‘నిట్’లో స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ కోర్సు
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఈ ఏడాది నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ నూతన కోర్సు అందుబాటులోకి రానుందని నిట్ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఈ మేరకు నిట్ వరంగల్, ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా సంస్థ గురువారం పరస్పర ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా నిట్ వరంగల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి రమణారావు ఆన్లైన్లో ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వేణు ఎంఓయూపై సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా సౌజన్యంతో నిట్ వరంగల్ ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్‌పై ఎం టెక్, ïపీహెచ్డీ స్కాలర్లకు నూతన కోర్సును అందించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన, 24 గంటలు అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల పరిశోధనలకు అనుగుణంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘వన్ నేషన్, వన్‌గ్రిడ్, వన్ ఫ్రీక్వెన్సీ’అనే నినా దంతో భారతదేశ ఎలక్ట్రిక్ గ్రిడ్ ముందడుగు వేస్తుందని, స్కిల్ ఇండియా మిషన్ అనుసంధానంతో నిట్ వరంగల్‌లో స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ కోర్సుకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు.