superstar Mammootty
-
మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు రొమాన్స్ చేస్తున్నారన్నది తాజా సమాచారం. మమ్ముట్టి చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు తంగమీన్‌గళ్ వంటి ఉత్తమ అవార్డులను అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ తాజగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇది. వేసవి కాలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి పేరంబు అనే పేరును నిర్ణయించారు. చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక కథానాయకిగా అంజలి నటిస్తున్నారు. ఈ అమ్మడు చిన్న గ్యాప్ తరువాత నటిస్తున్న తమిళ చిత్రం ఇది. కాగా ఇందులో మరో అంజలి కూడా నాయకిగా నటిస్తుండటం విశేషం. కేరళాకు చెందిన ఈమె పేరు అంజలి అమీర్. తను హిజ్రా కావడం మరో విశేషం. హిజ్రాలు ఇంతకు ముందు పలు చిత్రాల్లో నటించినా మలయాళ చిత్ర పరిశ్రమలో నటించిన తొలి హిజ్రాగా అంజలి అమీర్ కీర్తి పొందనున్నారు. ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించిన అంజలి అమీర్‌కు పేరంబు తొలి తమిళ సినిమా. ఇందులో మమ్ముట్టి సరసన నటించడానికి అంజలి అమీర్ మొదట సంకోచించారట. చిత్ర యూనిట్ పాజిటీవ్ అప్రోచ్‌తో నటించడానికి ముందుకొచ్చారట. ఇప్పుడు మమ్ముట్టితో కలిసి నటించడం సరికొత్త అనుభవం అంటున్నారు. అంతే కాదు ఆయన ప్రోత్సాహం మరువలేనిదని అంజలి అమీర్ చెప్పుకొచ్చారు. కాగా పేరంబు చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ప్రతినాయకుడిగా మమ్ముట్టి
సీనియర్ హీరోలను విలన్లుగా మార్చడం పరిపాటిగా మారిందనే చెప్పాలి.ఇటీవల నటుడు అరవింద్‌సామి తనీఒరువన్ చిత్రంతో విలన్‌గా మారారు. అదే విధంగా సత్యరాజ్, అరుణ్‌విజయ్ లాంటి వారిని ప్రతి నాయకులుగా మార్చేశారు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ కూడా కోలీవుడ్‌లో విజయ్‌కి విలన్ కానున్నారన్నది తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం తెరి చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, ఎమీజాక్సన్ నాయికలు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విజయ్ తన 60వ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ సంస్థకు చేయనున్నారు. దీనికి భరతన్ దర్శకుడు. కథానాయకిగా కాజల్‌అగర్వాల్ పేరు ప్రచారంలో ఉంది. ఇక పోతే ఇందులో విజయ్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయాలని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు ఆ తరువాత దక్షిణాది ప్రముఖ నటుడైతే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.అదీ ప్రతినాయకుడి ఇమేజ్ లేని నటుడైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయడంతో మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి అయితే బాగుంటుందని తలచి ఆయన్ని సంప్రదించారట. కథ విన్న తరువాత మమ్ముట్టి కూడా విజయ్‌కి విలన్‌గా మారడానికి సమ్మతించినట్లు తెలిసింది.అయితే ఆయన అందుకునే పారితోషికం కంటే రెండు రెట్లు అధికంగా చెల్లించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.కాగా ఇందులో విజయ్‌కు చెల్లెలిగా అమరకావ్యం,ఇండ్రు నేట్రు నాళై ,ఇత్రాల నియకి మియాజార్జ్ నటించనున్నట్లు సమాచారం. -
మా కెమిస్ట్రీ బాగుందంటున్నారు!
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి తెలుగు నాట కూడా అభిమానులున్నారు. ఆయన సినిమాలు చాలా మట్టుకు తెలుగులో అనువాదమయ్యాయి. డెరైక్ట్‌గా ‘రైల్వే కూలీ’, ‘సూర్యపుత్రులు’, ‘స్వాతికిరణం’ సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడాయన వారసుడు దుల్కర్ సల్మాన్ ‘ఓకే బంగారం’ ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో విడుదల చేశారు. గురువారం హైదరాబాద్ వచ్చిన దుల్కర్ పత్రికలవారితో ముచ్చటించారు. ‘‘తెలుగులో బంగారం లాంటి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తా. ఏ దేశంలోనూ లేనన్ని భాషలు మన దేశంలో ఉన్నాయి. ఏ భాషలో మంచి సినిమా వస్తే, ఆ భాషలో చేయాలని ఉంది. ఇక, ‘ఓకే బంగారం’ విషయానికొస్తే.. మణిరత్నంగారి సినిమా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. నేను కూడా అంతే. ఆయన ఈ పాయింట్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. సహజీవనం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. నిజజీవితంలో ఇది తప్పా? సరైనదా? అని చెప్పడానికి నేనెవర్ని? నిత్యామీనన్‌తో నాకిది మూడో చిత్రం. మా కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. కొంతమంది తెలుగువాళ్లు ఫోన్ చేసి అభినందించడం, ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఇక్కడ సినీ ప్రేమికులు ఎక్కువ’’ అన్నారు. ‘‘మీ నాన్నగారికన్నా మీరు మంచి ఆర్టిస్ట్ అని రామ్‌గోపాల్ వర్మ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొనడం, మీరు కూడా అందుకు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఈ విషయం గురించి మీరేమంటారు?’’ అని దుల్కర్‌ని ప్రశ్నిస్తే, ‘‘దాని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు’’ అన్నారు. ఒకవేళ వర్మతో సినిమా చేసే అవకాశం వస్తే - ‘‘కథ బాగుంటే... అప్పుడాలోచిస్తా’’ అని దుల్కర్ చెప్పారు.