samajika nyaya bheri bus yatra
-
ఇసుకలో నొక్కేశారు..అందుకే కేసు: బొత్స
సాక్షి, విజయనగరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లాలో సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా బొత్స మాట్లాడారు. రాష్ట్రంలో పేదలందరినీ అభివృద్ధి చేయాలని సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ ఎంతో మానవత్వం ప్రదర్శించారని చెప్పారు బొత్స. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దండుకున్నారన్నారు. ఇసుకలో అవినీతి జరిగినందునే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఇసుక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మాణాలు చేపట్టామని బొత్స తెలిపారు. -
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: విజయసాయిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు. -
ప్రభుత్వ పనితీరుకు జన నీరాజనం!
మే 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులందరం సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర చేపట్టాం. అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మేలు, సామాజిక న్యాయంలో బలహీన వర్గాలను పాలకులుగా మార్చిన తీరు వివరించడానికి యాత్రగా మేం బయలుదేరాం. యాత్రలో నేను చూసిన, అనుభవంలోకి వచ్చిన అంశాలను ఇక్కడ పంచుకుంటున్నాను. ‘సహాయం పొందినవారు కృతజ్ఞత చూపించరని జనంలో నానుడి ఉంది. కానీ అది నిజం కాదని సామాజిక న్యాయభేరి యాత్రలో మాకు స్పష్టంగా కనిపించింది. మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు... సమాజంలోని అట్టడుగు వర్గాల వ్యక్తులను ఆర్థికంగా, సామాజింగా, రాజకీయంగా స్థితిమంతులను చేయడానికి దోహదం చేశాయి. ఇది ప్రజల్లో కనపడుతుందా? ఈ విషయం తెలుసుకోవాలన్న ఆతురత... యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభ సమయంలో నాలో కలిగింది. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో యాత్రకు ఎదురేగి స్వాగతం పలికి మాతో అడుగు కలిపారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయనే విషయం వారు స్పందించిన తీరులో ప్రస్ఫుటమయింది. లబ్ధిదారులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశంతో ఆయన బొమ్మ పెట్టుకొని 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులం బస్సు యాత్రగా వస్తేనే ప్రజల్లో ఇంతటి ఆదరణ లభిం చిందంటే... స్వయంగా వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తే మరెంతటి ఆదరణ లభిస్తుందో, ఏ స్థాయిలో బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. విజయనగరానికి యాత్ర చేరినప్పుడు భారీ వర్షం స్వాగతం పలికింది. వర్షం కారణంగా బహిరంగ సభ నిర్వహించే పరిస్థితి లేక రద్దు చేయాల్సి వచ్చింది. అంతటి వర్షంలోనూ ప్రజలు తడుస్తూనే యాత్రకు స్వాగతం పలకడం నన్ను కదిలించింది. సీఎం జగన్ విధానాలనూ, సంక్షేమ పాలననూ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారనే నమ్మకం నాలో రెట్టింపయింది. విశాఖలో దారి పొడవునా జనం పోటెత్తారు. ఇదే తీరు అనంతపురం వరకు ప్రజా స్పందన మాకు అడుగడుగునా కనిపించింది. గతంలో ఎన్నడూ గుర్తింపునకు నోచు కోని కులాలను వెతికి మరీ పదవులు, పథకాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆయా కులాల వారు మాకు యాత్ర పొడవునా తారసపడ్డారు. జగన్ పనితీరుకు అన్ని సభలకు పోటెత్తిన జనం, రాత్రి 11 గంటలకూ రోడ్లమీద నిలబడి యాత్ర కోసం ఎదురు చూసిన సందర్భాలు నిదర్శనంగా నిలిచాయి. కరోనా వల్ల కష్టాలు ముంచు కొచ్చినా, గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిల బరువును దించుకుంటూనే... దళిత, గిరిజన, బహుజనులే కాకుండా సర్వజన సంక్షేమాన్ని నెత్తి కెత్తుకున్న సీఎం జగన్ పనితీరు ప్రజలకు నచ్చింది. భావి తరాల భవిష్యత్తును భుజానికి ఎత్తుకున్న జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణే... సామాజిక న్యాయభేరి యాత్రకు జనం నీరాజనం పట్టడానికి కారణం. ప్రతిపక్షం చెబుతున్న మాటలనూ, దుష్ట చతుష్టయంలో భాగమైన పత్రికలూ, టీవీల... రాతలూ, తీతలనూ ప్రజలు పట్టించుకోలేదని యాత్రలో ఉన్న అందరికీ స్పష్టమయింది. ముఖ్యమంత్రితో చర్చించి, మరింత బలమైన కార్యక్రమాలను తీసుకొంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కార్య క్రమాలు, పథకాలను ప్రతి గుండెకు చేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ప్రతి హృదయాన్నీ తట్టిలేపి ఈ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనలను వివరిస్తాం. - ప్రొఫెసర్ మేరుగు నాగార్జున ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
Samajika Nyaya Bheri Bus Yatra: సామాజిక న్యాయం 'దశ దిశలా'..
