Sukma district
-
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులపై నక్సల్స్ కాల్పులు జరిపారు. సైనికులపై నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. నక్సల్స్ కోర్ ఏరియాలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.అయితే.. ఈ ఎన్ కౌంటర్లో పలువురు నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. డీఆర్జీ, సీఆర్పీ ఎఫ్, కోబ్రా దళాలకు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్, సీఆర్పీ ఎఫ్ డీఐజీ ఆనంద్, కుంట డీఐజీ సూరజ్‌పాల్ వర్మలు ఎప్పటి కప్పుడు ఎన్ కౌంటర్ సమాచారం తెలుసుకుంటూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.చదవండి: కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో చర్చ -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. సోధి గజేంద్ర తదితర సుమారు 20 మంది మావోయిస్టులతో కూడిన కుంటా ఏరియా కమిటీ సమావేశమవుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా భేజీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నగరం, పంటాభేజీ గ్రామాల మధ్య ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. -
ఛత్తీస్‌గఢ్‌లో 20 మంది మావోయిస్టులు లొంగుబాటు
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో శనివారం ఐదుగురు మహిళలు సహా 20 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వివిధ మావోయిస్టు అనుబంధ విభాగాలకు చెందిన వీరంతా అమానవీయ మైన, పసలేని మావోయిస్టుల సిద్ధాంతాలతో విసిగినట్లు తెలిపారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. లొంగుబాటపట్టిన వారిలో మిలిషియా డిప్యూటీ కమాండర్ ఉయిక లఖ్మా, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్(డీఏకేఎంఎస్), క్రాంతికారీ మహళా ఆదివాసీ సంఘటన్(కేఏఎంఎస్), చేతన నాట్య మండలి(సీఎన్ఎం)లకు చెందిన సభ్యులున్నార న్నారు. జిల్లాలోని జాగర్‌గుండా పోలీస్‌స్టేషన్ పరిధిలో వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన వారికి పునరావా స కార్యక్రమాలను వర్తింప జేస్తామన్నారు. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. జిల్లాలోని భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్జీ జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. చెప్పారు. జవాన్ల చేతిలో హతమైన మావోయిస్టులను గొల్లపల్లి ఎస్ఓఎస్ కమాండర్ మద్కమ్, ఆయన భార్య పొడియం భీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై రూ 8 లక్షల రివార్డు ఉండగా.. ఆయన భార్యపై రూ. 3లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి -
సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్
-
44 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్:మావోయిస్టు పార్టీకి చెందిన 9మంది మహిళలతో సహా 44మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కరిగుండం వద్ద లొంగిపోయారు. సుక్మా జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పున నాకం అభియాన్’(కొత్త ఉదయం-కొత్త ప్రారంభం) ప్రభావంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో ఓ నక్సలైట్‌పై ప్రభుత్వం రూ.2లక్షల రివార్డును ప్రకటించింది. కొంతమంది కారిగుండం గ్రామ పరిసర ప్రాంతాల చెందిన కొత్తవారు ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు, వారితో పాటు వచ్చిన గ్రామస్తులకు పోలీసులు ఆహారం అందించారు. లొంగిపోయిన నక్సలైట్లందరికీ ప్రభుత్వం పునరావాస పథకాల ప్రయోజనం అందజేస్తుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. -
మావో పంజా
సాక్షి, హైదరాబాద్/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన మావోయిస్టులు ఆకస్మిక దాడి చేసి 17 మంది జవాన్లను బలితీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాలోని చింతగుఫా ఏరియాలో మీన్పా అడవుల్లో నక్సల్ కమాండర్ హీడ్మా, వినోద్, దేవా శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో 250 నుంచి 300 డీఆర్జీ (జిల్లా రిజర్వ్ గార్డులు), ఎస్టీఎఫ్ (స్పెషల్‌టాస్క్‌ఫోర్స్) జవాన్లతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు వారికి తారసపడ్డారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో 17 మంది జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారు. దాదాపు 8 గంటలపాటు కాల్పులు.. వేసవి రావడంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ ఏడాది కూడా ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా మావోయిస్టుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపులు మొదలుపెట్టారు. చింతగుఫా సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో దాదాపు 300 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య శనివారం మధ్యాహ్నం 12.40 నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 8 గంటలపాటు వందలాది రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో గాయపడ్డ 14 మందిని హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఎన్కౌంటర్ దట్టమైన అటవీ ప్రాంతంలో జరగడం, రాత్రి వరకు కొనసాగడంతో 17 మంది జవాన్ల జాడ తెలియకుండాపోయింది. ఆదివారం డ్రోన్ల సాయంతో గాలించగా.. ఆ 17 మంది విగతజీవులుగా కనిపించారు. అనంతరం బలగాలు ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. అమరులైన జవాన్లు వీరే.. :డీఆర్జీ విభాగం కానిస్టేబుళ్లు హేమంత్‌దాస్, లిబ్రూరాం, సోయం రమేష్, వంజెం నాగేష్, మడకం మాసా, పొడియం లక్మా, మడకం ఇడమా, వంజం నితేంద్రం, అసిస్టెంట్ కానిస్టేబుళ్లు గంధం రమేష్ , ఉయికా కమిలేష్, పొడియం ముత్తా, ఉయికా దుర్బా, ఎస్టీఎఫ్ విభాగం కానిస్టేబుళ్లు సీతారాం రాశ్యా, హేమంత్‌బోయ్, అమర్జిత్ కల్లోజీ, అసిస్టెంట్ కానిస్టేబుళ్లు నారోద్ మితాడ్, మడకం ముచ్చు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లలో మావోలు... బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించిన మావోయిస్టులు భారీ ఆయుధాలతో ఆకస్మికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు అంటున్నారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మావోయిస్టులకు తక్కువ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చనంటున్నారు. వారి ధీరత్వాన్ని మరచిపోం: మోదీ భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన ఘాతుకంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్నాను. ఈ దాడిలో అమరవీరులైన భద్రతా బలగాలకు అంజలిఘటిస్తున్నాను. వారు చూపిన ధీరత్వాన్ని ఎన్నటికీ మరచిపోం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
మావోయిస్టు అగ్రనేత రామన్న మృతి
మల్కన్‌గిరి: జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టు అగ్రనేత రామన్న గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. 2003 నుంచి 2007 వరకు మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల, చిత్రకొండ, కటాఫ్ ఏరియాలో అగ్రనేతగా పనిచేసిన రామన్న పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటివరకు అతడి ఆచూకీ పోలీసులకు లభ్యం కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడిని అప్పగించిన వారికి రూ.1.40 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. అయినా అతడు పోలీసుల కంట పడకుండా తన కార్యకలాపాలను కొనసాగించడం గమనార్హం. ఇదిలా ఉండగా, సుకుమా జిల్లాలోనే రామన్న అంత్యక్రియలను మావోయిస్టు దళ సభ్యులు మంగళవారం నిర్వహించారు. అతడి మృతదేహంపై విప్లవ సూచికలైన ఎర్రటి వస్త్రాలను కప్పి, విప్లవగీతాలు ఆలపిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామన్న సేవలను పలువురు దళం సభ్యులు కొనియాడారు. సుమారు 60 ఏళ్ల వయసు కలిగిన రామన్న దళంలో చాలా చురుకుగా ఉండేవారని, అతడి సహచరులు చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని, అతడి మృతి మావోయిస్టుల ఉద్యమానికి తీరని లోటు అని మావోయిస్టు దళ సభ్యులు పేర్కొన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా జిల్లాలోని చింతగుఫా పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం కోబ్రా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. -
ఎనిమిది మంది మావోయిస్టుల హతం
రాయ్‌పూర్ : మావోయిస్టులకు కేంద్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో తూటల మోతకు అటవి ప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు డీఆర్జీ జవాన్లు కూడా మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఆదివారం బీజాపూర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారంతా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) సంస్థకు చెందిన వారని సుక్మా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని.. మృత దేహాలను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. కాల్పుల్లో గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నామని మీనా పేర్కొన్నారు. -
రోడ్డు పనుల వాహనాల కాల్చివేత
మల్కన్‌గిరి : జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లాలో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వాహనాలను మావోయిస్టులు శనివారం కాల్చివేశారు. సుకుమ జిల్లాలోని రామారామ్ బడేష్ఠి గ్రామంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆ గ్రామానికి వచ్చిన మావోయిస్టులు పనులు జరుగుతున్న చోట సిబ్బందిని కొట్టి పంపించివేసి వాహనాలను కాల్చివేశారు. పొక్లెయిన్లు, మిక్సర్ మెషీన్, ట్రాక్టర్లకు మావోయిస్టులు పెట్రోల్ పోసి నిప్పంచించారు. ఎన్ని సార్లు హెచ్చరించినా రోడ్డు పనులు చేస్తున్నారని, మరోసారి ఈ ప్రాంతంలో రోడ్డు పనులు జరిగితే మరణ దండన విధిస్తామని హెచ్చరించారు. -
సీఆర్పీఎఫ్కు ఎట్టకేలకు అధిపతి దొరికారు!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీఆర్పీఎఫ్కు అధిపతిని నియమించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ రాయ్ భట్నాగర్ను కేంద్ర హోంశాఖ బుధవారం నియమించింది. రాయ్ 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. రెండురోజుల కిందట సుక్మాలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో కేంద్రం తీరును కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై విమర్శించారు. సీఆర్పీఎఫ్కు ఇప్పటివరకు పూర్తికాలం అధిపతిని నియమించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఆర్పీఎఫ్ గత డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ కేంద్ర హోం శాఖ నిన్నటివరకు నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది. సుక్మా దాడి నేపథ్యంలో సీఆర్పీఎఫ్కు వెంటనే అధిపతిని నియమించినట్టు తెలుస్తోంది. అలాగే ఇండో-టిబేటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి 1983 బ్యాచ్‌కు చెందిన ఆర్కే ప్రచండ నియమితులయ్యారు. -
నిర్లక్ష్యమే జవాన్ల ప్రాణాలను తీసింది
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది జవాన్లు మరణించడానికి విధుల నిర్వహణలో జవాన్లు నిర్లక్ష్యం వహించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమూ ఉంది. ఆ రోజున రోడ్డు నిర్మాణ పనులకు రక్షణగా ఉన్న బృందంలోని 36 మంది జవాన్లలో ఇద్దరు, ముగ్గురు మినహా అందరూ ఒకేసారి భోజనానికి వెళ్లారు. భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, అదే అదనుగా భావించిన మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీఆర్పీఎఫ్లోని 76వ బెటాలియన్‌కు