఓట్ల నమోదు, ఈవీఎంల వినియోగంపై ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తామో అదే విధంగా దీనిపై వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారన్నారు. పార్టీలకతీతంగా అందరు ఎంపీలు ఇందులో భాగస్వాములు కావాలని మోదీ కోరారని అనంత్‌కుమార్ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలు నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ‘రాజ్యశక్తి’ కంటే ‘జనశక్తి’కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం దీని ప్రాముఖ్యతను తెలియజెప్పిందన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు నోట్ల రద్దుపై చర్చ జరగాలనే ఉద్దేశం లేదని, అందువల్ల దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పార్టీ సభ్యులు నడుచు కోవాలని సూచించారని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏ పార్టీ డిమాండ్ చేయలేదని, అందువల్ల విపక్షాలు చర్చలో పాల్గొని విలువైన సలహాలు అందజేయాలని మోదీ సూచించారన్నారు. -
7రోజుల్లో రూ.1,487 కోట్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన్ ఖాతాల్లో నగదు డిపాజిట్ల వర్ద క్రమంగా తగ్గుముఖంపడుతోంది. ముఖ్యంగా గత వారం రోజుల కాలంలో స్పల్పంగా తగ్గింది. ఏడు రోజుల్లో సుమారు రూ.1,487కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇది నవంబరు 30 నాటికి వీటి విలువ 8,283కోట్లు డిపాజిట్ కాగా ఈ వారంలో డిపాజిట్ల విలువ క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం నవంబరు 30నాటికి 25.85 కోట్ల ఖాతాల్లోరూ. 74,321.55కోట్లు నమోదయ్యాయి. నవంబరు 23 నాటికి 25.68 కోట్ల ఖాతాల్లో మొత్తం విలువ రూ.72,834.72 కోట్లు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబరు 9 నాటికి సుమారు రూ.45,637 కోట్ల డిపాజిట్లు పెరిగాయి. కాగా 2014 ఆగస్టులో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన్ పథకాన్ని ప్రారంభించారు. జన్ ధన్ ఖాతాల్లో గరిష్ట డిపాజిట్ పరిమితి 50 వేలుగా నిర్ణయించారు. అయితే డీమానిటైజేషన్ తర్వాత విత్ డ్రా పరిమితిని 10 వేలకు కుదించిన సంగతి తెలిసిందే. -
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
నల్లగొండ : భారత ప్రభుత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినందున ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో నోట్ల రద్దు వల్ల ఆయా జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజలు నోట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు తగ్గించి ఆన్లైన్, స్మార్ట్‌ఫోన్, స్వైప్ మిషన్‌స ద్వారా జరిపే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. డిజిటల్ అక్షరాస్యతను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార సంఘాలు, మార్కెట్‌యార్డులు, ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలు, మెడికల్‌షాపులు, పెట్రోల్‌బంకులు, గ్యాస్ డీలర్లు వంటి ప్రజా వినియోగ ఆర్థిక లావాదేవీలను నగదు రూపంలో కాకుండా డెబిట్‌కార్డుల ద్వారా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 204 ఏటీఎంల ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సుమారు వంద కోట్లు అవసరముంటుందన్నారు. ప్రస్తుతం 128 ఏటీఎంలలో రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీలను జరిపేందుకు పెద్ద వ్యాపార సంఘాలు, పెట్రోల్ బంకు యజమానుల నుంచి స్వైప్మిషన్ల కోసం 179 దరఖాస్తులు వచ్చాయన్నారు. అదే విధంగా నూతన ఖాతాలు తెరిచేందుకు 861 అప్లికేషన్లను వివిధ బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.రామకృష్ణారావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ సూర్యం, డీఆర్వో అంజయ్య, అటవీశాఖాధికారి శాంతారామ్, బ్యాం కు అధికారులు పాల్గొన్నారు. -
వేలూరు, తిరువణ్ణామలైలో డీఎంకే ధర్నా
వేలూరు: పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా వేలూరు ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట డీఎంకే ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద నోట్లు చెల్లవని రాత్రికి రాత్రి ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం చెన్నైలో నిర్వహించిన ధర్నాలో ముకా స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు అన్నారోడ్డులో అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని నినాదాలు చేశారు. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ రాస్తారోకోను విరమించక పోవడంతో పోలీసులు చేసేది లేక రాస్తారోకోలో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అదే విధంగా తిరుపత్తూరు,రాణిపేట, గుడియాత్తం వంటి ప్రాంతాల్లో రాస్తారోకో చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువణ్ణామలైలో... తిరువణ్ణామలై జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద డీఎంకే జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి ఏవా వేలు అద్యక్షతన ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్లు చెల్లవని ఈ నెల 8వ తేదిన ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పిచ్చాండి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రూ.వెయ్యికి వీడ్కోలు
► చెలామణికి ముగిసిన గడువు ►బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ స్వస్తి ► డిపాజిట్ చేయూల్సిందే.. ►రూ.500 చెలామణికి పరిమితులు ► బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు ఆదిలాబాద్ అర్బన్ : రూ.1000 నోట్లకు కాలం చెల్లింది. గురువారం నాటితో ఆ కరెన్సీ చెలామణి గడువు ముగిసింది. రూ.500 నోట్లు పరిమితులతో కూడిన చెలామణికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం వరకు ప్రభుత్వ రంగ సంస్థలు, కరెంటు బిల్లు, పన్నులు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే, బస్ టికెట్ల బుకింగ్ కోసం రూ.500, రూ.1000 నోట్ల చెలామణికి అవకాశం కల్పించారు. ఇక ఆ గడువు ముగిసిపోవడంతో గురువారం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్ల చెలామణిని డిసెంబర్ 15వరకు పొడిగించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు, కరెంటు, నీటి బిల్లులు, రూ.500 లోపు మొబైల్ రీచార్జీకి చెల్లుబాటు అవుతుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ట్యాక్స్కు మినహాయింపు ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రూ.500 నోట్లు టోల్‌ప్లాజాల్లో చెల్లుబాటు అవుతాయి. ఒక్కసారి రూ.5వేల విలువైన వస్తువులను వినియోగదారులు సహకార స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ అవకాశం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇక రూ.వెరుు్య నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయూల్సిందే. డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్‌కు ఆయూ నోట్లను స్వీకరిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో పన్నులు, మొండి బకాయిల వసూలుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, విద్యుత్ సంస్థల పంట పండింది. భారీ మొత్తంలో పన్నులు, బకారుులు వసూలయ్యూరుు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధుల వరద మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాల పన్నుల వసూలకు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కలిసొచ్చింది. ఏళ్లు గడిచినా వసూలు కాని చెల్లింపులు కేవలం 15 రోజుల్లో రూ.2.80 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. రద్దు తర్వాత 30 శాతం మేర పన్ను వసూలైంది. పంచాయతీల్లో పన్ను వసూళ్లు రూ.3.50 కోట్లు ఉండగా, నోట్ల రద్దుకు ముందు రూ.60 లక్షలు వసూలు చేయగా, జిల్లా వ్యాప్తంగా రద్దు నుంచి ఇప్పటి వరకు రూ.35 లక్షలు వసూలు అయ్యాయి. నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజలు పన్ను చెల్లించేందుకు ముందుకు రావడంతో అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీలకు నిధుల వరద పారింది. పెట్రోల్ బంకులకు కాసుల గలగల పెట్రోల్ బంకుల్లో పాతనోట్ల చెల్లుబాటుతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.11 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఆదిలాబాద్ పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. ప్రతి రోజు సుమారుగా 5 నుంచి 6 లక్షల లీటర్ల పెట్రోల్, 4 నుంచి 5 లక్షల లీటర్ల డిజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. పెద్ద నోట్ల రద్దుతో వాహనదారులు ట్యాంకులు నింపుకోవడంతో ఒకేసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. వీటిపై ప్రభావం.. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జనజీవనం అతలాకుతలమైంది. చిల్లర దొరకకా, ఉన్న నోట్లు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అప్పగించడంతో చిల్లిగవ్వ లేక వ్యాపారాలు స్తంభించిపోయాయి. గత నెల వరకు కాసులు కురిపించిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు ప్రస్తుతం నోట్ల రద్దు ప్రభావంతో కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడగా, నిర్మాణ, వ్యాపారం, ఆబ్కారీ, రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇరవై రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద నోట్లు మార్చుకునేందుకు, ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకునేందుకు క్యూ కట్టక తప్పడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్యాంకులకు వెళ్తే ఒక రోజు మొత్తం కేటాయించేయాలి. ప్రస్తుతం ఆ ప్రభావం కొద్దిగా తగ్గింది. సరిపడా నోట్లు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం రద్దు వ్యవహారానికి ముందు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచి రద్దు చేసినట్లైతే ఇంత ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. ఎక్కువ డబ్బులు అవసరమున్నా రద్దు ప్రభావంతో బ్యాంకు అధికారులు ఇస్తలేరు. చేతిలో డబ్బులు లేక ఏమి చేయాలన్న తోచడం లేదు. - షేక్ ఖలీమ్, ఓ బ్యాంక్ ఖాతాదారు, ఆదిలాబాద్ ప్రభుత్వం గడువు పెంచాలి ప్రజలకు ఇంకా చిల్లర కష్టాలు తీరలేదు. చిల్లర కష్టాలు తీరిన తర్వాత పెద్ద నోట్లను తీసుకోకున్నా ఫర్వాలేదు. చిల్లర దొరకకముందే పెద్ద నోట్లను వాడుకలోంచి తీసేయడం సరికాదు. ఇంకా చాలామంది దగ్గర పాత నోట్లు కన్పిస్తున్నాయి. వీటిని సమర్పించేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లు చెలామణికి గడువును పొడిగించాలి. కొత్తగా రూ.500, రూ.100 నోట్లు సరిపడా అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల చెలామణికి చెక్ పెట్టిన సరిపోతది. - కె.విక్కీ, పొన్నారి, తాంసి -
చేతికొచ్చేనా..?
సాక్షి, నల్లగొండ : ఒకటో తేదీకి ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నవంబర్ నెల వేతనాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకింగ్ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావడంతో వేతనాలు పొందేందుకు ఎలాంటి సమస్యా లేకపోయినా, పొందిన వేతనాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే వేతనాల కోసం 10 రోజుల ముందు నుంచే ప్రణాళికలు వేసుకుని ఉండే ఉద్యోగులు వేతనాలు వచ్చిన 10 రోజుల్లోనే తమ అవసరాల కోసం ఆ వేతనాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, ఈ క్రమంలో ప్రస్తుతమున్న నిబంధనల కారణంగా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, పింఛన్‌దారులు కలిసి కనీసం లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఈ ఉద్యోగుల పరిస్థితి ఒకటో తేదీ తర్వాతేంటనే దానిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కానీ స్పష్టత నివ్వకపోవడం మరింత గందరగోళానికి దారి తీస్తోంది. రోజుకు రూ. 2వేలేనా? జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తర గతి ఉద్యోగుల నుంచి శాఖాధిపతుల వరకు 35 వేల వరకు ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆరువేల మందికి పైగా టీచర్లు కూడా ఉన్నారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, ఎఫ్‌సీఐ, ఎల్ఐసీ తదితర సంస్థల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 వేల వరకు ఉంటారు. లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు, పింఛన్‌దారులు కలిపి మొత్తం లక్ష మంది వరకు ఉంటారు. వీరే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు, అన్ని రకాల దుకాణాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీరంతా ప్రతి నెల ఒకటి నుంచి పదో తేదీ లోపు వేతనాలను తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులక యితే ఠంచన్‌గా ఒకటో తేదీన జీతం వస్తుంది. అయితే, జీతం పొందే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అనుమానం లేకపోయినా, పొందిన వేతనాన్ని తమ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్నదే సమస్యగా మారింది. బ్యాంకుల్లో గంటల తరబడి ఉన్నా.. ఏటీఎంల వద్ద క్యూలలో పడిగాపులు కాసినా రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేకపోవడంతో నెలసరి ఖర్చులెలా అన్నది ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంటి కిరాయిలు, పాలు, కిరాణా దుకాణం ఖర్చులు, చిట్టీలు, పిల్లల ఖర్చులు... ఇలా అన్ని రకాల అవసరాల కోసం 5-10 తేదీల్లోపే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, రోజుకు రూ.2 వేల చొప్పున ఇస్తే వీటికి ఎప్పటికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజల్లాగా గంటల తరబడి ఏటీఎంల వద్ద ఉండే అవకాశం కూడా తమకు లేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు వెసులుబాటు కల్పించకపోతే సాధారణ జీవనానికి ఇబ్బందులు తప్పవనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ వెసులు బాట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఒకటో తేదీ సమీపిస్తుండడం మరింత సమస్యగా మారుతోంది. బ్యాంకుల్లోనే? వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేంత వరకు తమ నగదు రూపంలో వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులతో పాటు, ఉద్యోగుల వేతనాల నుంచి కొన్ని రకాల మినహాయింపులు చేసుకుని మిగిలిన జీతం చెల్లించాల్సి ఉండడం, నగదు రూపంలో ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గరా సంతకాలు తీసుకోవాల్సి రావడం సమస్యగా మారింది. దీనికి తోడు బ్యాంకర్లు కూడా అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎప్పటిలాగే బ్యాంకుల్లోనే నవంబర్ నెల వేతనాలు జమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. అయితే, నవంబర్ నెల వేతనంలో రూ.10 వేలను ప్రతి ఉద్యోగికి అడ్వాన్స్‌గా ఇస్తారని, లేదంటే సగం జీతం నగదు రూపంలో ఇస్తారని మొదట్లో చర్చ జరిగినా అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో జమ అయిన వేతనాలను తమకు ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా తమ వేతనాల ఉపసంహరణ కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా కనిపిస్తోంది. దీంతో పాటు బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఉపసంహరణ చేసుకునే పరిమితిని కూడా పెంచాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో.. బ్యాంకర్లు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాల్సిందే. నగదు ఇస్తేనే బాగుంటుంది.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం నల్ల ధనాన్ని అరికట్టే విషయంలో మంచిదే అనుకున్నా.. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఉద్యోగుల పరిస్థితి సామాన్య ప్రజల కంటే భిన్నమైనది. ఉద్యోగులకు ఈనెల వేతనాలు నగదు ఇస్తేనే బాగుంటుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. మంగళ, బుధ వారాల్లో స్పష్టత వస్తుంది. - పందిరి వెంకటేశ్వరమూర్తి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎవర్నీ ఇబ్బంది పెట్టవద్దు. జిల్లాలో 6 వేలకు మందికి పైగా టీచర్లున్నారు. వీరికి నెలసరి వేతనాలే జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వేతనాలు డ్రా చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు బ్యాంకుల్లో జమ చేస్తే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి. ఉపసంహరణ పరిమితిని పెంచాలి. మాతో పాటు సామాన్య ప్రజలకు కూడా కౌంటర్లు పెంచాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. - పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, -
అప్పుతో ఆపరేషన్లు..!
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పుతో శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి బళ్లారిలోని అరుణోదయ ఆస్పత్రి ముందుకు వచ్చింది. అప్పుతో శస్త్ర చికిత్సలు, మోకాలి చిప్పలను మార్పిడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అరుణోదయ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కందుల పేర్కొన్నారు. సోమవారం ఆయన నగరంలోని రాయల్ ఫోర్ట్‌లో విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల అత్యవసరంగా చికిత్సలు చేయించుకునేందుకు పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ పరిధిలో చేసే ఆర్థోపెడిక్ సంబంధిత శస్త్రచికిత్సలు మూడు నెలల పాటు రోగులకు అప్పుగా చేస్తున్నట్లు చెప్పారు. రోగికి అత్యవసరంగా మోకాలి చిప్పల మార్పిడి లేదా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలను కూడా అప్పుతో చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం రోగులు ఆధార్ కార్డు అందజేస్తే చాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా అప్పుగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. - సాక్షి, బళ్లారి -
అక్కడ ఫెడ్ భయం... ఇక్కడ నోట్ల రద్దు నీరసం!
ముంబై/న్యూయార్క్: సమీప కాలంలో పసిడి అడుగులు తడబాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణి) పెంపు భయాలు ఒకవైపు... దేశీయంగా రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం పసిడి బలహీనతకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి . డిసెంబర్ 13-14 తేదీల్లో వాషింగ్టన్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు వినబడుతున్నాయి ఈ పరిణామం పసిడి గమనానికి ఒక దిశా నిర్దేశం చేస్తుందన్న వాదనలు ఉన్నాయిఇక దేశీయంగా చూస్తే... పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా డిమాండ్ ఉన్నప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయిపలు ఆంక్షలు, ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వారంలో అసలు ఢిల్లీ, ముంబైలలో బంగారం షాపులు అసలు తెరవకపోవడం గమనార్హం. ధరల జారుడు...: శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధరలు భారీగా పడిపోయాయిఅంతర్జాతీయంగా ఔన్స (31.1గ్రా) ధర దాదాపు 17 డాలర్లు పడిపోకయి 1,207 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగానూ ఇదే పరిస్థితి. ముంబై స్పాట్ మార్కెట్లో ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.1,205 తగ్గి రూ.29,310కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిపడిపోయి.29,160 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.3,655 పడిపోయి.41,765 వద్దకు చేరింది. -
ఆర్దిక ప్రణాళికను మార్చండి
పొదుపు, మదుపునకు అవకాశం భవిష్యత్తులో ఈక్విటీల్లోకి అధిక నిధులు నల్లధనంపై చర్యలతో బంగారం, రియల్టీలో తగ్గనున్న డిమాండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో క్లిష్ట సమయాలను ఎదుర్కోవడం ఈజీ ఊహించని సందర్భాలు జీవితంలో ఎదురవుతుండడం సర్వ సాధారణం. ప్రస్తుత నోట్ల రద్దు కూడా ఇటువంటిదే. సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే సందర్భం ఎలాంటిది అయినా నిర్భయంగా, ధైర్యంగా... తొణకకుండా, బెణకకుండా ఉండవచ్చు. అంతేకాదు... మదుపరి తన ఆలోచనకు పదును పెడితే ఇలాంటి సందర్భాలను ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువుగా మలుచుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలన్నది చూద్దాం... పొదుపు దిశగా.... ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ అవి చెల్లుబాటు కావని, బ్యాంకుల్లో మార్చుకోవాలని లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. మరుసటి రోజు బ్యాంకులకు సెలవు. ఏటీఎంలు పనిచేయలేదు. ఆ తర్వాత కూడా ఎక్కువ శాతం ఏటీఎంలలో నగదు అందుబాటులోకి రాలేదు. దీంతో చేతిలో డబ్బుల్లేక, ఉన్న డబ్బులకు విలువ లేక ప్రతి ఒక్కరూ తమ ఖర్చులకు చెక్ పెట్టేశారు. ప్రతి రూపాయి ఖర్చుకూ లెక్కలేయడం ప్రారంభించారు. ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో తాజా సందర్భం ప్రతీ ఒక్కరికీ నేర్పించింది. దీన్నే నిత్య జీవితంలో ఆచరణగా మార్చుకుంటే... పొదుపరులుగా మారిపోతారు. ఆ పొదుపును మంచి రాబడులను ఇచ్చే పథకాల్లోకి మళ్లించినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. కంటింజెన్సీ ప్లాన్ అత్యవసరమైతే గట్టెక్కేందుకు సరిపడా నగదు ప్రతి ఒక్కరి వద్దా అందుబాటులో ఉండాలి. అనుకోని అవాంతరం వచ్చి నగదు ప్రవాహం ఆగిపోతే... అత్యవసరంగా నగదుతో అవసరం ఏర్పడితే... గట్టెక్కేందుకు సిద్ధంగా ఓ ఫండ్ ఉండాలి. కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని తక్షణమే నగదుగా మార్చుకునే సాధనాల్లో పెట్టుబడి పెట్టుకోవాలని నిపుణుల సలహా. ఇందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స అందించే లిక్విడ్ ఫండ్స అనువుగా ఉంటాయని వారు సూచిస్తున్నారు. మిక్స్‌డ్‌గా ఉండాలి ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియో ఫిజికల్, ఫైనాన్స అసెట్స్ కలబోతగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఊహించని సందర్భాల్లో రాబడులను కోల్పోకుండా సరైన ఆసరాగా ఉంటుంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులను అవసరమైతే వెంటనే నగదుగా మార్చుకోవాలంటే దాదాపుగా అసాధ్యం. భూమిని నమ్మకున్నవారు ఎప్పు డూ నష్టపోరు అన్న సూత్రంతో తమ పొదుపునంతా రియల్టీ మార్కెట్‌పైనే పెట్టిన వారు అత్యవసర సమయాల్లో వాటిని ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడులు ఎప్పుడూ కలబోతగా ఉండేలా చూసుకోవాలి. డీమోనిటైజేషన్ అంటే..? డీమోనిటైజేషన్ అంటే చెలామణిలో ఉన్న నగదుకు చట్టబద్ధ చెల్లుబాటును రద్దు చేయడం. పాత నోట్లను అదే విలువ గల కొత్త కరెన్సీ నోట్లతో మార్పిడి చేయడం ఈ ప్రక్రియలో భాగం. స్వాతంత్య్రానంతరం 1978లోనూ ఓసారి డీమోనటైజేషన్ జరిగింది. నల్లధనం కట్టడికి అప్పట్లో చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేశారు. పన్నుకు ప్లాన్ చేసుకోండి... నిజానికి పన్ను తప్పించుకునే వారి కంటే పన్ను చెల్లించే వారే తమ పెట్టుబడుల విషయంలో స్వేచ్ఛగా ఉండగలరు. చెల్లించాల్సినంత పన్ను చెల్లించేస్తే సంపాదనలో మిగులును ఆర్జన పరులు తమ రిస్క్‌కు తగిన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. దీని కంటే ముందు పన్ను కట్టాల్సిన ఆదాయం ఉంటే పన్ను చెల్లించడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేయవద్దు. పెట్టుబడులపై రాబడుల్లో మార్పులు ఇప్పటి వరకూ ఎక్కువ మంది లెక్కల్లో చూపని పన్ను ఆదాయాన్ని బంగారం, స్థలాలు, ఇళ్లు వంటి వాటిపై పెట్టుబడిగా పెట్టడం తెలిసిందే. నిధుల రాక ఎక్కువగా ఉండడం వల్ల ఈ సాధనాల్లో రాబడులు మంచిగానే ఉండేవి. కానీ, పన్ను ఎగ్గొట్టే అవకాశాలకు కేంద్రం కత్తెర వేస్తోంది. దీంతో భవిష్యత్తులో మరింత మంది ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్సలో పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు 5 శాతం పడిపోయాయిమిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స విలువలు 7-8 శాతం వరకు, లార్జ్ క్యాప్ ఫండ్స 5 శాతం వరకు తగ్గాయిముఖ్యంగా రియల్ ఎస్టేట్ సూచీ 20 శాతం వరకు నష్టపోయి. మంచి స్టాక్స్‌లో, ఫండ్స పథకాల్లో పెట్టుబడులకు ఇదొక అవకాశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆరోగ్య బీమా ఎప్పుడు, ఏ సమయంలో ఆస్పత్రి పాలవ్వాల్సి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి సమయాల్లో వైద్య ఖర్చులు ఎంత అవుతాయో కూడా ఊహించడం కష్టమే. అందుకే ప్రతి ఒక్కరూ తమకు, తమ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ఉండేట్టు చూసుకోవాలి. దీంతో నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య సాయం పొందవచ్చు. ధన సాయం కోసం ఇతరుల వద్ద చేయిచాల్సిన పని పడదు. అత్యవసర నిధిని కూడా కదిలించే అవసరం కూడా రాకుండా ఉంటుంది. సొంతిల్లుకు సరైన తరుణం నోట్ల రద్దుతో రియల్టీ మార్కెట్లో లావాదేవీలు భారీగా పడిపోయాయిధనం రాక ఆగిపోవడంతో డిమాండ్ వాస్తవిక స్థాయికి చేరడం వల్ల ధరలు దిగివస్తాయన్నది పరిశీలకుల అంచనా. సొంతిల్లు సమకూర్చుకోవాలని అనుకునే వారు ప్రస్తుత తరుణంలో తక్కువ ధరకు డీల్ అందుబాటులో ఉంటే రుణంపై కొనుగోలు చేయడం సరైన నిర్ణయమే అవుతుంది. దాని వల్ల ఒకవైపు పన్ను ప్రయోజనం, మరోవైపు తక్కువ ధరకు సొంతిల్లు రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చు. పైగా బ్యాంకుల్లోకి భారీగా వచ్చి చేరుతున్న నిధులతో సమీప కాలంలో రుణాలపై రేట్లు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయిపన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే రుణంపై వడ్డీ కూడా సున్నాగా మారిపోతుంది. బంగారం బాండ్లు బెటరు పసిడిపై పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. నల్లధనం కట్టడి చేయడం వల్ల దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గనుంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే సమీప కాలంలో బంగారం ధర 10 గ్రాములు రూ.26 వేలకు పడిపోతుందని ఒక అంచనా. అయితేదే సమయంలో డాలర్‌తో రూపాయిరకం విలువ క్షీణించకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా బంగారం కంటే ప్రభుత్వ బంగారం బాండ్లను కొనుగోలు చేయడం వల్ల 2.5-2.75 వరకు వడ్డీ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే... డీమోనిటైజేషన్ వల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుల ఆదాయం సైతం పెరుగుతుందంటున్నారు. అయితే నగదు కొరత కారణంగా ప్రజలు కనీస అవసరాలపైనే వినియోగం చేస్తారని, దాంతో నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల స్వల్ప కాలంలో వడ్డీ రేట్ల కోత అనుకున్న మేర ఉండకపోవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఈ అభిప్రాయాల నేపథ్యంలో తక్కువ రిస్క్ కోరుకునే వారు లిక్విడ్, స్వల్ప కాలిక డెట్ ఫండ్సలో, రిస్క్ భరించే వారు దీర్ఘకాల ఫండ్స లో ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, దీర్ఘకాల బ్యాంకు డిపాజిట్లు, పన్ను రహిత బాండ్లు, కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి -
నేపాల్‌పై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
నోట్ల రద్దుపై విచారణ ఈ నెల16కు వాయిదా
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. నోట్ల రద్దుపై అనేక పిటిషన్లు వస్తున్నాయన్న న్యాయస్థానం వాటన్నింటినీ ఒకేసారి విచారణ చేస్తామని తెలిపింది. కాగా సామాన్య జనాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా రూ.500,1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. -
వారంలో డబ్బిస్తానని మాటిచ్చి కొడుకు పెళ్లి చేశా
భూపాలపల్లి: ‘‘నా కొడుకు పెళ్లికి రెండు నెలల కిత్రమే నవంబర్ 9న ముహూర్తం నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో పెళ్లి పను ల కోసం నిల్వ ఉంచిన నగదుకు విలువ లేకుండా పోయింది. వంట, షామి యానా, పురోహితుడు, బ్యాండు తదితర పెళ్లి ప నులకు అప్పటికే అడ్వా న్సులు చెల్లించాను. మిగిలిన డబ్బు చెల్లించడం కష్టంగా మారిం ది. చివరికి వారం రోజుల్లో మిగిలిన డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి పెళ్లి జరిపిం చాను. వారు నా మాటను గౌరవించారు’’ - వేముల శ్రీనివాస్, భూపాలపల్లి 500 నోటు మార్పిడికి యాచకుడి పాట్లు రామన్నపేట: పెద్ద నోట్ల మా ర్పిడి ఓ యాచకుడికి తీవ్ర ఇబ్బందులు తె చ్చిపెట్టింది. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్ప త్రి జంక్షన్లో ఉండే ఓ యాచకుడు యాచన ద్వారా కూ డబెట్టుకున్న చిల్లరను రూ. 500 నోటుగా మార్చుకున్నాడు. అరుుతే రూ. వెరుు్య, రూ. 500 నోట్లు రద్దు అయినట్లు తెలియడంతో గురువారం ఉదయం తన వద్ద ఉన్న రూ. 500 నోటు మార్పిడి కోసం ఎంజీఎం వద్దనున్న ఎస్బీహెచ్ బ్రాంచ్‌కు చేరుకుని నిరీక్షించసాగాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐ శివరామయ్య దీన్ని గమనించి తన సిబ్బంది సాయంతో ఆ నోటు మార్పిడి చేసి యాచకుడికి చిల్లరనందించాడు. ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రా మానికి చెందిన యువ సర్పంచ్ వైనాల మురళి. ఈ నెల 12 న వరంగల్ నగరం లోని ఓ పంక్షన్హాల్లో జరగనున్న తన పెళ్లి కోసం బంగారం, బట్టలు తీసుకున్నాడు. కిరాణా, కూరగా యలు చిల్లర ఖర్చుల కోసం రూ.50 వేల విలువైన పెద్దనోట్లు అట్టిపెట్టుకున్నాడు. గురువారం ఎక్కడికి వెళ్లినా పెద్దనోట్లు తీసుకోకపోవడంతో మిత్రులు, బంధువుల సహకారంతో ఆర్థిక అవసరాలన్నీ పూర్తి చేసుకున్నాడు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల తనకు ఇబ్బంది ఎదురైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదేనని మురళి పేర్కొనడం గమనార్హం. -
860 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. గురువారం బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీ చేరుకోవడంతో పోస్టాఫీసుల్లో మధ్యాహ్నం నుంచి మార్పిడికి అవకాశం కల్పించారు. హైదరాబాద్ జీపీవోతో పాటు ప్రధాన పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కోసం ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. కొత్త కరెన్సీ అలస్యంగా రావడం, రూ.2,000 నోట్లను మాత్రమే జారీ చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని సుమారు 860 పోస్టాఫీసుల్లో ఈ నెల 24 వరకు వరకు కరెన్సీ మార్పిడికి అవకాశం కల్పించినట్లు రాష్ట్ర తపాలా సేవల సంచాలకులు వెన్నం ఉపేందర్ తెలిపారు. మొత్తంమీద 35 హెడ్ పోస్టాఫీసులు, 825 సబ్ పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ మార్పిడికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోస్టాఫీసుల్లో వినియోగదారులు నిర్ణీత నమూనా దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాన్‌కార్డు, ప్రభుత్వరంగ సంస్థళు జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకదాని జిరాక్స్ జతచేసి, రోజుకు రూ.4 వేల వరకు పాత నోట్లు అందజేసి కొత్త కరెన్సీ డ్రా చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 5,832 పోస్టాఫీసుల్లో డిసెంబర్ 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. -
జనమంతా బ్యాం 'క్యూ' లో నే!
చాంతాడంత లైన్లు.. గంటల తరబడి నిరీక్షణ రాజధానితోపాటు రాష్ట్రమంతటా ఇదే సీన్ పలుచోట్ల తోపులాటలు.. బందోబస్తు మధ్య కార్యకలాపాలు కొన్ని బ్యాంకుల్లో తెరిచిన కొద్ది గంటల్లోనే ఖజానా ఖాళీ రూ. 2 వేల నోటు అందుకుని మురిసిపోరుయిన ప్రజలు నోట్ల మార్పిడి, డిపాజిట్లకు పోటెత్తిన జనం బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు సాక్షి, హైదరాబాద్: కరెన్సీ కదిలింది.. రెండ్రోజులుగా బీరువాల్లో, పర్సుల్లో, పోపుడబ్బాల్లో అచేతనంగా పడి ఉన్న పెద్ద నోటుకు ప్రాణమొచ్చింది.. బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆపపోపాలు పడుతూ వెళ్లి క్యూ కట్టింది..! తళతళలాడే కొత్త రూపాన్ని ధరించి జేబులో చేరింది!! నిన్నమొన్నటిదాకా పాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లక ఇబ్బందులు పడ్డ జనం గురువారం వాటిని మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు. వారితోపాటు డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినవారితో ఉదయం 8 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. రాజధాని భాగ్యనగరంతోపాటు రాష్ట్రంలో ఎక్కడచూసినా బ్యాంకుల ముందు చాంతాడంత బారులు కనిపించాయి. పోలీసు బందోబస్తు, గంటల తరబడి పడిగాపుల మధ్య... కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2 వేల నోట్లు అందుకున్న వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. కొన్నిచోట్ల నగదు చాలకపోవడంతో బ్యాంకులు మధ్యాహ్నం వరకే సేవలను నిలిపివేశారుు. దీంతో జనం నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బ్యాంకు కార్యకలాపాలు సాగాయి. అటు జిరాక్స్ సెంటర్లు కూడా కిటకిటలాడాయి. నోట్ల మార్పిడికి, డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ పత్రాలు తప్పనిసరి అని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో జనం జిరాక్స్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. గంటల తరబడి పడిగాపులు జనం ఉదయం 8 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకొని లైన్లలో నించున్నారు. ఉదయం 10.30కు బ్యాంకులు తెరుచుకున్నారుు. ఒక్కో వినియోగదారుడు ఐదారు గంటలకుపైనే లైన్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం బ్యాంకుకు వచ్చిన వారు మధ్యాహ్నం 3 తర్వాతే బయటకు వెళ్లారు. కొత్త రూ.2,000 నోట్లు చెలామణిలోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో అన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి రాలేదు. పలుచోట్ల కొత్త నోట్లను అందుకున్న వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా పెద్దనోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా కకావికలమైన నగరం గురువారం కాస్త తెరిపిన పడింది. చాలా మంది తమ వద్ద ఉన్న పాత నగదును ఖాతాల్లో జమ చేసుకొనేందుకు పోటీ పడ్డారు. ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వాళ్లకు రూ.10 వేల వరకు అవకాశం కల్పించారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. మధ్యాహ్నం వరకే క్లోజ్... చంపాపేట్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు గురువారం వైద్య చికిత్సల కోసం కోఠీలోని ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు సీటీ స్కాన్ రాశారు. వెంటనే తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకొనేందుకు కోఠీలోని ఎస్బీఐకి వెళ్లాడు. అప్పటికి మధ్యాహ్నం 2.30 అయింది. అప్పటికే కొత్త రూ.2000 నోట్లు, పాత వంద నోట్లు అయిపోయాయంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. శ్రీనివాస్‌కు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఆరా తీస్తే రూ.50 లక్షల వరకు తాము పై అధికారులను అడిగితే బ్యాంకుకు కేవలం రూ.10 లక్షలే అందజేశారని చెప్పారు. ఒక్క కోఠీలోనే కాదు.. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. విద్యానగర్, కాచిగూడ, చిలకలగూడ, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు మధ్యాహ్ననికే కార్యకలాపాలను నిలిపివేశాయి. మరోవైపు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పినా.. చాలాచోట్ల అది కనిపించలేదు. సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల ఒకట్రెండు కౌంటర్లనే ఏర్పాటు చేశారు. దీంతో రద్దీ బాగా పెరిగింది. ఈస్ట్, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో సర్వర్ డౌన్ వల్ల కొన్ని బ్యాంకుల్లో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. పోస్టాఫీసుల్లో గందరగోళం... రాజధానిలో పలుచోట్ల పోస్టాఫీసుల్లోకి కొత్త కరెన్సీ, వంద నోట్లు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో క్యూలో నించున్న వారు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పంపిణీ మొదలైంది. తప్పని చిల్లర తిప్పలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితోపాటు పలు జిల్లాల్లో గురువారం కూడా జనానికి చిల్లర తిప్పలు తప్పలేదు. చిల్లర లేక పెట్రోల్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కోదాడ పట్టణ సమీపంలో చిల్లర ఇవ్వలేదంటూ జగ్గయ్యపేట డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ ప్రయాణికులను కోదాడ శివారులో దింపేశాడు. ఇక సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 130 బ్యాంకుల్లో గురువారం ఒక్కరోజే రూ.వంద కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర జమ అరుునట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాల్లో 367 బ్యాంకులకు జనం క్యూ కట్టారు. పోస్టాఫీస్‌లో డబ్బుల మార్పిడి జరగలేదు. డిపాజిట్లు మాత్రమే చేశారు. కొత్తనోటు చూడముచ్చటగా ఉంది కొత్త రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి ఉదయ మే బ్యాంకుకు వెళ్లాను. భారీ క్యూలైన్లో నిలబ డి నోటు చేతికి తీసుకు న్నాను. నోటు కొత్తగా ఉంది. పాత వెయి నోటు అంత అందంగా లేకున్నా చూడముచ్చటగా ఉంది. - తుమ్మలపల్లి మహేశ్, హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంది పాత వెయి నోటు కంటే రూ.2 వేల నోటు కొంత భిన్నంగా ఉంది. మూడు గంటల పాటు లైన్లో నిలబడి పాత నోట్లను మార్పిడి చేసుకున్నాను. - బాలు, హైదరాబాద్ రెండోరోజూ స్తంభించిన మార్కెట్లు రెండోరోజు కూడా హైదరాబాద్‌లోని మార్కెట్లు కళా విహీనంగానే కనిపించారుు. అన్నిచోట్ల కార్యకలాలు స్తంభించారుు. రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లు వెలవెలబోయారుు. సికింద్రాబాద్ జనరల్ బజార్, రాణిగంజ్, మోండా మార్కెట్. కోఠి, మలక్‌పేట్, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, తదితర ప్రాంతాల్లో గిరాకీ లేక వ్యాపారులు ఉసూరుమన్నారు. నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్ వంటి ప్రాంతాలు కూడా వెలవెలబోయారుు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలోనూ వ్యాపారం ఇంకా జోరందుకోలేదు. -
కరెన్సీ.. ఎమర్జెన్సీ..!
-
కరెన్సీ.. ఎమర్జెన్సీ..!
► బ్యాంకుల మూత.. పనిచేయని ఏటీఎంలు, ఆన్లైన్ డిపాజిట్ల కోసం భారీ క్యూలు ► ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్‌డౌన్.. స్తంభించిన వ్యాపార లావాదేవీలు.. చెల్లింపులు ► బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో టిక్కెట్ల కోసం జనం బారులు ► అంతా పెద్ద నోట్లతోనే క్యూ.. చిల్లర సమస్యలతో జనం ఇబ్బందులు ► పెట్రోల్ బంకుల వద్దా అదే పరిస్థితి.. ఆసుపత్రులు, మాల్స్‌లో పెద్ద నోట్ల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో మహానగరం ఒక్కసారిగా కకావికలమైంది. ఒకవైపు పనిచేయని బ్యాంకులు, ఏటీఎంలు. మరోవైపు సర్వత్రా రూ.500, రూ.1,000 నోట్ల తిరస్కరణ. దీంతో పెద్ద నోట్లు బుధవారం నగర వాసులకు కష్టాలు తెచ్చి పెట్టాయి. పెట్రోల్ బంకులు, షాపింగ్‌మాల్స్, ఆసుపత్రులు, మార్కెట్ ఇలా ఎక్కడికెళ్లినా.. బస్సెక్కినా, రైలు టికెట్ కోసం వెళ్లినా అంతటా రూ.500, రూ.1,000 నోట్లకు చుక్కెదురే అయింది. పెట్రోలు బంకుల్లో, ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పాలబూత్‌లలో పెద్ద నోట్టు చెల్లుబాటు అయినా చిల్లర లేకపోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో నగరమంతటా వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. ఇక కేంద్రం ప్రకటించిన మేరకు బ్యాంకులు మూతపడ్డాయి. ఏటీఎంల సేవలు నిలిచిపోయాయి. ఇక ఆన్లైన్ లో చెల్లింపుల కోసం కూడా వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆన్లైన్ చెల్లింపులు జరగడంతో సర్వర్లు డౌనై సేవలు నిలిచిపోరుు జనం గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు నగదు చెల్లింపులను నిలిపివేశాయి. ఆసుపత్రుల్లో రోగుల ఇబ్బందులు.. నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.500, రూ.1,000 నోట్లు చలామణి అయినప్పటికీ చిల్లర సమస్య రోగులు, వారి బంధువులను ఇబ్బందులకు గురి చేసింది. ఇన్పేషెంట్లుగా చేరేవారి నుంచి పెద్ద నోట్లు తీసుకున్నా.. బయటి రోగులకు మాత్రం వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం, వైద్యుల ఫీజుల కోసం, మందుల కొనుగోళ్ల కోసం ఇక్కట్లు తప్పలేదు. ఇక గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తదితర ఆసుపత్రుల్లో అయితే రోగులు నరకం చవిచూశారు. మార్కెట్లు, మాల్స్ వెల వెల.. నగరంలోని బిగ్‌బజార్, మోర్, స్పెన్సర్, హెరిటేజ్, డీమార్ట్, రిలయన్స, మొబైల్ షోరూమ్‌లు, సినిమాహాళ్లు వెలవెలబోయాయి. రూ.500 ,రూ.1,000 నోట్లతో వెళ్లి వస్తువులు కొనుగోలు చేసిన వాళ్లు చివరి క్షణంలో బిల్లు చెల్లించే సమయంలో నిరాకరించడంతో ఘర్షణకు దిగారు. బార్లు, వైన్‌షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లకు సైతం గిరాకీ తగ్గింది. కొన్ని చోట్ల వైన్‌షాపులు, బార్ల వద్ద వినియోగదారులు నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇక ప్రజలు కూరగాయల మార్కెట్లకు వెళ్లకపోవడంతో అవి వెలవెలబోయాయి. రూ.500 నోట్లను తీసుకునేందుకు అక్కడి వ్యాపారులు నిరాకరించడంతో వచ్చిన కొద్దిమంది కాస్తా కూరగాయలు తీసుకోకుండానే తిరిగి వెళ్లిన పరిస్థితి కనిపించింది. మార్కెట్లకు వెళితే చిల్లర తంటాలు ఎదురవడంతో సిటీవాసులు తమకు సమీపంలోని కిరాణా దుకాణాలకు దారి పట్టారు. దీంతో గల్లీలోని కిరాణాషాప్ల్లో వ్యాపారం ఊపందుకుంది. హోటళ్లలోనూ ‘నోట్ల’ తిప్పలు.. సిటీలోని చాలా హోటళ్లలోనూ నోట్ల తిప్పలు, చిల్లర తంటాలు కనిపించాయి. టిఫిన్స, భోజనం చేద్దామని వెళ్లిన వారు పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. టిఫిన్ చేసిన కొంత మంది తమ వద్ద చిల్లర లేదని చెప్పడంతో కొన్నిచోట్ల గొడవలు కూడా చోటుచేసుకున్నాయి. నోట్ల రద్దు వల్ల చాలా హోటళ్లలో వ్యాపారం బాగా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. కౌంటర్లు కిట కిట.. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో, టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్ కార్యాలయాల్లో రూ.500, రూ.1,000 నోట్లతో ఇబ్బంది లేకపోయినా చిల్లర ఇవ్వాల్సి వచ్చినప్పుడు కౌంటర్లలో చేతులెత్తేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రూ.350 టిక్కెట్ కోసం రూ.500 నోటు ఇచ్చిన వారికి తిరిగి రూ.150 చెల్లిం చడం పెద్ద సమస్యగా మారింది. దీంతో చాలా మంది రిజర్వేషన్లు చేసుకోకుండా వెనక్కి వెళ్లిపోయారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఇదే సమస్య ఎదురైంది. చిల్లర లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది చేతులెత్త్తేశారు. డబ్బులు బదులు టికెట్ డిపాజిట్ స్లిప్‌లు రైల్వే టికెట్ కొన్నప్పుడు చిల్లర ఇవ్వాల్సి వస్తే నగదు బదులు డిపాజిట్ రశీదులు ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని తర్వాత నగదుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యం లో పరిస్థితిని సమీక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త ఈ నిర్ణయం తీసుకున్నారు. కిక్కిరిసిన పెట్రోల్ బంకులు గ్రేటర్లో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసి పోయారుు. పెద్ద నోట్ల రద్దుతో వాహనదారులు తమ వాహనాల్లో ఒక లీటర్, రెండు లీటర్లు కాదు.. ట్యాంకులు నింపుకోక తప్పలేదు. ఫలితంగా బుధవారం సగటు కంటే 30 నుంచి 40 శాతం వరకు అదనంగా పెట్రో, డీజిల్ అమ్మకాలు పెరిగాయి. మరోవైపు వాహనదారులు అష్ట కష్టాలు పడ్డారు. బంకుల నిర్వాహకులు తమ వద్ద చిల్లర లేదంటూ.. రూ.500.. రూ.వెయికి తక్కువ పెట్రోల్ పోయమని తేల్చి చెప్పారు. ప్రతి వాహనదారులు రూ.500.. రూ.వెరుు్యకి పెట్రోల్.. డీజిల్ పోరుుంచుకున్నారు. పెట్రోల్ బంకుల యజమానులు ఆరుుల్ కంపెనీల నుంచి ముందస్తు ట్యాంకర్లను తెప్పించుకుంటుండటంతో ఎలాంటి కొరత ఏర్పడ లేదు. నోట్ల మార్పిడి.. ఓ నయా దందా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వంద నోట్ల కోసం నానా అవస్థలు పడ్డారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో తమ జేబులో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు తంటాలు పడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు రూ.1,000 నోట్లకు రూ.800..రూ.700, రూ.500కు రూ..400.. రూ.300 చిల్లర ఇచ్చి దోచేసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, పెట్రోల్ బంకులు, మార్కెట్లు.. మొదలైన చోట్ల ఈ వ్యాపారం జోరుగా సాగింది. రాష్ట్రంలో కోట్ల రూపాయల్లో ఈ వ్యాపారం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
11న అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల్లో చెల్లుబాటు
ప్రధాన ఆయిల్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: ప్రధాన ఆయిల్ కంపెనీలైన బీపీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ పెట్రోల్ బంకులు, సీఎన్జీ స్టేషన్లలో ఈనెల 11వ తేది అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి పెట్రోల్, డీజల్ కొనుగోలు చేయవచ్చని ప్రధాన ఆయిల్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త, చీఫ్ రీజినల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన ఆయిల్ కంపెనీల గ్యాస్ వినియోగదారులు ఈనెల 11వ తేది అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి ఎల్పీజీ సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదని, అవసరమైన మేరకు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు. -
'నోట్' దిస్ పాయింట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనాథ్.. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. రాత్రి విధులు పూర్తి చేసుకొని ఇంటికెళ్లే సరికి.. తన కొడుక్కి సడన్‌గా జ్వరమొచ్చిందని భార్య చెప్పింది. సరే తెల్లారి ఆసుపత్రికి తీసుకెళ్దాంలే అనుకున్నాడు. కానీ అప్పుడే గుర్తొచ్చింది.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏటీఎంలో ఉన్నా అవేమో పనిచేయట్లేదే అని!! సర్లే తెల్లారాక చూద్దాంలే అని పడుకున్నాడు. తెల్లారాక అసలు విషయం భార్యతో చెప్పాడు. పర్లేదు నా దగ్గర రూ.1,000 నోటుంది అంది భార్య. ఇదీ సమస్యే. ముందైతే ఆసుపత్రికెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తే ఇబ్బందనుకున్నారు. ఆటోలో వెళ్దామని రోడ్డెక్కారు. ఆటో వచ్చింది కానీ, ‘‘సర్ మీ దగ్గర రూ.100 నోటుంటేనే ఎక్కండి. పెద్ద నోట్లయితే వద్దు. ఇప్పటికే ఇద్దరు ప్యాసింజర్లను వదిలేశాను’’ అన్నాడు ఆటో డ్రైవర్. చేసేదేం లేక ఇంటికెళ్లి బైక్ తీసుకొని బయల్దేరారు. తీరా ఆసుపత్రికెళ్లాక.. ‘‘దయచేసి చిల్లర ఇవ్వండి.. పెద్ద నోట్లు తీసుకోబడవు’’ అని బోర్డు చూసి కంగుతిన్నారు. ముందు డాక్టర్ని చూడనిద్దాం. ఫీజు సంగతి తర్వాత చూద్దాంలే అని అనుకుని డాక్టర్ వద్దకెళ్లారు. తీరా పూర్తయ్యాక.. కన్సల్టేషన్ ఫీజు కోసం చేతిలో ఉన్న రూ.1,000 నోటిస్తే.. బోర్డు చూడలేదా? అంటూ నోటు తీసుకోనన్నాడు డాక్టర్. నా దగ్గర ఈ నోటు తప్ప వేరే లేదు. కార్డుంది కావాలంటే స్వైప్ చేయడన్నాడు శ్రీనాథ్. కానీ, డాక్డర్ వద్ద స్వైప్ మిషన్ లేదు. ముందెళ్లి మందులు తీసుకో.. ఆ తర్వాత వచ్చి ఫీజు ఇవ్వమన్నాడు డాక్టరు. సరే అని మందుల షాపుకెళ్తే పెద్ద నోటు మార్చడానికి రూ.100 అదనంగా చార్జీ చేశాడు షాపతను. చేసేదేంలేక చేతి చమురు వదిలించుకొని బైక్ వద్దకెళితే బండిలో పెట్రోల్ నిండుకుంది. దగ్గర్లోని బంకుకెళితే.. చాంతాడంత క్యూ. సరే అని తన వంతొచ్చేదాకా వెరుుట్ చేస్తే.. ఫుల్ ట్యాంక్ తప్ప చిల్లరకు పెట్రోల్ పోయలేమన్నారు. ఇక్కడా చేసేదేం లేక జేబు గుల్ల చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. రూ.1,000తో ఇంట్లోంచే బయటికెళితే.. డాక్టర్ ఫీజు, మందులు, పెట్రోల్, ఎక్స్ట్రా చార్జీలు పోగా.. రూ.100తో ఇంటికి చేరాడు. .. ఇది జరిగిన ఘటన. సామాన్యుడి యాతనకు నిదర్శనం. నిత్యావసరాలన్నిటికీ పాత నోట్లు చెల్లుతాయని చెబుతున్నారు. నిజమా? ఈ నెల 11వ తేదీ వరకూ పాత రూ.500, రూ.1,000 నోట్లు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో చెల్లుతాయని ప్రభుత్వం చెబుతోంది. పైన చెప్పిన వాటిల్లో సామన్యుడికి రోజువారీ అవసరమైంది పెట్రోల్ బంకే. మరి ప్రభుత్వం లేదా చమురు సంస్థలు నేరుగా నడుపుతున్న పెట్రోల్ బంకులు దేశంలో ఎన్నున్నాయి? వాటికి ఎందరు వెళ్లగలరు? ఎంతమందికని వారు చిల్లర ఇవ్వగలరు? నిజానికి పెద్ద నోట్లు రద్దయిన రాత్రి నుంచే పెట్రోల్ బంకుల్లో జనాలు క్యూ కట్టారు. దీంతో కొన్ని బంకులు ఇదే అదనుగా పెట్రోల్ రేట్లను కృత్రిమంగా పెంచేశాయి. ఇంకొన్ని తమ వద్ద చిల్లర లేదంటూ కస్టమర్లను తిరిగి పంపేశాయి. ఇంకొన్ని ఫుల్ ట్యాంక్ అరుుతేనే కొడతామని చెప్పాయి. అవసరం నిమిత్తం కొందరు వాహనదారులు కావాల్సినంత పెట్రోల్ పోయించుకొని రూ.500 నోటు ఇచ్చి చిల్లర లేదనటంతో ఏం చేయలేక వదిలేసి వెళ్లిపోయిన వారూ ఉన్నారు. ఈ రకంగానూ సామాన్యుడి జేబుకే చిల్లు పడింది. టోల్‌ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి. తగినంత చిల్లర లేకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అన్ని వర్గాలకూ అష్టకష్టాలు.. శుభకార్యం కోసమని ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే ఏం చేయాలి? కొత్త నోట్లెలా వస్తారుు? చేతిలోని పెద్ద నోట్లను బ్యాంకుల్లో వేసి, కొత్త నోట్లు తీసుకోవటం పెద్ద కసరత్తే. మరి ఇంట్లో శుభకార్యం కోసమని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసో, స్నేహితుల నుంచి అప్పోసప్పో చేసి ఇంట్లో పెట్టుకున్నవారి పరిస్థితేంటి? చాలామంది పెళ్లిళ్లలకు, శుభకార్యాలకు సరైన రోజులు కావటంతో అడ్వాన్సలు, ఖర్చుల కోసమని భారీగా నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అడ్వాన్స ఇవ్వటానికి వెళితే పెద్ద నోట్లు తీసుకోలేమని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ప్రయాణాల్లో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం. విహారయాత్రలు, పుణ్య క్షేత్రాలకు వెళ్లిన వారు చేతిలో ఉన్న పెద్ద నోట్లు ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊరు కాని ఊళ్లో పరిచయస్తులు కూడా లేని ప్రాంతాల్లో గమ్యస్థానాన్ని చేరుకునేందుకు, తినడానికి తిండీ లేక నరకయాతన అనుభవించారు. బ్యాంకు ఖాతాల్లో అయితే ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఖాతాలు లేనివారికి, నగదు అవసరమైన వారికి రోజుకు రూ.4 వేలు మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తామని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ అవసరమైనవారి సంగతేంటి? నోట్ల మార్పునకు ఈ నెల 24 వరకు పరిమితిని రూ.4 వేలుగా విధించారు. కానీ దేశంలో రోజుకు రూ.4 వేలకన్నా ఎక్కువ ఖర్చుచేసేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల తొలి రోజే దేశంలో 70 శాతం వ్యాపారం పడిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారుు. ఎప్పుడూ ట్రాఫిక్‌తో, వ్యాపారాలతో కిటకిటలాడే హైదరాబాద్‌లో రోడ్లు సైతం ఖాళీగా కనిపించారుు. చాలా మంది చేతిలో ఉన్న సొమ్ముతో నిత్యావసర కొనుగోళ్లకే మొగ్గు చూపారు. దీంతో రెస్టారెంట్లు, బార్ షాపులు, వైన్‌షాపులు, సినిమా థియేటర్లు వెలవెలబోయారుు. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగం, ఆన్లైన్ చెల్లింపుల వంటి ఎలక్ట్రానిక్స్ చెల్లింపులకు ఎలాంటి అంతరాయం, పరిమితి లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దేశంలో వీటిద్వారా జరుగుతున్న జరుగుతున్న లావాదేవీలు 52 శాతమే. అది కూడా అధికారికంగా నమోదైనవి మాత్రమే. గురువారం (ఈ నెల 10) నుంచి డిసెంబర్ 30 వరకు మన చేతిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ఈ సొమ్మునంతా ఒకేసారి క్యాష్ రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చా? సమాధానం: కుదరదు. ఒక వ్యక్తికి రోజుకు రూ.4 వేలు మాత్రమే నగదు రూపంలో తీసుకునే వీలుంది. మిగిలిన సొమ్మును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. నా వ్యక్తిగత అవసరాలకు రూ.4,000 సొమ్ము సరిపోదు. మరిప్పుడేం చేయాలి నేను? డెబిట్, క్రెడిట్, ఆన్లైన్ వంటి ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసుకోవచ్చు. మొబైల్ వాలెట్స్, చెక్, డీడీ రూపంలోనూ వినియోగించుకునే వీలుంది. రూ.4,000లకు పైన సొమ్ము కావాలంటే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. మరి నాకు ఖాతా లేకుంటే? భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర్లోని ఏదైనా బ్యాంకుకు వెళ్లండి. కేవైసీ నిబంధనలను పూర్తి చేసి.. బ్యాంకు ఖాతాను తెరవండి. ఆపైన చెల్లింపులు చేసుకోవచ్చు. ఒకవేళ నాకు కేవలం జన్‌ధన్ ఖాతా మాత్రమే ఉంటే? జన్‌ధన్ ఖాతా నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ఆయా ఖాతాలో నగదును వేసుకునే వీలుంది. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఎక్కడికి వెళ్లాలి? రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకులు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు అకౌంట్ ఉన్న బ్యాంకుకు కాకుండా ఇతర బ్యాంకుకు వెళ్లవచ్చా? తప్పుకుండా వెళ్లవచ్చు. కానీ, సరైన గుర్తింపు కార్డు, మీ బ్యాంక్ ఖాతా వివరాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా బ్యాంక్ ఖాతా లేదు. కానీ, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అకౌంట్ ఉంది. మరి నా వద్ద ఉన్న సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయవచ్చా? చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ఖాతాలో పాత పెద్ద నోట్లను జమ చేసుకునే వీలుంది. కానీ, మీరు లిఖితపూర్వకంగా రాసిన అనుమతి పత్రాన్ని సంబంధిత అధికారులకు చూపించాల్సి ఉంటుంది. నోట్ల మార్పు, నగదు ఉపసంహరణకు వ్యక్తిగతంగా వెళాల్సిందేనా? లేక రిప్రజెంటివ్ను పంపిస్తే సరిపోతుందా? సాధ్యమైనంత వరకూ వ్యక్తిగతంగా వెళ్లటమే ఉత్తమం. వెళ్లలేని పక్షంలో మీ రిప్రజెంటివ్ను పంపించొచ్చు. కానీ, ఖాతాదారుని వివరాలు, గుర్తింపు కార్డుతో పాటూ రిప్రజెంటివ్ గుర్తింపు కార్డు, వివరాలనూ సమర్పించాల్సి ఉంటుంది. ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా క్యాష్‌ను డిపాజిట్ చేయవచ్చా? నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పాత రూ.1,000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఉంది? డిసెంబర్ 30 లోగా పెద్ద నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి మార్చుకోవచ్చు. ఒకవేళ ఆ తేదీలోగా మార్చుకోలేని పక్షంలో... అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 2017 మార్చి 31వరకూ మార్చుకోవచ్చు. ప్రస్తుతం నేను ఇండియాలో లేను. మరి నేనేం చేయాలి? మీ వద్ద ఇండియన్ కరెన్సీకి ఉండి.. అది కూడా పెద్ద నోట్లు ఉంటే.. వాటిని తీసుకొని ఏదైనా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. సంబంధిత వ్యక్తి గుర్తింపు కార్డును ఇచ్చి! లేదా మీకు తెలిసిన వారి బ్యాంక్ ఖాతాలోనూ ఆన్లైన్ ద్వారా మీరే జమ చేయవచ్చు. ఏ గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుంది? ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లెసైన్‌స, పాస్‌పోర్ట్, ఎన్ఆర్ఈజీఏ కార్డు, లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్దు లేదా పబ్లిక్ సెక్టార్ తమ ఉద్యోగులకిచ్చే గుర్తింపు కార్డునూ సమర్పించవచ్చు. నేను ప్రవాస భారతీయుడిని. నాకు దేశంలో ఎన్నారై ఖాతా ఉంది? నా వద్ద ఉన్న పెద్ద నోట్లను ఎన్నారై ఖాతాలో జమ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, మీ ఎన్నారై ఖాతా అకౌంట్లోనే జమ చేసుకోవాల్సి ఉంటుంది. నేను విదేశీ పర్యాటకుడిని. నా వద్ద రూ.1,000, రూ.500 నోట్లు ఉన్నారుు. మరిప్పుడు నేనేం చేయాలి? అంతర్జాతీయ విమానాశ్రయాల్లో, ఫారెన్ ఎక్స్ఛేంజ్ సెంటర్లలో రూ.5 వేల వరకూ నగదును మార్చుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రి, మందులు, ట్రావెల్ వంటి అత్యవసరాల సేవల నిమిత్తం నగదు అవసరం మరి నేనిప్పుడు ఏం చేయాలి? ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో మీ చేతిలో ఉన్న పాత రూ.1,000, రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయి. రైల్వే కౌంటర్లు, బస్టాండుల్లో, విమానాశ్రయాల్లో టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గరున్న పెద్ద నోట్లను అప్పగించండని చెప్పి.. తీరా నా సొమ్మును ఒకేసారి తీసుకునే వీలులేకపోవటమేంటి? నల్లధన ప్రవాహానికి ప్రధాన కారణం నగదు చెల్లింపులే. అందుకే నగదు చెల్లింపులను పూర్తిగా రూపుమాపాలనే ధ్యేయంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా అని మీ దగ్గరున్న సొమ్ము మొత్తాన్ని తీసుకొని ఒకేసారి కొత్త నోట్లను మీకిస్తే.. మిగిలిన ప్రజలకు ఇబ్బంది అవుతుంది. పెపైచ్చు ప్రజలందరికీ సరిపడేంత కొత్త నోట్లను ముద్రించలేదు. అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు మాత్రమే వెళ్లాలా? నోట్ల మార్పునకు అది కూడా రూ.4 వేల వరకై తే ఏ బ్యాంకుకు వెళ్లినా పర్వాలేదు. కానీ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ మీకు రూ.4 వేలకు మించి అది కూడా మీ ఖాతాలో జమ చేస్తే చాలనుకుంటే మాత్రం.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు గానీ లేదా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు గానీ వెళ్లవచ్చు. చెక్ రూపంలో బ్యాంక్‌లో నగదును డ్రా చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, చెక్ రూపంలో రోజుకు రూ.10 వేలు, గరిష్టంగా వారానికి రూ.20 వేలు మించి డ్రా చేయటానికి వీల్లేదు. (ఇందులో ఏటీఎం నుంచి డ్రా చేసిన సొమ్ము కూడా కలుస్తుంది) ఈ నిబంధన ఈనెల 24 వరకూ ఉంటుంది. ఆ తర్వాత పరిమితిని పెంచే అవకాశముంది.) ఏటీఎం నుంచి నగదును డ్రా చేసుకోవచ్చా? ప్రస్తుతమైతే రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవు కాబట్టి డ్రా చేయలేరు. ఏటీఎంలు పనిచేయటం మొదలెట్టాక.. డ్రా చేసుకునే వీలుంది. కానీ, రోజులో ఒక్కో కార్డుపై రూ.2,000లకు మించి డ్రా చేయటానికి వీల్లేదు. ఈనెల 18వ తేదీ వరకూ ఈ నిబంధన ఉంటుంది. ఆ తర్వాత రోజు నుంచి రోజుకు ఒక్కో కార్డుపై రూ.4,000 వరకూ నగదును తీసుకోవచ్చు. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రూ.500, 1000లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. ఇది ప్రజల జీవించే హక్కు, వ్యాపార నిర్వహణ, తదితర హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు కనీస సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. పాతనోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలకు కట్టుబడలేదని తెలిపారు. ఫలితంగా సాధారణ పౌరుల వ్యాపారం, విద్య, దైనందిన జీవితంలో గందరగోళం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడమో లేదా ప్రజలు పాతనోట్లు మార్చుకోవడానికి తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఢిల్లీ లాయర్ వివేక్ నారాయణ్ శర్మ దాఖలుచేసిన ఈ పిటిషన్ ఈ వారంలోనే విచారణకొస్తుంది. హైకోర్టులోనూ వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కల్గించే విధంగా ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడి జీవితం స్తంభించిందని, నిత్యావసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ జారీచేసేందుకు అవకాశం కల్పించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 26(2)ను రద్దు చేయాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారించాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య అభ్యర్థించినా ధర్మాసనం నిరాకరిస్తూ గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల నిబంధనలు, వివరాల మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్బీఐ.ఓఆర్జీ.ఇన్ లేదా 022 22602201/022 22602944 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
నోట్ దిస్ పాయింట్!
-
మీ దగ్గర రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా..
