సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు మే 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. మే 5, 12, 19, 26 తేదీల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయని రిజిష్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు.
12న న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం, సి.ప్రవీణ్‌కుమార్ సింగిల్ జడ్జిగా వ్యవహరిస్తారు. 19వ తేదీన జస్టిస్ పి.నవీన్‌రావు, ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. 26వ తేదీన జస్టిస్ ఎ.వి.శేషసాయి, ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ బి.శివశంకరరావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. అత్యవసర కేసులను దాఖలు చేసుకునే వారు 3, 10, 17, 24తేదీల్లో పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.