Runamaphi farmer
-
ఇది దా‘రుణమే’!
మొత్తం రుణాల లక్ష్యం: రూ.272.5కోట్లు ఇప్పటికి ఇచ్చినట్టు చెబుతోంది: రూ.162.1 కోట్లు రైతుల చేతికిచ్చింది: రూ.12 కోట్లు రెన్యూవల్, రీషెడ్యూల్: 150.1 కోట్లు కొత్తగా రుణం పొందిన రైతులు: 5,156 మంది పైసా చేతికందని రైతులు: 54,691 మంది రైతు రుణమాఫీ ప్రక్రియ కొత్త రుణాల మంజూరుకు గుదిబండగా మారింది. రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగోవంతు నిధులు మాత్రమే విడుదల చేసింది. మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో అర్హులైన రైతులకు తిరిగి పంటరుణాలు చెల్లించాలని స్పష్టం చేసింది. కానీ బ్యాంకర్లు ఇందుకు సమ్మతిస్తూనే.. కొర్రీలు వేయడంతో కొత్త రుణాల లభ్యత రైతుకు కష్టంగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో రూ.272.5కోట్ల రుణాలు ఇచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 59,847 మంది రైతులకు రూ.162.1కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్ల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్ ముగియడాకి మరో రెండు నెలల సమయం ఉండడంతో ఆలోపు పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని సాధించేలా పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇందులో కేవలం 5,156 మంది రైతులకు మాత్రమే.. అంటే 8 శాతం మంది రైతులకే కొత్తగా రూ.12 కోట్ల రూపాయలు రుణరూపంలో ఇచ్చారు. మిగతా రూ.150.1 కోట్ల రుణాలను రెన్యూవల్, రీషెడ్యూల్ చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో రూ.135 కోట్ల రుణాలను రెన్యూవల్ చేయగా, రూ.15కోట్లు రీషెడ్యుల్ చేశారు. ఇలా 54,691 మంది రైతులకు పైసా చేతికివ్వకుండానే రుణాలిచ్చినట్లు బ్యాంకులు లెక్కలు చూపడం గమనార్హం. కాగితాల్లోనే పురోగతి.. వరుసగా నష్టాల పాలవుతున్న రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సీజన్‌కు ముందు పంటరుణాల అందిస్తుంది. అలా తీసుకున్న రుణాన్ని పంటకు పెట్టుబడి పెట్టి రైతు సాగుపనులకు ఉపక్రమిస్తాడు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తారుమారైంది. గత బకాయిలను చూపుతూ.. వాటినే కొత్త రుణాలుగా ఖాతా పుస్తకాల్లోకి మారుస్తూ రైతుకు పైసా ఇవ్వకుండానే రుణాల పురోగతిని సాధించినట్లు చూపుతున్నాయి. నాలుగోవంతే రుణం.. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు పావువంతు నిధులు మాత్రమే విడుదల చేసింది. ఈక్రమంలో బ్యాంకులు ఒక్కో రైతుకు అర్హతలో గరి ష్టంగా పావువంతు మాత్రమే రుణాలిస్తున్నాయి. అంటే గతంలో రూ.లక్ష తీసుకున్న రైతు ఖాతాల్లో మాఫీ కింద రూ.25వేల జమయ్యాయి. దీంతో ఆ రైతు చెల్లింపుల తీరును పరిగణనలోకి తీసుకొని గరి ష్టంగా రూ.25వేల రుణం మంజూరు చేస్తున్నారు. కొత్తగా ఐదు వేల మందికి రుణాలివ్వగా.. మిగతా వారిలో ఇలా కొంత మొత్తాన్ని రుణంగా ఇస్తూ మిగతా మొత్తాన్ని కొత్త ఖాతాలోకి మారుస్తున్నారు. -
రైతు వ్యధ పట్టని బాబు
రుణాలు రద్దు చేసే సత్తా లేనప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత హామీ ఎందుకు ఇచ్చినట్టు..ఏరుదాటి తెప్ప తగలేసేందుకా..దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులను అవమానించేందుకా..వ్యవసాయాన్ని ఎగతాళి చేసేందుకా.. సీఎం గా చంద్రబాబు తొలి సంతకం చేసిన నాటి నుంచి రుణమాఫీ కోసం ఎదురు చూడని రైతూ లేడు..