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం ► అవి మంగళవారం అర్ధరాత్రి నుంచే విలువ కోల్పోతాయని ప్రధాని ప్రకటన ► తాజా నిర్ణయంపై జిల్లా వాసుల్లో మిశ్రమ స్పందన ► ఆశించిన ప్రయోజనం ఉండదంటున్న పలువురు ఆర్థికవేత్తలు ► మార్పు మంచిదే అంటున్న మరికొందరు.. మేధావి వర్గాల్లోనూ అదే అభిప్రాయం ► నేడు, రే పు ఏటీఎంలు పనిచేయవు.. రోజుకు విత్‌డ్రా రూ.10 వేలు మాత్రమే.. ► ఉన్న నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చు ► ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానం సాక్షి, నల్లగొండ : మీ దగ్గర రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా.. కుటుంబం కోసం ఏదైనా కొనుగోలు చేయడానికి ఈ నోట్లను మీరు దాచిపెట్టుకున్నారా.. బ్యాంకుల్లో ఉంటే ఓకే.. నగదు రూపంలో ఉంటే మాత్రం వెంటనే కదలండి. బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి వాటిని మార్చుకోండి. ఎందుకంటే.. మంగళవారం అర్ధరాత్రి నుంచే 500, 1000 నోట్లు విలువ కోల్పోతున్నాయి. వాటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఉన్నట్టుండి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా వాసుల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏ నోటవిన్నా.. ఎక్కడ చూసినా.. ఇదే విషయంపైనే చర్చ సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని మోదీ ప్రకటన సంచలనాన్నే సృష్టించింది. అవినీతి, బ్లాక్‌మనీ టార్గెట్‌గా... వాస్తవానికి ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వ చ్చినప్పటి నుంచే.. ఏదో ఒక సంచలన ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభమైన మొదట్లో దేశంలో అవినీతి, బ్లాక్‌మనీ, ఉగ్రవాద కార్యకలాపాలు ఎలాంటి ఆటంకంగా మారాయనే దానిపై ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా రూ.500, రూ.1000 నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చెల్లవని, ముద్రణ నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన విన్న ప్రజలు తాము విన్నది నిజమేనా..? అనుకున్న ప్రజలు ప్రధాని ప్రకటన పూర్తిగా అవగతం అయిన తర్వాత మాత్రం తదుపరి పరిణామాలపై చర్చించుకున్నారు. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం జరిగిందనే చర్చ జరిగింది. దీనికి తోడు అవినీతి, ఉగ్రకార్యకలాపాలకు ఆసరాగా మారిన దొంగనోట్ల ముద్రణ లాంటి వాటిని అరికట్టవచ్చనే, కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రా యం జిల్లా వాసుల్లో వ్యక్తమయింది. కేం ద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయాలు ఎలా ఉన్నా.... సామాన్య ప్రజల వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానమనే అంశం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ప్రధాని చెప్పిన నేపథ్యంలో గ్రామీణులకు ఈ విషయాన్ని తెలియపరిచే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మిశ్రమ స్పందన.. ఇక, ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తుందనే అభిప్రాయం జిల్లా ఆర్థిక వర్గాల్లో వ్యక్తం కాలేదు కానీ...దీనివల్ల కేంద్రం ఆశించిన ప్రయోజనం ఏమీ ఉండదని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు. కేంద్రం నిర్ణయంలో కీలకమైనవి.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే రూ.500, 1000 నోట్లు చెల్లవు. ఇకపై పాత నోట్ల ముద్రణ ఉండదు. ఈ నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లు ముద్రిస్తారు. అవి త్వరలోనే చెలామణిలోకి వస్తాయి. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేయవచ్చు. అప్పటివరకు బస్సులు, రైళ్లు, ఇతర ప్రభుత్వ రవాణా వ్యవస్థల్లో ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయి. నవంబర్11 వరకు పెట్రోల్ బంకుల్లో కూడా చెల్లుతాయి. ఇంటర్నెట్ లావాదేవీలు, డీడీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. బుధ, గురు వారాల్లో ఏ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలు కూడా పనిచేయవు. ఇక నుంచి ఏటీఎంల ద్వారా డబ్బు ఉపసంహరణ (విత్‌డ్రాయల్) మొత్తాన్ని కూడా మార్చారు. రోజుకు రూ.10,000, వారానికి రూ..20,000 మాత్రమే ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు. ఆశించిన ప్రయోజనం ఉండదు.. రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం కొంతమేర బయటకు వస్తుంది. అయితే, నగదు రూపంలో ఉన్న నల్లధనమే బయటకు వస్తుంది. అక్రమార్జన ద్వారా సంపాదించిన ఆస్తులు, బంగారం లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇక, నల్లధనం ఉన్న వారు కూడా మార్చుకోకుండా నష్టపోవడానికి సిద్ధపడితే ఈ నిర్ణయం మరింత వృధా అవుతుంది. ఇక, దొంగనోట్ల విషయానికి వస్తే దొంగనోట్ల ముద్రణ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్థాయిలో లేదనే చెప్పుకోవాలి. ఈ కారణాల వల్ల ప్రధాని నిర్ణయం ఆశించిన ప్రయోజనం పొందదు. - డాక్టర్ అందె సత్యం, ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.. ఇది మంచి పరిణామమే. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చు. చేతుల మీదుగా విచ్చలవిడి డబ్బు ప్రవాహాన్ని కూడా నియంత్రించవచ్చు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగానే కనిపిస్తోంది. సమసమాజ నిర్మాణం దిశలో కమ్యూనిస్టుల అభిప్రాయానికి ద గ్గరగా ఈ నిర్ణయం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. - ఆకుల రవీందర్, కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ ‘స్మార్ట్’ లావాదేవీల కోసమే.. ఁఅభివృద్ధి చెందిన దేశాల తరహాలో భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను తీసుకురావాలన్న క్రమంలో ఈ నిర్ణయం చాలా కీలకమైంది. కేవలం ఇంటిసామాన్లు, కూరగాయలు లాంటివి కొనుక్కునేందుకే నగదు లావాదేవీలు జరిపి, మిగిలిన అన్నింటినీ స్మార్ట్ లావాదేవీలు జరపాలనేది కేంద్రం యోచనగా భావించవచ్చు. ఏదైనా మార్పు మంచిదే. - కందిమళ్ల సుధీర్‌రెడ్డి, సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి, హైదరాబాద్ సామాన్య ప్రజలకు నష్టం లేదు.. లాభం లేదు ఈ నిర్ణయం మంచిదేననే భావన వస్తోంది. అయితే, దీని వల్ల సామన్య ప్రజలకు ఎలాంటి నష్టం, లాభం ఉండదు. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగానే ఈనిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అదే విధంగా దొంగనోట్ల ముద్రణను కూడా కొంతమేర నివారించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఈ ప్రక్రియలో సామాన్య ప్రజలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -పెరమాళ్ల వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ప్రజల్లో అవగాహన కల్పించాలి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రజల విషయం లో జాగ్రత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకెళ్లాలి. వారి దగ్గర న గదు రూపంలో ఉన్న మొత్తాన్ని దళారులకు ఇవ్వకుం డా, బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే జమ చేసుకోవాలని తె లియజేయాలి. ఈ బాధ్యతలను ప్రభుత్వ వర్గాలే తీసుకోవాలి. డిసెంబర్ 31 కల్లా గ్రామాల్లోని ప్రజల వద్ద రూ.500, 1000 నోట్లు లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలి. - గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ, నల్లగొండ -
అసోంలో పతంజలి మెగా ఫుడ్‌పార్క్
హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ‘పతంజలి ఆయుర్వేద్’... అసోంలో మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. అసోంలోని సోనిత్పూర్ జిల్లా బలిపర ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఈ ఫుడ్ పార్క్‌కు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదివారం శంకుస్థాపన చేశారు. దాదాపు 1,300 కోట్ల పెట్టుబడితో ఈ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఫిబ్రవరి నాటికి ఇందులో కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్‌దేవ్ ఈ సందర్భంగా తెలిపారు. రూ.20,000 కోట్ల వార్షిక టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటవుతున్న ఈ ఫుడ్ పార్క్ దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఆచార్య బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. -
అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్
ముంబై: ఆటోమొబైల్ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అశోక్ లేలాండ్ భారీ ఆర్డర్ ను చేజిక్కించుకుంది. టాంజానియా ప్రభుత్వం నుంచి 170 మిలియన్ డాలర్లు సుమారు రూ 1,130.96 కోట్ల విలువైన ఆర్డర్ ను దక్కించుకుంది. అశోక్ లేలాండ్ వాహనాలు, జెన్ సెట్స్, విడిభాగాలు తదితర వర్క్ షాప్ కవసరమైన పరికరాలు, ట్రైయినింగ్ మాడ్యూల్స్ సరఫరా కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ ప్రభుత్వం నుంచి తమ వాహనాలు, విడిభాగాలు , అంబులెన్స్ పరికరాల కొనుగోలు కోసం భారీ ఆర్డర్ ను సాధించినట్టు గురువాం బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులద్వారా గ్లోబల్ గా విస్తరించాలన్న అశోక్ లేలాండ్ వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందమని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి ఒక ప్రకటనలో తెలిపారు . ఈ ప్రకటనలో ఇవాల్టి మార్కెట్ అశోక్ లేలాండ్ సుమారు 2శాతం లాభపడింది. తాజా ఆర్డర్ నేషనల్ ఎగుమతి భీమా ఖాతా(ఎన్ఈఐఎ) పథకంలో భాగంగా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఫైనాన్స్ చేసింది. -
రూ.1,499కే డేటావిండ్ స్మార్ట్‌ఫోన్
తక్కువ బడ్జెట్లో టాబ్లెట్లను ఆవిష్కరించే కంపెనీగా పేరున్న డేటావిండ్, తాజాగా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పాకెట్‌సర్ఫర్ జీజడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను రూ.1,499కే కస్టమర్లకు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌తో పాటు ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సౌకర్యాన్ని కూడా వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తూ.. టెక్నాలజీని సరసమైన ధరల్లో యూనివర్స్ల్గా అందించేందుకు దృష్టిసారించామని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి చెప్పారు. టెక్నాలజీ డెమోక్రటైజేషన్కు ఇదే నిజమైన అర్థమని తెలిపారు. తక్కువ ధరల్లో టెక్నాలజీని అందించడం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని సునీత్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలో దాగిఉన్న ప్రతి మూలకు టెక్నాలజీ చేరేలా తాము దోహదం చేస్తామన్నారు. టచ్ స్క్రీన్, రియర్ కెమెరా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. అయితే పాకెట్‌సర్ఫర్ జీజడ్కు సంబంధించిన మిగతా ఫీచర్లను కంపెనీ తెలుపలేదు. తాజాగా లాంచ్ చేసిన పాకెట్‌సర్ఫర్ జీజడ్ ఒక్కటే కంపెనీ నుంచి వెలువడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కాదు. పాకెట్‌సర్ఫర్ 2జీ4ఎక్స్, పాకెట్‌సర్ఫర్ 3జీ4ఎక్స్, పాకెట్‌సర్ఫర్ 3జీ5, పాకెట్‌సర్ఫర్ 3జీ4జడ్ స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో బడ్జెట్ ధరల్లో మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఫ్రీడం 251 తర్వాత డేటావిండ్స్ పాకెట్‌సర్ఫర్ జీజడ్ స్మార్ట్ఫోనే చాలా చౌకైన మొబైల్. ఐడీసీ డేటా ప్రకారం డేటావిండ్ తక్కువ ధరల్లో టాబ్లెట్లను అందించడంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. కంపెనీ టాబ్లెట్ల రవాణా 2016 తొలి త్రైమాసికంలో 33.5 శాతం పెరిగి, 27.6 శాతం మార్కెట్ షేరును డేటావిండ్ దక్కించుకుంది. మొత్తంగా టాబ్లెట్ మార్కెట్ భారత్‌లో ఫ్లాట్‌గా ఉంది. -
రూ.1,400 కోట్లతో న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్
► కృష్ణపట్నంపోర్టులో ప్రత్యేక బెర్తు ఏర్పాటు ► 2017లో పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా ముత్తుకూరు/చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా భారీ సహజ వాయువుల పైపులైను ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ సంస్థ రూ. 1,400 కోట్ల అంచనాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టులో ఎల్ఎన్జీ(లిక్విడ్ నాచురల్ గ్యాస్) బెర్తు నిర్మిస్తారు. ఇక్కడ నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకే కాకుండా ఇఫ్కో, శ్రీసిటీ, మేనకూరు సెజ్‌లు, తొట్టంబేడు, ఏర్పేడు, మాంబట్టు, గుమ్మడిపూడి, మనాలి పారిశ్రామికవాడలకు గ్యాస్ సరఫరా చేస్తారు. 2017లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నూరు, నెల్లూరు, కృష్ణపట్నం, సుళ్లూరుపేట, రేణిగుంట వరకు పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు. తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు ట్రక్కుల ద్వారా గ్యాస్ రవాణా జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో, జపాన్, చైనా పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. రివర్‌బే గ్రూపు, కేఈఐ గ్రూపులు ఈ ఎల్ఎన్జీ భారత్ టెర్మినల్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్యాస్ కొరతను తీరుస్తాం: మూర్తి కృష్ణపట్నం పోర్టులో తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో 5 ఎమ్ఎమ్టీపీఏ సామర్థ్యం ఉన్న ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ స్టోరేజి యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ ఎండీ మూర్తి మంగళవారం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా విద్యుత్, ఎరువుల పరిశ్రమలకు గ్యాస్‌ను అందించే వీలుంటుందన్నారు. భారతదేశ గ్యాస్ మార్కెట్లో సుమారు 45 ఎంఎంఎస్సీ ఎండీ కొరత ఉందని, డిమాండ్‌కు తగ్గట్టుగా అందించడానికి కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఎన్ఎన్జీ స్టోరేజీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారుగా 1.30 లక్షల ఎల్‌త్రీ ఎల్ఎన్జీని నిల్వచేసే ఒక ఎఫ్‌ఎస్‌యూ(నిల్వలతో తేలియాడే యూనిట్ షిప్)ను కృష్ణపట్నంలోని ప్రత్యేక జట్టీతో కలిపి ఉంచుతామన్నారు. దీనివలన చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కాలుష్యం ఉండదని తెలిపారు. -
రూ.1500 కోట్ల భూమి ఆక్రమణ
* దుర్గం చెరువును పరిశీలించిన అంచనాల కమిటీ * వివరాలను వెల్లడించిన చైర్మన్ రామలింగారెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో రూ.1,500 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను అంచనాల కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ దుర్గం చెరువు పరిసరాల్లోని 60 ఎకరాల విలువైన భూమి అన్యాక్రాంతమైందన్నారు. చెరువు, శిఖం భూములను ఆక్రమించిన వాళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. ప్రాథమిక సర్వే చేసిన తర్వాత ప్రభుత్వానికి ఆక్రమణలపై నివేదిక ఇస్తామన్నారు. దుర్గం చెరువు పరిశీలన దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, వీరేశం, డి.కె.అరుణ, అంజయ్య, ప్రభాకర్‌రావు, కృష్ణారావు, జనార్ధన్‌రెడ్డి, హెచ్ఎండీఏ చైర్మన్ శాలిని మిశ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఆక్రమణల వివరాలతో కూడిన ప్రదర్శన... దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను, వాటి నమూనాలను, ఆక్రమణలతో కూడిన వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను అంచనాల కమిటీ సభ్యులు తిలకించారు. కాగా ఎఫ్టీఎల్ పరిధిలోనే అమర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ(హుడా అప్రూవ్డ్ లే అవుట్), కావూరి హిల్స్ (హుడా అప్రూవ్డ్ లే అవుట్), ఎస్టీపీ పక్కన, ఓరుగంటి నర్సింహ్మ లే అవుట్, కల్యాణ్ నగర్, బృందావన్‌కాలనీ, నెక్టార్ గార్డెన్, గఫూర్ నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయని ప్రదర్శనలో పేర్కొన్నారు. ఈ కాలనీ వివరాలను సభ్యులు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
విగ్రహానికి జడ్ ప్లస్ భద్రత...
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి భద్రతను పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. 190 అడుగుల ఎత్తైన ఈ స్మారక విగ్రహానికి రూ.1900 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సందర్శక స్థలంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనుంది. కంటికి కనిపించని రాడార్ల సాయంతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డులు.. చత్రపతి విగ్రహానికి జడ్ ప్లస్ ప్లస్ భద్రతను కల్పించనున్నారు. బంకర్లు వాడకంతో పాటు ఇందుకోసం ప్రత్యేక భద్రత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. టెర్రరిస్టు దాడులు లాంటివి జరగకుండా, 26/11 లాగ ముంబై పట్టణంలోకి ఉగ్రవాదులు ప్రవేశించడానికి వీలులేకుండా చేయడానికి ఆ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. 2019 నాటికి ఇక్కడి చత్రపతి విగ్రహాన్ని రోజుకు కనీసం 10 వేల మంది సందర్శిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహానికి చుట్టూ 16 హెక్టార్లలో నారిమన్ పాయింట్ కు 2.6 కిలోమీటర్ల దూరం నుంచి రాడార్ల సిస్టమ్ ను వినియోగిస్తారు. దాడులు లాంటివి జరిగినప్పుగు భద్రతా బలగాలు రక్షణ పొందేందుకు బంకర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలతో మెమోరియల్ పై నిఘా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముంబై పోలీసులు, తీరప్రాంత బలగాల సమన్వయం కోసం ప్రత్యేక భద్రతా విభాగాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
జెడ్పీ ప్రణాళిక.. రూ.1000కోట్లు
నీలగిరి : పల్లె ప్రణాళిక తరహాలోనే...జిల్లా పరిషత్ ప్రణాళికలు తయారయ్యాయి. జెడ్పీ ఆమోదించిన రూ.15 వేల కోట్ల జిల్లా ప్రణాళికలోనుంచి 30 ప్రాధాన్యత అంశాలను తొలి ఏడాదిలో చేపట్టేందుకు రూ.వెయ్యి కోట్ల ప్రణాళికతో అధికారులు సమాయత్తమయ్యారు. జిల్లా సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కీలకశాఖలకు ప్రాధాన్యం కల్పించారు. విద్య, వైద్యం, క్రీడలు, యువత ఉపాధి, పర్యాటకం, రహదారుల నిర్మాణాలకు పెద్దపీట వేశారు. ‘మన జిల్లా-మన ప్రణాళిక’లో భాగంగా 30 ప్రాధాన్యత పనులు గుర్తించిన అధికారులు అందుకు అవసరమయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. దీంట్లో సింహభాగం గ్రామీణ తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణాలకు ఎక్కువ కేటాయింపులు చేశారు. వసతి గృహాలు, కేజీబీవీల సమస్యల పరిష్కారం జిల్లాలో సంక్షేమ వసతి గృహాల ఆధునికీకరణ, హాస్టల్ విద్యార్థులకు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. అదే విధంగా కోట్ల రూపాచలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు ప్రహరీ లేవు. దీని వల్ల బాలికలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్‌లో ఈ పాఠశాలల్లో ఆర్వోప్లాంట్లు (రివర్స్ ఆర్మోసిస్ ప్లాంట్లు) ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. దీంతో ముందస్తుగా ఆయా పాఠశాలలకు ప్రహరీలు, హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రణాళికలో రూ.60 కోట్లు కేటాయించారు. స్త్రీ శక్తి భవనాలకు మోక్షం జిల్లాలో స్త్రీ శక్తి భవనాలు నిధులు లేక పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ భవనాలకు నిధులు కేటాయించి పనులు చేపట్టడం ద్వారా నిరుపయోగంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ భవనాల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు. పర్యాటకం పురోగతి తెలంగాణ రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న నల్లగొండ జిల్లాకు పర్యాటక శోభ తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. డిండి, ఉండ్రుగొండ, నీలగిరి శిల్పారామం, పోచంపల్లిలో గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని నిర్మించేందుకు రూ.4 కోట్లు కే టాయించారు. యువతకు ఉపాధి నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలో రూ.33 కోట్లు కేటాయించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు యువతీ, యువకుల అర్హతను బట్టి వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. భూసార పరీక్ష కేంద్రాలు రైతుల్లో అవగాహన కల్పించి పంట మార్పిడి చర్యలు చేపట్టేందుకు డివిజన్ కేంద్రాల్లో భూసార పరీక్ష కేం ద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రణాళికలో రూ.3కోట్లు కేటాయించారు. డివిజన్ కేం ద్రాల్లో భూసార పరీక్ష సహాయ సంచాలకుల కార్యాల యాల నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించారు. రహదారుల విస్తరణ జిల్లాలో ఆర్అండ్బీ రహదారుల విస్తరించేందు రూ.158 కోట్ల ప్రణాళిక తయారు చేశారు. మండల కేంద్రాల రహదారులను ప్రధాన రహదారులకు అను సంధానం చేసేందుకుగాను ఈ నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 77 రోడ్ల నిర్మాణాలకు రూ.125 కోట్లు కేటాయించారు. మండలాలు, గ్రామాల రహదారులను అనుసంధానం చేసేందుకు పంచాయతీరాజ్ ప్రణాళిక రూపొందించింది. విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు... గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశారు. ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖకు ప్రత్యేక బడ్జెట్ లేకపోవడం వల్ల చర్యలు చేపట్టడంలో అధికారులు మిన్నకుండిపోయారు. గ్రామాల్లో ఇళ్ల మీద నుంచి వెళ్లే హైటెన్షన్ లైన్లను తొలగించేందుకు, వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి, వేలాడుతున్న తీగలను తొలగించి అక్కడ మధ్యంతర విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చే సేందుకు రూ.20 కోట్ల ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల గ్రామాల్లో విద్యుత్ చౌర్యం నియంత్రణ, ప్రమాదాలు నివారణకు దోహద పడుతుంది.