Shiv Sena MP
-
వక్ఫ్ కమిటీ భేటీ నుంచి విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాడీవేడీ చర్చలకు వేదికగా మారింది. అధికార బీజేపీ, విపక్ష పార్టీల ఎంపీలు వాగ్వాదానికి దిగారు. చివరకు విపక్ష ఎంపీలు సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు. నియమనిబంధనలకు విరుద్ధంగా కమిటీ సమావేశం జరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్ సంయుక్త కమిటీలో చర్చ సజావుగా సాగట్లేదని, నియమాలను పాటించడం లేదని శివసేన ఎంపీ సావంత్ మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ విపక్ష నేతలపై కొందరు తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారని విపక్షసభ్యులు ఆరోపించారు. తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు విపక్షాల సభ్యులు విడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సంయుక్త కమిటీ సమావేశంలో జరిగిన వాగ్వాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేయాలని కొందరు విపక్షసభ్యులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయాక బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ సారథ్యంలో కమిటీ సమావేశం యథావిధిగా కొనసాగింది. ఖర్గేపై విమర్శలువక్ఫ్ భూముల కుంభకోణంతో కర్ణాటకకు చెందిన ఖర్గే, రెహ్మాన్ ఖాన్లకు ప్రమేయం ఉందని కర్ణాటక బీజేపీ నేత అన్వర్ మణిప్పాడి ఆరోపణలు గుప్పించారు. దీంతో విపక్షసభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో లేని వ్యక్తిపై నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంటరీ కమిటీలో ఆరోపణలు ఎలా చేస్తారని వాదించారు. ముస్లింలకు సంబంధించిన చట్టంపై హిందూ వర్గాల అభిప్రాయాలను ఎందుకు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు?. ముస్లింల అభిప్రాయాలు పట్టవా? అని విపక్ష సభ్యులు నిలదీశారు. కమిటీ చీఫ్‌కి ఒవైసీ లేఖకమిటీ చీఫ్ జగదాంబికాపాల్కు ఒవైసీ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘‘సనాతన్ సంస్థ, హిందూ జనజాగృతి సమితి వంటి సంస్థలు హిందూ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌ను హిందూదేశంగా మార్చడమే వారి లక్ష్యం. భారత సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి’’ అని లేఖలో ఒవైసీ పేర్కొన్నారు. -
హస్తినకొస్తే అంతం చేస్తాం
ముంబై: ఓ గ్యాంగ్‌స్టర్ బృందం తనను చంపేస్తానని బెదిరించిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బెదిరింపుల అంశంపై వెంటనే ముంబైలో పోలీసులకు ఆయన ఫిర్యాదుచేశారు. ముంబైలో ఉండే సంజయ్‌రౌత్ ఢిల్లీకొస్తే ఏకే47 తుపాకీతో కాల్చిపడేస్తామని హెచ్చరిస్తూ ఆయనకు వాట్సాప్‌లో సందేశం పంపారు. ఈ ఘటనలో ముంబై పోలీసులు పుణేకు చెందిన 23 ఏళ్ల రాహుల్ తలేకర్‌ను అరెస్ట్‌చేశారు. కంజుర్మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో రౌత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన ఫిర్యాదు, పోలీసు అధికారి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ రౌత్‌కు రాహుల్ తలేకర్ ముందుగా ఫోన్లో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో వాట్సాప్‌లో బెదిరిస్తూ మెసేజ్ చేశాడు. ‘రౌత్ హిందువులకు శత్రువు. నువ్వు ఢిల్లీలో కనిపించావంటే ఏకే47తో చంపేస్తా. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే నీకు పడుతుంది. లారెన్స్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. నీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ల మరణం తథ్యం. ఇది ఫిక్స్’ అని హెచ్చరించాడు. మూసేవాలాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం చంపేసిందని ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. దీంతో మెసేజ్‌లో పేర్కొన్న లారెన్స్‌ను లారెన్స్ బిష్ణోయ్‌గా పోలీసులు భావిస్తున్నారు. తలేకర్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా బిష్ణోయ్ గురించి తెల్సుకుని, మద్యం తాగిన మైకంలో అతను రౌత్‌కు బెదిరింపు సందేశం పంపినట్లు కేసు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలొచ్చాయి. పాత్రా చావల్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, వీటిని భయపడేది లేదని రౌత్ స్పష్టంచేశారు. రౌత్‌ను హత్య చేస్తామని బెదిరింపులు రావడాన్ని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్‌చేశారు. -
రౌత్ అరెస్ట్ చట్టవ్యతిరేకం