ఎదురు చూడని కుటుంబం లేదు.. పాలనా పగ్గాలు చేపట్టి 150 రోజులు గడిచినా హామీ ఇచ్చిన రూ.1.50 లక్షల రుణం మాఫీ అమలు కాకపోగా సవాలక్ష సందేహాలు రైతుల బుర్రలు తొలుస్తున్నాయి. సత్తెనపల్లి: జిల్లాలో రైతు రుణమాఫీపై స్పష్టత కొరవడింది. ఎవరి రుణాలు మాఫీ చేస్తారు, ఎవరి పేర్లు తొలగిస్తారు అనే విషయాలు రైతులకు బోధపడడం లేదు. రెండు రోజుల కిందట ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితా విడుదల చేసినా క్షేత్ర స్థాయిలో వివరాలు తెలియడం లేదు. శనివారం గ్రామ రెవెన్యూ అధికారుల వద్దకు జాబితాలు వచ్చాయి. ఆ జాబితాల్లో ఉన్న రైతులు రుణమాఫీకి అర్హులా, అనర్హులా పరిశీలించి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు వీఆర్వోలు గ్రామాల్లో పరిశీలన చేస్తున్నారు. రైతుల నుంచి రేషన్, ఆధార్ కార్డు కాపీలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమపేర్లు జాబితాలో ఉన్నాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న అందరి రైతుల పేర్లు ఈ జాబితాల్లో ఉన్నాయా, బ్యాంకుల్లో సరైన ఆధారాలు అందించనివారివా మాత్రమే ఉన్నాయా అనేది స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాల కోసం రైతులు బ్యాంకుల వద్దకు వెళితే జాబితాలు తహశీల్దారుల వద్దకు వచ్చాయని చెబుతూ, గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ జాబితాలో పేర్లు లేనివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా, ఇటు రెవెన్యూ అధికారులు, అటు బ్యాంకర్లు చెప్పలేకపోతున్నారు. రుణమాఫీ కటాఫ్ తేదీ ప్రకటించకపోవడంతో రైతుల్లో అనేక అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. 2013 డిసెంబరు 31వ తేదీనా, లేక 2014 మార్చి 31వ తేదీనా అనేది జాబితా పరిశీలనకు వచ్చిన అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. రెండు రోజుల నుంచి రైతులు పనులు మానుకుని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. సరైన పత్రాలు లేకపోతే అక్కడే అందించేందుకు పత్రాలు చేతపట్టుకుని వెళుతున్నారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
కేసీఆర్ ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు
ధ్వజమెత్తిన వామపక్షాలు సర్కారువన్నీ ఆచరణసాధ్యం కాని ప్రకటనలే సమస్యలపై కానరాని స్పష్టత హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గుప్పిస్తున్న ప్రజారంజక ప్రకటనలు, హామీలు తక్షణమే ఆచరణలో అవులు చేసే విధంగా ఒత్తిడి పెంచేందుకు ఐక్య ఉద్యమాలు చేయాలని వావుపక్ష పార్టీల సంయుుక్త సవూవేశం నిర్ణరుుం చింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొం టున్న సవుస్యలపై ప్రత్యక్ష కార్యాచరణతో రంగంలోకి దిగకుండా.. ఆచరణ సాధ్యం కాని సానుకూల ప్రకటనలతో వుభ్యపెట్టే ప్రయుత్నం చేయుటంపై వావుపక్షాలు తీవ్రంగా ఆక్షేపించా రుు. దళితులకు వుూడెకరాల భూ పంపిణీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్, రైతు రుణవూఫీ, విద్యుత్తు కొరత నివారణ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైరైజేషన్, ఓయుూలో ఆందోళన తదితర అంశాలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి సృష్టత లేద ని, నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేకుండా పొంతన లేని ప్రకటనలు చేయుటం దురదృష్టకరవుని సవూవేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయుంలో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పది వావుపక్ష పార్టీల సంయుుక్త సవూవేశం జరిగింది. ఇందులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సారంపల్లి వుల్లారెడ్డి(సీపీఎం), పల్లా వెంకట్‌రెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు(సీపీఐ), సూర్యం, వెంకట్రావుయ్యు, గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ), విజయ్కవూర్, వీరన్న(ఎం.ఎల్.), వుురహరి (ఎస్యుూసీఐ), ఎండీ, గౌస్, ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ), జానకిరావుులు (ఆర్ఎస్పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్)లు పాల్గొన్నారు. సవూవేశం వుుగిసిన తర్వాత వావుపక్ష పార్టీల నేతలు మీడియూతో వూట్లాడారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, రైతులు రోడ్డెక్కుతున్నప్పటికీ.. పక్క రాష్ట్రాలు, గ్రిడ్ల నుంచి విద్యుత్తు కొనుగోలుపై దృష్టి పెట్టడం లేదన్నారు.