ఏడాదిగా కుల బహిష్కరణ
పర్వతగిరి: నేటి ఆధునిక సమాజంలోనూ ఇంకా కుల బహిష్కరణ వంటి సాంఘిక దురాచారాలు కొనసాగుతున్నారుు. తమ కుటుంబాన్ని ఏడాదిగా కులం నుంచి బహిష్కరించారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన చీదురు బిక్షపతి వాపోయాడు. ఆయన విలేకరులతో మాట్లాడాడు.
బిక్షపతి వీఆర్ఏ(గ్రామసేవకుడు). 2015లో బిక్షపతిని వీఆర్ఏగా పర్మనెంట్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టు విషయమై గ్రామంలో పలుమార్లు పంచారుుతీ నిర్వహించి తన వద్ద కొంత డబ్బు కూడా వసూలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో తమ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారని బిక్షపతి వాపోయూడు.