సాక్షి ప్రతినిధి, అనంతపురం/నంద్యాల/కర్నూలు (రాజ్‌విహార్): ‘రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి చెప్పడంకాదు.. చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఎన్నికల వేళ ఓట్లు అభ్యర్థించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మర్చిపోయే వారికి మనం ఎప్పటికీ అవకాశం ఇవ్వొద్దు. ఇప్పుడు వెనుకబడిన వర్గాలు, కులాలకు రాజ్యాధికారం వచ్చింది. దీన్ని కాపాడుకోవాలంటే ముప్పై ఏళ్లు మనం జగన్‌ను కాపాడుకుని సీఎంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది’.. అని రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ముగింపు సభ ఆదివారం అనంతపురం ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించారు. కిక్కిరిసిన జనాల మధ్య జరిగిన ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ సభలో మంత్రులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అంటే ఏమిటో జగన్ చేసి చూపించారన్నారు. ‘గతంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా రాజ్యాధికారంలో సామాజిక న్యాయం జరిగిన దాఖలాలు చూశామా? ఆంధ్రప్రదేశ్‌లో మినహా ఇలాంటి విప్లవాత్మక మార్పులు ఎక్కడైనా చూశామా? బీసీ, ఎస్సీ వర్గాలు ముఖ్యమంత్రులుగా పాలిస్తున్న రాష్ట్రాల్లో సైతం ఇలా సామాజిక న్యాయం అమలుకావట్లేద’ని మంత్రులు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏనాడైనా ఇంతమంది వెనుకబడిన వర్గాలు, కులాలకు మంత్రి పదవులు వచ్చాయా అని వారు ప్రశ్నించారు. సామాజిక న్యాయం దశ దిశలా ఆచరణలో ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమేనని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు ఉండేలా కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రులు ఆకాంక్షించారు. సభలో పాల్గొన్న మంత్రులు ఏమన్నారంటే.. అనంతపురంలో బస్సు యాత్ర సందర్భంగా వేదికపై మంత్రులు తరతరాలుగా ఎందుకు చేయలేకపోయారు? : ధర్మాన పేదల ఖాతాల్లోకి డబ్బు వెళ్తోందని కొంతమంది బాధపడుతున్నారు. అవసరాలు తీర్చడంవల్లే కదా వారి పిల్లలు చదువుకుంటున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇలాంటివి తీర్చలేక పోవడంవల్లే కదా కులాల మధ్య అసమానతలు పెరిగి వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు సీఎం రాష్ట్రమంతా తిరిగి, పాదయాత్ర చేసి, పరిస్థితులను అధ్యయనం చేసి వారి ఆకలి బాధలను గుర్తించి ఖాతాల్లో నగదు వేస్తున్నారు. గతంలో వెనుకబడిన వర్గాల సంఖ్యకు తగ్గ అధికారం ఎప్పుడైనా ఉండేదా? రాజ్యాధికారం వస్తేనే కదా ఆయా కులాల, వర్గాల అవసరాలు తీరేది. పథకాలు ఇవ్వడమే కాదు.. వాటిని గౌరవంగా ఇచ్చారా, లేదా అనేది ముఖ్యం. ఆ గౌరవం ఇక్కడ సామాజికవర్గాలకు దక్కింది. ఈ వర్గాలన్నీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరముంది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు లేకుండా చేయడంవల్లే రాష్ట్రంలో తీవ్రవాదం తగ్గింది. అప్పట్లో పసుపు చొక్కా వేసుకున్న వారికే లబ్ధి : చెల్లుబోయిన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పసుపు చొక్కా వేసుకున్న వారికే లబ్ధి జరిగేది. ఇప్పుడు కులం, మతం, వర్గం, పార్టీల రహితంగా పథకాలు అందుతున్నాయి. బాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే.. జగన్ రాజ్యాధికారం ఇచ్చారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్వల్లే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పెద్ద చదువులు చదువుకోగలిగారు. వెనుకబడిన కులాలు, వర్గాల వారిని ఇక్కడలా ఎక్కువ సంఖ్యలో మంత్రులుగా తీసుకున్నది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన తలరాతలు మార్చింది జగనన్నే : గుమ్మనూరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులిచ్చి వారి తలరాతలు మార్చడమే కాదు.. సంక్షేమ పథకాల ద్వారా మనందరి తలరాతలు మార్చింది ఒక్క జగనన్నే. ఏ కుటుంబంలోనైనా తండ్రి ఆస్తి ఇస్తానని చెప్పి మాట తప్పి ఉండొచ్చుగానీ, జగన్ ఎక్కడా మాట తప్పలేదు. ప్రతి అర్హుడికి సెంటున్నర స్థలం ఇచ్చారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు మనం బలి కాకూడదు. మహానాడులో బాలకృష్ణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి మన బీసీ సోదరులంతా హిందూపురంలో బాలకృష్ణనూ ఓడించాలి. భవిష్యత్తులో జగన్‌పై నోరుజారొద్దని బాలకృష్ణను హెచ్చరిస్తున్నా. ప్రతి ఇంట్లో సంక్షేమ క్యాలెండర్ : అంజాద్ బాషా సాధారణంగా ఇంట్లో క్యాలెండర్‌ను తేదీలను చూసుకోవడానికే వాడతారు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ క్యాలెండర్ ఉంది. ఎప్పుడు ఏ పథకానికి సంబంధించిన డబ్బు వస్తుందో చూస్తున్నారు. నవరత్నాల ద్వారా రూ.1.48 లక్షల కోట్లు పేదలకు పంచిన ఘనత జగన్మోహన్రెడ్డిదే. ఇలాంటి క్యాలెండర్ ఏ రాష్ట్రంలోనూ లేదు. జగన్ పాలనను చూసి చంద్రబాబుకు కడుపు మండుతోంది. వెనుకబడిన వర్గాలకు ఈ పాలన పండుగలా ఉంది. జగన్‌కు ప్రజలే మీడియా : ఉషశ్రీ చరణ్ అంబేడ్కర్, ఒక జ్యోతిబాపూలేకు పర్యాయ పదం ఎవరున్నారూ అంటే మన జగనన్నే. దేశచరిత్రలో 70 శాతానికి పైగా మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చింది ఆయనే. టీడీపీ మహానాడులో మహిళా నేతలు తొడలు కొట్టారు. వారికి విచక్షణలేదు. నేను బీసీని.. కురుబ కుటుంబంలో పుట్టినా నాకు మంత్రి పదవి వచ్చింది. ఒక ఎస్సీ మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఇదంతా కేవలం జగన్వల్లే సాధ్యమైంది. చంద్రబాబు వద్దు.. జగనన్న ముద్దు అనేదే మన నినాదం కావాలి. టీడీపీకి ఎల్లో మీడియా ఉంది. కానీ జగన్‌కు ప్రజలే మీడియా. జగన్‌కు అండగా నిలుద్దాం : నారాయణస్వామి దశాబ్దాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అన్ని విధాలా అణగదొక్కారు. తొలిసారిగా సీఎం జగన్ వారికి మంత్రి పదవులే కాదు, రాజకీయంగా అన్ని రకాల పదవులూ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాల వారికే ఎక్కువగా ఇచ్చారు. చివరకు విజయవాడ మేయర్ పదవి జనరల్‌కు రిజర్వ్ అయినా బీసీకిచ్చి ఆ వర్గాల పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు. అందుకే మనమంతా ఆయనకు రుణపడి ఉండాలి. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం వాళ్లు ఏపీలో కలవాలనుకుంటున్నారు : ఆర్. కృష్ణయ్య నేను ఈమధ్య కర్ణాటక వెళ్లా. అక్కడి వారు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనను మెచ్చి.. వారిని ఈ రాష్ట్రంలో కలపాలని కోరారు. వారూ మన పథకాలు కావాలని కోరుకుంటున్నారు. ఆంధ్ర సరిహద్దుల్లోని తమిళనాడు వాసులూ ఇదే చెబుతున్నారు. టీడీపీ బీసీల పార్టీ అని చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ, ఆయన ఏనాడూ వారి కోసం పనిచేయలేదు. ఎప్పుడూ ప్రజలను ఓట్ల కోణంలోనే చూస్తారు. కానీ, జగన్ అలా కాదు. బడుగు, బలహీన వర్గాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఇందుకు ధైర్యం కావాలి. అందుకే జగన్‌కు అందరం ఎప్పుడూ అండగా నిలవాలి. నీకా ధైర్యం ఉందా బాబూ? : జోగి చంద్రబాబూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రివర్గంలో 70 శాతం పదవులు ఇస్తానని చెప్పే దమ్ముందా నీకు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నువ్వు, ఏనాడైనా ఆ వర్గాల బాగును పట్టించుకున్నావా? సీఎం జగన్ ఈ మూడేళ్లలోనే సంక్షేమం కింద రూ.1.42 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. వీరిలో 80 శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల వారున్నారు. అందుకే మన సీఎంను చూసి, ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవాలని చూస్తున్నాయి. -
ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన ప్రసాదరావు
-
టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ: ఆర్ కృష్ణయ్య
-
బలహీనవర్గాలకు రాజ్యాధికారం: ఉషాశ్రీ చరణ్
-
పదవులు ఇస్తామని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా: మంత్రి జోగి రమేష్
-
సామాజిక న్యాయ భేరి నాల్గోరోజు (ఫొటోలు)
-
నీ సభ వీడియో చూసి.. మా సభ గురించి మాట్లాడు బాబు: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
-
టీడీపీది..నయవంచక మహానాడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
చంద్రబాబు కుట్రలను మీరే తిప్పి కొట్టాలి: ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా
-
బాలకృష్ణకు మంత్రి గుమ్మనూరు జయరాం వార్నింగ్
-
అనంతపురం భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి శంకర్ నారాయణ
-
చంద్రబాబు పై రెచ్చిపోయిన ఎంపీ గోరంట్ల మాధవ్
-
గుంపులు గుంపులుగా జనం.. ఓ రేంజ్ లో పబ్లిక్ రియాక్షన్
-
టీడీపీ మహానాడు అట్టర్ ప్లాప్.. అనంతపురం బహిరంగ సభలో మంత్రులు
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. సభలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని.. వైఎస్ జగన్ పాలనలో కులాలు, పార్టీ లకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ‘‘సీఎం జగన్‌ను ఎందుకు క్విట్ చేయాలి?. అమ్మ ఒడి ఇస్తున్నందుకా?. రైతు భరోసా ఇస్తున్నందుకా?. వైఎస్సార్ చేయూత ఇస్తున్నందుకా?’’ అని మంత్రి ప్రశ్నించారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్లాలని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి: అంజాద్ బాషా అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. కేబినెట్లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. ‘‘పేదలకు పూర్తిస్థాయి న్యాయం చేయగలిగిన నాయకుడు సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని’ అంజాద్ బాషా అన్నారు. టీడీపీది.. నయవంచక మహానాడు: నారాయణ స్వామి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని మంత్రి నారాయణస్వామి అన్నారు. ‘‘టీడీపీది మహానాడు కాదు.. వెన్నుపోటు నాడు, దగా నాడు. టీడీపీది జరిపింది నయవంచక మహానాడు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. నవరత్నాల పథకాలతో సీఎం జగన్.. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కలేనన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నారాయణ స్వామి అన్నారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం: ఉషాశ్రీ చరణ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. చరిత్రలో లేని విధంగా బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ: ఆర్ కృష్ణయ్య సీఎం జగన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోందని బీసీ నేత ఆర్. కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేని సామాజిక న్యాయం ఏపీలో జరుగుతోందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ. చంద్రబాబు మాటల్లోనే బీసీలపై ప్రేమ చూపించారు. బీసీలపై ప్రేమను సీఎం జగన్ చేతల్లో చూపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిందని.. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేందుకు ప్రజల్లోకి వచ్చామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 17 మందికి మంత్రి పదవులు ఇవ్వడమే కాదు. కీలకమైన పోర్టు పోలియోలు అప్పగించారన్నారు. అధికారంలోకి రాక ముందు వైఎస్ జగన్ రాష్ట్రమంతా పర్యటించారు. రాష్ట్ర స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. స్థితిగతులు పరిశీలించాక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారన్నారు. నాడు-నేడు పథకం ద్వారా బడులు రూపు రేఖలు మార్చారని మంత్రి ధర్మాన అన్నారు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్ బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మరో 30 ఏళ్లు పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉండాల్సిన అవసరముందన్నారు. బస్సు యాత్రపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
‘చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారు’
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం.. కర్నూల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల కోసం బీసీ, ఎస్సీ ఎస్టీల వర్గాలను చంద్రబాబు వాడుకొని వదిలేశారని, కానీ బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. టీడీపీ పనైపోయింది: మంత్రి బొత్స మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రులుగా పనిచేసినవాళ్లను అంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుని ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని, టీడీపీ పనైపోయిందని, ఆ విషయం మహానాడుతో స్పష్టమైందని తెలిపారు. ‘మా అవినీతిని బయటపెట్టడానికి మూడేళ్లు పట్టిందా, అవినీతిపై చర్చకు సిద్ధం.. వాళ్ల అవినీతి చిట్టా అంతా విప్పుతామంటూ’ ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలపై చంద్రబాబు ఎందుకు బీజేపీని ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. -
YSRCP బస్సు యాత్ర: కర్నూలు జిల్లాలో సామాజిక భారీ బహిరంగ సభ
-
నాలుగో రోజు బస్సు యాత్ర ప్రారంభం
-
సామాజిక న్యాయభేరీ: నాల్గో రోజు బస్సు యాత్ర
Updates.. నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. అనంతపురానికి చేరుకుంది. మంత్రులకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర అనంతపురంలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. సభలో పలువురు మంత్రులు మాట్లాడారు. 01:05PM నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. మధ్యాహ్నానికి కర్నూలుకు చేరుకుంది. పాణ్యం మీదుగా కర్నూలు సి క్యాంప్‌కు బస్సు యాత్ర చేరుకుంది. కర్నూలులో బస్సుయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూల్ మేయర్ బివై రామయ్య, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బాల నాగిరెడ్డి తదితరులు బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఎన్నికల కోసం మాత్రమే బాబు వాడుకుని వదిలేశారు బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. మహనీయుల ఆశయాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ర్డె కొనసాగిస్తున్నారని, బడుగుల అభివృద్ధి కోసం సీఎం జగస్ సముచిత స్థానం కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. బడుగుల అభివృద్ధి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌లాగా సీఎం జగన్ వచ్చారన్నారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ పని అయిపోయింది.. ఇక చంద్రబాబు, టీడీపీ పని అయిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బస్సుయాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన బొత్స.. మహానాడులో అసభ్యంగా, చెండాలంగా మాట్లాడరని, మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడరన్నారు బొత్స. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారన్నారు. అలాగే బాలకృష్టను ప్రజలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 10.30 AM వైఎస్సారీసీ సామాజిక న్యాయభేరీలో భాగంగా నాలుగో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నంద్యాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సాయంత్రానికి అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది. నాలుగో రోజు యాత్ర బస్సు యాత్ర ప్రారంభానికి ముందు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారు. అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైన సీఎం జగన్ మాత్రమే. టీడీపీ హయాంలో ఒక్క మైనార్టీకి కూడా కేటినెట్‌లో చోటు కల్పించలేదు’’ అని విమర్శించారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. అణగారిక వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దే. కేబినెట్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. మనమంతా కలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్దిచెప్పాలి’ అని పేర్కన్నారు. ఇది కూడా చదవండి: మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు : నారా లోకేష్ -
కాసేపట్లో నంద్యాల నుంచి బస్సు యాత్ర ప్రారంభం
-
Samajika Nyaya Bheri: సమసమాజం సాకారం
నరసరావుపేట నుంచి సాక్షి ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాడేపల్లిగూడెం: సమసమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందని సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో మంత్రులు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల చిరకాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని, 70 శాతం మంత్రి పదవులను ఆయా వర్గాలకే ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ మహానాడు దూషణలే లక్ష్యంగా ఏడుపునాడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ‘జగన్ ముద్దు–బాబు వద్దు’ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల బృందం చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర మూడో రోజైన శనివారం తాడేపల్లిగూడెం జిల్లా నుంచి ఏలూరు, గన్నవరం, విజయవాడ, గుంటూరు మీదుగా నరసరావుపేట వరకు సాగింది. మంత్రులు పలుచోట్ల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. నరసరావుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 44 డిగ్రీల మండుటెండలోనూ జనం పోటెత్తారు. యాత్ర పొడవునా ప్రజలు మంత్రులకు స్వాగతం పలికారు. నరసరావుపేటలో వేదికపై మంత్రులు బడుగు వర్గాలను పాతాళానికి తొక్కిన చంద్రబాబు: మంత్రి విడదల రజని చంద్రబాబు పాలనలో బడుగు వర్గాలను పాతాళానికి తొక్కాడని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని విమర్శించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్క రాజ్యసభ సభ్యత్వమూ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ మూడేళ్ల పాలనలో 8 రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే కేటాయించి సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారన్నారు. జగన్ ముద్దు.. చంద్రబాబు వద్దు: మంత్రి వేణు సామాజిక న్యాయభేరితో కర్ణభేరీ మోగిన చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. బడుగు వర్గాలు ఉద్యమాలు చేయకుండానే ముఖ్యమంత్రి జగన్ వారికి ఉన్నత స్థితి కల్పించారన్నారు. శాసన మండలికి ఎస్సీని చైర్మన్ చేశారని చెప్పారు. చంద్రబాబు మహానాడు ఏడుపునాడుగా సాగుతోందన్నారు చంద్రబాబు నిర్వహించింది నారా మహానాడు: మంత్రి కారుమూరి చంద్రబాబు నిర్వహించింది ఎన్టీఆర్ మహానాడు కాదని, నారా మహానాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మహానాడు వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ లేకపోవటం సిగ్గుచేటన్నారు. మంత్రివర్గంలో అణగారిన కులాలకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కే వారిని ఓట్లు అడిగే హక్కుందన్నారు. చంద్రబాబు ఎవరిని పోయి ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బస్సుయాత్రకు తరలివచ్చిన జనసందోహం అణగారిన వర్గాలకు న్యాయం: ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. బలహీన వర్గాల పరిపుష్టికి నవరత్నాలు అమలు చేశారన్నారు. డ్వాక్రా చెల్లెమ్మలకు చంద్రబాబు మోసం చేస్తే వైఎస్సార్ ఆసరాతో జగన్ ఆదుకున్నారని తెలిపారు. 2024లోనూ జగన్ సీఎం కావటం ఖాయమన్నారు. అది ఏడుపునాడు: మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో సామాజిక న్యాయం సాగుతోందని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అధికారం లేదని చంద్రబాబు, లోకేష్ ఏడుపుతో నిర్వహిస్తున్న మహానాడు ఏడుపునాడని ఎద్దేవా చేశారు. మహిళలతో బూతులు తిట్టించిన మహానాడు బూతులనాడని, ఆ బూతులను మహాభారతంలా విన్నట్లుగా విన్న చంద్రబాబు దిగుజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. ఒక్కడే ఎన్నికలకు పోలేక అందరూ కలిసి రావాలని అన్ని పార్టీలను బ్రతిమలాడుకుంటున్నారని తెలిపారు. వాడుకొని వదిలేసే చరిత్ర చంద్రబాబుది: మంత్రి జోగి రమేష్ బలహీన వర్గాలను వాడుకొని వదిలేసే చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అంతు చూస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని హితవు పలికారు. ఐక్యత కొనసాగాలి: మంత్రి పీడిక రాజన్నదొర బడుగు బలహీన వర్గాల ఐక్యత కొనసాగాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనసాగుతోందని, అందులో ఎక్కువ లబ్ధి పొందుతున్నది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు మహానాడులో మహిళలతో అసభ్యంగా మాట్లాడిస్తున్నారని అన్నారు. ఈ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. అపూర్వ స్పందన: మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నుంచి బయల్దేరిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గత పాలకులు మేనిఫెస్టోలను పక్కన పెట్టారని, సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి హామీలను పూర్తిగా అమలు పరుస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు హద్దు మీరి మాట్లాడితే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందన్నారు. అంబేడ్కర్ కోనసీమ పేరుపై టీడీపీ అభిప్రాయం చెప్పాలి: మంత్రి సురేష్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరుపై టీడీపీ అభిప్రాయం చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూసి చంద్రబాబుకు గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం: ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చిన మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ అని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకూ సంతృప్తికర న్యాయం చేశారన్నారు. మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసి గౌరవించారని తెలిపారు. అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కింది: శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు జగన్ పాలనలో అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కిందని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు చెప్పారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న తమకు జగన్ రాకతో మేలు జరిగిందన్నారు. ఎక్కడా గుర్తింపు లేకుండా ఉన్న 56 కులాలకు కార్పొరేషన్ పదవులు కేటాయించి జగన్ సామాజిక న్యాయం చేశారని చెప్పారు. జగన్ పాలన పది కాలాల పాటు ఉండాలని కోరుకుందామన్నారు. యాత్రలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం, ఉషాశ్రీచరణ్, తానేటి వనిత, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి, మహ్మద్ ముస్తఫా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నంద్యాల నుంచి మొదలయ్యే యాత్ర అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది. బడుగువర్గాలకు గౌరవం కల్పించిన సీఎం జగన్: మంత్రి ధర్మాన వైఎస్సార్సీపీ వచ్చేంత వరకు రాష్ట్రంలో బడుగు వర్గాలు సరైన గౌరవాన్ని నోచుకోలేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సమసమాజ స్థాపన చేయాలనే దృక్పధంతో వైఎస్ జగన్ 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచిపెడుతున్నారని చంద్రబాబు తన పార్టీ వారి చేత ప్రచారం చేయిస్తున్నాడని, సంపద సృష్టించేందుకు కారణమైన వారికే పంచిపెడుతున్నారని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలు లాంటి బ్రోకర్లతో పనిలేకుండా పేదలందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే ఇప్పటివరకు రూ.1.47 లక్షల కోట్లు జమ చేసినట్లు తెలిపారు. బాబు 14 ఏళ్ల పాలనలో దోపిడీనే తప్ప ఇటువంటి మంచి చేయలేకపోయారని అన్నారు. టీడీపీ పాలనలో పసుపు చొక్కా వేసుకొని ఇంటిపై జెండా పెడితేనే పింఛను వచ్చేదన్నారు. పేదవారికి సాయం చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే బాబులాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తారని హెచ్చరించారు. సామాజిక న్యాయ విప్లవం : మంత్రి మేరుగ ఏపీలో సామాజిక న్యాయం మహా విప్లవంలా ప్రారంభమైందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ నేత చేయలేని న్యాయాన్ని సీఎం జగన్ అందించారని తెలిపారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. ఎస్సీ, బీసీ, కాపు, ఈబీసీ మహిళలకు మేలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల రాజ్యాంగ హక్కులను హరించారని విమర్శించారు. అమలాపురం అలజడులు చంద్రబాబు, పవన్ అడిన నాటకంలో భాగమేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు జగన్‌కు అండగా ఉండి సంక్షేమ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: ఆదిమూలపు
-
బస్సు యాత్ర స్పందన చూసి చంద్రబాబుకు వణుకు: సీదిరి అప్పలరాజు