వైకుంఠ మోక్షం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం వైకుంఠద్వార దర్శనం కోసం జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసి పోయాయి. కోటి యజ్ఞాల పుణ్యఫలం ఇచ్చే ఉత్తరద్వార దర్శానానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో ప్రత్యేక పూజాకార్యక్రమాలతో భక్తిభావం వెల్లివిరిసింది.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం కోసం జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. కోటి యజ్ఞాల పుణ్యఫలం ఇచ్చే ఉత్తరద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి.
ఉత్తరద్వారంలో శ్రీలక్ష్మీ సమేత అనంతపద్మనాభస్వామి, శ్రీసీతా సమేత శ్రీరామచంద్రస్వామివారలు భక్తులకు దర్శనమిచ్చారు. నారాయణమూర్తిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్న భక్తులు కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యాన్ని మూటకట్టుకున్నామన్న సంతృప్తి పొందారు. అంబారీసేవపై ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా ప్రదక్షిణ చేయించారు. ధర్మపురిలో పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి, పరిపూర్ణానంద ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు వైకుంఠద్వార దర్శనం మొదలైంది. కొండగట్టు అంజన్న సన్నిధానం భక్తజనసంద్రంగా మారింది. 50 వేల మంది భక్తులు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు.