Summer Vactions
-
వేసవి సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ : సాధారణంగా అయితే విద్యార్థులకు వేసవిలో సెలవులుంటాయి. కానీ ఈసారి మాత్రం కొంచెం భిన్నం. సెలవుల్లోనే వేసవి వచ్చింది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే మే 11 నుంచి జూన్ 30 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆయా పాఠశాలల విద్యార్థులకు వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం అందివ్వాలని సూచించింది. ( జేఈఈ, నీట్ పరీక్షా తేదీలు ప్రకటించిన ప్రభుత్వం ) కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి స్కూల్స్ మూతపడటంతో విద్యార్థులు నష్టపోకుండా అన్ని యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా వేసవిలో వివిధ కోచింగ్ సెంటర్లు నడిచేవి. కానీ ఈసారి పరిస్థితి మారింది. కాబట్టి విద్యార్థులు ఎవరినీ క్లాసుల పేరిట కోచింగ్‌లు, ట్యూషన్లు అని పంపవద్దని ఆదేశించారు. అయితే ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దేశ రాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 5100 కోవిడ్ కేసులు నమోదవగా, 64 మంది మరణించారు. -
చల్లగా.. చిల్‌గా..
సమ్మర్ స్టార్ట్ అయ్యింది. ఎండ తీవ్రత పెరిగింది. దీంతో బాలీవుడ్ తారలు కొందరు వెకేషన్ కోసం మ్యాప్‌ను ముందు వేసుకుని నచ్చిన ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసి ఎయిర్‌పోర్టుకు దారి వెతుక్కుంటున్నారు. సూట్‌కేస్‌లు సర్దుకుని చల్లని ప్రదేశాల్లో ల్యాండైపోతున్నారు. కొందరు విదేశాలను చుట్టొచ్చేశారు. కొందరు అక్కడ చిల్ అవుతున్నారు. ఐశ్వర్యారాయ్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్, సారా అలీఖాన్‌లు ఆల్రెడీ సర్దుకున్న సూట్‌కేసులను ఫారిన్లో ఓపెన్ చేసి, చిల్ అయి వచ్చేశారు. మరి.. వీళ్లంతా ఎక్కడెక్కడి వెళ్లారో తెలుసుకోవాలంటే మాత్రం మ్యాటర్ కంటిన్యూ చేయండి. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులు వెళ్లారు ఐశ్వర్యారాయ్. అక్కడికే వెళ్లొచ్చారు కత్రినాకైఫ్, కృతీసనన్, మలైకా అరోరాఖాన్. ‘గుడ్‌న్యూస్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన గుడ్మూడ్లో లండన్ తిరిగొచ్చారు కరీనాకపూర్. భార్య మీరా కపూర్‌తో కలిసి షాహిద్ కపూర్ స్పెయిన్‌లో హాలీడే టైమ్ ఎంజాయ్ చేశారు. జార్జియాలో జాలీగా గడిపొచ్చిన కొత్త దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ లేటెస్ట్ లవ్‌బర్డ్స్ ఫర్హాన్అక్తర్, షిబాని దండేకర్ మెక్సికోలో చిల్ అయ్యారు. మాజీ మిస్ ఇండియా సుస్మితాసేన్ తన బాయ్‌ఫ్రెండ్ (బాలీవుడ్ మీడియా అలానే చెబుతోంది) రోహ్మన్తో కలిసి న్యూయార్క్‌లో ప్రేమ పరుగు తీశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ న్యూయార్క్‌లో వాలిపోయారు. స్నేహితులతో కలిసి న్యూయార్క్‌ని రౌండప్ చేసే పనిలో ఉన్నారు. మరి కొందరు హీరోయిన్లు తమ సినిమాల షూటింగ్ డేట్స్‌ను చూసుకుని ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి.. ఇంకా ఎంతమంది స్టార్స్ చల్లని ప్రదేశాల్లో చిల్ కావడానికి వెళతారో చూడాలి. సారా అలీఖాన్, స్నేహితులతో కరీనా -
మే 2 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు మే 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. మే 5, 12, 19, 26 తేదీల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయని రిజిష్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. 12న న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం, సి.ప్రవీణ్‌కుమార్ సింగిల్ జడ్జిగా వ్యవహరిస్తారు. 19వ తేదీన జస్టిస్ పి.నవీన్‌రావు, ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. 26వ తేదీన జస్టిస్ ఎ.వి.శేషసాయి, ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ బి.శివశంకరరావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. అత్యవసర కేసులను దాఖలు చేసుకునే వారు 3, 10, 17, 24తేదీల్లో పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.