Satellite City
-
స్మార్ట్ సిటీ
- దేశంలోని వంద నగరాల్లో కరీంనగర్ ఒకటి! - కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్ ప్రతిపాదనలు - మొదటి దశలో రూ.70 కోట్ల నిధులు టవర్‌సర్కిల్ : కరీంనగర్ ఇప్పుడు స్మార్ట్ సిటీగా మారనుంది. దేశంలోని వంద నగరాలను ప్రపంచంలోని ప్రధాన నగరాలకు దీటుగా స్మార్ట్ సిటీలు.. శాటిలైట్ సిటీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన వంద స్మార్ట్‌సిటీల జాబితాలో కరీంనగర్ సిటీ చోటు సంపాదించుకుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ పట్టణాలు స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్నారుు. వీటి అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 బడ్జెట్లో రూ.7,060 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే నగరం ఇక స్మార్ట్‌గా దూసుకెళ్లనుంది. జపాన్‌లోని క్యోటో నగరంలా మారనుంది. రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా పేరున్న కరీంనగర్‌పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. నగరాన్ని అభివృద్ధి చేయూలనే దృఢ సంకల్పంతో ఉంది. ఆగస్టు 5న కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వరాల జల్లు కురిపించారు. యూజీడీ పనులు పూర్తిచేసేందుకు రూ. 50 కోట్లు, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.46 కోట్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.5.75 కోట్లు కేటాయించారు. ఈ నిధులకు తోడు కేంద్రం ప్రకటించే స్మార్ట్ సిటీహోదా దక్కితే రూ.400 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యే అవకాశాలున్నారుు. ఈ నిధులన్నీ అభివృద్ధి పనులపై ఖర్చుచేస్తే కరీంనగర్ నగర రూపురేఖలే మారిపోనున్నారుు. స్మార్ట్‌సిటీతో పాటు శాటిలైట్ అనుసంధానంగా జనానికి మరిన్ని సేవలు అందనున్నారుు. విస్తరించే అవకాశం... నగరం మూడు లక్షల పైచిలుకు జనాభా కలిగి, 23.85 చదరపు కిలో మీటర్ల వైశాల్యంతో ఉంది. 65 వేల ఇళ్లతో ప్రస్తుతం విస్తరించి ఉంది. నగరంలో స్లమ్ ఏరియాలు 42 ఉండగా, అందులో జనాభా 21,24,896 ఉంది. కాగా కరీంనగర్ నగరం మూడు వైపుల విస్తరించేందుకు అవకాశాలున్నాయి. దక్షిణాన మానేరు నది ఉండడంతో మిగిలిన మూడు వైపుల ఉన్న గ్రామాలు నగరంలో కలిసిపోయాయి. వాటిని నగరంలో కలిపితే అత్యంత విశాలమైన నగరంగా రూపాంతరం చెందనుంది. రాబోయే రోజుల్లో వివిధ రకాల పరిశ్రమల స్థాపన జరిగే అవకాశాలుండడంతో నగరం తెలంగాణలో రెండో అతిపెద్ద స్మార్ట్ సిటీగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లనుంది. -
అభివృద్ధి చేశాం... ఆదరించండి
సోనియా పిలుపు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:‘మా హయాంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందింది. రూ. ఆరు వేల కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, వికారాబాద్‌ను శాటిలైట్ సిటీగా ఆధునీకరించాం’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పదేళ్లలో జిల్లాలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేశామని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా 19 నిమిషాలపాటు ప్రసంగించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాదేనని, ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అధికారంలోకివస్తే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్ధేశించిన చేవెళ్ల- ప్రాణహిత, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని సోనియా వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించామని, ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన సోనియా.. ఆ పార్టీ అధినేత అవకాశవాద, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు మారుపేరు అని విమర్శించారు. ఎవరో చెబితే తెలంగాణ ఇవ్వలేదని, 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించే ఇచ్చామని చెప్పుకొచ్చారు. బహిరంగసభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకులు వాయిలార్ రవి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులను సోనియాకు పొన్నాల పరిచయం చేశారు. భారీగా జన సమీకరణ సోనియా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. భారీగా జన సమీకరణ చేసింది. సుమారు 700 ప్రత్యేక బస్సులతో జిల్లా నలుమూలల నుంచి జనాలను చేవెళ్లకు తరలించారు. ఇటీవల తెలంగాణలో వివిధ చోట్ల జరిగిన అగ్రనేతల సమావేశాలు పేలవంగా జరిగిన నేపథ్యంలో దీనిపై మాజీ మంత్రి సబిత ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికల ప్రచారం ముగింపు వేళ అధినేత్రి ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో కాదని, మీరే నిజమైన హీరోలని సోనియా పేర్కొనడం ఉత్సాహాన్ని పెంచింది. కొన్ని పార్టీలు కల్లిబొల్లి మాటలతో దగా చేసేందుకు ముందుకొస్తున్నాయని, అవి చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలనే పిలుపునకు మంచి స్పందన వచ్చింది. సోనియా రాకముందు కొందరు నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలను విసుగెత్తించాయి. -
అభివృద్ధి చేశాం..ఆదరించండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘మా హయాంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందింది. రూ. ఆరు వేల కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, వికారాబాద్‌ను శాటిలైట్ సిటీగా ఆధునీకరించాం’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. పదేళ్లలో జిల్లాలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేశామని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా 19 నిమిషాలపాటు ప్రసంగించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాదేనని, ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అధికారంలోకివస్తే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్ధేశించిన చేవెళ్ల- ప్రాణహిత, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని సోనియా వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించామని, ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన సోనియా.. ఆ పార్టీ అధినేత అవకాశవాద, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు మారుపేరు అని విమర్శించారు. ఎవరో చెబితే తెలంగాణ ఇవ్వలేదని, 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించే ఇచ్చామని చెప్పుకొచ్చారు. బహిరంగసభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకులు వాయిలార్ రవి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులను సోనియాకు పొన్నాల పరిచయం చేశారు. భారీగా జనసమీకరణ సోనియా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. భారీగా జనసమీకరణ చేసింది. సుమారు 700 ప్రత్యేక బస్సులతో జిల్లా నలుమూలల నుంచి జనాలను చేవెళ్లకు తరలించారు. ఇటీవల తెలంగాణలో వివిధ చోట్ల జరిగిన అగ్రనేతల సమావేశాలు పేలవంగా జరిగిన నేపథ్యంలో జనసమీకరణపై మాజీ మంత్రి సబిత ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లను చేశారు. పార్టీశ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికల ప్రచారం ముగింపు వేళ అధినేత్రి ప్రసంగం నూతనోత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో కాదని, మీరే నిజమైన హీరోలని సోనియా పేర్కొనడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. కొన్ని పార్టీలు కల్లిబొల్లి మాటలతో దగా చేసేందుకు ముందుకొస్తున్నాయని, అవి చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలనే పిలుపునకు కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. కాగా, సోనియా రాకమునుపు కొందరు నేతలు చేసిన ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలను విసుగెత్తించాయి.