చెందిన 99 మంది జవాన్లు మూడు బృందాలుగా విడిపోయి రోడ్డు నిర్మాణ పనులకు కాపలా కాస్తున్నారు. ఒక్కో బందంలో 30 నుంచి 36 మంది జవాన్లు ఉన్నారు. ఒక్కో బృందంలోని సభ్యులు భోజన విరామానికి వెళ్లాలంటే అతి తక్కువ సంఖ్యలో వెళ్లాలి. దాన్నే ఆపరేషన్ అప్రమత్తత అంటారు. అలా అప్రమత్తంగా వ్యవహరించక పోవడం వల్ల అనసరంగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 2010లో పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించడానికి కారణం కూడా ఆపరేషన్ నిబంధనలను పాటించక పోవడమే కారణం. ఆ రోజున తెల్లవారు జామున మావోయిస్టులు దాడి జరిపినప్పుడు ఎక్కువ మంది జవాన్లు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ తర్వాత రెండు నెలలకే అలసి పోయిన జవాన్ల బృందం కలసికట్టుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మావోయిస్టులు కాల్పులు జరపడంతో 26 మంది జవాన్లు మరణించారు. ముగ్గురు, నలుగురు చొప్పున బృందాలుగా విడిపోయి వెళ్లాల్సిన జవాన్లు అలా చేయకుండా ఒకే గుంపుగా వెళ్లడం ఒక పొరపాటైతే వెళ్లిన దారినే వెనక్కి రావడం రెండో పొరపాటు. గుణపాఠం నేర్చుకోలేదు ఈ రెండు సంఘటనల నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లనే ఈ రోజున కూడా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడి జరిపిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సీనియర్ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. తాము కూడా మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు జరిపామని గాయాలతో బయటపడిన జవాన్లు చెప్పిన మాటలను వారి సీనియర్ అధికారులే నమ్మడం లేదు. 12 ఏకే–47 రైఫిళ్లు, 31 ఇన్సాస్ రైఫిళ్లు, 3000 బుల్లెట్లను సంఘటన స్థలం నుంచి మావోయిస్టులు ఎత్తుకెళ్లారంటే ఎదురు కాల్పులు జరిగి ఉండే అవకాశం లేదు. సీఆర్పీఎఫ్కు అధిపతి లేరు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది. -
మావోయిస్టుల భారీ ఎటాక్: 12 మంది జవాన్ల మృతి!
-
సుక్మా ఘటనపై ప్రధాని విచారం
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సుక్మా జిల్లా కేంద్రానికి చేరుకుని తాజా పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు. భెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొటచెరు గ్రామ సమీపంలో శనివారం ఉదయం కూంబింగ్ జరుపుతున్న జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 1ద2 మంది జవాన్లు చనిపోయిన విషయం విదితమే. -
మావోయిస్టుల భారీ ఎటాక్: 12 మంది జవాన్ల మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే 11 మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఐఈడీ అమర్చి, దాన్ని పేల్చడంతో పాటు ఆ షాక్‌లో ఉన్న జవాన్లను చుట్టుముట్టి కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ మరిన్ని ఐఈడీలను అమర్చారని అంటున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు.. ఒక్కసారిగా విరుచుకుపడి జవాన్లను హతమార్చారు. కూంబింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల మీదకు కాల్పులు జరిపారు. దాంతో 12 మంది మరణించారు. ఈ కాల్పుల్లో కొందరు మావోయిస్టులు కూడా మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఇంతకుముందు ఫిబ్రవరి మొదటివారంలో ఛత్తీస్‌గఢ్‌లోనే నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. అది మావోయిస్టులకు పెద్ద దెబ్బగా అప్పట్లో భావించారు. నిజానికి అప్పటినుంచి ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురుచూస్తున్న మావోయిస్టులు.. తాజాగా సుకుమా జిల్లాలో విరుచుకుపడ్డారు. మృతుల వివరాలు ఇన్స్పెక్టర్ జగ్జీత్ సింగ్, ఏఎస్ఐ హెచ్‌బీ భట్, ఏఎస్ఐ నరేందర్ కుమార్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ పీఆర్ మిండే, కానిస్టేబుల్ మంగేష్ పాల్ పాండే, కానిస్టేబుల్ రాంపాల్ సింగ్ యాదవ్, కానిస్టేబుల్ గోరక్నాథ్, కానిస్టేబుల్ నందకుమార్ పాత్రా, కానిస్టేబుల్ సతీష్ కుమార్ వర్మ, కానిస్టేబుల్ కె. శంకర్, కానిస్టేబుల్ సురేష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జగదీష్ ప్రసాద్ విష్ణోయ్. క్షతగాత్రులు వీరే కానిస్టేబుల్ జైదేవ్ ప్రామాణిక్, కానిస్టేబుల్ సలీం -
సుకుమా జిల్లాలో మందుపాతర పేలుడు
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోల కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయి. ఆదివారం రాత్రి గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ రోంపల్లి కలప డిపోకు నిప్పుపెట్టిన మావోలు.. సోమవారం సుకుమా జిల్లాలోని కుంట సమీపంలో జాతీయ రహదారిపై మందు పాతర పేల్చారు. దీంతో 30 వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి. అలాగే మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొగడపల్లి దగ్గర రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న జేసీబీ, టిప్పర్లను మావోలు తగలబెట్టారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతం సుక్మా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. బెజ్జి నుంచి మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్, జిల్లా రిజర్వు పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భెజ్జి- ఇంజారం గ్రామాల మధ్య బెజ్జి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని కల్వర్టు కింద ఉంచిన పేలుడు పదార్థాలను కనుగొన్నారు. అయితే, తక్కువ తీవ్రత కలిగిన వీటిని పోలీసు బలగాలే లక్ష్యంగా పెట్టి ఉంటారని సుక్మా ఎస్పీ ఇందిరా కల్యాణ్ ఎలిసెల తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాదళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సుక్మా జిల్లా కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నీలమడుగు, వెలిశాల గ్రామాల మధ్య భద్రతా దళాలు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు. చనిపోయిన నక్సల్‌ను లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్‌కు చెందిన మడకం హంగాగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ఇందిరా కల్యాణ్ చెప్పారు. -
122 మంది మావోయిస్టుల లొంగుబాటు
చింతూరు (తూర్పుగోదావరి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం 122 మంది మావోయిస్టులు, వారి సానుభూతిపరులు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి, కలెక్టర్ నీరజ్ బన్సోడ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో జన్ మిలిషీయా కమాండర్లు, లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ (ఎల్వోఎస్) సభ్యులు, చేతన నాట్యమండలి సభ్యులు, జన్ మిలీషియా సభ్యులు ఉన్నట్లు ఐజీ తెలిపారు. వీరిలో 8 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని, చాలామందిపై రివార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. -
43 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొంత కాలంగా చత్తీస్ గఢ్ లో లొంగు బాటుల పరంపర కొనసాగుతోంది. అడవుల్లో పోలీసుల కదలికలు ఎక్కువవడంతో.. ప్రాణ రక్షణకోసం జన జీవన స్రవంతి కలిసి పోవాలని నిర్ణయించుకున్న గిరిజనులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగు బాట్లకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
మావోయిస్టుల దాడి: ఇద్దరు జవాన్ల మృతి
హైదరాబాద్ : చత్తీస్ ఘడ్ లో పెట్రోలింగ్ నిర్వహిస్టున్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మంగళవారం చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని హలామూలా సంఘం ఈ సంఘటన చోటుచేసుకుంది. మావోల దాడిలో ఆసీఓం సింగ్, తిలక్ రాజ్‌లు మృతి చెందినట్లుగా సీఆర్పీఎఫ్ అధికారులు ప్రకటించారు. -
30 గంటలు పట్టింది!
రాయ్‌పూర్/చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల మృత దేహాల తరలింపునకు 30 గంటల సమయం పట్టింది. సుక్మా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగ్గా, ఆదివారం సాయంత్రానికి మతదేహాలను కాంకేర్‌లంక పోలీసు క్యాంపునకు తరలించారు. మతదేహాలను ఘటనాస్థలి నుంచి హెలికాప్టర్లలో తరలించేందుకు ప్రయత్నించారు. వాతావరణం సహకరించకపోవడం, మృత దేహాల కోసం వెళ్లిన పోలీసులపై నక్సల్స్ మళ్లీ దాడి చేయవచ్చనే అనుమానంతో ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఎఫ్(జిల్లా ఫోర్స) పోలీసులు ఆదివారం భారీ ఎత్తున కాలినడకన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను క్యాంపుకు, తర్వాత అక్కణ్ణుంచి జగ్దల్పూర్ తరలించారు. మావోయిస్టుల దాడి మృతులకు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, పోలీసు ఉన్నతాధికారులు జగ్దల్పూర్లో నివాళులర్పించారు. అల్పాహారం తీసుకునేందుకు సిద్ధమవుతున్నపుడు నాలుగువైపుల నుంచి మావోలు దాడికి తెగబడ్డారిన జగ్దల్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు తెలిపారు. దాడి నుంచి తేరుకుని కాల్పులు ప్రారంభించేసరికే ఏడుగురు సహచరులను కోల్పోయామన్నారు. గ్రామం దగ్గర్లో దాడి చేయడంతో మావోలను తాము పసిగట్టలేదని, చాలామంది గ్రామీణుల వేషధారణలో ఉన్నారని వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) జవాన్లను దాదాపు 200 మంది నకల్స్ చుట్టుముట్టారు. ఇది గమనించిన జవాన్లు ఫైర్ ఓపెన్ చేశారు. అటు మావోయిస్టులు కూడా కాల్పులు ప్రారంభించడంతో రెండు గంటపాటు ఆ ప్రాంతమంతా తుపాకుల చప్పుళ్లతో మారుమోగింది.ఈ ఘటనలో ఎ ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు మరణించారు. 11 మంది గాయాలతో బయటపడ్డారు. మృతదేహాల కోసం బలగాలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని దోర్నపాల్- చింతగుఫా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఎస్టీఎఫ్ జవాన్ల మృతదేహాలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనపర్చుకోవడానికి ఆలస్యానికి గల కారణాలను ఏడీజీపీ ఆర్ కే విజ్ మీడియాకు వివరించారు. చనిపోయిన జవాన్ల శవాల కోసం ఘటనా స్థలానికి వెళ్లిన సీఆర్పీఎఫ్ బృందంపై అనూహ్యరితీలో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళం వెనక్కి వచ్చేసింది. ఆదివారం ఉదయం మరింత బలగంతో వెళితేగానీ శవాల స్వాధీనం సాధ్యపడలేదని విజ్ చెప్పారు. మైనింగ్ కంపెనీపై దాడి సుక్మా జిల్లాలో ఏడుగురు జవాన్లను హతమార్చిన 24 నాలుగు గంటలలోపే కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీపై మావోయిస్టులు దాడిచేసి 17 వాహనాలను తగలబెట్టారు. కోరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దాస్పూర్ ఐరన్ ఓర్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన సాయుధ నక్సలైట్లు కూలీలను వెళ్లగొట్టి మైనింగ్ యంత్రాలు, జేసీబీలు, జీపులు ఇతరత్రా మొత్తం 17 వాహనాలకు నిప్పుపెట్టారని కాంకేర్ ఎస్పీ జితేంద్రసింగ్ మీనా తెలిపారు. ఘటన అనంతరం మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సీ చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. -
పది ఏకే-47 తుపాకుల లూటీ
సుకుమా: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ పై దాడికి పాల్పడిన తర్వాత మావోయిస్టులు జవానుల నుంచి అత్యాధునిక ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 10 ఏకే-47, 56 తుపాకులు తీసుకెళ్లారు. 3 ఏకే-47 తుపాకుల్లో అత్యాధునిక సదుపాయాలున్నాయి. వీటిని అంబర్ బ్యారెల్ డ్రెనేడ్ లాంఛర్స్ కు ఫిట్ చేసినట్టు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఐఎన్ ఎస్ఏఎస్ రైఫిల్, 400 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయని తెలిపింది. మావోయిస్టుల ఏరివేతకు వెళ్లిన జవాన్లలో చాలా మంది అడవిలో ఉన్నారని, ప్రస్తుతానికి కూంబింగ్ నిలిపి వేశామని సీఆర్పీఎఫ్ ప్రకటించింది. సుకుమా జిల్లాలో సోమవారం మావోయిస్టులు జరిపిన దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.