నాలుగేళ్లలో 50-80 లక్షల ఉద్యోగాలు...
ఉద్యోగావకాశాల కల్పనకు బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలతో వివిధ రంగాల్లో వచ్చే మూడు, నాలుగేళ్లలో 50 నుంచి 80 లక్షల ఉద్యోగాలు ఏర్పడవచ్చని నిపుణులు అంటున్నారు. ఉద్యోగాల కల్పనకు ముఖ్యంగా తయారీ రంగానికి ఊతం ఇవ్వాల్సి ఉందని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలను మానవ వనరుల నిపుణులు స్వాగతించారు. మౌలిక సౌకర్యాలు, రవాణా, విద్యుత్తు, వినియోగ వస్తువులు, ఈ-కామర్స్, స్టార్టప్స్, టూరిజం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను వెంటనే కల్పించవచ్చన్నారు. వివిధ రంగాల్లో దాదాపు 80 లక్షల ఉద్యోగాల కల్పనకు బడ్జెట్ దోహదపడుతుందని భావిస్తున్నట్లు కెల్లీ సర్వీసెస్ ఎండీ కమల్ కారంత్ తెలిపారు.