San Francisco court
-
ఎలన్ మస్క్‌కు చుక్కలు చూపిస్తున్నారు!
శాన్ఫ్రాన్సిస్కో: టెస్లా, ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ట్విటర్ సంస్థ నుంచి ఉద్యోగాల తొలగింపు నేపథ్యంలో ఆయన్ని కోర్టుకు లాగాలని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలన్ మస్క్ ట్విటర్ బాధ్యతలు చేపట్టాక.. సగం మంది ఉద్యోగులను(సుమారు 7,500 మందిని) సంస్థ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాపార దిగ్గజాన్ని కోర్టుకు ఇచ్చేందుకు వాళ్లంతా యత్నిస్తున్నారు. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో వందల సంఖ్యలో దావాలు దాఖలు అయ్యాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా. అంతేగాక.. ఆఫీస్‌లోనే పడుకోవాలంటూ బెడ్రూమ్లను ఏర్పాటు చేస్తుండడంపైనా కోర్టుకు ప్రైవేట్ ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ధనికుడైన ఎలన్ మస్క్.. ఉద్యోగుల హక్కుల్ని కాలరాసేయడంతో పాటు చట్టాన్ని అనుసరించకపోవడం దారుణమని లాయర్ షాన్నోన్ లిస్ రియోర్డన్ పేర్కొంటున్నారు. ట్విటర్ నుంచి ఉద్వాసన తర్వాత.. వాళ్లకు అందాల్సిన ప్రతిఫలాలు అందకపోవడంతో.. షాన్నోన్ ద్వారా దావా వేయించారు కొందరు మాజీ ఉద్యోగులు. చట్టమైన పోరాటం ఎలన్ మస్క్‌కు కొత్తేం కాదు. కానీ, ఇలా వందల సంఖ్యలో దావాలు దాఖలు అవుతుండడంపై కాస్త ఉత్కంఠ నెలకొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
2,000 కోట్ల భారీ జరిమానా
శాన్ఫ్రాన్సిస్కో: బహుళజాతి విత్తన, పురుగుమందుల కంపెనీ మోన్శాంటోకు అమెరికాలోని ఓ న్యాయస్థానం షాకిచ్చింది. తమ ఉత్పత్తుల్ని వాడితే కేన్సర్ సోకుతుందన్న విషయాన్ని దాచిపెట్టి ఓ వ్యక్తి కేన్సర్ బారిన పడేందుకు కారణమైనందుకు ఏకంగా రూ.2,003 కోట్ల(29 కోట్ల డాలర్లు) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కోర్టు జ్యూరీ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న డ్వేన్ జాన్సన్(46) బెనికాలో ఓ పాఠశాలలో గ్రౌండ్‌మెన్‌గా పనిచేసేవారు. విధుల్లో భాగంగా స్కూల్ ప్రాంగణం, మైదానంలో కలుపుమొక్కలు పెరగకుండా మోన్శాంటో తయారుచేసిన ‘రౌండర్’ మందును స్ప్రే చేసేవారు. ఈ కలుపుమొక్కల నాశినిలో ప్రధానంగా ఉండే గ్లైఫోసేట్ అనే రసాయనం వల్ల కేన్సర్ సోకుతుంది. ఈ విషయం సంస్థాగత పరీక్షల్లో వెల్లడైనా మోన్శాంటో బయటకు చెప్పలేదు. రౌండప్ కలుపు నాశినిని తరచుగా వాడటంతో తెల్ల రక్తకణాలకు వచ్చే అరుదైన నాన్‌హడ్జ్‌కిన్స్ లింఫోమా అనే కేన్సర్ సోకినట్లు జాన్సన్‌కు 2014లో తెలిసింది. చికిత్స చేసినా జాన్సన్ బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చారు. మరుసటి ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఆర్క్) పరిశోధనలో సంచలన విషయం బయటపడింది. మోన్శాంటో తయారుచేస్తున్న కలుపుమొక్కల నాశనులు రౌండప్, రేంజ్ ప్రోలో కేన్సర్ కారక గ్లైఫోసేట్ అనే ప్రమాదకర రసాయనం ఉందని ఐఆర్క్ తేల్చింది. ఈ విషయాన్ని కస్టమర్లకు మోన్శాంటో తెలపలేదంది. కాలిఫోర్నియాలో కేసు దాఖలు.. మోన్శాంటో కలుపు మందులపై వినియోగదారుల్ని హెచ్చరించకపోవడంతో కాలిఫోర్నియాలోని కోర్టులో కేసు దాఖలైంది. మోన్శాంటో తయారుచేసిన రౌండప్ కారణంగా జాన్సన్‌కు కేన్సర్ సోకిందని ఆయన లాయరు వాదించారు. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని మోన్శాంటో ప్రతినిధులు కోర్టులు తెలిపారు. దాదాపు 8 వారాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. ఐఆర్క్ నివేదికనూ అధ్యయనం చేసింది. చివరగా కేన్సర్ కారక గ్లైఫోసేట్ గురించి మోన్శాంటో వినియోగదారుల్ని హెచ్చరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. జాన్సన్‌కు నయంకాని కేన్సర్ సోకేందుకు కారణమైనందున ఆయనకు పరిహారంగా రూ.1,727 కోట్లు, ఇతర ఖర్చుల కింద మరో రూ.276 కోట్లు, మొత్తంగా రూ.2,003 కోట్లు(29 కోట్ల డాలర్లు) చెల్లించాలని మోన్శాంటోను ఆదేశించింది. జాన్సన్ ఆరోగ్యస్థితిపై జ్యూరీ సానుభూతి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుతో జాన్సన్ కన్నీటిపర్యంతమయ్యారు. తీర్పు ఇచ్చిన జ్యూరీలోని సభ్యులందరికీ జాన్సన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా కోర్టు తీర్పుపై తాము అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో కంపెనీ ఉపాధ్యక్షుడు స్కాట్ పాట్రిడ్జ్ చెప్పారు. డ్వేన్ జాన్సన్ -
అధ్యక్షుడి మాట అమలవ్వాలా?
• ట్రంప్ వీసారద్దు నిర్ణయాన్ని ప్రశ్నించిన శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు • న్యాయస్థానంలో జడ్జీలు, ట్రంప్ ప్రతినిధి మధ్య వాగ్వాదం • తీర్పు వాయిదా.. కొనసాగనున్న సియాటెల్ కోర్టు ఉత్తర్వులు శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన వలసల రద్దు (ఏడు ముస్లిం మెజారిటీ దేశాలనుంచి వలసలను తాత్కాలికంగా నియంత్రించేందుకు) ఆదేశాలపై సియాటెల్ కోర్టు విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేసేందుకు శాన్ ఫ్రాన్సిస్కోలోని కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తిరస్కరించింది. గంటసేపు ఫోను ద్వారా ప్రభుత్వాధికారులను విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ‘అసలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? ముస్లింలపై విపక్ష చూపటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జాతీయ భద్రత కారణంతో నిర్ణయం తీసుకున్నామనటంలో ఆంతర్యమేంటి? అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే అమలైపోవాలా?’ అని ప్రశ్నించింది. తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో ప్రస్తుతానికి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలపై సియాటెల్ కోర్టు విధించిన నిషేధం కొనసాగనుంది. ఆధారాలున్నాయా? అమెరికన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సియాటెల్ కోర్టు తీర్పును రద్దుచేయాలనిప్రభుత్వం తరపు న్యాయవాది ఆగస్ట్ ఫ్లెంటిజ్ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో ధర్మాసనం, ఫ్లెంటిజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ‘ఆ దేశాలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయా? ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించకూడదని వాదిస్తున్నారా?’ అని ప్రశ్నించారు. అటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ సొలిసిటర్ జనరల్ నోవాహ్ పుర్సెల్ కోర్టులో తన వాదనలు వినిపించారు. ‘ముస్లింలకు నష్టం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.’ అని అన్నారు. దీనిపై ఫ్లెంటిజ్ స్పందిస్తూ.. ‘అధ్యక్షుడి నిర్ణయంపై ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు. కానీ ఓ న్యాయమూర్తి అధ్యక్షుడి ఆదేశాల అమలుపై స్టే విధించటమే సరికాదు’ అని అన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. బుధవారం న్యాయవ్యవస్థపై నేరుగా విమర్శలు చేశారు. ‘కోర్టులు పక్షపాతంగా వ్యవహరిస్తాయని నేను అనను. కానీ దేశభద్రత కోసం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవటంలో రాజకీయ ఉద్దేశం కనబడుతోంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరే వీలుంది. ప్రభుత్వ చర్చ సమర్థనీయమే! అమెరికన్ కాంగ్రెస్‌లో జరిగిన చర్చ సందర్భంగా ‘ఆ దేశాలకు వీసారద్దుపై ఆదేశాలు రాజ్యాంగబద్ధమైనవే. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు లోబడే ఉంది. దీనిపై జరుగుతున్న న్యాయపోరాటంలో ప్రభుత్వం విజయం సాధిస్తుంది’ అని ఓ అమెరికా అంతర్గ భద్రత కార్యదర్శి జాన్ కెల్లీ తెలిపారు. అధ్యక్షుడి ఉత్తర్వుల్లో పేర్కొన్న ఏడు దేశాల్లో రెండింటి పేర్లు ఒబామా ప్రభుత్వం పేర్కొన్న ‘ఆయా దేశాల్లో ప్రభుత్వాల ప్రోద్బలంతోనే ఉగ్రవాదం పెచ్చుమీరుతున్న దేశాలు’ జాబితాలో ఉన్నాయన్నారు. మిగిలిన ఐదు దేశాలు కూడా ఉగ్రవాదం విషయంలో అమెరికా ప్రభుత్వానికి సహకరించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాగా, తన నిర్ణయంపై నిషేధం విధించిన సియాటెల్ జడ్జిపై తీవ్రంగా మండిపడ్డ ట్రంప్.. ఆ కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి సీన్ స్పైసర్ వెల్లడించారు. ‘కోర్టు తీర్పును అధ్యక్షుడు గౌరవిస్తున్నారు. కోర్టుల్లో తన నిర్ణయమే విజయం సాధిస్తుందన్నారు.