ఐరిష్ స్టార్టప్స్‌లో ఇన్ఫోసిస్ పెట్టుబడులు
బెంగళూరు: సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐర్లాండ్‌కు చెందిన స్టార్టప్స్‌లో రూ.64 కోట్ల వరకూ పెట్టుబడులు పెడుతోంది. ఐర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల గ్రూప్ అల్లైడ్ ఐరిష్ బ్యాంక్స్ పీఎల్‌సీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ భాగసామ్యం నేపథ్యంలో తమ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా ఐరిష్ స్టార్టప్స్‌లో రూ.64 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయనున్నామని ఇన్ఫోసిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ మోహిత్ జోషి వివరించారు.
ఐరిష్ బ్యాంక్ ఉద్యోగుల కోసం 200 సీట్ల డెవలప్‌మెంట్ సెంటర్‌ను డబ్లిన్‌లో ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. భారత్‌తో సహా, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సంబంధిత స్టార్టప్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ఫోసిస్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్‌ను 2013లో 10 కోట్ల డాలర్లతో ప్రారంభించారు. 2015 జనవరికి దీనిని 50 కోట్ల డాలర్లకు విస్తరించారు.