ముంబై: ముంబైలోని గోరేగావ్‌లో పాత్రా ఛావల్(సిద్దార్థ్ నగర్) పునర్నిర్మాణాభివృద్ధి ప్రాజెక్టులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టయి కారాగారంలో గడుపుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేసు వాదనల సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే.. కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘ ఈడీ ముందు హాజరయ్యేందుకు రౌత్ సమయం కావాలన్నారు. అంతలోపే అరెస్ట్చేయడం చట్టవ్యతిరేకం. ప్రధాన నిందితులైన హౌజింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్(హెచ్‌డీఐఎల్)కు చెందిన రాకేశ్ వధవాన్, సారంగ్ వధవాన్లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌చేయలేదు? మహారాష్ట్ర హౌజింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) అధికారులను ఎందుకు అరెస్ట్చేయలేదో కారణం చెప్పలేదు. కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈ కేసుతో సంబంధం లేకుండా సివిల్ వివాదంలో అరెస్ట్‌చేశారు. సంజయ్ రౌత్‌ను ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్‌చేశారు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. తర్వాత సంజయ్, ప్రవీణ్‌లకు బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం రాత్రి సంజయ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తోంది. -
సంజయ్ రౌత్ కస్టడీ మళ్లీ పొడిగింపు
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముంబై పట్రా చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకల కేసులో ఆగస్ట్ ఒకటో తేదీన ఈడీ సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. రౌత్ బెయిల్ పిటిషన్‌పై 21న కోర్టు విచారణ చేపట్టనుంది. -
మహారాష్ట్ర తలవంచదు
ముంబై: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలంటూ కొందరు వ్యక్తులు దాదాపు నెల రోజుల క్రితం తనను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. అలాగే ట్విట్టర్లో శివసేన గుర్తు పులి ఫొటోను పోస్టు చేశారు. జుఖేంగే నహీ.. జై మహారాష్ట్ర (మహారాష్ట్ర తలవంచదు) అని ట్వీట్ చేశారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పూర్తికాలం.. ఐదేళ్లూ అధికారంలోకి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంవీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత శివసేన నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యులపై వేధింపులను అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ విన్నవించారు. ఉపరాష్ట్రపతికి తాను రాసిన లేఖ ఒక ట్రైలర్ మాత్రమేనని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ క్రిమినల్ సిండికేట్‌ను ముందుండి నడిపిస్తున్న ఈడీ అధికారులు బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు. మనీ ల్యాండరింగ్ పేరిట వేధింపులు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద నాతో పాటు మరో ఇద్దరు మహారాష్ట్ర మంత్రులను జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ జైలుకు పంపితే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వారు భావించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం 2003 జనవరి 17న అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, అంతకంటే ముందు జరిగిన డబ్బు లావాదేవీలు కూడా మనీ ల్యాండరింగే అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వేధింపులకు దిగుతున్నాయని ఆరోపించారు. 2012–13లో తనకు, తన కుటుంబ సభ్యులకు భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లిలో అలంకరణ పనులు చేసిన వారిని సైతం వెంటాడుతోందని, నేను వారికి రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటన చేయాలని భయపెడుతోందని దుయ్యబట్టారు. తనకు సంబం« దించిన ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు 28 మందిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించాయన్నారు. ఈడీ కనుసన్నల్లో అక్రమాలు స్వేచ్ఛగా భావాలను వెల్లడించే హక్కు తనకుందని, ఆ హక్కుపై దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నానని సంజయ్ రౌత్ చెప్పారు. సిండికేట్, బ్లాక్‌మెయిలింగ్, మనీ ల్యాండరింగ్ వంటి అక్రమ వ్యవహారాలు ఈడీ కనుసన్నల్లో సాగుతున్నాయని ఆరోపించారు. తనను జైలుకు పంపిస్తే వెళ్తానని, తన తర్వాత బీజేపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, బీజేపీ నేతలే ఎన్నో పాపాలు చేశారని అన్నారు. తాము భయపడతామని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు సాయం అడిగారని ప్రశ్నించగా... దానిపై త్వరలో మాట్లాడతానని సంజయ్ రౌత్ బదులిచ్చారు. అది ఢిల్లీ, ముంబైకి చెందిన నాయకుల ఉమ్మడి కుట్ర అని పేర్కొన్నారు. గత ఏడాది ఉప ఎన్నికలో దాద్రా నగర్ హవాలీ ఎంపీ సీటును శివసేన గెలుచుకుందని, అప్పటి నుంచి తమ పార్టీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మహారాష్ట్రలో బీజేపీదే అధికారం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 10న ఫలితాలు బహిర్గతమైన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావడం తథ్యమని జోస్యం చెప్పారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. -
ప్రముఖ మహిళల ఫొటోలు యాప్‌లో వేలానికి
న్యూఢిల్లీ: ప్రముఖ ముస్లిం మహిళల ఫొటోలను యాప్‌లోకి అప్లోడ్ చేసి వేలానికి పెట్టిన దారుణ వికృత చేష్ట ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై భిన్న వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత జులైలో ‘సలీ డీల్స్’ పేరిట జరిగిన అరాచకాన్ని గుర్తుచేస్తూ ‘బుల్లి బాయ్’ యాప్ ఒకటి తెరమీదకొచ్చింది. దాదాపు 100 మంది ప్రముఖ ముస్లిం మహిళలు, మహిళా పాత్రికేయుల ఫొటోలను వారి ట్విట్టర్ ఖాతాల నుంచి సేకరించి వాటిని బుల్లి బాయ్ యాప్‌లో అప్లోడ్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేలానికి పెట్టారు. దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు, ముంబై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. యాప్ కార్యకలాపాలకు వేదికగా వాడుతున్న ‘గిట్‌హబ్’ ప్లాట్‌ఫామ్‌లోని యూజర్ ఐడీని బ్లాక్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ఆన్లైన్ నెట్‌వర్క్‌లోకి హ్యాకింగ్ యత్నాలపై ఆయా సంస్థలను అప్రమత్తం చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్), ఢిల్లీ, ముంబై పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, బుల్లి బాయ్ వెబ్సైట్లో తన ఫొటోను వాడారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్ట్ ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ డెవలపర్లు, ట్విట్టర్ హ్యాండిల్ హోల్టర్లపై ముంబై సైబర్ విభాగం మరో కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు మహిళా జాతీయ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ సూచించారు. మహిళలను అవమానించడం, మత విద్వేషంపై ప్రజలు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వారికి అధికార అండదండలు: మెహబూబా ముఫ్తీ ఆరోపణ యాప్ ద్వారా ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న వారికి ‘అధికార అండదండలు’ అందుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు వెనకుండి నడిపించడం వల్లే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు స్వేచ్ఛగా తప్పించుకు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. -
మోదీజీ.. దీదీ గెలిస్తే.. మీరు ఓడినట్లే: సంజయ్ రౌత్
ముంబై: మే 2 తర్వాత మహరాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారతాయని వాదించిన వాళ్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు వస్తాయని గుర్తుంచుకోవాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాలు ప్రచారం నిర్వహించారు. ఆ ఇద్దరు ఉద్దండుల ప్రచారంతో బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందని రాజకీయ నిపుణులు భావించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎలా అయితే విజయం సాధించిందో.. బెంగాల్లో సైతం అదే తరహాలో దీదీని మట్టికరిపిస్తూ బీజేపీ విజయ దుందుభి మోగిస్తోందని సొంత పార్టీల నేతలు, అభ్యర్ధులు ఊహించారు. కానీ నేటి ఓట్ల లెక్కిపు ప్రక్రియలో బీజేపీ నాయకుల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎన్నికల ప్రచారంలో గాయ పడ్డ మమత ఒంటికాలితో ప్రచారం నిర్వహించి విజయం సాధిస్తానని ప్రత్యర్ధులకు విసిరిన సవాల్ నిజమయ్యింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ శివసేన అధికార మీడియా 'సామ్నా' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మే 2 తర్వాత మహారాష్ట్రలో రాజకీయ మార్పులు జరుగుతాయని ప్రచారం చేసిన వారు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో కూడా ప్రకంపనల సృష్టిస్తాయని గుర్తించుకోవాలన్నారు. ఓ వైపు దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. వ్యాక్సిన్లు, బెడ్ల కొరత, ఆక్సిజన్ లేకపోవడం వల్ల 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు చనిపోతున్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఒక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు దేశ ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఈసీ తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడిందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అంతేకాదు వెస్ట్ బెంగాల్లో దీదీ గెలిస్తే అక్కడ ప్రచారం చేసిన మోదీ, అమిత్ షాలు సైతం ఓడినట్లేనని సంజయ్ రౌత్ సామ్నాలో పేర్కొన్నారు. -
యాక్సిడెంటల్ హోం మినిస్టర్
ముంబై/నాగపూర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి అనూహ్యంగా ఆ పదవి లభించిందని, ఆయన యాక్సిడెంటల్ హోం మినిస్టర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్సీపీ నేతలు జయంత్‌పాటిల్, దిలీప్ వాల్సే హోం మంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగానే, అనిల్‌దేశ్‌ముఖ్‌కు అవకాశం లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వలో నష్ట నివారణ యంత్రాంగం సరిగా లేదని రౌత్ పేర్కొన్నారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే విషయంలో ఈ విషయం రుజువైందన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అహ్మదాబాద్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలపై రెండు పార్టీలు స్పందించాయి. దీనిపై మీడియా ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అన్ని విషయాలు వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. కాగా, కావాలనే షా అలా మాట్లాడారని, గందరగోళం సృష్టించాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, బీజేపీ పద్ధతే అదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరానన్నారు. -
ఆలస్యానికి ఎంపీ 15 లక్షల భారీ మూల్యం!
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే నిషేధం మాత్రమే ఎత్తివేశాం కానీ, చట్టపరంగా పోరాటం చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. తమ ఉద్యోగిపై దాడి చేసినందుకుగానూ అతడికి క్షమాపణ చెప్పకుండానే నిషేధం నుంచి బయటపడటంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి23న జరిగిన వివాదంలో ఎయిర్ క్రాఫ్ట్ (ఏఐ 852)ను 90 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చినందున అందుకు నష్టపరిహారంగా గైక్వాడ్ రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా స్పష్టంచేసింది. గైక్వాడ్ కారణంగానే సర్వీస్ ఆలస్యమైందని.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు ఆ సంస్థ సన్నద్ధమైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ)లో సభ్యత్వం ఉన్న ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్, టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు మార్చి 24వ తేదీ నుంచి ఎంపీ గైక్వాడ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాయి. ఎప్ఐఏలో సభ్యత్వం ఉన్న విమానయాన సంస్థలన్నీ గైక్వాడ్‌ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్లు ఎఫ్ఐఏ డైరెక్టర్ ఉజ్వల్ డే శనివారం తెలిపారు. ఎంపీ గైక్వాడ్ తమ సిబ్బందిని గౌరవించాలని, వాళ్లు ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతున్నారని.. విమాన ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఆ సంస్థలు గైక్వాడ్ కు సూచించాయి. దాదాపు రెండు వారాల పాటు గైక్వాడ్ విమానయాన నిషేధం ఎదుర్కొన్న తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఆ నిషేధాన్ని ఎత్తేశాయి. రవీంద్ర గైక్వాడ్ క్షమాపణలు తెలిపారని, ఈ మేరకు లేఖ కూడా అందజేశారని.. గైక్వాడ్ ఇక మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ కూడా ఇచ్చారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలపడంతో విమాన సంస్థలు శాంతించాయి. -
డబ్బుల్లేవని.. చార్టర్డ్ విమానంలో వెళ్లాడు
న్యూఢిల్లీ: ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకుని, ప్రముఖ విమానయాన సంస్థల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు విమానం ఎక్కారు. రెండు వారాలుగా పలుమార్లు విమానంలో ప్రయాణించేందుకు విఫలయత్నం చేసిన గైక్వాడ్.. డబ్బుల్లు లేవంటూనే చివరకు ఓ చార్టర్డ్ విమానంలో బుధవారం పుణె నుంచి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గాను ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు శివసేన ఏర్పాట్లు చేసింది. రెండు వారాల క్రితం విమానంలో సీటు విషయంపై గొడవపడి ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌పై గైక్వాడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ను చెప్పుతో కొట్టినట్టు ఆయన ఒప్పుకొన్నారు. సుకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. కాగా గైక్వాడ్ తప్పు చేసినట్టయితే ఆయనపై చర్యలు తీసుకోవాలని, విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించే అధికారం ఎవరికీ లేదని శివసేన సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఎయిరిండియా, స్పైస్ జెట్, ఇండిగో సహా పలు విమానయాన సంస్థల్లో గైక్వాడ్ టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఢిల్లీ వెళ్లడానికి శివసేన చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. తనపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయాన్ని గైక్వాడ్ పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశముంది. -
ఫ్లైట్ ఎక్కడానికి ఏడుసార్లు విఫలయత్నం!
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించడంతో విమానంలో ప్రయాణించేందుకు ఆయన విఫలయత్నం చేస్తున్నారు. ఏడు రోజుల్లో ఏడుసార్లు ప్రయత్నించి ఆయన భంగపడ్డారు. ఈనెల 28 నుంచి ఐదుసార్లు విమానంలో ఢిల్లీ వచ్చేందుకు ఆయన చేసిన యత్నాలు ఫలించలేదు. మూడు సార్లు టిక్కెట్లు కొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన కొనుగోలు చేసిన టిక్కెట్లను రెండుసార్లు ఎయిరిండియా రద్దు చేసింది. రవీంద్ర గైక్వాడ్ పేరు గుర్తించగానే ఎయిరిండియా టిక్కెట్లు కొనుగోలు చేయకుండా చేస్తోంది. ఒకవేళ టిక్కెట్లు దక్కించుకున్నా రద్దు చేస్తోంది. గత శుక్రవారం(మార్చి 24) ఢిల్లీ నుంచి పుణెకు ఆయన బుక్ చేసుకున్న రెండు టిక్కెట్లను ఎయిరిండియా క్యాన్సిల్ చేసింది. ఈ నెల 24 నుంచి 30 వరకు మొత్తం ఏడుసార్లు ఆయన విఫలయత్నాలు చేశారు. రవీంద్ర గైక్వాడ్ పేరును నిషేధ జాబితాలో పెట్టినందున టిక్కెట్లు తీసుకోకుండా నిలువరిస్తున్నామని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. -
శివసేన ఎంపీకి తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగిపై దౌర్జన్యం చేయడంతో ఎయిరిండియా సహా ఆరు విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ ఆయన టికెట్లు రద్దు చేసేశాయి. దీంతో ఢిల్లీ నుంచి ముంబైకి ఆయన రైళ్లో వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బుక్ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేయడంతో రోడ్డు మార్గంలో ఢిల్లీకి బయలుదేరారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లాలని టిక్కెట్లు తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. గైక్వాడ్ కారులో ఢిల్లీకి బయలుదేరిన విషయాన్ని ఉమర్గా పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. మంగళవారం మధ్యహ్నం గైక్వాడ్, ఆయన భార్య కారులో పుణె నుంచి ఢిల్లీకి పయనమైనట్టు తెలిపారు. బుధవారం సాయంత్రానికి వీరు ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఈ రోజు లోక్ సభ సమావేశాలకు హాజరుకారని వెల్లడించారు. రేపటి నుంచి ఆయన లోక్ సభ సమావేశాలకు హాజరవుతారు. -
మెత్తబడిన కేంద్రం. ఎంపీకి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిరిండియా అధికారిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మెత్తపడింది. అన్ని విమానాల్లో గైక్వాడ్ ప్రయాణించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంలో గొడవపడిన గైక్వాడ్.. సుకుమార్ అనే ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టడం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంపీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిరిండియా సహా ప్రధాన విమాన సంస్థలలో గైక్వాడ్ ప్రయాణించకుండా నిషేధం విధించారు. ఢిల్లీ నుంచి పుణెకు తిరిగి వెళ్లేందుకు గైక్వాడ్ రిజర్వ్ చేసుకున్న టికెట్‌ను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన రైలులో ముంబై వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం శివసేన ఎంపీలు.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లను కలసి గైక్వాడ్‌పై నిషేధం తొలగించాలని కోరారు. విమానాల్లో ప్రయాణించకుండా ఎంపీపై నిషేధం విధించడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని సమాజ్‌వాదీ పార్టీ సభలో పేర్కొంది. ఎంపీ తప్పు చేసినట్టు తేలితే ఆయనపై చర్యలు తీసుకోవాలని, విమానాల్లో ప్రయాణించకుండా ఆపేలా చట్టం లేదని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి అన్నారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత విమానాల్లో ప్రయాణించేందుకు గైక్వాడ్‌కు అనుమతి ఇచ్చేందుకు కేంద్ర అంగీకరించింది. -
మోదీని ఇన్సల్ట్ చేసినందుకే.. అలా చేశాడు!
ముంబై: ఎయిరిండియా విమానంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దుష్ర్పవర్తన యావత్ దేశాన్నే కాదు.. ఆయన కుటుంబసభ్యులను కూడా విస్మయపరిచింది. తన భర్తలోని అంత దురుసు కోణాన్ని చూడటం ఇదే తొలిసారి అని గైర్వాడ్ భార్య ఉషా 'ముంబై మిర్రర్'కు తెలిపారు. 'నా భర్త ఎవనైనా అలా కొట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు. ఢిల్లీలో తొలిసారి ఆయనలోని హింసాత్మక కోణాన్ని చూశాను. ఎయిరిండియా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్లే ఆయన అలా ప్రతిస్పందించారు' అని ఆమె అన్నారు. తన భర్తకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన ఇలాంటి చర్యకు పాల్పడుతారని వ్యక్తిగతంగా ఆయన గురించి తెలిసినవారు ఎవరూ భావించరని చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల కిందట ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో రంజాన్ సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తికి బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించి.. గైక్వాడ్ వివాదం రేపిన సంగతి తెలిసిందే. తన భర్తకు అంత కోపం రావడం తానెప్పుడూ చూడలేదని, ఎయిరిండియా సిబ్బంది మొరటుగా ప్రవర్తించడం వల్లే ఆయన సహనం కోల్పోయారని ఆమె చెప్పారు. విమానంలో ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టి.. వారిపై దౌర్జన్యపూరితంగా గైక్వాడ్ ప్రవర్తించడం సబబేనా అని ప్రశ్నించగా.. 'ఎయిరిండియా నాసిరకం సేవలు గురించి మా ఆయన ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఫిర్యాదు తీసుకోవడానికి బదులు వారు వాగ్వాదానికి దిగారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును అగౌరవపరుస్తూ అవమానకరంగా మాట్లాడారు. అందువల్లే ఆయన సహనం కోల్పోయారు' అని ఆమె అన్నారు. -
గైక్వాడ్ చేసింది కరెక్టే: ఎమ్మెల్యే
ముంబై: ఎయిరిండియా అధికారి సుకుమార్‌పై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై తీవ్ర విమర్శలు వస్తుండగా.. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బచ్చు కడు ఆయన చర్యను సమర్థించారు. అధికారిని ఎంపీ కొట్టడం సరైన చర్యని వ్యాఖ్యానించారు. పైగా తాను కూడా గతంలో ఓ అధికారిని 20 సార్లు చెంపదెబ్బ కొట్టానని చెప్పారు. ఓ అధికారిని గైక్వాడ్ కొట్టారంటే.. దానికి తగిన కారణం ఉండి ఉంటుందని కడు అన్నారు. ప్రజా ప్రతినిధులతో కొందరు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తారని, తమ గురించి వాళ్లు ఏమనుకుంటున్నారని, చేతులు కట్టుకుని నిలబడాలా అని కడు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అచల్పూర్ నుంచి ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. శివసేన కూడా రవీంద్రను వెనకేసుకొచ్చింది. ఎయిరిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొంది. ఈ దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు.. గైక్వాడ్‌పై కేసు నమోదు చేశారు. ఎయిరిండియాతో పాటు విస్తారా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి సంస్థలు ఆయన్ను బహిష్కరించాయి. కాగా కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలి కానీ ప్రయాణించకుండా, టికెట్ ఇవ్వకుండా అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని అన్నారు. -
ఎంపీకి పూలు, చెప్పులతో నిరసన
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ను దుర్భాషలాడి, ఆయనపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఆమ్ ఆద్మీ సేన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుకుమార్‌ను చెప్పుతో కొట్టిన గైక్వాడ్‌కు తామూ అదే పని చేస్తామని హెచ్చరించారు. ఎంపీ దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ సేన సభ్యులు ఢిల్లీ విమానాశ్రయంలో మూడో టర్మినల్ ముందు ఆందోళన చేపట్టారు. పూలు, చెప్పులతో నిరసన తెలియజేశారు. ఎంపీ గైక్వాడ్ మహారాష్ట్రకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం 4:15 గంటలకు టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. నిన్న సంఘటన తర్వాత ఎయిరిండియా ఈ టికెట్‌ను రద్దు చేసింది. ఎంపీ విమానాశ్రయానికి వస్తారని సమాచారం రావడంతో గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా టికెట్ రద్దు కావడంతో ఎంపీ రాలేదు. గైక్వాడ్ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపేందుకు ఆమ్ ఆద్మీ సేన సభ్యులు విమానాశ్రయానికి వచ్చారు. గురువారం సీటు విషయంపై గొడవపడిన ఎంపీ గైక్వాడ్.. సుకుమార్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టానని స్వయంగా ఎంపీ చెప్పారు. ఎంపీపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎయిరిండియాతో పాటు విస్తారా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి సంస్థలు ఆయన్ను బహిష్కరించాయి. -
25 సార్లు చెప్పుతో కొట్టాను: ఎంపీ
-
మన దేశాన్ని దేవుడే కాపాడాలి
-
ఈ ఎంపీ.. గతమంతా నేరాలమయం
న్యూఢిల్లీ: ఎయిరిండియా సిబ్బందిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గతమంతా నేరాలమయమే. ఆయన చట్టాలను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. గైక్వాడ్‌పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆయనేమీ చదువు లేనివాడు కాదు. ఉన్నత విద్యావంతుడు..! ఎంకామ్, బీఎడ్ చేశారు. గైక్వాడ్ గతంలో రెండుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఉస్మానాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉన్నత విద్య, రాజకీయ నేపథ్యం ఉన్నా.. ఆయన జీవితమంతా వివాదాలు, నేరాలమయం. అభ్యర్థుల నేర, ఆర్థిక వివరాలను పొందుపరిచే మై నేత పోర్టల్ జాబితా ప్రకారం గైక్వాడ్‌పై 12 కేసులున్నాయి. హత్య, దోపిడీ, బెదిరించడం వంటి కేసులున్నాయి. తాజాగా ఎయిరిండియా అధికారిని చెప్పుతో కొట్టి గైక్వాడ్ వార్తల్లోకెక్కాడు. ఎయిరిండియా అధికారిపై గైక్వాడ్ దాడి చేసిన ఘటనపై శివసేన స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
మన దేశాన్ని దేవుడే కాపాడాలి
న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, అందరిముందు తనను తీవ్రంగా అవమానించి దాడికి పాల్పడ్డారని ఎయిరిండియా అధికారి సుకుమార్ చెప్పారు. ఎంపీ తన కళ్లజోడు పగలగొట్టారని, ఇలాంటి ఘటన జరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. మన ఎంపీల ప్రవర్తన, సంస్కృతి ఇదే అయితే మన దేశాన్ని దేవుడే రక్షించాలని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గైక్వాడ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుకుమార్ డిమాండ్ చేశారు. దాడి ఘటనకు సంబంధించి ఆయనపై ఫిర్యాదు చేశారు. సీటు విషయంపై ఎంపీ చెప్పిన విషయం సాధ్యంకాదని చెప్పానని, దీంతో ఎంపీ తనను అసభ్య పదజాలంతో తిట్టారని, చేయిచేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంపై సుకుమార్‌తో గొడవపడిన ఎంపీ గైక్వాడ్ చెప్పుతో ఆయన్ను కొట్టారు. ఈ విషయాన్ని ఎంపీ అంగీకరించారు. ఎంపీ దురుసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ ఘటనపై స్పందిస్తూ.. భౌతిక దాడులను ఏ పార్టీ కూడా ప్రోత్సహించదని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలను శివసేన సహించదని ఆ పార్టీ నేత మనీషా కయండె చెప్పారు. -
25 సార్లు చెప్పుతో కొట్టాను: ఎంపీ
న్యూఢిల్లీ: తానో ఎంపీనని.. గౌరవ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని, స్థాయిని మరచిపోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం వీరంగం సృష్టించారు. సీటు విషయంపై ఎయిరిండియా సిబ్బందితో గొడవపడి దాడి చేశారు. ఎంపీ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ, తన చెప్పు తీసి ఎయిరిండియా అధికారిని కొట్టారు. ఎయిరిండియా అధికారిపై దాడి చేసిన విషయాన్ని గైక్వాడ్ అంగీకరించారు. తన పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించాడని, 25 సార్లు చెప్పుతో కొట్టానని అన్నారు. తాను బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకోగా, ఎకానమీ క్లాస్ సీటు ఇచ్చారని చెప్పారు. ఈ విషయం గురించి తాను ఫిర్యాదు చేయగా, ఎయిరిండియా సిబ్బంది సరిగా స్పందించలేదని తెలిపారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నుంచి గైక్వాడ్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎయిరిండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీటు విషయంపై గొడవ జరిగినట్టు తెలిపారు. -
శివసేన ఎంపీ వీరంగం
‘రోజా’ ఉన్న ముస్లిం ఉద్యోగికి బలవంతంగా ఆహారం తినిపించేందుకు ప్రయత్నం గతవారం జరిగిన ఘటన; వార్తాచానళ్లలో బుధవారం వీడియో ప్రసారం దద్దరిల్లిన పార్లమెంటు; ఉభయసభల్లో గందరగోళం; పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహారాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహం న్యూ మహారాష్ట్ర సదన్‌లో గతవారం ఒక శివసేన ఎంపీ చేసిన దాష్టీ కం తాజాగా వెలుగులోకి వచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రోజా(ఉపవాసం) ఉంటున్న అర్షద్ జుబెయిర్ అనే ముస్లిం ఉద్యోగికి శివసేన ఎంపీ రాజన్ విచారే బలవంతంగా ఆహారం తినిపించేందుకు ప్రయత్నించిన ఘటన రాజకీయంగా పెనుదుమారం లేపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం పలు వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో.. ఎంపీ చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటులోనూ విపక్ష సభ్యులు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బాధ్యులైన ఎంపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, వాస్తవాలు వెల్లడయ్యేంతవరకు సంయమనం పాటించాలని, దీనికి మతం రంగు పులమవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ హిందుత్వ మద్దతుదారైనప్పటికీ.. తమకు ఇతర మతాలపై వ్యతిరేకత లేదని శివసేన స్పష్టం చేసింది. ‘మా పార్టీ గొంతుకను అణిచేందుకు జరుగుతున్న ప్రయత్నమే ఇది. మాది హిందుత్వవాదమే అయినా.. మాకు ఇతర మతాలపై ద్వేషం లేదు’ అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఔరంగాబాద్‌లో స్పష్టం చేశారు. రోటీలు బాగా లేవని.. గతవారం మహారాష్ట్ర సదన్‌లోని క్యాంటీన్లో భోజనం చేసేందుకు శివసేన ఎంపీలు వెళ్లారు. అక్కడ వారికి వడ్డించిన రోటీ(చపాతీ)లు గట్టిగా, తినడానికి వీల్లేకుండా ఉండటంతో.. ఫిర్యాదు చేసేందుకు సదన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కమిషనర్ కోసం గంటకు పైగా ఎదురుచూసి.. ఆయన రాకపోవడంతో ఆగ్రహంతో మళ్లీ క్యాంటీన్లోకి వెళ్లి అక్కడి ఉద్యోగి అర్షద్ జుబెయిర్‌ను ఆహార నాణ్యత విషయమై ప్రశ్నించారు. ఆ సందర్భంగా మిగతా ఎంపీలు చూస్తుండగా ఆగ్రహంతో ఎంపీ రాజన్ విచా రే ఉద్యోగి అర్షద్ నోట్లో రోటీని బలవంతంగా కుక్కేందుకు ప్రయత్నించారు. భయంతో వణికిపోతూ ఆ ఉద్యోగి అలా చేయవద్దంటూ వేడుకోవడం, ఆ ఉద్యోగి పేరు కూడా అతని షర్ట్‌పై కనిపిస్తుండటం వీడియోలో స్పష్టంగా ఉంది. తన వీడియో పలు చానళ్లలో ప్రసారం కావడంతో.. తన ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తనకు ఆ ఉద్యో గి పేరు, కులం, మతం.. ఇవేవీ తెలియవని పేర్కొన్నారు. టీవీల్లో చూసిన తరువాతే అతను ముస్లిం అని తెలిసిందన్నా రు. సదన్‌లో నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు మాత్రమే తాను ప్రయత్నించానన్నారు. సదన్‌లోని క్యాంటీన్లో తమకు ఉడికీ ఉడకని కూరలు, చేత్తో తుంచలేని రోటీలను వడ్డిస్తున్నారన్నారు. పార్లమెంట్లో గందరగోళం మిత్రపక్షమైన శివసేన ఎంపీ చర్య ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. పార్లమెంటులోని ఉభయసభల్లోనూ ఈ అంశంపై గందరగోళం చెలరేగి, వాయిదాలకు దారితీసింది. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఎంఐ షానవాజ్.. లౌకికవాద మూలాలనే ఇది నరికేస్తుందని వ్యాఖ్యానించారు. ‘మైనారిటీల నమ్మకం వమ్మయింది. ఈ ఘటనను సభ ఖండించాలి’ అని డిమాండ్ చేశారు. రంజాన్ నెలను గౌరవించే సభ్యులు సభలో తప్పుడు ప్రకటనలివ్వవద్దని సేన ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ గీతే అన్నారు. మోడీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. శివసేన ఎంపీలపై ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించొద్దు. అసలా ఘటన జరిగిందో లేదో.. వాస్తవాలేంటో ఎవరికీ తెలియదు. విచారణ జరగాల్సి ఉంది. దీనిపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించవద్దు. ఈ ఘటనకు, ప్రభుత్వానికి సంబంధం లేదు’ అన్నారు. బిదూరి అభ్యంతరకర వ్యాఖ్యలు ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు రమేశ్ బిదూరి వెల్‌లోకి దూసుకొచ్చి ‘ఇది భారతదేశం..’ అంటూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సభలో మరోసారి గందరగోళం చెలరేగింది. ఆగ్రహంతో ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ సభ్యుడు పప్పూ యాదవ్‌లు వెల్‌లోకి దూసుకెళ్లారు. బిదూరితో వాగ్వాదానికి దిగారు. వారు ఓ దశలో కొట్టుకునేందుకు సిద్ధమన్నట్లుగా షర్టు చేతులను వెనక్కి మడవడం కూడా కనిపించింది. పరిస్థితిని గమనించిన బీజేపీ సీనియర్ నేత బిదూరిని కోప్పడి తనసీట్లో కూర్చోవలసిందిగా ఆదేశించారు. తన సీట్లో కూర్చున్న తర్వాత రమేష్ బిదూరి తన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పారు. బీజేపీ ఎంపీ ప్రవర్తనను తమ పార్టీ ఆమోదించదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శివసేన ఎంపీలను సెక్షను 153 కింద అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ముస్లిం ఉద్యోగి ఉపవాసాన్ని బలవంతంగా భంగపర్చడానికి శివసేన ఎంపీలు చేసిన దారుణాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ముస్లిం ఉద్యోగి నోట్లోకి శివసేన ఎంపీలు బలవంతంగా చపాతీ కుక్కడం దుర్మార్గచర్యగా పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ ముందుంచాలని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీ, వామపక్షాలు, పీడీపీ, ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ‘అది తప్పు’ అంటూ శివసేన ఎంపీ చర్యపై బీజేపీ అగ్రనేత అద్వానీ స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం ఉద్యోగికి బలవంతంగా ఆహారం తినిపించాలని ప్రయత్నించడం వారి మనస్తత్వాన్ని, వారి ఆలోచనాధోరణిని బట్టబయలు చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, అలాగే తక్షణం విచారణ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు ఒక లేఖ రాశాయి. ఆ లేఖపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆరెస్పీ, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీలకు చెందిన ఎంపీలు సంతకం చేశారు. ‘బలవంతంగా నోట్లో కుక్కారు’ జరిగిన ఘటనపై బుధవారం సదన్ రెసిడెంట్ కమిషనర్‌కు అర్షద్ జుబెయిర్ ఫిర్యాదు చేశారు. ‘నా పేరు ఆ ఎంపీకి తెలుసు.. నేను ధరించిన చొక్కాపై కూడా నా పేరు ఉంది.. అయినా బలవంతంగా నా నోట్లో చపాతీలు కుక్కారు’ అని అందులో అర్షద్ పేర్కొన్నారు. ‘నేను ముస్లింనని తెలిసే.. బలవంతంగా రోటీలు తినిపించారు. దానివల్ల రంజాన్ మాసంలో నా ఉపవాస దీక్ష భగ్నమైంద’ని అర్షద్ వివరించారు. ఐఆర్సీటీసీ నిర్వహిస్తోన్న ఆ క్యాంటీన్లో కేటరింగ్ సూపర్వైజర్గా అర్షద్ పనిచేస్తున్నారు. -
నటి నవనీత్ కౌర్‌ను దుర్భాషలాడిన శివసేన ఎంపీ
అమరావతి: శివసేన ఎంపీ ఆనంద రావు తనను దుర్భాషలాడారని దక్షిణాది సినీ నటి నవనీత్ కౌర్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎంపీతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నవనీత్ కౌర్ పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. మహారాష్ట్రకు చెందిన లెజిస్టేటర్ రవి రాణాను 2011లో వివాహం చేసుకున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. తనను కులం పేరుతో ధూషించడంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ బెదిరించారని కౌర్ ఫిర్యాదు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. కాగా ఆనందరావు మాత్రం కౌర్ ఆరోపణల్ని ఖండించారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకోసమే ఆమె తనపై తప్పుడు ఆరోపణల్ని చేస్తోందని విమర్శించారు. నవనీత్ వాదన మరోలా ఉంది. ఎన్సీపీ తనకు టికెట్ ఇవ్వనున్నట్టు తెలిసినప్పటి నుంచి రెండు నెలలుగా ఎంపీ అనుచరులు వేధిస్తున్నారని 27 ఏళ్ల నవనీత్ చెప్పారు. తాను నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక కొందరు తన ఫొటోలను అసభ్యకరరీతిలో సామజిక వెబ్సైట్లో పోస్ట్ చేశారని చెప్పారు.