startaps
-
ఏంజెల్ ట్యాక్స్ నుంచి ఆ స్టార్టప్స్‌కు మినహాయింపు
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిచ్చే దిశగా వాణిజ్య, పరిశ్రమల శాఖ సర్టిఫై చేసిన స్టార్టప్స్‌కు ఏంజెల్ ట్యాక్స్ నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై పారిశ్రామిక, దేశీ వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ), కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు చర్చలు జరుపుతున్నట్లు వివరించాయి. ఏంజెల్ ఫండ్స్‌కి సంబంధించిన పెట్టుబడుల పరిమితిని అధిక స్థాయిలో ఉంచడం ద్వారా పెద్ద సంఖ్యలో స్టార్టప్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుందని పేర్కొన్నాయి. ఆదాయ పన్ను శాఖ నుంచి ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సంబంధించి ట్యాక్స్ నోటీసులు వస్తుండటంతో ఇప్పటికే పలు స్టార్టప్స్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. స్టార్టప్స్‌లో రూ. 10 కోట్ల దాకా ఏంజెల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులకు ప్రభుత్వం గతేడాది పన్ను మినహాయింపులు అనుమతించింది. పూర్తి స్థాయిలో మినహాయింపునివ్వాలంటూ స్టార్టప్ సంస్థలు కోరుతున్నప్పటికీ.. అలాకాకుండా పరిమితిని మాత్రమే రూ. 25–40 కోట్లకు పెంచే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
డీఐపీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
న్యూఢిల్లీ: కొత్త ఎంటర్ప్రెన్యూర్లు స్టార్టప్స్ స్థాపించుకునేందుకు కావలసిన వసతుల కల్పనలో గుజరాత్ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో స్టార్టప్‌ల ఏర్పాటుకున్న సానుకూల పరిస్థితులపై డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ) పరిశీలన జరిపి ర్యాంకింగ్స్ ఇచ్చింది. స్టార్టప్ పాలసీ, ఇంక్యుబేషన్ హబ్స్, ఇన్నోవేషన్స్, నియంత్రణా సవాళ్లు, ప్రొక్యూర్మెంట్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాలకు సంబంధించి 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం అత్యున్నతం, ఉన్నతం, అగ్రగామి, కాబోయే అగ్రగామి, వర్ధమాన రాష్ట్రం, ఆరంభకులు పేరిట రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ బెస్ట్ పెర్ఫామర్‌గా నిలిచింది. కర్ణాటక, కేరళ, ఒడిశా, రాజస్తాన్ టాప్ పెర్ఫామర్స్‌గా, ఏపీ, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లీడర్లుగా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు యాస్పైరింగ్ లీడర్లుగా, అసోమ్, ఢిల్లీ, గోవాతో పాటు 8 రాష్ట్రాలు ఎమర్జింగ్ స్టేట్స్‌గా, చండీగఢ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు బిగినర్స్‌గా నిలిచాయి. ఈ తరహా ర్యాంకింగ్‌లు రాష్ట్రాల్లో స్టార్టప్స్‌కు కావాల్సిన సానుకూల వాతావరణం ఏర్పడేందుకు తోడ్పడతాయని డీఐపీపీ సెక్రటరీ రమేశ్ అభిషేక్ చెప్పారు. ఏ రాష్ట్రాన్ని తక్కువ చేయడానికి ఈ ప్రక్రియ చేపట్టలేదని, కేవలం ప్రోత్సహించడానికే ర్యాంకింగ్లిచ్చామని వివరించారు. విధానపరమైన మద్దతు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, సీడ్ ఫండింగ్, ఏంజిల్, వెంచర్ ఫండింగ్, సరళమైన నియంత్రణలతో పాటు వివిధ అంశాలను పరిశీలించి ర్యాంకులను రూపొందించామన్నారు. ఆన్లైన్ సమాచార కల్పన, నియంత్రణలను సరళీకరించడం, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌కు ప్రాధాన్య మివ్వడం తదితర అంశాలపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. -
స్టార్టప్స్ కోసం రూ.300 కోట్లతో ‘యువర్నెస్ట్’ ఫండ్
న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘యువర్నెస్ట్’ తాజాగా స్టార్టప్స్ కోసం రూ .300 కోట్ల మూలధనంతో ‘యువర్నెస్ట్ ఇండియా ఫండ్-2’ను ఏర్పాటు చేసింది. సంస్థ ఈ ఫండ్ ద్వారా వచ్చే 3-4 ఏళ్లలో ప్రధానంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ రోబొటిక్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, మొబైల్ ఇంటర్నెట్ వంటి విభాగాలకు చెందిన 25-30 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టనుంది. -
ఇంధన రంగానికి పునరుత్తేజం..!
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో నూతన ఆవిష్కరణలు అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పేర్కొన్నారు. ఇందుకు కొత్త యంత్రాంగం సృష్టి అవసరమని అన్నారు. ఈ దిశలో ప్రస్తుత నియమ నిబంధనల చట్టాల్లో మార్పు అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలుకు వీలుకాని పలు నియమ నిబంధనల వల్ల భారత ఇంధన రంగం ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. నూతన టెక్నాలజీ అమల్లో సైతం పలు సమస్యలు ఉన్నాయని వివరించారు. ‘భవిష్యత్ పటిష్ట ఇంధన రంగానికి నూతన ఆవిష్కణలు’ అన్న అంశంపై ఇక్కడ జరిగిన టాటా ట్రస్టులు-యూసీఎల్ఏ (యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్) గ్లోబల్ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన రెండు రోజుల సమావేశంలో పాల్గొన్న రతన్ టాటా ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. స్టార్టప్స్‌కు ప్రోత్సాహం అవసరమని అన్నారు. ఏకీభవించిన యూసీఎల్ఏ చాన్సలర్... రతన్ టాటా అభిప్రాయాలతో సమావేశంలో పాల్గొన్న యూసీఎల్ఏ చాన్సలర్ జీన్ బ్లాక్ పూర్తిగా ఏకీభవించారు. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించడానికి ఇంధన రంగంలో ఒక సుస్థిర పటిష్ట సాంకేతిక విధానం అవసరమని ఆయన అన్నారు. -
స్టార్టప్స్ కోసం... రిజర్వ్ బ్యాంక్ హెల్ప్‌లైన్
ముంబై: పెట్టుబడులు తదితర సీమాంతర లావాదేవీలు నిర్వహించే స్టార్టప్స్‌కి తోడ్పాటు అందించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. విదేశీ మారక నిర్వహణ నిబంధనలకు సంబంధించి దీన్నుంచి సహాయం పొందగోరు సంస్థలు తత్సంబంధిత పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో సత్వరం సరైన సమాచారం ఇవ్వడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. -
వాల్పోస్ట్.. మనోళ్ల సోషల్ మీడియా!
* సరికొత్త ఫీచర్లు,పూర్తి సెక్యూరిటీతో హల్చల్ * వెబ్‌లో 4 లక్షల మంది యూజర్లు.. జనవరిలో మార్కెట్లోకి యాప్ * వాల్పోస్ట్ సీఈఓ బంగార్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్స్ అడ్డాగా మారిన హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు సైతం సవాల్ విసిరే స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. మీరు చేయలేని.. మీరందించని సేవలను సైతం మీం అందిస్తామంటూ కవ్విస్తున్నాయి కూడా. అలాంటి స్టార్టప్ కంపెనీయే ఈ ‘వాల్పోస్ట్’!! సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫేస్బుక్, ట్వీటర్. కానీ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాల్పోస్ట్.కామ్ గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. నిజానికి ఫేస్బుక్, ట్వీటర్లో సైతం లేని అధునాతనమైన ఫీచర్లు ఉన్నాయిందులో. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో ఇది తక్కువేమీ కాదు. సామాజిక మాధ్యమాలంటే ఫొటో షేరింగ్‌లు, లైకులు, కామెంట్లేనా అనే ప్రశ్నే ఈ వాల్పోస్ట్ ఆరంభానికి మూలం. పదేళ్ల కిందట ఈ ప్రశ్న తలెత్తిన వెంటనే... దానికి సమాధానంగా ఈ ప్రయత్నాన్ని ఆరంభించారు బంగార్ రెడ్డి. దీనికి సంబంధించి ఆయనేమంటారంటే... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ (ఎంసీఎస్ఈ) పూర్తి చేశాక.. ఆరు నెలల పాటు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (సీఈహెచ్) కోర్స్ చేశా. 2003 వరకు కూడా దేశంలో ఫేస్బుక్, ట్వీటర్ వంటివి లేవు. అప్పట్లో మైస్పేస్, ఆర్కుట్లదే రాజ్యం. వాటిలో కూడా చాలా తక్కువ ఫీచర్లుండేవి. టెక్నాలజీ మీద పట్టుండటంతో చాలా వెలితిగా అనిపించేది. ఎవరో సోషల్ సైట్స్‌ను రూపొందిస్తే... మనం దాన్ని వాడటం, వాటికి ఆదాయాన్ని సంపాదించి పెట్టడమేంటని అనిపించేది. అప్పుడే... సొంతగా సోషల్ నెట్‌వర్క్‌ను రూపొందించాలని అనుకున్నా. అలా 2010 నవంబర్‌లో వాల్పోస్ట్.కామ్ వెబ్‌వెర్షన్ ఆరంభించా. అయితే దేశంలో స్మార్ట్పోన్లు, యాప్‌ల వినియోగం చూసి ప్రతి ఒక్కరినీ సులువుగా చేరుకోవాలంటే వాల్పోస్ట్ యాప్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నాం. వచ్చే జనవరిలో వాల్పోస్ట్ యాప్‌నూ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాం కూడా. వాల్‌పోస్ట్‌లోని ప్రతి ఒక్క ఫీచర్లో పబ్లిక్, ప్రైవేట్ అనే రెండు అప్షన్స్ ఉంటాయి. మనకు అవసరమైనదాన్ని ఎంచుకునే వీలూ ఉంటుంది. వాల్‌పోస్ట్‌లోని ముఖ్యమైన ఫీచర్లలో కొన్ని.. వాయిస్: ఇతర సోషల్ నెట్వర్కింగ్స్లో మన భావాలను, స్పందనలను అక్షర రూపంలోనే కామెంట్ చేయాలి. అన్ని సందర్భాల్లోనూ అక్షర రూపంలో కామెంట్ చేయలేం. అందుకే వాల్‌పోస్ట్‌లో మనం ఏం చెప్పదలచుకున్నామో దాన్ని మన సెల్‌ఫోన్ ముందు చెప్పేస్తే చాలు.. ఆటోమెటిక్‌గా ఆ వాయిస్ రికార్డ్ అయి వెంటనే అప్లోడ్ అయిపోతుంది. ఈవెంట్స్: మనకు కావాల్సిన ప్రాంతం తాలూకు జిప్ కోడ్ (పిన్‌కోడ్) ఇస్తే చాలు. ఆరోజు ఆ ప్రాంతంలో జరిగే కార్యక్రమాల వివరాలొచ్చేస్తాయి. తాజా పోస్ట్‌లే కాదు.. గతంలో మనం చేసిన కామెంట్లు, పోస్ట్‌లు, ఫొటోలు తిరిగి పొందాలంటే డాష్‌బోర్డ్ ఆప్షన్‌లోకి వెళితే చాలు. జాబ్స్: యూజర్ తన టెక్నికల్ స్కిల్స్‌ను జాబ్స్ ఆప్షన్లో అప్లోడ్ చేస్తే.. వారికి తగ్గ ఉద్యోగాలు ఏ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయో ఆటోమెటిక్‌గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నియర్ ప్రొఫెషనల్స్: ఒక కిలోమీటర్ పరిధిలో చుట్టూ ఉన్న వాల్పోస్ట్ యూజర్లు ఎవరు? వారి వృత్తి ఏంటి? అనే వివరాలు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే యాక్టివ్‌గా ఉన్న యూజర్ ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయం కూడా లోకేషన్ రూపంలో కనిపిస్తుంది. ఎస్ఓఎస్: అత్యవసర సమయంలో వాల్‌పోస్ట్‌లోని ఎస్ఓఎస్ ఆప్షన్‌ను నొక్కితే చాలు. వాల్పోస్ట్ యూజర్లందరికీ అలర్ట్ వెళ్లిపోతుంది. దీంతో వాళ్లు స్పందించి మనల్ని రక్షించే అవకాశం ఉంది. ఇది మహిళలకు చాలా ఉపయుక్తం. సోషల్ యాడ్స్: ఇతర సైట్స్‌లో ప్రకటన ఇవ్వాలంటే డబ్బు కట్టాలి. కాని వాల్‌పోస్ట్‌లో పూర్తి గా ఉచితం. అలాగే మన ప్రకటనను ఎవరైనా లైక్ చేస్తే అది వారి ఫ్రెండ్స్ లిస్ట్‌లో కూడా కనిపిస్తుంది. అంటే రొటేషన్ పద్ధతిలో అన్నమాట. గేమ్స్, అడ్రస్ బుక్, స్టోరీ రైటింగ్, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఆల్బమ్, ఫొటోట్యాగ్స్, ఆల్బమ్ ఇన్వైట్స్ హిస్టరీ, రీసెంట్ విజిటర్స్, అప్డేట్ ఎడిట్, రిపోర్ట్స్, సెర్చ్ అప్డేట్ వంటి ఎన్నో ఫీచర్లున్నాయిందులో. ప్రభుత్వం సహకారం అందిస్తే... ‘‘దేశవ్యాప్తంగా ప్రస్తుతం వాల్పోస్ట్కు 4 లక్షల మంది యూజర్లున్నారు. ప్రభుత్వం మౌలికంగా, ఆర్థికంగా సహకారం అందిస్తే మరింత మెరుగైన సేవలనందిస్తాం. ఏడాదిలో 3-4 కోట్ల యూజర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 9 మంది టెక్నాలజీ సభ్యులున్నారు. ఇప్పటివరకు మా సంస్థలో సురేందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, శశాంక్ తాటి ముగ్గురు పెట్టుబడిదారులు రూ.2 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
స్టార్టప్‌ల కోసం ‘ఏంజిల్స్’
స్టార్టప్స్‌కు, ఇన్వెస్టర్లకు వారధిగా లీడ్ ఏంజెల్స్ నెట్వర్క్ * రెండేళ్లలో 10 సంస్థలకు 8-9 కోట్ల దాకా నిధులు * సభ్యులుగా ఐదు నగరాల నుంచి 110 మంది ఇన్వెస్టర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లో లిస్టయి... పరుగులు పెడుతున్న కంపెనీకి భారీ ఎత్తున నిధులు సమీకరించడానికి డిబెంచర్లు, క్విప్ ఇష్యూ వంటి అనేక మార్గాలున్నాయి. ఇక లిస్టెడ్ కాకున్నా బాగా పేరున్న కంపెనీకైతే రుణాల రూపంలోనో, ప్రయివేటు ఈక్విటీ ఫండ్ల నుంచో నిధులు సమీకరించటం కష్టం కాదు. మరి అప్పుడే ప్రారంభించి నిధుల్లేక పురిటి నొప్పులు పడుతున్న స్టార్టప్ సంస్థలకో..? మంచి ఐడియాతో ఆరంభించినా, దాన్ని ముందుకు తీసుకెళ్లటానికి నిధుల్లేక సతమతమవుతున్న వాటికో..? నిజమే!! వీటికి నిధులంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే సదరు కంపెనీ వాల్యుయేషన్‌పై ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండదు. ఎంత పెట్టుబడికి ఎంత ఈక్విటీ ఇవ్వాలన్నది స్టార్టప్స్‌కూ అర్థం కాదు. అందుకే ఈ రెండింటికీ అలాంటి సమస్యలు తీర్చి, ఇద్దరినీ ఒక గొడుగు కిందికి తీసుకొస్తోంది లీడ్ ఏంజిల్స్ నెట్వర్క్. రెండేళ్ల కిందట ఏర్పాటయిన ఈ సంస్థ... ఇప్పటికి 10 సంస్థలకు నిధులు అందించింది. 110 మందికిపైగా ఇన్వెస్టర్లు దీన్లో సభ్యులు. రోజూ వందల సంఖ్యలో కార్పొరేట్ సంస్థలను కలుస్తూ.. వేల మంది యువత వినూత్న ఆలోచనల్ని వాటి ముందుంచటమే తమ పని అంటున్న లీడ్ ఏంజిల్స్ నెట్వర్క్ దక్షిణాది వైస్ ప్రెసిడెంట్ వినుత రాళ్లపల్లి... తమ సంస్థ గురించి ఏం చెబుతున్నారనేది ఆమె మాటల్లోనే... కోటి రూపాయల కన్నా తక్కువ పెట్టుబడి అవసరమయ్యే స్టార్టప్‌లను గుర్తించి... వాటికి ఇన్వెస్టర్లను వెతికి పెట్టేందుకు ప్రొఫెసర్ సి.అమర్నాథ్, సుశాంతో మిత్రా కలిసి 2013 అక్టోబర్‌లో దీన్ని ఆరంభించారు. స్టార్టప్‌లు పెట్టాలనుకునే వాళ్ల ైవె పు, పెట్టుబడిదారుల వైపు ఉన్న సమస్యలను తగ్గిస్తూ.. పెట్టుబడులు సులువుగా, వేగంగా అందేలా చేయటం మా ఉద్దేశం. ఇది నిజంగా కత్తిమీద సామే. కాస్త తేడా వచ్చినా రెండు వైపులా ఇబ్బందులొస్తాయి. 5 నగరాలు.. 110 మంది ఇన్వెస్టర్లు.. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లోని 110 మంది వ్యకితగత పెట్టుబడిదారులతో కలిసి లీడ్ ఏంజిల్స్ పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్ డెరైక్టర్ అబా జోల్, బ్యాంక్ ఆఫ్ టోక్యో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ టాండన్, స్టార్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ ఆదిత్య, మైసేతు ఫౌండర్ అమిత్ పటేల్, ఎస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ సింఘి, ఓలా డెరైక్టర్ నితేష్ ప్రకాశ్, బ్లూ చిప్ కంప్యూటర్స్ సీఈఓ రాజేష్ కొఠారి వంటివారు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 నెలల క్రితం ప్రారంభమైన హైదరాబాద్ నుంచి 20 మంది సభ్యులు ఉన్నారు. ఏం చేస్తుందంటే.. నిధులవసరమైన స్టార్టప్‌లు తొలుత తమ బిజినెస్ ప్లాన్‌ను లీడ్ ఏంజెల్స్‌కు పంపాలి. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆయా ప్రాంతం ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహిస్తాం. ఇందులో స్టార్టప్స్ తమ ఆలోచనలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజెంటేషన్ ఇస్తారు. ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. అయితే ఒక నగరంలోని పెట్టుబడిదారులు ఇతర నగరంలోని స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఆ మీటింగ్‌లను వీడియో తీసి నెట్వర్క్ మెంబర్స్‌కు పంపిస్తాం. లీడ్ ఏంజెల్స్‌కు లాభమేంటంటే.. స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ముందుగా మా వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లయితే ఏడాదికి రూ.60 వేలు, సంస్థలైతే ఏడాదికి రూ.1.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 10 కంపెనీలకు.. రూ.8-9 కోట్ల పెట్టుబడులందేలా చేశాం. ఇందులో మైల్యాబ్ యోగి, మైకట్ ఆఫీస్, గ్రేమీటర్, సెన్సస్ టెక్నాలజీస్, థ్రిల్లోఫీలియా, ఆన్లైన్ ప్రసాద్, గేమ్ ఎక్సెస్ వంటివి ఉన్నాయి. నిధుల సమీకరణ కోసం రోజూ 30-40 దరఖాస్తులొస్తుంటాయి. రెండేళ్లలో 200 మంది మెంబర్స్‌ను సంస్థలో రిజిస్టర్ చేయించాలని, ఏడాదికి కనీసం 12 సంస్థలకు నిధులందించాలన్నది లక్ష్యం. ఇలాగైతేనే పెట్టుబడులొస్తాయ్.. లీడ్ ఏంజెల్స్ పని కేవలం నిధులందేలా చేయడం మాత్రమే కాదు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఏ మార్పులైతే బాగుంటుందో కూడా స్టార్టప్‌లకు సూచిస్తాం. ఏ స్టార్టప్‌కైనా తమ ఆలోచనని చెప్పడం, అది ఎంత వేగంగా విస్తరిస్తుందో వెల్లడించడం, అనుబంధ రంగాల్లోకి ఎలా చొచ్చుకుపోగలదో వివరించడమనేవి చాలా ముఖ్యం. వ్యాపార ఆలోచనలో కొత్తదనం, బృంద సభ్యుల సృజన, క ష్టపడేతత్వం, ప్రణాళికను అమలుపరిచే తీరు, దాన్ని మెరుగుపరిచే తపన, నెట్వర్క్ని విస్తరించడం, పోటీని తట్టుకొనే ధైర్యం ఈ ఆరూ ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇన్వెస్టర్లను ఎలా ఒప్పించాలో కూడా తెలిస్తేనే నిధులు త్వరగా వస్తాయి. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
స్టార్టప్ కంపెనీల్లో ఎస్బీఐ పెట్టుబడులు!
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ రానున్న కాలంలో స్టార్టప్స్ వృద్ధిలో ప్రధాన భూమిక పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎస్బీఐ సుముఖంగా ఉంది. ఈ చర్య ఎస్బీఐ కార్యకలాపాలకు ఎంతగానో దోహదపడుతుందని ఒక బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎస్బీఐ ఇప్పటిదాకా ఎటువంటి స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టలేదని, వాటితో జతకట్టడానికి ఎస్బీఐ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకుకు నిధుల సమస్య లేదని, తమకు సరైన వేదిక లభిస్తే.. తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. గతవారం ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య స్టార్టప్స్‌తో బెంగళూరులో సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన కొత్త స్టార్టప్స్ వాటి సొల్యూషన్స్‌ను వివరించాయి. -
స్టార్టప్స్‌లకు డాక్టర్ రెడ్డీస్ చేయూత!
- కొత్త ఆలోచనలకు కార్యరూపం మివ్వడంలో అండగా ఉంటాం - డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో-చైర్మన్, సీఈఓ జీవీ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ (డీఆర్ఐఎల్ఎస్- డ్రిల్స్) కార్పొరేట్ పరిశోధనలతో పాటుగా స్టార్టప్ కంపెనీలకూ చేయూతనందించనుంది. ఔషధ, వైద్య రంగంలో వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులతో ముందుకొచ్చే స్టార్టప్స్‌కు కార్పొరేట్ స్థాయిలో ప్రోత్సాహం అందించడంతో పాటుగా వారి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి సరైన దిశానిర్దేశం చేస్తామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ కో-చైర్మన్, సీఈఓ జీవీ ప్రసాద్ చెప్పారు. వైద్యం- విద్యా, పర్యావరణ పరిశ్రమ వృద్ధి అనే అంశంపై శనివారమిక్కడ ‘డ్రిల్స్ సినర్జీ 2015’ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ... స్టార్టప్స్ కంపెనీల ఆర్థిక చేయూత నిమిత్తం రెడ్డీస్‌తో పాటు ఇతర కంపెనీల నుంచి నిధులను సమీకరించడంపై దృష్టిపెట్టామన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 2004లో ప్రారంభమైన డ్రిల్స్‌కు మౌలిక వసతుల అభివృద్ధి నిమిత్తంరెడ్డీస్ తొలుత రూ.28 కోట్లు.. ఆ తర్వాత 7 ఏళ్లలో మరో రూ.30 కోట్లు అందించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు గ్రాంటు రూపంలో లభించాయని ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. జనరిక్ మందులను కాపీ చేయొద్దు: సన్ ఫార్మా ఇతర దేశాల్లోని జనరిక్ మందులను ఇక్కడ కాపీ చేయడం కాకుండా.. కొత్త ఔషదాలను తయారు చేయడంపై దేశీ ఔషద కంపెనీలు పరిశోధనలు చేయాలని సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ దిలీప్ సంఘ్వీ సూచించారు. ఇందుకోసం విద్యా స్థాయిలోనే పరిశోధనల నాణ్యత, నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘కేసీఆర్ ప్లాటినం స్పూన్‌తో పుట్టాడు’ ఎవరైనా అష్టైశ్వర్యాలతో పుడితే.. ‘వాడికేంటిరా.. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు’ అంటారు. ఈ నానుడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్వయిస్తే... ‘‘కేసీఆర్ ప్లాటినం స్పూన్‌తో పుట్టాడని’’ అనుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. విద్యా, వైద్యం, సాంకేతిక.. ఇలా ప్రతి రంగంలోనూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్.. తెలంగాణలో ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ సినర్జీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఐరిష్ స్టార్టప్స్‌లో ఇన్ఫోసిస్ పెట్టుబడులు
బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐర్లాండ్‌కు చెందిన స్టార్టప్స్‌లో రూ.64 కోట్ల వరకూ పెట్టుబడులు పెడుతోంది. ఐర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల గ్రూప్ అల్లైడ్ ఐరిష్ బ్యాంక్స్ పీఎల్సీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ భాగసామ్యం నేపథ్యంలో తమ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా ఐరిష్ స్టార్టప్స్‌లో రూ.64 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయనున్నామని ఇన్ఫోసిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ మోహిత్ జోషి వివరించారు. ఐరిష్ బ్యాంక్ ఉద్యోగుల కోసం 200 సీట్ల డెవలప్మెంట్ సెంటర్‌ను డబ్లిన్‌లో ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. భారత్‌తో సహా, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సంబంధిత స్టార్టప్స్ల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ఫోసిస్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్‌ను 2013లో 10 కోట్ల డాలర్లతో ప్రారంభించారు. 2015 జనవరికి దీనిని 50 కోట్ల డాలర్లకు విస్తరించారు. -
ఏఐపీఏసీ చైర్‌పర్సన్‌గా ఇన్ఫీ నారాయణ మూర్తి
న్యూఢిల్లీ: స్టార్టప్స్, ప్రత్యామ్నాయ పెట్టుబడుల కోసం కొత్త నిబంధనల రూపకల్పనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గురువారం 18 మంది ప్యానల్‌తో కూడిన ‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల సలహా కమిటీ’(ఏఐపీఏసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో పరిశ్రమ రంగానికి, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు, స్టార్టప్ ఆర్గనైజేషన్స్‌కు చెందిన ప్రతినిధులతోపాటు సెబీ, ఆర్బీఐ, ఆర్థిక శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఉంటారు. -
స్టార్టప్స్ కోసం సిడ్బి వెంచర్ క్యాపిటల్ ఫండ్
న్యూఢిల్లీ: చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి) ప్రత్యేకంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రూ. 10,000 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్ ద్వారా స్టార్టప్ సంస్థలకు అవసరమైన నిధులను సిడ్బి సమకూరుస్తుంది. నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) రాజీవ్ ప్రతాప్ రూడి రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. స్టార్టప్ కంపెనీలు మరింతగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిడ్బి పెట్టుబడులు తోడ్పడతాయి. -
ఉద్యోగాలడగం.. ఇస్తాం!
చక్కనిఆలోచన.. ప్రజలకు ఉపయోగపడే సేవలతో ఇపుడు స్టార్టప్‌లు అదరగొట్టేస్తున్నాయి. అందుకే వీటికి వినియోగదారుల ఆదరణతో పాటు ఇన్వెస్టర్ల విశ్వాసమూ పెరుగుతోంది. ఇలాంటి స్టార్టప్‌లను వెతికి... పాఠకులకు పరిచయం చేస్తోంది ‘సాక్షి స్టార్టప్స్ డైరీ’. దీనికి స్పందిస్తూ... ‘‘మేమూ స్టార్టప్స్ సేవలందిస్తున్నాం’’ అంటూ స్టార్టప్స్ఎట్దిరేట్సాక్షి.కామ్‌కు పెద్ద సంఖ్యలో ఈ-మెయిల్స్ వస్తున్నాయి. వాటిలో ఎంపిక చేసిన కొన్ని స్టార్టప్స్ ఈ వారం మీకోసం... - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్ ఆన్లైన్లో కరెంట్! ఆన్లైన్లో షాపింగ్ చేయడం.. సినిమా టికెట్లు కొనడం... ఇంతేనా! అదే అన్లైన్లో విద్యుత్ ఉపకరణాలనూ కొనుగోలు చేసే సేవలు ఆరంభించాలనుకున్నారు ఇద్దరు మిత్రులు. రూ.3 కోట్ల పెట్టుబడులతో దేశంలో తొలిసారిగా ఎలక్ట్రికల్ వస్తువుల సమాచారం, కొనుగోళ్లు, రాయితీల కోసం ఎలక్ట్రికల్స్.కామ్ సంస్థను ప్రారంభించారు చిన్ననాటి మిత్రులైన అజయ్, విజయ్... దీన్లో స్విచ్చుల నుంచి సబ్ స్టేషన్ల వరకు ఇండస్ట్రియల్, డొమెస్టిక్ రెండు విభాగాలకు అవసరమైన దాదాపు లక్షకు పైగా విద్యుత్ ఉపకరణాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్స్.కామ్.. హావెల్స్, యాంకర్, సఫారియా, రాకో, సూర్య, స్నైడర్, రిచెమ్ వంటి సుమారు 256 జాతీయ, అంతర్జాతీయ ఎంఎన్సీ కంపెనీలకు చానల్ పార్టనర్‌గా కొనసాగుతోంది. అల్ట్రాటెక్, బీహెచ్ఈఎల్, హానెస్టీ ట్రేడర్, ఐటీడీ, అక్యురేట్ ఇంజనీర్స్, భారత్ పెట్రోలియం, గోద్రెజ్, షాపూర్జీ పల్లోంజీ వంటి సుమారు 40 వరకు కంపెనీలు దీనికి కస్టమర్లు. అయితే ఈ విద్యుత్ ఉపకరణాలు బయటి మార్కెట్లోనూ దొరుకుతాయి కదా... అలాంటప్పుడు ఎలక్ట్రికల్స్.కామ్‌తో ఉపయోగమేంటనే సందేహం రావచ్చు. కానీ పారిశ్రామిక రంగాలు పెద్ద మొత్తంలో విద్యుత్ ఉపకరణాలను కొనుగోలు చేయాలంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరో, డీలర్ల దగ్గరో కొనాలి. దీనికి సమయం, డబ్బు రెండూ ఎక్కువే. ఎలక్ట్రికల్స్.కామ్‌తో అయితే ఒక్క రోజులోనే వస్తువులను కొనడంతో పాటు మార్కెట్ రేటు కంటే 20-30% తక్కువకే పొందవచ్చు. ‘వస్తువుల డెలివరీ కోసం ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాం. రూ.500 కంటే ఎక్కువ.. 500 కిలోల బరువుండే వస్తువుల వరకు డెలివరీ చార్జీలను కంపెనీనే భరిస్తుంది. పెట్టుబడులొస్తున్నాయి కానీ ఈక్విటీ రూపంలో వస్తేనే తీసుకుంటాం’ అని వ్యవస్థాపకులు చెప్పారు. ఇంట్లో ల్యాప్‌టాప్ మర్చిపోయారా? పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఆర్డరిస్తే ఇంటికి తెచ్చే సంస్థలున్నాయని మనకు తెలుసు. కానీ, ఇంట్లో మర్చిపోయిన ల్యాప్‌ట్యాప్‌ను, ఆఫీసు ఫైళ్లనూ చెప్పిన చోటుకు తీసుకొచ్చే సంస్థ ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రూ.20 లక్షల పెట్టుబడితో వీడెలివరీ.ఇన్ పేరుతో శ్రీనివాస్, కృష్ణ చైతన్య రెడ్డి కల సి ఇలాంటి సేవలనే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్, చెన్నై నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ప్రారంభించనున్నారు. ఎన్నారైలు తమ కుటుంబ సభ్యులకు మందులు, బహుమతులు వంటివి పంపించేందుకు వీడెలివరీని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో వాటిని ఎక్కడ కొనాలో.. ఎక్కడ డెలివరీ చేయాలో కూడా కస్టమరే చెబుతారు. కంపెనీ కేవలం మధ్యవర్తి మాత్రమే. ప్రస్తుతం రోజుకు 60-80 వరకు ఆర్డర్లొస్తున్నాయి. మొదటి 5 కి.మీ.లకు రూ.75.. ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.10 చొప్పున చార్జీ ఉంటుంది. ‘‘ఫ్లిప్‌కార్ట్ సంస్థ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ, రూ.6 కోట్ల నిధుల కోసం చూస్తున్నాం. వెంచర్స్ కేపలిస్ట్లతో మాట్లాడుతున్నాం. త్వరలోనే నిధులు సమీకరించి కంపెనీ సేవలను మరింత విస్తరిస్తాం’’ అని వివరించారు శ్రీనివాస్. దహన సంస్కారాలకూ వెబ్సైట్.. షాపింగ్‌కో.. సినిమాలకో కాదు దహన సంస్కారాలకూ ఆన్లైన్ సేవలున్నాయండోయ్. అది కూడా హైదరాబాద్‌లో. రూ.50 వేల పెట్టుబడితో నగరంలో ఠీఠీఠీ.్చట్టఛ్చీడట్ఛటఠిజీఠ్ఛిట.ఛిౌఝ ను ప్రారంభించాడు ఖమ్మంకు చెందిన సుధాకర్. చనిపోయిన వ్యక్తి కుటుంబంలో అందరూ బాధల్లో ఉంటారు. ఇలాంటి సమయంలో దహన సంస్కారాలకు కావాల్సినవి(శవ పేటిక, డప్పుళ్లు, వాహనం, ఫ్రీజర్ బాక్స్, పూజ సామగ్రి.. వంటివి) ఎక్కడ దొరుకుతాయో తెలియవు. ఒకవేళ తెలిసినా అవసరం మనది కాబట్టి ఎంత అడిగినా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి చిక్కుల్లేకుండా అన్ని మతాలకు చెందిన దహన కార్యక్రమాలకు సంబంధించిన సామగ్రిని ఉచితంగానే ఆర్డర్ చేయవచ్చిక్కడ. ఇందుకోసం నగరంలోని సుమారు 20 మంది సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ. కంపెనీకి ఫోన్ చేసిన గంటలోపు ఆర్డరిచ్చిన వస్తువులను ఇంటికి తెచ్చిస్తారు. ఇతర మెట్రో నగరాలకు ఈ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని, నిధుల సమీకరణకు హైదరాబాద్ ఏంజిల్స్‌తో చర్చించామని, త్వరలోనే కొత్త మొత్తాన్ని సేకరించి సంస్థ సేవలను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకూ విస్తరిస్తామని చెప్పారు సుధాకర్. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
స్టార్టప్స్..సంకల్పమే సక్సెస్ మంత్రం
స్టార్టప్స్.. స్టూడెంట్ స్టార్టప్స్.. ఆన్లైన్ స్టార్టప్స్.. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్..! ఫ్లిప్‌కార్ట్.. అమెజాన్.. స్నాప్‌డీల్... ఫేస్బుక్.. గూగుల్.. ట్విట్టర్!! ఇప్పుడు చర్చంతా స్టార్టప్స్.. ఈ-కామర్స కంపెనీలపైనే నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, ఫేస్బుక్ తదితర కంపెనీలన్నీ నలబై ఏళ్ల లోపున్న యువకుల ఆలోచనల్లోంచి అంకురించి సక్సెస్ సాధిస్తున్న సంస్థలు. కాలేజీ క్యాంపస్‌లో ఉన్నప్పుడే విద్యార్థి మదిలో మెదిలిన ఆలోచనకు నిదర్శనం.. ఫేస్బుక్. 20ల్లోనే చేయగలిగినప్పుడు 40ల దాకా ఆగడమెందుకంటూ.. చదువు పూర్తయ్యాక కొద్దికాలం అనుభవం గడించి సృజనాత్మక ఆలోచనలతో బన్సాల్, బెజోస్ లాంటివారు ప్రపంచం గర్వించదగ్గ కంపెనీలు నెలకొల్పారు. ఇలా కేవలం కొన్ని వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమై.. కొద్ది కాలంలోనే రూ. కోట్ల టర్నోవర్‌కు చేరిన స్టార్టప్స్ కంపెనీలు ఎన్నో! ఎవరు ఉద్యోగం ఇస్తారు.. ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది? అని ఎదురుచూసేకంటే.. సొంత ఆలోచనతో సాహసం చేయరా డింభకా.. అంటూ ముందుకెళ్లాలని భావించే యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సృజనాత్మకత, టెక్నాలజీ, సామాజిక అవసరాలే పెట్టుబడిగా విస్తృత విజయాలు సొంతం చేసుకున్న స్టార్టప్స్‌పై ప్రత్యేక కథనం.. పుస్తకాలతో మొదలైన.. ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్.. జాతీయస్థాయిలో ఇప్పుడు ఈ కంపెనీ పేరు వినని వారుండరు. ఈ-కామర్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ ఇది. తాజాగా బిగ్ బిలియన్ డే సెలబ్రేషన్స్‌లో ఒక్క రోజులోనే రూ.600 కోట్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్.. ప్రారంభ పెట్టుబడి కేవలం నాలుగు లక్షల రూపాయలు. ఐఐటీ-ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి.. కొంతకాలం అమెజాన్ డాట్ కామ్‌లో పనిచేసిన సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌లు ఏర్పాటు చేసిన కంపెనీ ఫ్లిప్‌కార్ట్. తొలుత ఆన్లైన్లో బిజినెస్ టు కస్టమర్ విధానంలో కేవలం పుస్తకాల విక్రయాలకే పరిమితమైన సంస్థ తర్వాత క్రమేణా తన కార్యకలాపాలను విస్తరించుకుంది. ఇదే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల సంఖ్య పెరగడమూ నమోదైంది. ఫలితంగా సంస్థకు వెంచర్ క్యాపిటల్ కూడా పెరిగింది. 2009లో తొలిసారి యాక్సెల్ ఇండియా నుంచి ఒక మిలియన్ అమెరికన్ డాలర్లను పెట్టుబడిగా పొందిన ఫ్లిప్‌కార్ట్‌కు తర్వాత మరెన్నో వెంచర్ క్యాపిటల్ సంస్థలు నిధులు అందించాయి. తాజాగా ఈ ఏడాది జూలైలోనూ మరో బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని సొంతం చేసుకుంది. వ్యాపార నిర్వహణలో రాణించి ఇటు వినియోగదారుల ఆదరణ.. అటు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి నిధులు సమకూర్చుకోవడంలో సత్ఫలితాలు సాధించింది. అంతేకాకుండా.. మరెన్నో సంస్థలను టేకోవర్ చేసే స్థాయికి ఎదిగింది. అటు ఉపాధి పరంగానూ బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు వేదికగా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థలో పది వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అమెజాన్ డాట్ కామ్ అన్ని వస్తువులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విప్లవాలు సృష్టించిన సంస్థ అమెజాన్ డాట్ కామ్. ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొంతకాలం పలు కంపెనీల్లో పనిచేసిన జెఫ్ బెజోస్ దీని వ్యవస్థాపకుడు.1994లో ఏర్పాటైన అమెజాన్ డాట్ కామ్ తొలి పెట్టుబడి కేవలం పది వేల అమెరికన్ డాలర్లు. ఇంటర్నెట్ గురించి సరిగా అవగాహన కూడా లేని జెఫ్ బెజోస్.. ఈ-కామర్స్ రంగం 2300 శాతం పెరగనుందనే ఒక నివేదికలోని అంశాన్ని ఆధారం చేసుకుని.. తన సృజనాత్మకతను జోడించి.. ఒక చిన్నపాటి గ్యారేజ్‌లో స్థాపించిన అమెజాన్ డాట్ కామ్ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఎంతో సుపరిచితం. ఆన్లైన్లో పుస్తకాల విక్రయాలకే పరిమితమైన అమెజాన్ ఇప్పుడు అన్ని వినిమయ వస్తువులను ఒక్క క్లిక్‌తో అందిస్తోంది. దీని పనితీరును గమనించిన ఏంజెల్ ఇన్వెస్టర్స్.. సంస్థ ఏర్పాటైన ఏడాదికే నిధుల వెల్లువ కురిపించారు. 1995లో ఏకంగా ఇరవైమంది ఏంజెల్ ఇన్వెస్టర్స్ మొత్తం 9,37,000 అమెరికన్ డాలర్ల నిధులు అందించడమే అమెజాన్ పనితీరుకు నిదర్శనం. ఈ క్రమంలో 2013-14లో 74.45 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. స్నాప్‌డీల్.. వెంచర్ క్యాపిటలిస్ట్తోనే ఎదిగిన సంస్థ స్నాప్‌డీల్ డాట్ కామ్. చక్కటి ఆలోచన ఉంటే ఆచరణకు ఆర్థిక అవాంతరాలు ఉండవని చెప్పడానికి నిదర్శనం స్నాప్‌డీల్ డాట్ కామ్. స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు కునాల్ బాల్, రోహిత్ బన్సాల్ ఇద్దరూ పాఠశాల స్నేహితులు. వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన కునాల్ బాల్, ఐఐటీ ఢిల్లీలో చదివిన రోహిత్ బన్సాల్ ఇద్దరూ సొంత వ్యాపారం నిర్వహించాలనే ఆలోచనలకు రూపమే.. స్నాప్‌డీల్. తొలుత ఇద్దరూ 2007లో ఆఫ్‌లైన్ విధానంలో పలు కూపన్ బిజినెస్‌లు ప్రారంభించి.. కొద్ది రోజుల్లోనే ఆదరణ పొందారు. దీంతో వ్యాపారాన్ని విస్తరించాలని యోచించారు. కానీ నిధుల సమస్య. ఇదే సమయంలో ఇండో-యూఎస్ వెంచర్ పార్ట్నర్స్ సంస్థతో తమ వ్యాపారం గురించి వివరించి మెప్పు పొందడంతోపాటు నిధులను కూడా సాధించారు. తాజాగా టాటా గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా కూడా ఈ సంస్థకు నిధులు అందించారంటే సంస్థ పనితీరు అవగతమవుతోంది. ఇలా.. కేవలం ఒక సృజనాత్మక ఆలోచనతో ఎలాంటి సొంత పెట్టుబడి లేకుండా ఒక వెంచర్ క్యాపిటల్ సహకారంతో మొదలై ఇప్పుడు 14 మంది పెట్టుబడిదారులతో 435 మిలియన్ డాలర్ల మూలధనంతో ముందుకెళుతోంది స్నాప్‌డీల్. ఫేస్బుక్.. హాస్టల్ గది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఫేస్బుక్.. ఈ మాట వినని.. ఈ వెబ్సైట్ వీక్షించని వారు ఉండరు అంటే ఏ మాత్రం సందేహం లేదు. అంతలా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఫేస్బుక్. కానీ ఫేస్బుక్ ప్రస్థానం హార్వర్డ్ యూనివర్సిటీలోని ఒక హాస్టల్ గదిలో కేవలం ఒక కంప్యూటర్‌తో మొదలైందంటే అతిశయోక్తికాదు. సంస్థ చైర్మన్ మార్క్ జుకెర్‌బర్గ్ 2004లో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈ ఫేస్‌బుక్‌ను రూపొందించారు. తొలుత కేవలం హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకే పరిమితం చేసిన ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్ సదుపాయాన్ని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా.. స్నేహితులతో కబుర్ల కోసం రూపొందిన ఫేస్బుక్.. 2004లో తొలిసారి అయిదు లక్షల డాలర్ల వెంచర్ క్యాపిటల్‌ను సమకూర్చుకుంది. ఆ తర్వాత మరెన్నో సంస్థలు మూలధనం సమకూర్చడంతో ఇప్పుడు దాదాపు 16 వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులను సొంతం చేసుకుంది. ట్విట్టర్.. విమర్శల నుంచి విశ్వవ్యాప్త ఖ్యాతి నేడు విశేష ఆదరణ పొందు తున్న మరో సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్.. ట్విట్టర్ డాట్‌కామ్. న్యూయార్క్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ జాక్ డార్సీకి వచ్చిన చిన్న ఆలోచనకు ప్రతిరూపమే ట్విట్టర్. ఇంటర్నెట్ వినియోగదారులు తమ అభిప్రాయాలను మెసేజ్‌ల రూపంలో పొందుపర్చే అవకాశం కల్పించడం అనే ఆలోచనతో 2006లో ఎవాన్ విలియమ్స్, జాక్ డార్సీ, బిజ్ స్టోన్లు ప్రారంభించిన ట్విట్టర్‌కు తొలుత ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కేవలం సరదా కోసమే ఈ వెబ్సైట్ అని.. చిట్ చాట్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని ఎందరో విమర్శిం చారు. కానీ కొద్ది రోజుల్లోనే అది నిజం కాదని నిరూపించారు. బ్రేకింగ్ న్యూస్ కూడా అందిస్తూ ఆదరణ పొందింది. 2013లో యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో లిస్టెడ్ కంపెనీ జాబితాలో చేరింది. 2013 డిసెంబర్ నాటికి దాదాపు 33 బిలియన్ డాలర్ల మార్కెట్ మూలధనం సొంతం చేసుకుంది. వాట్స్‌యాప్.. ఏర్పాటే వినూత్నం అమెరికాకు చెందిన జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్లు యాహూలో కొన్నేళ్లపాటు పనిచేసి ఫేస్బుక్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరూ ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోయారు. అప్పుడే (2009)లో జాన్ ఒక ఐఫోన్ కొన్నాడు. అందులో అప్లికేషన్స్ అన్నీ ఏడు నెలల కిందటివి. దీంతో వినియోగదారుల ఆదరణ పొందే అప్లికేషన్స్‌కు మంచి మార్కెట్ ఉంటుందని గ్రహించాడు జాన్. ఆ ఆలోచనతో మొగ్గతొడిగిందే వాట్స్‌యాప్. స్మార్ట్ ఫోన్స్‌లో వాట్స్‌యాప్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సందేశాలు, ఆడియో, ఫొటోలు, వీడియోలు ఉచితంగా పంపొచ్చు. వాట్స్‌యాప్ అనేది ఒక ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. అతితక్కువ కాలంలో అపార ఆదరణ పొందిన వాట్స్‌యాప్‌ను.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 బిలియన్ యూఎస్ డాలర్ల (రూ.లక్ష కోట్లకుపైగా)ను వెచ్చించి ప్రముఖ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ కొనుగోలు చేసింది. ఐడియా, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే ఎన్నో అవకాశాలు ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్టప్స్ ఏర్పాటుకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఐడియా నచ్చితే నిధులు ఇచ్చేందుకు సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు ఎన్నో సిద్ధంగా ఉన్నాయి. ఔత్సాహికులు వీటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా ది ఇండస్ ఎంటర్ప్రైజెస్ (టై), నాస్కామ్ వంటి సంస్థలు స్టార్టప్ ఔత్సాహికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫండింగ్ ఏజెన్సీలను, ఔత్సాహికులను ఒకే వేదికపై కలిసే అవకాశం కల్పిస్తున్నాయి. ఔత్సాహికులు చేయాల్సిందల్లా వినూత్నమైన ఆలోచనతో కూడిన రంగాన్ని ఎంచుకుని చక్కటి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేసుకోవడమే. ఆయా సెమినార్లలో నిర్ణీత వ్యవధిలో తాము తలపెట్టిన వ్యాపార ఆలోచన వ్యాపారపరంగా, సామాజిక అభివృద్ధి పరంగా ఏ మేరకు దోహద పడుతుందనే అంశంపై చక్కగా విశ్లేషించే నైపుణ్యం పెంపొందించుకోవాలి. - మురళి బుక్కపట్నం, టీఐఈ హైదరాబాద్ చాప్టర్ -
నాలుగేళ్లలో 50-80 లక్షల ఉద్యోగాలు...
ఉద్యోగావకాశాల కల్పనకు బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలతో వివిధ రంగాల్లో వచ్చే మూడు, నాలుగేళ్లలో 50 నుంచి 80 లక్షల ఉద్యోగాలు ఏర్పడవచ్చని నిపుణులు అంటున్నారు. ఉద్యోగాల కల్పనకు ముఖ్యంగా తయారీ రంగానికి ఊతం ఇవ్వాల్సి ఉందని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను మానవ వనరుల నిపుణులు స్వాగతించారు. మౌలిక సౌకర్యాలు, రవాణా, విద్యుత్తు, వినియోగ వస్తువులు, ఈ-కామర్స్, స్టార్టప్స్, టూరిజం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను వెంటనే కల్పించవచ్చన్నారు. వివిధ రంగాల్లో దాదాపు 80 లక్షల ఉద్యోగాల కల్పనకు బడ్జెట్ దోహదపడుతుందని భావిస్తున్నట్లు కెల్లీ సర్వీసెస్ ఎండీ కమల్ కారంత్ తెలిపారు.