చిన్నారుల మరణం బాధాకరం
కొవ్వొత్తులతో నివాళులర్పించిన విద్యార్థులు
శ్రీకాకుళం కల్చరల్: స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘట నలో అసువులు బాసిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని పట్టణానికి చెందిన చిన్నారులు ప్రార్థించారు. కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద ఠాగూర్ పబ్లిక్ స్కూల్, చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్, హెల్పింగ్ హేండ్స్, హిందీ మంచ్, యంగ్ ఇండియా, ఏపీటీఎఫ్ సభ్యులు కలసి సామూహికంగా శుక్రవారం సాయంత్రం నివాళులు అర్పించా రు. ఈ సందర్భంగా ఏడు రోడ్ల కూడలి వద్ద చిన్నారులంతా.. కలిసి మానవహారంగా ఏర్పడ్డారు.
అనంతరం కొవ్వొత్తులు వెలిగించి..చిన్నారుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ సం దర్భంగా శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ..గేట్లు లేని క్రాసింగ్ల వద్ద వెం టనే గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాల న్నారు. స్కూల్ యాజమాన్యాలు సైతం బస్సు ల నిర్వహణ, డ్రైవర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదంలో 16 మంది చిన్నారులు చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ బెహరా శ్రీదేవి, కరస్పాండెంట్ రవికుమార్, జేసీస్ సెనెటర్ నటుకుల మోహన్, చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు, జామి భీమశంకరరావు, బరాటం కామేశ్వరరావు, యంగ్ ఇండియా ప్రెసిడెంట్ మందపల్లి రామకృష్ణ, హిందీమంచ్ అధ్యక్షుడు ఏపీటీఎఫ్ నాయకుడు సదాశివుని శంకరరావు, నిక్కు హరిసత్యనారాయణ, గుమ్మా నాగరాజు, వెంకటేశ్వరరావు, కోన్శైర్ తదితరులు పాల్గొన్నారు.