ఇది దా‘రుణమే’! | It daruname '! | Sakshi
Sakshi News home page

ఇది దా‘రుణమే’!

Published Fri, Jan 2 2015 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

ఇది దా‘రుణమే’! - Sakshi

ఇది దా‘రుణమే’!

మొత్తం రుణాల లక్ష్యం: రూ.272.5కోట్లు ఇప్పటికి ఇచ్చినట్టు చెబుతోంది: రూ.162.1 కోట్లు రైతుల చేతికిచ్చింది: రూ.12 కోట్లు రెన్యూవల్, రీషెడ్యూల్: 150.1 కోట్లు కొత్తగా రుణం పొందిన రైతులు: 5,156 మంది పైసా చేతికందని రైతులు: 54,691 మంది
 
రైతు రుణమాఫీ ప్రక్రియ కొత్త రుణాల మంజూరుకు గుదిబండగా మారింది. రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగోవంతు నిధులు మాత్రమే విడుదల చేసింది. మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో అర్హులైన రైతులకు తిరిగి పంటరుణాలు చెల్లించాలని స్పష్టం చేసింది. కానీ బ్యాంకర్లు ఇందుకు సమ్మతిస్తూనే.. కొర్రీలు వేయడంతో కొత్త రుణాల లభ్యత రైతుకు కష్టంగా మారింది.     - సాక్షి, రంగారెడ్డి జిల్లా
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో రూ.272.5కోట్ల రుణాలు ఇచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 59,847 మంది రైతులకు రూ.162.1కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్ల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్ ముగియడాకి మరో రెండు నెలల సమయం ఉండడంతో ఆలోపు పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని సాధించేలా పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇందులో కేవలం 5,156 మంది రైతులకు మాత్రమే.. అంటే 8 శాతం మంది రైతులకే కొత్తగా రూ.12 కోట్ల రూపాయలు రుణరూపంలో ఇచ్చారు. మిగతా రూ.150.1 కోట్ల రుణాలను రెన్యూవల్, రీషెడ్యూల్ చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో రూ.135 కోట్ల రుణాలను రెన్యూవల్ చేయగా, రూ.15కోట్లు రీషెడ్యుల్ చేశారు. ఇలా 54,691 మంది రైతులకు పైసా చేతికివ్వకుండానే రుణాలిచ్చినట్లు బ్యాంకులు లెక్కలు చూపడం గమనార్హం.

కాగితాల్లోనే పురోగతి..
వరుసగా నష్టాల పాలవుతున్న రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సీజన్‌కు ముందు పంటరుణాల అందిస్తుంది. అలా తీసుకున్న రుణాన్ని పంటకు పెట్టుబడి పెట్టి రైతు సాగుపనులకు ఉపక్రమిస్తాడు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తారుమారైంది.

 గత బకాయిలను చూపుతూ.. వాటినే కొత్త రుణాలుగా ఖాతా పుస్తకాల్లోకి మారుస్తూ రైతుకు పైసా ఇవ్వకుండానే రుణాల పురోగతిని సాధించినట్లు చూపుతున్నాయి.

నాలుగోవంతే రుణం..
రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు పావువంతు నిధులు మాత్రమే విడుదల చేసింది. ఈక్రమంలో బ్యాంకులు ఒక్కో రైతుకు అర్హతలో గరి ష్టంగా పావువంతు మాత్రమే రుణాలిస్తున్నాయి. అంటే గతంలో రూ.లక్ష తీసుకున్న రైతు ఖాతాల్లో మాఫీ కింద రూ.25వేల జమయ్యాయి. దీంతో ఆ రైతు చెల్లింపుల తీరును పరిగణనలోకి తీసుకొని గరి ష్టంగా రూ.25వేల రుణం మంజూరు చేస్తున్నారు. కొత్తగా ఐదు వేల మందికి రుణాలివ్వగా.. మిగతా వారిలో ఇలా కొంత మొత్తాన్ని రుణంగా ఇస్తూ మిగతా మొత్తాన్ని కొత్త ఖాతాలోకి మారుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement