ఏడాదిగా కుల బహిష్కరణ | Caste relegation from one year | Sakshi
Sakshi News home page

ఏడాదిగా కుల బహిష్కరణ

Published Mon, Jun 20 2016 9:08 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

Caste relegation from one year

పర్వతగిరి: నేటి ఆధునిక సమాజంలోనూ ఇంకా కుల బహిష్కరణ వంటి సాంఘిక దురాచారాలు కొనసాగుతున్నారుు. తమ కుటుంబాన్ని ఏడాదిగా కులం నుంచి బహిష్కరించారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన చీదురు బిక్షపతి వాపోయాడు.  ఆయన విలేకరులతో మాట్లాడాడు.

బిక్షపతి వీఆర్‌ఏ(గ్రామసేవకుడు). 2015లో బిక్షపతిని వీఆర్‌ఏగా పర్మనెంట్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టు విషయమై గ్రామంలో పలుమార్లు పంచారుుతీ నిర్వహించి తన వద్ద కొంత డబ్బు కూడా వసూలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో తమ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారని బిక్షపతి వాపోయూడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement