Stirling
-
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్(62) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వెల్లింగ్టన్లోని తప సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయన మృతి పట్ల న్యూజిలాండ్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. కాగా స్టిర్లింగ్ టెస్టులు, వన్డేల్లోనూ కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1984 నుంచి 1986 మధ్య న్యూజిలాండ్ తరపున 6 టెస్టులు, 6 వన్డేలు ఆడిన స్టిర్లింగ్ ఓవరాల్‌గా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా రిచర్డ్ హ్యాడ్లీ, ఎవెన్ చాట్‌ఫీల్డ్, లాన్స్ కెయిర్న్స్ వంటి దిగ్గజ కివీస్ పేసర్లు అద్భుతంగా రానిస్తున్న సమయంలో.. స్టిర్లింగ్ అరంగేట్రం చేయడంతో పెద్దగా అవకాశాలు పొందలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం స్టిర్లింగ్‌కు మంచి రికార్డు ఉంది. అతడు డొమాస్టిక్ క్రికెట్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్కు ప్రాతినిధ్యం వహించారు. 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టిర్లింగ్ 206 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 65 గేమ్‌లలో 90 వికెట్లు సాధించాడు. స్టిర్లింగ్ రిటైర్మెంట్ తర్వాత హాక్స్ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. కివీస్ యువ క్రికెటర్లను తయారు చేయడంలో స్టిర్లింగ్ తన వంతు పాత్రపోషించారు. చదవండి: నేనొక భారత ముస్లింని గర్వంగా చెబుతా.. నన్ను ఎవరు ఆపుతారు: షమీ NZC is deeply saddened by the passing of former Test fast-bowler Derek Stirling, aged 62. "Billy" as he was known, played 6 Tests and 6 ODIs for his country and was a popular member of both the @CDCricket, and @cricketwgtninc sides. Our thoughts are with his family and friends. — BLACKCAPS (@BLACKCAPS) December 13, 2023 -
టీమిండియా.. పసికూనలతో జర జాగ్రత్త!
వన్డే ప్రపంచ కప్ సమరం రసవత్తరంగా మారింది. తొలి రెండు రోజులు అంచనాలకనుగుణంగా ఫలితాలు వచ్చినా.. మూడో రోజు సంచలనం నమోదైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసి.. 300, ఆ పైచిలుకు భారీ స్కోరు సాధించిన జట్లనే విజయం వరించింది. దీంతో 300 మార్క్ లక్ష్యం సాధించడం కష్టమనే అభిప్రాయం ఏర్పడింది. అయితే సోమవారం ఈ అంచనాలు తప్పని తేలింది. టోర్నీలో తొలిసారి 300పైచిలుకు లక్ష్యం కరిగిపోయింది. ఇంతటి లక్ష్యాన్ని ఛేదించింది ఏ అగ్రశ్రేణి జట్టో కాదు.. పసికూన ఐర్లాండ్.! ఐర్లాండ్ తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. తద్వారా ఎంత పెద్ద జట్టునయినా మట్టికరిపించే సత్తా ఉందని ఐర్లాండ్ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. అగ్రశ్రేణి జట్లు.. పసికూనలే కదా అని అలసత్వం ప్రదర్శిస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు. పసికూనలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా టీమిండియా. గ్రూపు దశలో భారత్.. ఐర్లాండ్, జింబాబ్వేలతో ఆడాల్సివుంది. గ్రూప్-బిలోనే జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫేవరేట్ జట్లలో ఒకటయిన దక్షిణాఫ్రికా 340 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయినా జింబాబ్వే తొణకలేదు. ఓడినా పోరాటపటిమతో ఆకట్టుకుంది. సఫారీలపై పసికూనలు 277 పరుగులు చేయడం ఆషామాషీ కాదు. గ్రూపు-బిలో ఉన్న భారత్‌కు ఈ రెండు ఫలితాలు ఓ హెచ్చరిక. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించి శుభారంభం చేసిన భారత్‌కు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ రెండు జట్లపై టీమిండియా గెలవాలంటే తీవ్రంగా శ్రమించకతప్పదు. కాబట్టి ధోనీసేనకు పసికూనలు జింబాబ్వే, ఐర్లాండ్, యూఏఈతో మ్యాచ్‌లు కీలకం. భారత్ నాకౌట్ చేరాలంటే వీటిపై నెగ్గడం చాలా అవసరం. జింబాబ్వే అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంటోంది. ఇక ఐర్లాండ్‌కు తనదైన రోజున ఏ జట్టునయినా ఓడించగల సత్తా ఉంది. ఈ రెండింటితో పోలిస్తే యూఏఈ అంత ప్రమాదకరం కాకపోవచ్చు. ఏదేమైనా టీమిండియా పసికూనలతో జాగ్రత్తగా ఉండకతప్పదు. -
ఆషామాషీగా తీసుకుంటే అంతే!
ఐర్లాండ్ మరోసారి సంచలనం సృష్టించింది. అండర్ డాగ్ గా తమ మీదున్న అంచనాలను నిజం చేసింది. గతంలో ఇంగ్లండ్ లాంటి అగ్రశేణి జట్టుపై 320 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి సంచలనం రేపిన ఈ చిన్న జట్టు మరోసారి ఈ ఫీట్ రిపీట్ చేసింది. తాజా వరల్డ్ కప్ లో వెస్టిండీస్ కు షాక్ ఇచ్చింది. 11వ ప్రపంచకప్ లో భాగంగా సోమవారం నెల్సన్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి టాప్ టీమ్ లకు తీసిపోమని చాటింది. 305 పరుగుల భారీ లక్ష్యం ముందున్నా ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ బెదిరిపోలేదు. పైపెచ్చు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పాల్ స్టిర్లింగ్(92), జొయస్(84), ఓబ్రిన్(79) ఐర్లాండ్ ఇన్నింగ్స్ కు మూలస్తంభాల్లా నిలిచారు. విండీస్ బౌలర్ల అలవోగా ఎదుర్కొని పరుగులు వరద పారించారు. చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టు విజయానికి బాటలు వేశారు. ఒక గెలుపు ఖాయమనుకున్న దశలో ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా చెదిరింది. జట్టు స్కోరు 273 పరుగుల వద్ద జొయస్ అవుటకాగానే వరుసగా వికెట్లు పడిపోవడంతో ఐర్లాండ్ జోరు కాస్త తగ్గింది. అయితే జోరు మీదున్న ఓబ్రిన్ లాంఛనం పూర్తి చేశాడు. తమను ఆషామాషీగా తీసుకోవద్దని ఈ విజయంతో అగ్రశేణి జట్లకు ఐర్లాండ్ సంకేతమిచ్చింది. చిన్నజట్టే కాదా అని తేలిగ్గా తీసుకుంటే భంగపాటు తప్పదని హెచ్చరిక పంపింది. మార్చి 3న జరిగిన తర్వాతి మ్యాచ్ ఐర్లాండ్ పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును ఢీకొనబోతోంది. సంచలనం పునరావృతమవుతుందో, చతికిలబడుతోందో తేలాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే. -
సంచలనం సృష్టించిన చిన్నజట్టు
నెల్సన్: 11వ ప్రపంచకప్ లో ఐర్లాండ్ జట్టు సంచలనం నమోదు చేసింది. తమ కంటే మెరుగైన వెస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది. సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్ విండీస్ పై ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 305 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయంగా చేరుకుంది. మరో 25 బంతులు మిగులుండగానే గెలుపు అందుకుంది. 45.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. అయితే చివర్లో తడబడినప్పటికీ ఐర్లాండ్ విజయాన్ని అందుకుంది. పాల్ స్టిర్లింగ్(92), జొయస్(84), ఓబ్రిన్(79) చెలరేగి ఆడారు. స్టిర్లింగ్ కొద్దిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. గేల్, శామ్యూల్ చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 304 పరుగులు చేసింది. సిమన్స్(102) సెంచరీ చేశాడు. జట్టు ఓడిపోవడంతో అతడి సెంచరీ వృధా అయింది. ఇప్పటివరకు ఐర్లాండ్ తో ఆడిన ఐదు వన్డేల్లో విండీస్ కు ఇది మొదటి ఓటమి. -
గెలుపు ముంగిట ఐర్లాండ్
నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ గెలుపు ముంగిట నిలిచింది. 43.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 290 పరుగులు చేసింది. విజయానికి 38 బంతుల్లో 15 పరుగులు చేయాలి. స్టిర్లింగ్, జొయస్, ఓబ్రిన్ అర్థ సెంచరీలతో రాణించారు. స్టిర్లింగ్ 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. 84 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. జొయస్(84), ఓబ్రిన్(64) అర్థ సెంచరీలు నమోదు చేశారు.