Suspension of caste
-
దళిత మహిళ కుల బహిష్కరణ
⇒ మాట్లాడితే 5 వేలు జరిమానా ⇒ ఇది ‘పెదరాయుళ్ల’ తీర్పు మధిర: ఇరవై ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ.. కూలీ చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న దళిత మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ కుల బహిష్కరణ చేశారు. ఆమెతో ఎవరు మాట్లాడినా రూ.5 వేల జరిమానా కట్టాలంటూ తీర్పు చెప్పారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మధిర పంచాయతీ పరిధిలోని ఇల్లెందులపాడులో జరిగింది. గ్రామానికి చెందిన నండ్రు సాయి, మరియమ్మ దంపతులు. వారికిద్దరు కుమార్తెలు, కొడుకు. సాయి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో మరియమ్మ 20 ఏళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. తనకున్న రెండున్నర సెంట్ల ఇంటి స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తోంది. కాగా, సుమారు మూడేళ్ల క్రితం నండ్రు సాయి కుల సంఘంలో ఉన్న రూ. 50 వేలను వడ్డీకి తీసుకున్నాడు. సాయి తీసుకున్న డబ్బులకు స్థానికుడు తాళ్లూరి నరేశ్ (యేసు) హామీగా ఉన్నాడు. సాయి ఆ డబ్బులు చెల్లించకపోవడంతో కుల సంఘానికి నరేశ్ చెల్లించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుల పంచాయతీ పెట్టారు. సాయి తీసుకున్న డబ్బులను భార్య మరియమ్మ చెల్లించాలని, లేదంటే ఆమె నివసిస్తున్న ఇంటిని బాకీ కింద నరేశ్‌కు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీనికి ఒప్పుకోకపోతే వేర్వేరుగా నివసిస్తున్న సాయి, మరియమ్మలను కులం నుంచి బహిష్కరించాలని తీర్మానించా రు. ఆమెతో ఎవరూ మాట్లాడవద్దని, పాలు విక్రయించినా జరిమానాగా రూ. 5 వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లకూ ఇదే తీర్పు వర్తిస్తుందన్నారు. దీంతో మరియమ్మ కులపెద్దలపై టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
కుల బహిష్కరణ పేరిట ఘోరం..
వరంగల్ జిల్లాలో ఘోర సంఘటన వెలుగుచూసింది. కులబహిష్కరణ పేరిట ఓ కుటుంబాన్ని ఘోరంగా అవమానించిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా.. ఇంట్లో మృతదేహం ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా.. కుల బహిష్కరణ జరిగిన కుటుంబానికి తామెవ్వరం రామని తీర్మానించిన కులపెద్దలు మనవత్వాన్ని మరిచి ప్రవర్తించడం విస్మయానికి గురి చేసింది. వరంగల్ జిల్లా మద్దూరు మండలం కూటిగల్ గ్రామానికి చెందిన సౌందర్య(19) ప్రేమించిన వాడు కాదన్నాడని మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ మృతిచెందిన ఆమెకు అంత్య క్రియలు నిర్వహించడానికి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కులపెద్దల నుంచి అనూహ్య పరిణామం ఎదురైంది. ఇప్పటికే ఓ కూతురు కులాంతర వివాహం చేసుకున్న ఇంట్లో జరిగే కార్యానికి ఎవరు హాజరుకాకుడదని కులపెద్దలు నిర్ణయించారు. దహన సంస్కారాల సమయంలో డప్పులు కొట్టేవారు, కుమ్మరివారు, చాకలివారు పాల్గొనకూడదని కులపెద్దలు ఆదేశించారు. దీంతో సౌందర్య కుటుంబ సభ్యులు కులపెద్దలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాగా.. సౌందర్య సోదరి వడ్ల లావణ్య(21) ఆరు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన విక్రమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో.. ఆమెను కులం నుంచి బహిష్కిరస్తున్నట్లు కులపెద్దలు తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో చెళ్లెలు మృతిచెందిందని తెలిసి విలపిస్తూ వచ్చిన లావణ్యను కులపెద్దలు సూటిపోటి మాటలతో బాదించడంతో పాటు నీ వల్లే మీ చెల్లెలు శవాన్ని ఎత్తడానికి కూడా ఎవరు రాలేదని నిందించడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
ఏడాదిగా కుల బహిష్కరణ
పర్వతగిరి: నేటి ఆధునిక సమాజంలోనూ ఇంకా కుల బహిష్కరణ వంటి సాంఘిక దురాచారాలు కొనసాగుతున్నారుు. తమ కుటుంబాన్ని ఏడాదిగా కులం నుంచి బహిష్కరించారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన చీదురు బిక్షపతి వాపోయాడు. ఆయన విలేకరులతో మాట్లాడాడు. బిక్షపతి వీఆర్ఏ(గ్రామసేవకుడు). 2015లో బిక్షపతిని వీఆర్ఏగా పర్మనెంట్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టు విషయమై గ్రామంలో పలుమార్లు పంచారుుతీ నిర్వహించి తన వద్ద కొంత డబ్బు కూడా వసూలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో తమ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారని బిక్షపతి వాపోయూడు. -
సర్పంచ్ కుటుంబం వెలి!
ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన మంచిర్యాల రూరల్: నేటి ఆధునిక సమాజంలోనూ కులబహిష్కరణ సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఓ చిన్న ఘటన ఏకంగా సర్పంచ్ కుటుంబాన్నే కుల బహిష్కరణ చేసే దాకా వెళ్లింది. ఆదిలాబా ద్ జిల్లా మంచిర్యాల మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్గం లక్ష్మికి జరిగిన ఈ చేదు ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదీ జరిగింది.. రెండేళ్ల క్రితం సర్పంచ్ లక్ష్మికి తోటి కోడలు భాగ్యలక్ష్మితో గొడవ జరిగింది. భాగ్యలక్ష్మి ఇంటి వద్ద ఉన్న అంబేడ్కర్ జెండా గద్దె నిర్మాణమే గొడవకు దారి తీసింది. దీంతో కుల సంఘం భాగ్యలక్ష్మికి రూ.వెయ్యి జరి మానా విధించింది. అరుుతే మరోసారి ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏర్పడిన ఈ వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కుల పెద్దల మాట ధిక్కరించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినందుకుగాను.. సర్పంచ్ దుర్గం లక్ష్మి రూ.2,500 జరిమానా కట్టాలని తీర్మానం చేశారు. జరిమానా కట్టనని సర్పంచ్ తెలపడంతో ఆమెను కుల బహిష్కరణ చేస్తూ తీర్మానం చేశారు. ఇది జరిగిన తర్వాత రోజు గ్రామంలోని తమ కులానికి చెం దిన ఓ కుటుంబం సర్పంచ్‌ను వివాహానికి ఆహ్వానించింది. విషయం తెలుసుకున్న కుల సంఘం నేతలు పెళ్లివారితో మాట్లాడారు. పెళ్లికి రావొద్దని సర్పంచ్‌కు సమాచారం ఇప్పించారు. ఒకవేళ వస్తే కుల బహిష్కరణతోపాటు రూ.5 వేల జరి మానా తప్పదని సర్పంచ్ కుటుంబాన్ని కుల పెద్దలు హెచ్చరించారు. దీనిపై సర్పంచ్ లక్ష్మి-శ్రీనివాస్ దంపతులు ఏఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. రాజకీయ కుట్రలతోనే బహిష్కరణ రాజకీయ కక్షతోనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ కుల బహిష్కరణకు కుట్ర చేశారు. అభివృద్ధిలో ముందుకు వెళ్లడంతోపాటు రాజకీయంగా నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. నేను అధికార పార్టీ సర్పంచ్‌ను కాకపోవడం కూడా దీనికి కారణం. నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారు. నాకు ప్రజాప్రతినిధుల, కుల సంఘం అండదండలు అందలేదు. - దుర్గం లక్ష్మి, సర్పంచ్, పెద్దంపేట