siege
-
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్‌మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
ఏబీవీపీ TGPSC ముట్టడి విఫలం.. నాంపల్లిలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: ఏబీవీపీ ముట్టడి ప్రయత్నంతో నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక వాతావరణం నెలకొంది. గ్రూప్ ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టుల డిమాండ్‌తో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు మంగళవారం ఉదయం టీజీపీఎస్సీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అయితే.. ఒక్కసారిగా వాళ్లు కమిషన్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 పిలవాలని, గ్రూప్ 2 లో పోస్టులు పెంచి, డిసెంబర్ లో గ్రూప్ టు పరీక్షలు నిర్వహించాలని, టీచర్ పోస్టుల్ని పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ. -
నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు బురిడీ కొట్టించాలనుకున్న టీవీ–5 సాంబశివరావుకు బుర్ర తిరిగిపోయే ఎదురుదెబ్బ తగలింది. పచ్చ మీడియాలో ఒకటైన టీవీ–5లో సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా భూ యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆయ న నడిపిస్తున్న పెట్రోల్ బంక్‌ను హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు బుధవారం సీజ్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో ప్లాట్‌ను అగ్రిమెంట్ చేసుకొని, దాన్ని హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చాడని ప్లాట్ యజమాని సరనాల శ్రీధర్‌రావు హెచ్‌పీసీఎల్‌కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ చేసిన స్థలానికి బుధవారం కంచె వేయడంతో పాటు పెట్రోల్ బంక్‌ను పాక్షికంగా సీజ్ చేశారు. ఆ స్థలంలో ఉన్న పెట్రోల్ పంపులను మూసి వేశారు. ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలున్నాయని నమ్మించి.. సాంబశివరావుపై ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సరనాల శ్రీధర్ భార్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామం, సర్వే నంబరు–64, హుడా టెక్నో ఎన్క్లేవ్, సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో 600 చదరపు మీటర్ల (717.60 చదరపు గజాలు) స్థలం ఉంది. 2018లో సాంబశివరావు వీరిని కలిసి, తనకు ఆయిల్ సంస్థలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్షిప్ ఇప్పిస్తామని నమ్మించాడు. ప్లాట్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూ యజమానులకు తెలియకుండా పెట్రోల్ బంక్ డీలర్‌షిప్‌ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు సాంబశివరావు బదలాయించాడు. జర్నలిస్టులు, పోలీసుల పేరుతో భయపెట్టి.. తన స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్‌ను నడుపుతున్నట్లు తెలుసుకున్న శ్రీధర్‌రావు షాక్‌కు గురయ్యారు. 2021లో దీనిపై సాంబశివరావును నిలదీశారు. దీంతో సాంబశివరావు ఎదురుదాడికి దిగాడు. హెచ్పీసీఎల్తో డీలర్షిప్ అగ్రిమెంట్‌కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన శ్రీధర్‌రావు ఆ డీలర్‌షిప్‌ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరారు. లక్షల్లో వసూలు చేసి డీలర్షిప్ బదలాయించకుండా.. అయితే కొంత నగదు చెల్లిస్తేనే డీలర్‌షిప్‌ను బదలాయిస్తానని సాంబశివరావు చెప్పాడు. వేరే దారిలేక 2021, మార్చిలో రూ.లక్షల్లో నగదు బదలాయించామని శ్రీధర్‌రావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ డీలర్‌షిప్‌ను బదలాయించకపోవడంతో ఈ ఏడాది జనవరి 31న శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ప్రతినిధులకు సైతం శ్రీధర్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్‌పీసీఎల్ అధికారులు సాంబశివరావు నడుపుతున్న పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. చీటింగ్ కేసును నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్‌రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్‌కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్‌ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
గ్రూప్-2 వాయిదా వేయండి.. టీఎస్పీఎస్సీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. ఇప్పటికే గ్రూప్ - 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా.... గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట మసకబారిపోగా.. ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజుల్లో మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు.. జీవో నెంబర్ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
కిడ్నీ రాకెట్‌పై సర్కారు సీరియస్
మహారాణిపేట/సింహాచలం: విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికే అనుమతి లేదు కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు, జీవన్‌దాన్ కో–ఆర్డినేటర్ రాంబాబు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆస్పత్రి అనుమతులు, ఇటీవల జరిగిన సర్జరీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆర్థో ఓపీలు, సర్జరీలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇందులో రెండు ఆపరేషన్ థియేటర్లు కూడా ఉండటాన్ని గమనించారు. ఐదేళ్లుగా పెందుర్తిలో తిరుమల ఆస్పత్రి కార్యకలాపాలు సాగిస్తోంది. దీనికి ఎటువంటి అనుమతి లేదని అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. కనీసం తాత్కాలిక ఆనుమతి కూడా లేదన్న విషయం తెలుసుకుని అధికారులు కంగుతిన్నారు. అనుమతులు లేని ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా, నేరపూరితంగా సర్జరీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు మాత్రమే ఉండగా.. కిడ్నీ మారి్పడి ఎలా చేశారు, ఎవరు చేశారన్న విషయంపైనా ఆరా తీశారు. తమ ఆస్పత్రిలో ఎముకలకు సంబంధించిన వైద్యమే తప్ప ఎలాంటి కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు జరగలేదని ఆస్పత్రి ఎండీ పరమేశ్వరరావు అధికారులకు చెప్పారు. ఆస్పత్రి సీజ్ : వైద్య సేవలు, సౌకర్యాలపై అధికారులు కలెక్టర్ మల్లికార్జునకు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్ సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేశారు. మోసం, మానవ అవయవాల మారి్పడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు. -
కారులో రూ.2.10 కోట్ల నగదు ఎవరిది!
బళ్లారి సాక్షి, యశవంతపుర: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా హున్నూర చెక్‌పోస్టు వద్ద లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ.2.10 కోట్ల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. చెక్‌పోస్ట్‌లో అధికారులు ఒక కారును శోధించగా నగదు కట్టలు లభించాయి. ఈ నగదు ఒక సహకార బ్యాంకుకు చెందినదిగా నగదు తరలింపుదారులు తెలిపారు. అయితే అందుకు సంబంధించి దాఖలాలు చూపలేదని తెలిసింది. పత్రాలను చూపించి నగదు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆ నగదును జమఖండిలోని ట్రెజరీకి తరలించారు. -
165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్దఎత్తున అవకతవకలు వెలుగుచూశాయి. అవకతవకలను అరికట్టేందుకు 3,810 ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లను ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 1,163 ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 165 ఆస్పత్రులను సీజ్ చేయగా, మరో 106 ఆస్పత్రుల యాజమాన్యాలకు జరిమానాలు విధించి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రజారోగ్య విభాగానికి నివేదిక సమర్పించగా, అధికారులు మంగళవారం గణాంకాలు విడుదల చేశారు. వామ్మో నాగర్‌కర్నూల్... అధికారులు సీజ్ చేసిన 165 ఆస్పత్రుల్లో 41 ఆస్పత్రులు నాగర్‌కర్నూల్ జిల్లాలోనివే కావడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 54 ఆస్పత్రులను తనిఖీ చేసిన అధికారులు అందులో 70 శాతం ఆస్పత్రులను సీజ్ చేయడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అత్యధిక ఆస్పత్రులు సీజ్ చేసిన కేటగిరీలో నల్లగొండ–17, సంగారెడ్డి–16, భద్రాద్రి కొత్తగూడెం–15, హైదరాబాద్–10, రంగారెడ్డి–10 ఆస్పత్రులు ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన కేటగిరీలో హైదరాబాద్–274, కరీంనగర్–124, రంగారెడ్డి –107 ఆస్పత్రులున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నోటీసుల జారీ ప్రక్రియ సాగింది. ప్రస్తుతం నోటీసుల జారీ, సీజ్, పెనాల్టీలతో సరిపెట్టిన వైద్య, ఆరోగ్య శాఖ వాటికి సంబంధించి వచ్చిన వివరణలు, తదుపరి చర్యలకు త్వరలో మరో డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
మంత్రి ఇంటి ముట్టడికి యత్నం
ఒంగోలు టౌన్: జీఓ నెం 279 రద్దుచేసి, ఆర్టీఎంఎస్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ మునిసిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరుకొంది. సమ్మెలో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ఇంటిని ముట్టడించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కార్మికులు, నాయకులు ప్రదర్శనగా బయలుదేరి మంగమూరురోడ్డులోని మంత్రి ఇంటిని ముట్టడించేందుకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో రోడ్డు మొదట్లోనే ఆందోళనకారులను అడ్డుకున్నారు. తాము లోపలికి వెళతామంటూ ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రిని కలిసేందుకు ముఖ్య నాయకులకు అనుమతి ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్ వద్దకు చేరుకొన్నారు. అక్కడే కలెక్టర్ వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ఉన్నారు. వారి సమక్షంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు మునిసిపల్ కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ కార్మికుల ఉనికికి గొడ్డలి పెట్టు అయిన జీఓ నెం 279ని ప్రభ్వుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంటే, ఆర్టీఎంఎస్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. జేఏసీ నాయకుడు శ్రీరాం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు అంకితభావంతో విధులు నిర్వర్తించడం వల్లనే రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని గుర్తెరగని నగర పాలక సంస్థ కమీషనర్ కార్మికులను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోకి పారిశుధ్య కార్మికులు ప్రవేశించకుండా ఉండాలన్న ఉద్ధేశంతో గేట్లకు తాళాలు వేయించడం సరికాదన్నారు. కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నాయకుడు ఎస్డీ సర్ధార్ మాట్లాడుతూ జీఓ నెం 279 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతన సవరణ చేయాలన్నారు. మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తంబి శ్రీనివాసులు, టి.మహేష్, కె.శ్రీనివాసరావు, యూ రత్నకుమారి పాల్గొన్నారు. 14 మందిపై కేసు నమోదు ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ సంకురాత్రి వెంకట కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 4వ తేదీ నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎక్కువమంది సమ్మె చేస్తున్నారు. కొందరు మాత్రం విధులకు హాజరవుతున్నారు. శనివారం కార్మికులు చేస్తున్న పనికి ఆటంకం కలిగించడంతోపాటు శానిటరీ ఇన్స్పెక్టర్ల విధులకు కోర్నిపాటి శ్రీనివాసరావు, కొల్లాబత్తిన గోపి, ఊదరగుడి సామ్రాజ్యం, కాకర్లమూడి సామ్రాజ్యం, తంబి శ్రీనివాసులు(సీఐటీయూ), ఊరగాయల నాగరాజు, రంపతోటి శ్రీనివాసరావు, కోర్నెపాటి రవికుమార్, కోర్నెపాటి బాలకృష్ణ, తేళ్ల విజయ, బందెళ సుబ్బారావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, పిల్లి శారద, బండ్ల ఏడుకొండలు అనే వారు ఆటంకం కలిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. -
రక్త ఉత్పత్తుల అక్రమ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రక్త నిల్వలకు సంబంధించిన ప్యాకెట్ల (బ్లడ్ ప్రొడక్ట్స్) అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. లైసెన్సులు లేకుండానే కొన్నిచోట్ల యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఒక హోల్‌సేల్ మెడికల్ షాపులో వెయ్యి రక్త ఉత్పత్తుల ప్యాకెట్లను కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా పట్టుకుని అక్కడికక్కడే సీజ్ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు. ఆ ప్యాకెట్లన్నీ కూడా ప్లాస్మా, క్రయో ప్రిస్పరేట్ రక్త ఉత్పత్తులని, వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అధికారులు ఏకధాటిగా ఈ దాడులు చేశారు. ఆ మెడికల్ షాపునకు రక్త ఉత్పత్తులను విక్రయించే లైసెన్సు లేదు సరికదా ఆ ప్యాకెట్లపై కనీసం గడువు తేదీకూడా లేకపోవడం గమనార్హం. ఆ మెడికల్ షాపుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నెట్వర్క్ ఉందని తెలిసింది. కొన్నేళ్లుగా అక్రమంగా రక్త ఉత్పత్తుల దందా నిర్వహిస్తున్నా ఎవరూ గుర్తించలేదని సమాచారం. పైగా కొందరు అధికారులు కూడా ఆ షాపునకు సహకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రక్త ఉత్పత్తుల విక్రయాలకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అయితే చాలామంది బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ తీసుకొని రక్త ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. రక్తం ద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకోసం రక్త ఉత్పత్తులు తయారుచేస్తుంటారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. అలాగే ప్లాస్మా నుంచి ప్లేట్లెట్లు, రెడ్‌బ్లడ్ సెల్స్ సెపరేట్ చేస్తుంటారు. ఇలా నాలుగైదు రకాల రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో పలుచోట్ల అక్రమార్కులు లైసెన్సు లేకుండా, ప్రమాణాలు పాటించకుండా తయారుచేస్తుండటం గమనార్హం. అయితే 2012 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా రక్త ఉత్పత్తుల విక్రయాలకు లైసెన్సు ఇవ్వలేదని సమాచారం. కూకట్‌పల్లిలోని ఆ మెడికల్ షాపులో రక్త ఉత్పత్తులను ప్రమాణాల ప్రకారం నిల్వ చేయలేదు. ఉదాహరణకు ప్లాస్మాను మైనస్ 20 డిగ్రీల వద్ద, క్రయోప్రిస్పరేట్ను మైనస్ 80 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి. కానీ వాటిని ఏసీ రూములో పడేశారు. అలాగే వాటిపై లేబుళ్లు లేవు. రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో ఇష్టారాజ్యంగా వీటిని అమ్ముతున్నారు. పేరుకు అది హోల్‌సేల్ మెడికల్ షాపైనా ల్యాబ్‌లా ఉందని అంటున్నారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్లు దాస్, రమ«ధాన్, ఇన్స్పెక్టర్లు నాగరాజు, చంద్రశేఖర్, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడలో రెండు టన్నుల గంజాయి స్వాధీనం
విజయవాడ: సుమారు రెండు టన్నుల గంజాయిని విజయవాడలో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ర్ట వెళ్తున్న రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. రామవరప్పాడు వద్ద ఒక కారు దొరకగా..పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ పోయిన మరో కారును ఇబ్రహీంపట్నం వద్ద చేజ్ చేసి పట్టుకున్నారు. రెండు కార్లలో కలిపి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నలుగురూ మహారాష్ర్టకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెజిటబుల్ కట్లెట్లో బొద్దింకలు, పురుగులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించడమే కాకుండా, లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న అన్నపూర్ణ థియేటర్లోని క్యాంటీన్‌ను అధికారులు సీజ్ చేశారు. గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ, శకుంతల థియేటర్స్‌లో ఆహార పదార్థాలు శుభ్రంగా లేవంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తనిఖీలో తేలిందని పూర్ణచంద్రరావు తెలిపారు. మినిట్ మెయిడ్ పల్ప్ డ్రింక్ బాటిల్స్‌కు 4, 5 రోజుల్లో కాలవ చెల్లనున్నట్లు గుర్తించామన్నారు. వెజిటబుల్ కట్లెట్ పూర్తిగా పాడైపోయి పురుగులు పట్టిందని తెలిపారు. బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాల్లో సంచరిస్తున్నాయని చెప్పారు. లేస్, పాప్‌కార్న్ అన్ఆథరైజ్డ్ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వైట్ కవర్స్‌లో ఉంచిన కంపెనీ పేరులేని ఆహార పదార్థాలు గుర్తించామన్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. క్యాంటీన్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. క్యాంటీన్లో లభించిన బ్యాచ్‌కు చెందిన కూల్ డ్రింక్స్ ఎక్కడెక్కడ నిల్వలున్నాయో.. వాటన్నింటిని స్వాధీనం చేసుకోవాలని కోకాకోలా కంపెనీకి నోటీసులు జారీ చేస్తామన్నారు. క్యాంటీన్‌కు సరుకు సరఫరా చేసే వారికి లైసెన్స్ లేదని తనిఖీల్లో వెల్లడైందన్నారు. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేకుండా సరుకు సరఫరా చేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సీజ్
జగ్గయ్యపేట అర్బన్ : ఇంటి పన్ను చెల్లించకపోవటంతో స్థానిక బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ కార్యాలయాన్ని బుధవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు పన్ను వసూళ్లకు వచ్చిన పురపాలక సంఘ రెవెన్యూ అధి కారులు.. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపివేసి ప్రధాన ద్వారానికి తాళాలు వేసి సీల్ వేశారు. పన్ను చెల్లింపునకు ఈనెల 31 వ తేదీ డెడ్‌లైన్ కావటంతో మున్సిపల్ కమిషనర్ పి.రమేష్ ఆదేశాల మేరకు పన్ను బకాయిల వసూలు లక్ష్యంతో రెవెన్యూ విభాగం సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా బీఎస్ఎన్ఎల్ గత 18 ఏళ్లుగా రూ.5.13 లక్షల ఇంటి పన్నును చెల్లించకపోవటంతో అనేకసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఖాతరు చేయలేదు. దీంతో బుధవారం కార్యాలయానికి వచ్చి మరొకసారి పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. అయినా స్పందించకపోవడంతో రెవెన్యూ ఆఫీసర్ ఆర్. వసంతరావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కేజే శంకర్, టీమ్ లీడర్ చావా ప్రేమ్‌చంద్, సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, బిల్ కలెక్టర్లు నాగరాజు, ఇతర సిబ్బంది కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్లు నోటీస్ జారీ చేసి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి సీల్ వేశారు. కాగా ఒక దశలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, సిబ్బందికి.. మున్సిపల్ అధికారులు, సిబ్బందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా రెవెన్యూ అధికారులు ససేమిరా అనటంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఈ విషయాన్ని వారి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే, మున్సిపల్ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. -
శ్రీధర్ హెల్త్‌కేర్ ఆసుపత్రి సీజ్
అనంతపురం న్యూసిటీ: నగరంలో వర్ష ఆసుపత్రి ఉదంతం మరువక ముందే మరో ఆస్పత్రి అడ్డగోలు బాగోతం గురువారం వైద్య ఆరోగ్యశాఖాధికారి తనిఖీలో వెలుగుచూసింది. స్థానిక హౌసింగ్‌బోర్డు రాంనరేష్ ఫంక్షన్ హాల్లో శ్రీధర్ హెల్త్‌కేర్ హాస్పిటల్లో ఓ వ్యక్తి శంకర్‌దాదా ఎంబీబీఎస్ అవతారమెత్తాడు. ఎంబీబీఎస్ పట్టా పొందకపోయినా వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. విషయాన్ని ఓ అజ్ఞాతవ్యక్తి డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్‌కి సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని అందించారు. దీంతో డీఎంహెచ్ఓ తన బృందంతో కలసి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆస్పత్రికి రిజిస్ట్రేషన్‌పై ఆరా తీయగా అలాంటి పేరుతో ఆరోగ్యశాఖలో ఎలాంటి పేరు నమోదు కాలేదనే విషయం వెల్లడయింది. వైద్యుడు కాకుండానే ఎలా చికిత్స చేస్తున్నారని శ్రీధర్‌బాబును డీఎంహెచ్ఓ నిలదీయగా మౌనమే సమాధానమైంది. ఏం చదువుకున్నావని ఆరా తీయగా.. ఎం.ఫార్మసీ చేసినట్లు తెలిపాడు. ఇంతలోనే నిర్వాహకుని అత్త జోక్యం చేసుకుని తాను విశ్రాంత వైద్యురాలినని చెప్పారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆస్పత్రిని సీజ్ చేశారు. డీఎంహెచ్ఓ వెంట డీఐఓ డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ గంగాధర్ రెడ్డి, డెమో ఉపమాతి తదితరులు ఉన్నారు. -
వర్ష ఆస్పత్రి సీజ్
అనంతపురం న్యూసిటీ: నిబంధనలకు విరుద్ధంగా రక్తమా ర్పిడికి పాల్పడడంతో పాటు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్న వర్ష ఆస్పత్రిని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సోమవారం సీజ్ చేశారు. నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి (బ్లడ్ ట్రాన్స్మిషన్) చేస్తున్నట్లు సమాచారంతో డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు ఆదివారం తనిఖీ చేసిన విషయం విదితమే. ఆస్పత్రిలో రక్తమార్పిడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ నిర్వహణ, శానిటేషన్ వైఫల్యం, ధరల పట్టిక పొందుపర్చకపోవడం, కేస్‌షీట్‌లో వైద్యుల సంతకాలు లేకపోవడం, రిజిస్ట్రేషన్‌లో పలు లోపాలు అధికారుల తనిఖీలో వెలుగుచూశాయి. ఈ కారణాల రీత్యా ఆస్పత్రిని మూసివేశారు. నగర చరిత్రలో ఆస్పత్రిని సీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. బ్లడ్ బ్యాగ్స్‌లు ఎక్కడి నుంచి వచ్చాయోనని డ్రగ్ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. సదరు ఆస్పత్రి నిర్వాహకులపై డ్రగ్ అధికారులు కోర్టులో కేసు నమోదు చేసినట్లు తెల్సింది. వేకువజాము వరకు విచారణ వర్ష ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సుప్రజ చౌదరి, ఆమె భర్త డాక్టర్ హర్షవర్ధన్ (అపెక్స్ రేడియాలజిస్టు)లను ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం వేకువజాము వరకు డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు విచారణ చేశారు. ఆస్పత్రిలో చిల్లవారిపల్లికు చెందిన రాములమ్మ, బుక్కపట్నం చెన్నరాయుడుపల్లికి చెందిన అనితలకు ఎందుకు రక్తమార్పిడి చేశారని, ప్రభుత్వ మార్గదర్శకాలు మీకు తెలియవా అని ప్రశ్నించారు. డ్రగ్ యాక్ట్ ఉల్లంఘిస్తే ఆస్పత్రి సీజ్ చేయడమే కాక కెరియర్‌పై ప్రభావం చూపుతుందన్నారు. బ్లడ్ బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిందేనని అధికారులు గట్టిగా నిలదీశారు. ఓ ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా బ్యాగులు తీసుకున్నట్లు వారు అంగీకరించారు. సర్వజనాస్పత్రికి రోగుల తరలింపు.. వర్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులను డీఎంహెచ్ఓ 108 అంబులెన్స్‌లో సర్వజనాస్పత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ వెంట డెమో ఉమాపతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూపర్వైజర్ రమణ, సిబ్బంది గంగాధర్ తదితరులున్నారు. -
ఐదులక్షల మందితో పార్లమెంటు ముట్టడిస్తాం
తిరువొత్తియూరు: రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయని పక్షంలో నవంబర్ 20న ఐదు లక్షల మంది రైతులతో కలిసి పార్లమెంటు ముట్టడి చేయనున్నట్టు రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను తెలిపారు. నదులను అనుసంధానించాలని, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల సంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన అయ్యాకన్ను పత్రికల వారితో మాట్లాడుతూ 41 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నామని రెండవ ఘట్టంగా రోజూ ఒక్కో విధానంలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామని ఈ ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెవిన పడలేదని ఈ చర్య వలన దేశానికి వెన్నముకగా పిలవబడే రైతులు మోసపోయినట్టు తెలిపారు. ఈ కారణంగా తమిళనాడు రైతులు, ఉత్తర రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిపి ఐదు లక్షల మందితో నవంబర్ 20వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభం రోజున ముట్టడి చేయనున్నట్టు తెలిపారు. -
భయపెట్టే సైలెన్సర్లు సీజ్
కృష్ణరాజపురం : రోడ్లపై వికృత శబ్ధాలను చేస్తూ శబ్దకాలుష్యంతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన మోడిఫైడ్ సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ సీజ్ చేశారు. కే.ఆర్.పురం వ్యాప్తంగా ఇటువంటి సైలెన్సర్లు కలిగిన సుమారు 60 బైకులను సీజ్ చేసి ఆ సైలెన్సర్లను తొలగించారు. కొంతమంది యువత ఎక్కువ శబ్ధం వచ్చే సైలెన్సర్లను అమర్చి హల్చల్ చేయడం సిటీలో బాగా పెరిగింది. -
పట్టుకుంటారు.. పక్కన పడేస్తారు
♦ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల పరిస్థితి ♦ తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుతున్న వాహనాలు ♦ మాయమవుతున్న విడి భాగాలు ♦ 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాల్లో ఇదే తంతు కాశినాయన : పలు కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలు పోలీస్‌స్టేషన్, ఎక్సైజ్, అటవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. దొంగతనాలకు గురైనవి, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్నవి, అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడినవి, సరైన పత్రాలు లేకుండా సీజ్ చేసిన వాహనాలు ఆయా శాఖల కార్యాలయాల్లో శిథిలావస్థకు చేరుతున్నాయి. అలాగే లారీలు, ఆటోలు, సుమోలు, స్కార్పియోలు, మోటారు సైకిళ్లు తదితర వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడిసి ఎందుకూ పనికిరాకుండా పడి ఉన్నాయి. వాహనాలు పోగొట్టుకున్నవారు కొంత కాలానికి తమ వాహనాలు దొరికాయనే సంతోషం ఎంతో కాలం ఉండడం లేదు. కారణం వాటిని తిరిగి పొందాలంటే చేంతాడంత వ్యవహారం ఉండడమే. ఈలోగా ఆయా వాహనాలకు సరైన రక్షణ లేక అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. 1,500 వాహనాలు పనికిరావు జిల్లాలో 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలున్నా యి. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలతో పాటు ఎక్సైజ్, పోలీసుస్టేషన్ల పరి«ధిలో వివిధ కేసుల్లో పట్టుబడినవి దాదాపు 1,500 వాహనాలు న్నాయి. బద్వేలు తాలూకాలో బద్వేలు, పో రుమామిళ్ల అటవీ కార్యాలయాల్లో పట్టుబ డిన వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అవి తుప్పుపట్టి పోతున్నాయి. అయినా కూడా అధికారులు వాటిని పట్టించుకో వడం లేదు. ఎక్కువగా ఎర్రచందనం తరలి స్తూ పట్టుబడిన లారీలు, కార్లు, సుమోలు, ఆ టోలు వందల సంఖ్యలో అటవీశాఖ కార్యాలయంలో మగ్గుతున్నాయి. వీటిని అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మాయమవుతున్న వాహనాల విడిభాగాలు ఎర్రచందనాన్ని తరలించేందుకు కండీషన్లో ఉన్న వాహనాలనే ఉపయోగిస్తారు. అవి పట్టుబడితే అటవీశాఖ కార్యాలయానికి చేరతాయి. పట్టుబడిన వాహనాలను కొందరు అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. కొందరు సిబ్బంది పట్టుబడిన వాహనాల విడిభాగాలను తొలగించి విక్రయిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి. అంతేకాక గతంలో పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలు కూడా మాయమైపోయాయి. వాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇంజిన్లు వేరుచేసి అ మ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఉన్నతాధికారులు ఈ విషయమై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. పట్టుకున్న వాహనాలను వేలంలో విక్రయిస్తే అటు పోగొట్టుకున్న యజమానులు గానీ, టెండర్లు వేసే వారు గానీ ఎక్కువ రేట్లకు వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలను వేలం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కదం తొక్కిన విద్యార్థులు
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి తోపులాటలో గాయపడిన విద్యార్థులు, పోలీసులు పలువురి అరెస్ట్, కేసుల నమోదు అనంతపురం అర్బన్: పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. డిమాండ్ల సాధనలో భాగంగా తొలుత సప్తగిరి సర్కిల్ నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. గేట్ బయటే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గేట్ బయటే రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూర్యచంద్ర, నరేష్, రాష్ట్ర కార్యదర్శి సుశీలమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలను సమాంతరంగా కొనసాగించాలన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచాలన్నారు. జీఓ 29ని రద్దు చేసి పాఠశాలలు, వసతి గృహాల మూసివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేఎస్ఆర్ కళాశాలకు అనుబంధంగా వసతి గృహం ఏర్పాటు చేయాలన్నారు. కేజీబీవీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ కలెక్టరేట్లో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల చర్యని రోప్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. వెనువెంటనే పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో విద్యార్థులకు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దొరికిన వారిని దొరికినట్లే పోలీసులు లాగిపడేశారు. తోపులాటలో పలువురు విద్యార్థులతో పాటు పోలీసులూ గాయపడ్డారు. విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 341 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ముట్టడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి సంఘం నాయకులను సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పరామర్శించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, వాటి సాధన కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై పోలీసుల ద్వారా అణచివేతకు సిద్ధపడడాన్ని ఆయన ఖండించారు. -
200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని రాయినిపాలెం గ్రామంలో భారీగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మిర్యాలగూడరూరల్ పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పట్టుకున్నారు. ఎస్ఐ కుంట శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మూతబడిన పీఏసీఎస్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని లారీలోకి డంపు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి బియ్యం పట్టుకున్నారు. బియ్యం భారీగా ఉండడంతో మిర్యాలగూడ డీఎస్పీ రాంగోపాల్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ వెంటనే అక్కడకు చేరుకుని నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం బియ్యం ఎవరు నిల్వ చేశారన్న విషయంపై విచారించారు. బియ్యం నిల్వ చేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన రమణ, సహకరించిన రాయినిపాలెం గ్రామానికి చెందిన జయమ్మ, బియాన్ని తరలించేందుకు వచ్చిన లారీ యజమాని శ్రీనివాస్, డ్రైవర్ సకృపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. -
వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి
డీఎంఅండ్‌హెచ్‌వో ఘెరావ్ అంతర్గత బదిలీలు, సస్పెన్షన్‌కు గురైన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగుల డిమాండ్ సంఘీభావం ప్రకటించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : వైద్య ఆరోగ్య శాఖలో అంతర్గత బదిలీలు, సస్పెన్షన్‌కు గురైన సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్లతో వైద్య ఆరోగ్య ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఏజెన్సీ, జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయం వద్దకు చేరుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్యను ఘెరావ్ చేశారు. కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏజెన్సీలో అరకొర సౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తూంటే, అనారోగ్యం, రక్తహీనతతో సంభవించిన మరణాలకు సిబ్బందిని బాధ్యులు చేస్తూ సస్షెండ్ చేయడంపై జేఏసీ నాయకులు గొంతి ఆస్కారరావు, ఎస్.విజయకుమార్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్ఎం, ఎంపీహెచ్, ఎంపీహెచ్‌ఈవో, పీహెచ్ఎన్, పారా మెడికల్ సిబ్బందిని బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు, అంతర్గత సమస్యల పరిష్కారం కోసం అనేక విపతి పత్రాలు అందించినా స్పందించకపోవడంతో మార్చి 23న సమ్మె నోటీసు ఉన్నతాధికారులకు ఇచ్చామన్నారు. అప్పటి నుంచి చర్చలు జరపకపోవడంతో ప్రజాస్వామ్య రీతిలో హక్కుల సాధనకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. అత్యవసరసేవల విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న సమస్యలను కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి తీసుకెళ్లడంలో డీఎంహెచ్‌వో, గిరిజన డీఎంహెచ్వోలు వైఫల్యం చెందారని ఆరోపించారు. కింది స్థాయి íసిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ రోగులు, గర్భిణుల తరలింపునకు పీహెచ్సీకొక అంబులెన్స్, వైద్యాధికారి పర్యటనకు వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. రిస్క్ అలవెన్సు మంజూరు చేయాలన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా మూడేళ్లు దాటిన ఉద్యోగులను ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రిలీవర్తో ముడిపెట్టకుండా చూడాలని కోరారు. తమ సమస్యలపై అధికారులు స్పందించేవరకుఆందోళన విరమించేది లేదని స్పష్టం చేయడంతో డీఎంహెచ్‌వో ఆందోళనకారులతో చర్చించారు. చర్చలు విఫలం కావడంతో తిరిగి ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు ఉమామహేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణ, డీఎల్ గంగాధర్, బియన్ మూర్తి, సీహెచ్ శ్రీనివాసరాజు, డీబీవీ ప్రసాద్, భాస్కరరావులతో పాటూ సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర సేవలు నిర్వీర్యం అత్యవసర సేవలైన వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాళ్లవాపు, రక్తహీనత సమస్యతో గిరిజనులు చనిపోతుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించే వరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. అత్యవసర విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఒక్కో రంగాన్ని ప్రైవేటీకరిస్తోందన్నారు. అధికారంలో కొస్తే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఉద్యోగులను తొలగించేందుకు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడడ, అక్రమ సస్పెన్షన్ల పేరుతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం తమ వంతు చేయూతనిస్తామని ఆయన సంఘీభావం ప్రకటించారు. పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ప్రూటీకుమార్, బీసీ నేతలు గుబ్బల వెంకటేశ్వరరావు, బి.ప్రసన్నకుమార్, అల్లి రాజబాబు, బి.గోవిందు, ముత్తు సతీష్, గోపిశెట్టి సత్యనారాయణ, ఎస్సీ నాయకులు జంగా గగారిన్ పాల్గొన్నారు. కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్ బంగ్లాలో చర్చలు జరిపారు. సస్షెండ్కు గురైన సిబ్బందిపై ఉన్న ఉత్తర్వులను రద్దు చేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డీఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత పీహెచ్సీ పరిధిలో చేపట్టిన అంతర్గత బదిలీలపై పునసమీక్ష చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ,ఉద్యోగ సంఘాలు ఒక కమిటీ వేసుకుని బదిలీ అవసరంపై చర్చించుకోవాలన్నారు. మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించినట్టు జేఏసీ నేలలు ఆస్కారరావు, విజయ్‌కుమార్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కలెక్టర్‌కు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
పోలీసు జులుంపై జనాగ్రహం
= స్టేషన్ ను ముట్టడించిన ఎస్సీ కాలనీవాసులు = ఎస్ఐ చొరవతో ఆందోళన విరమణ చిలమత్తూరు: పోలీసుల జులుంపై ఆగ్రహించిన ప్రజలు స్టేష¯Œన్ ను ముట్టడించిన సంఘటన సోమవారం ఉదయం మండల కేంద్రమైన చిలమత్తూరులో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు... స్థానిక ఎస్సీ కాలనీలో ఆదివారం మదగలమ్మ జాతర సందర్భంగా అంగన్వాడీ సెంటర్ సమీపంలోని రచ్చకట్ట వద్ద ఐదుగురు చెక్కాబారా ఆడుకుంటుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. కొందరు పరిగెత్తగా దొరికిన ముగ్గురిని వారు చితకబాదారు. ఆదినారాయణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆ దెబ్బలు చూసి ఆయన భార్యకు, కాలనీవాసులకు పోలీసులపై కోపం కట్టలు తెంచుకుంది. అందరూ కలిసి సోమవారం ఉదయం పోలీసుస్టేçÙ¯ŒS వద్దకొచ్చి బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఇష్టమొచ్చినట్లు కొట్టడమే కాకుండా తమవారి దగ్గరున్న డబ్బులు కూడా లాగేసుకున్నారని ఆ ఇద్దరి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేసేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జమాల్‌బాషా కరువు బృందం బందోబస్తులో ఉన్నప్పటికీ హుటాహుటిన స్టేష¯ŒS వద్దకొచ్చారు. కాలనీ పెద్ద మనషులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అందుకయ్యే ఖర్చులు తానే పెట్టుకుంటానని చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన కానిస్టేబుâýæ్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
చంద్రలోక్ కాంప్లెక్స్ భవనం సీజ్
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తాలోని చంద్రలోక్ కాంప్లెక్స్‌ను అధికారులు సీజఃŠ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధరెడ్డిలు మంగళవారం భవనాన్ని సందర్శించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం భవనం రెయిలింగ్ కూలడంతో వెస్ట్‌మారేడుపల్లికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి దుర్మరణం పాలైన సంగతి విధితమే. మృతుడి కుటుంబానికి రూ.2.5లక్షల నష్టపరిహారం: మేయర్ భవనం రెయిలింగ్ కూలిన ఘటనలో మృతి చెందిన దుర్గయ్య కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఆపద్భందు పథకం కింద మరో రూ.50 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్మిక శాఖ నుంచి ఏదైనా ఆర్థిక సహాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రలోక్ కాంప్లెక్స్‌ను సీజ్ చేసి జేఎన్టీయూ నివేదిక కోరనున్నట్లు తెలిపారు. పురాతన భవనాల యజమానులు, అసోసియేషన్లు ఇంజనీర్లను ఏర్పాటు చేసుకుని వాటిని పటిష్టం చేయించుకోవాలని కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సూచించారు. భవనంపై ఉన్న సెల్‌టవర్లు, హోర్డింగ్‌లపై విచారణ చేపడతామన్నారు. మేయర్ వెళ్లిన 5 నిమిషాలకే.. మేయర్ మీడియాతో మాట్లాడి వెళ్లిన 5 నిమిషాలకే రెయిలింగ్‌లోని మరికొంత ఊడి పడింది. అంతకు ముందు మేయర్ నిలుచున్న చోటుకు 5 అడుగుల దూరంలోనే శిథిలాలు పడటం గమనార్హం. మళ్లీ కూలే ప్రమాదం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఎస్డీరోడ్ గుండా మళ్లించారు. -
బైబిల్ యూనివర్శిటీ సీజ్
డెంకాడ: మండలంలోని మోదవలస పంచాయతీలో గల బైబిల్ యూనివర్శిటీని శుక్రవారం సాయంత్రం అధికారులు సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఉత్తర్వుల మేరకు ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స, రెవెన్యూ, పోలీస్ అధికారుల సహాయంతో సీజ్ చేసినట్టు ఎస్ఐ ధనుంజయరావు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా బైబిల్ యూనివర్శిటీ నిర్వహిస్తున్నారన్నారు. క్రై స్తవ బోధనల కోసం వివిధ ప్రాంతాలనుంచి బాల, బాలికలు ఇక్కడ చేరి విద్యనభ్యసిస్తున్నారు. వారిపై యూనివర్శిటీ డెరైక్టర్ లాజరస్ ప్రసన్నబాబు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చారుు. అవన్నీ రుజువు కావడంతో ఆయనపై కేసు నమోదు చేసి ప్రసన్న బాబును అరెస్టు చేశారు. అరుుతే యూనివర్శిటీ మాత్రం యథాతధంగా కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం సీజ్‌చేశారు.