Talasani Srinivas Yadava
-
‘చీకోటి’ కేసులో ఈడీ దూకుడు.. ఎమ్మెల్సీ రమణకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో కేసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేశ్, ధర్మేందర్ సంబంధాలపై ఈడీ బుధవారం ప్రశ్నించింది. చీకోటి నిర్వహించిన ఈ కేసీనోలకు వీరు కూడా హాజరయ్యారన్న సమాచారం మేరకు అధికారుల వారి నుంచి కూపీ లాగుతున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇక్కడ కరెన్సీని విదేశాలకు హవాలా ద్వారా చేరవేసి, అక్కడ కరెన్సీ తీసుకున్నారా? నిబంధనల ప్రకారం మార్పిడి చేశారా?.. ఇలా పలు అంశాలపై మంత్రి సోదరులను ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జరిగిన విదేశీ ప్రయాణాల విమాన టికెట్ల బుకింగ్ వ్యవహారాలనూ ఈడీ సేకరించినట్లు చెబుతున్నారు. వీరిని గురువారం కూడా మరోసారి విచారించనున్నట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసీనోలతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా! -
టీజర్ బాగుంది
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘ఎర్రర్ 500’ టీజర్ బాగుంది. యూనిట్ ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జస్వంత్ పడాల, నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో సందీప్ మైత్రేయ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రర్ 500’. యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. జస్వంత్ మాట్లాడుతూ– ‘‘ఎర్రర్ 500’ అందరికీ కనెక్ట్ అయ్యే కథ. నన్ను హీరోగా పరిచయం చేసిన బాలరెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ‘బిగ్ బాస్’ ఫేం జస్వంత్‌ని హీరోగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సందీప్. ఈ చిత్రానికి కెమెరా: శశాంక్ శ్రీరామ్– ప్రశాంత్ మన్నె, సంగీతం: ఫణి కల్యాణ్. -
9 నుంచి ‘మన బస్తీ.. మన బడి’ పనులు
సాక్షి,హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 9 నుంచి ‘మన బస్తీ – మన బడి’ పనులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం ఆయన మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లాలో ‘మన బస్తీ – మన బడి ’పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం తో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మన ఊరు –మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం 11 మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి రూ.7,289.54 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేశారన్నారు. వీటికి ఎస్టిమేషన్లను కూడా సిద్ధం చేసినందున ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్, పాఠశాల భవనాలకు రంగులు వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనేలా వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ‘మన బస్తీ – మన బడి’ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత డిప్యూటీ డీఈవోల పై ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించడంపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల వారిగా సిబ్బంది, ఉపాద్యాయుల ఖాళీలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. అధికారులు అందజేసే నివేదికను మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీ స్కూల్లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సమావేశం దృష్టికి తీసుకు రాగా, త్వరలో స్కూల్ ను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందజేస్తామన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అర్జున్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!) -
ఫిలిం జర్నలిస్టులకు ‘చిరు’ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ (ఫోటోలు)
-
గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని తలసాని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్న గవర్నర్.. వారి పరిమితులకు లోబడి మాట్లాడాలన్నారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని,ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యతా రాహిత్యం అవుతుందని, మీడియాతో గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదని తలసాని అన్నారు. గవర్నర్ ఎలా గౌరవించాలో తమతో పాటు తమ సీఎంకు తెలుసన్నారు. -
మంత్రి తలసాని చేతుల మీదుగా ‘యూత్ అబ్బా మేము’ పాటను
చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సముద్రాల మంత్రయ్య బాబు నిర్మించిన చిత్రం ‘లవ్ యు రా’. ఈ చిత్రంలోని ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాటయూట్యూబ్లో మంచి స్పందన అందుకుంటుంది. కంచరపాలెం మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్థి పాడిన ఈ సాంగ్‌ను పాటలు రత్నం బట్లురి రాయగా.. ఈశ్వర్ పెరవలి సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల మంత్రయ్య బాబు మాట్లాడుతూ.. ‘మా విన్నపాన్ని గౌరవించి ఈ సినిమాలోని పాటను విడుదల చేయడానికి ఒప్పుకున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయన ఋణం తీర్చుకోలేనిది. అద్భుతమైన కథతో సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది.. త్వరలోనే విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అన్నారు. దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ.. ఈ సినిమా లో ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను విడుదల చేసిన మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కథను వినగానే ఒకే చేసిన నిర్మాతగారికి కృతజ్ఞతలు.. అయన ఇచ్చిన ఈ అవకాశం వినియోగించుకుంటాను. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. కాగా ఈ సినిమాలో శేఖర్ బండి , సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, నాగిరెడ్డి, చిట్టి బాబు , తదితరులు నటిస్తున్నారు. -
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలపై భేటి కానున్న మంత్రి తలసాని
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలపై రాష్ట్ర పశుసంవర్థక శాఖ, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ భేటి ముగుసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్స్ మీడియాతో మాట్లాడుతూ.. థియేటర్ల కరెంట్ బిల్లులను మాఫి చేయాల్సిందిగా మంత్రిని కోరమన్నారు. విద్యూత్ బిల్లుల మాఫీకి ప్రభుత్వం అంగీకరించిందని, మిగతా సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎగ్జిబిటర్స్ పేర్కొన్నారు. కాగా ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ చార్జి వసూలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళి మోహన్, కార్యదర్శి సునీల్ నారంగ, సినీ ఎగ్జిబిటర్స్ సదానంద్ గౌడ్, అభిషేక్, అనుపమ్ రెడ్డి తదితరులు మంత్రిని కలిసి ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఎగ్జిబిటర్స్ తమ సమస్యలను యంత్రి దృష్టికి తీసుకేళ్లారు. దీంతో ఆయన త్వరలోనే వారి సమస్యలపై ఆయా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. -
నాలాల వెంబడి ఇళ్లలోని పేదలకు డబుల్ ఇళ్లు
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో నాలాలు, వరద ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి తగిన ప్రణాళిక రూపొందించి, ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాల్సిందిగా పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులకు సూచించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలో నాలాల పరిస్థితులపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతియేటా చేస్తున్న పనుల వల్ల శాశ్వత పరిష్కారం లభించక ప్రజాధనం దుబారా అవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలా కాకుండా నాలాల్లో పూడికతీత పనులకు ఆధునిక టెక్నాలజీ, మెషినరీ ఎక్కడ ఉన్నా వినియోగించేందుకు, వాటి లభ్యతపై అవసరమైతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పర్యటించి అధ్యయనం చేసేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా పూడికతీత పనుల్లో మనుషులను వినియోగించడం కూడా తగ్గుతుందని, తద్వారా వారి ఆరోగ్యానికి రక్షణ కలి్పంచినట్లవుతుందని పేర్కొన్నారు. పేదలకు డబుల్ ఇళ్లు... నాలాలపై నిరి్మంచిన అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుతో పునరావాసం కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, అందుకు అవసరమైన సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం దాదాపు రూ.45 కోట్లతో నాలాల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల వల్ల వరద నీటి ప్రవాహానికి అంతరాయాలు ఏర్పడుతున్నాయని పలువురు అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక రోజు వర్క్‌షాప్ నాలాల పూడిక తొలగింపు పనులు, నాలాల నీటి మళ్లింపు, అభివృద్ధి, చెరువుల పరిరక్షణ తదితర అంశాలపై మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ జరుగనున్నట్లు తలసాని తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధులు తదితర అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై అధికారులు తగిన విధంగా స్పందించాలన్నారు. నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నేతృత్వంలో నిపుణుల కమిటీని వెంటనే నియమించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు సూచించారు. క్షేత్రస్థాయిలోకి.. ఈ నెల 14వ తేదీ సోమవారం నుంచి వారాంతం వరకు జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ అధికారులంతా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్ వంటి ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, నాలాలకు సంబంధించిన సమస్యలు పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పనుల జాప్యంపై అసంతృప్తి.. నాలాలకు సంబంధించిన పనులు జనవరిలోనే జరగాల్సి ఉండగా, మార్చిలో చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జరగడం లేవని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్లను ఈ సమావేశానికి ఆహ్వానించి ఉంటే.. జరగని పనులపై ప్రశ్నలతో సమావేశం జరిగే పరిస్థితి కూడా ఉండదన్నారు. దాదాపు 221 కిలోమీటర్లకుగాను 207 కిలోమీటర్లలో దాదాపు 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు సీఈ దేవానంద్ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జియోట్యాగింగ్ ద్వారా పనులు పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఉందన్నారు. సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మా, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
-
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్ చాంబర్లో విజయలక్ష్మి, ఒకటవ అంతస్తులోని డిప్యూటీ మేయర్ చాంబర్లో శ్రీలత సర్వమత ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు తీసుకునే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలీ, ఈటల రాజేందర్, ఎంపీ కె.కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తా : మేయర్ విజయలక్ష్మి నగర ప్రజలకు సేవ చేసేందుకు తన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తానని సోమవారం మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. హైదరాబాద్ నగర మేయర్‌గా ప్రమాణం చేయడం తనకు లభించిన సంపూర్ణ గౌరవమని, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ! -
రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. చికెన్, గుడ్లు తింటే ఎలాంటి నష్టమూ జరగదన్నారు. దేశవ్యాప్తం గా వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డితో కలసి పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు, ప్రొఫె సర్లు, పశువైద్యశాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ వ్యాధి కనిపించినట్లు సమాచారం అందగానే పశుసంవర్థక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు చెప్పా రు. నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాలో కోళ్ల మృతిపై సమాచారం రాగానే 276 శాం పిల్స్ సేకరించామని, అలాగే గత మూడు రోజుల్లో వెయ్యి నమూనాలు పరీక్షించగా అన్నీ నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలు గా సహకరిస్తుందని తెలిపారు. మన రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితమన్నారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. గతం లో బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం మాత్రమే నష్టపోయిందని, మనుషులకు నష్టం జరగలేదని తెలిపారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్లను అందించే శక్తి చికెన్, గుడ్లకే ఉందన్నారు. భేటీలో అధికారులు అనితా రాజేంద్ర, రిజ్వీ, వాకాటి కరుణ, డా.శ్రీనివాస్ రావు, డా.వి.లక్ష్మారెడ్డి, డా.రాంచందర్, బ్రీడర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.హర్షవర్ధన్ రెడ్డి, బ్రీడర్స్ ప్రధాన కార్యదర్శి జి.రమేశ్ బాబు, నెక్ సీఈవో కె.జి.ఆనంద్, చైర్మన్ ఏ.గోపాల్‌రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు కె.మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు, చంద్రశేఖర్ రెడ్డి, స్నేహ చికెన్ డి.రాఘవరావు పాల్గొన్నారు. 25లోగా హాస్టళ్లకు బియ్యం సరఫరా సమావేశంలో గంగుల, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 25వ తేదీలోగా సన్నబియ్యం అందుబాటులో ఉంచాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సన్నబియ్యంతో పాటు పప్పు, ఉప్పులు, నూనె, ఇతర రేషన్ సరుకులను అందుబాటులో ఉంచడంతో పాటు శానిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 26 తర్వాత హాస్టళ్లలో వసతులపై మంత్రులు, శాసన సభ్యులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాట్లను మంత్రి గంగుల మంగళవారం తన కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాదాపు 9 నెలల నుండి హాస్టళ్లు, స్కూల్స్ మూతపడి ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు పౌరసరఫరాల సంస్థ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని ప్రతినెల 8,500 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని చెప్పారు. దాదాపు 74వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోగా గోదాముల నుండి హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు రవాణా చేయాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
తలసాని కోసం 40 నిమిషాలు ఎదురు చూశాం
సాక్షి, హైదరాబాద్: లక్ష ఇళ్లు చూపిస్తా అన్నా తలసాని రెండో రోజు పర్యటన మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్లారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండి పడ్డారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతు మమ్మల్ని వదిలేసిన ప్రాంతంలోనే మళ్లీ వస్తారని 40 నిమిషాలు వేచి చూశామని తెలిపారు. శనివారం ఇందిరా భవన్ పీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నుంచి కేటీఆర్, తలసాని వరకు అందరూ గ్రేటర్ సిటీ ప్రజలను ప్రతి ఎన్నికల సమయంలో మోసం చేస్తూ ఓట్లు దండుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పేదల అవసరాలను ఓట్లుగా మలుచుకొని ఆ తరువాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. 2016 అసెంబ్లీలో కేసీఆర్.. 2017 లో కేటీఆర్.. 2020లో తలసాని అసెంబ్లీలో లక్ష ఇళ్లు అన్నారు. గత ఎన్నికల్లో ఒక్క ప్రాంతంలో ఇళ్లు కట్టి గ్రేటర్ సిటీ ఓట్లు దండుకున్నారు. 150 డివిజన్లలో 96వేలు ఇళ్లు ఉండాలి.. కానీ ప్రభుత్వం చూపించింది 3,400 మాత్రమే. 24 నియోజవర్గాల్లో 96వేల ఇళ్లు ఉండాలి.. నాలుగు నియోజవర్గాల్లో 3వేల ఇళ్లు మాత్రమే చూపించారు’ అని తెలిపారు భట్టి. (చదవండి: ‘డబుల్’ కాక) ‘గ్రేటర్‌లోనే ఇళ్లు చూపిస్తా అన్న తలసాని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజావర్గంలో ఉన్నవి చూపించారు. మహేశ్వరం దగ్గర ఉన్న ఇళ్లు ఇప్పటి కావు 2016లోవి. అక్కడి ప్రజల ఇండ్లను గ్రేటర్ సిటీ ఇళ్లు అని మాయ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కేవలం 3,400 ఇళ్లు మాత్రమే కట్టారు.. ఒక లక్ష ఇళ్లు అన్న మాట అవాస్తవం. నాలుగేళ్ల క్రితం 150 కుటుంబాలను అంబేద్కర్ కాలనీలో ఖాళీ చేయించారు.. ఇప్పటి వరకు ఆ కాలనీ అంతా ఖాళీగానే ఉంది. మల్లెపల్లిలో సైతం శంకుస్థాపన చేసి ఖాళీగా వదిలేశారు. నాలుగేళ్ల నుంచి పేదల ఇబ్బందలు పట్టించుకోవడం లేదు. మోసాలకు పాల్పడే టీఆర్ఎస్ను మళ్ళీ నమ్మితే పేదలకు న్యాయం జరగదు. ప్రభుత్వ మోసాలను గ్రేటర్ సిటీలో ప్రతి డివిజన్లో తిరిగి చెప్తామన్నారు భట్టి. -
సినిమాలకు సడలింపులు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నివాసంలో టాలీవుడ్ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్‌ల ప్రారంభం, టాలీవుడ్ సమస్యలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు పాటించేందుకు సిద్దంగా ఉన్నామని అయితే సినిమా రంగానికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని చిరంజీవి కోరారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. షూటింగ్‌లకు అనుమతి సంబంధించిన సీఎం కేసీఆర్‌తో చర్చించాకనే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అయితే ఒకట్రెండు రోజుల్లోనే సినిమా రంగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సినీ రంగానికి సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, దిల్‌రాజు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రాజమౌళి, కొరటాల శివ, సి.కల్యాణ్, జెమిని కిరణ్, స్రవంతి రవికిషోర్ , వినాయక్, త్రివిక్రమ్, ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? సుద్దాల అశోక్ తేజకు శస్త్రచికిత్స.. ! -
గద్దెనెక్కిన వరాల తల్లి
-
తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి
‘‘కళలపై రసమయికి ఉన్న మక్కువతో ‘తుపాకి రాముడు’ సినిమాని నిర్మించాడు. బిత్తిరి సత్తి గురించి అందరికీ తెలిసిందే. వీరు కలిసి చేసిన ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వమని నిర్మాత ‘దిల్’ రాజుతో మాట్లాడాను. కొంత నష్టమైనా భరించాలని చెప్పాను. ఆయన ధైర్యంగా ముందుకొచ్చారు’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బిత్తిరి సత్తి, ప్రియ జంటగా టి. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తుపాకి రాముడు’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్ బిగ్ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి ఓ సినిమా చేశాడు. ఇప్పుడు హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందర్నీ తెలంగాణ వారినే పెట్టి మంచి సినిమా తీశాడు. తెలంగాణ కళలు, సంప్రదాయాలు, బతుకమ్మ పండగ గురించి తీసిన సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకాదరణతో 100 రోజులు ఆడాలి’’ అన్నారు. ‘‘శంకర్ అన్నలా ‘శ్రీరాములయ్య’ వంటి గొప్ప సినిమా తీయాలనే నా కోరిక ‘తుపాకి రాముడు’తో తీరింది. సినిమా నిర్మించడం కంటే విడుదల చేయడం కష్టమని ‘దిల్’ రాజుగారిని కలిశాక తెలిసింది’’ అని రసమయి బాలకిషన్ అన్నారు. ‘‘ఎప్పుడూ నవ్వించే సత్తి ఈ చిత్రంతో ఏడిపిస్తాడు కూడా’’ అని బిత్తిరి సత్తి అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిర్మాత శివకుమార్, నటులు రాజ్ తరుణ్, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
‘బలవంతంగా నిమజ్జనం చేయడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్‌ను చేరుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి అవుతుందని తెలిపారు. కాగా మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేలా హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్ సాగర్‌లో పూడిక తీశారని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారన్నారు. మొదటి రోజు నుంచి కూడా అధికారులు భక్తులకు, సందర్శకులకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, మేము బలవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం లేదు స్పష్టం చేశారు. ఒకవైపు ముస్లింల పండుగ మొహర్రం జరుగుతోంది.. మరోవైపు వినాయకచవితి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు అన్ని ఏర్పాట్లుచేసి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం సాగర్‌లో నిమజ్జనం అవుతుందని తెలిపారు. -
ప్రతి పశువుకూ ఆరోగ్యకార్డు
యాచారం(ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలోని ప్రతి పాడి పశువుకు సంబంధించి ఆరోగ్య(ఆధార్) కార్డు జారీ చేస్తున్నామని, పశువుల ఆరోగ్యం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలియజేశారు. మండల పరిధిలోని చింతపట్ల గ్రామం లో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ లిక్కి సరితారెడ్డి అధ్యక్షతన గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసి పశువులకు రాయితీపై దాణాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గొల్లకురుమలు ఆర్థికంగా బాగుపడేందుకు సీఎం కేసీఆర్ రూ. 4,500 కోట్ల నిధులతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. మొదటివిడతలో భాగంగా 7 లక్షల పంపిణీకి 4 లక్షల గొర్రెలను అందజేసినట్లు వివరించారు. మరో 3 లక్షలకు పైగా జీవాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జీవాల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నారని తెలిపారు. గొల్లకురుమలకు అందిస్తున్న జీవాలు ఆరోగ్యంగా ఉండి అధిక బరువుంటే మాంసం ఉత్పత్తి పెరుగుతుందనే ఉద్దేశంతో నట్టల నివారణ మందులను ఏడాదికి మూడుసార్లు వేస్తున్నట్లు తెలిపారు. జీవాల ఎదుగుదల, మాంసం ఉత్పత్తి పెరుగుదలతో కాపరులు ఆర్థికంగా బాగుపడుతారని చెప్పారు. ఈ ఏడాది రూ. 7 కోట్లు ఖర్చు చేసి నట్టల నివారణ మందులేయనున్నామని, తద్వారా రూ. 300 కోట్ల మాంసం ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు జీవాలను అమ్ముకోకుండా కాపాడుకొని మంచి ఆదాయం పొంది ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. గాలికుంటు వ్యాధి పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. గొర్రెల పథకం కింద పంపిణీ చేసిన జీవాలు రోగాలబారినపడి చనిపోతే వెంటనే వేరే గొర్రెలను ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం డివిజన్లో పశువులు, గొర్రెల, మేకల పెంపకం అధికంగా ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది సరిగా లేకపోవడంతో జీవాలు, పశువులు మృత్యువాత పడుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది, ఆస్పత్రుల ఏర్పాటు విషయమై నివేదిక పంపిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్, సీఈఓ మంజువాణి, ఎండీ లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్, ఎంపీపీ వరŠాధ్యవత్ రజితారాజునాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీటీసీ ఎండీ షాహిన్, పీఏసీఏస్ ఉపాధ్యక్షుడు లిక్కి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, చింతపట్ల ఉప సర్పంచ్ పెండ్యాల వెంకటేష్ సాగర్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. యాచారం: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులు, పాడి పశువులకు దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమావేశంలో మాట్లాడారు. మూగజీవాల ఆరోగ్యం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. మూగజీవాల కోసం సర్కారు 1962 టోల్‌ఫ్రీ నంబరు ప్రవేశపెట్టిందని, ఆ నంబర్‌కు రైతులు పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్ చేయొచ్చని, వెంటనే అంబులెన్స్ వచ్చి సిబ్బంది చికిత్స చేస్తారని అన్నారు. ప్రతి పశువైద్యశాలలో ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆ సమయంలో చింతపట్ల గ్రామానికి చెందిన రైతు బండ పర్వతాలు లేచి ‘సార్ నీవు చెప్పేది నిజం కాదు.. ఆస్పత్రిలో మందులు ఉండడం లేదు. డాక్టర్లు మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేసుకోమని అంటున్నారు. 1962కు ఫోను చేసినా అంబులెన్స్ రావడం లేద’ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చింతపట్ల వెటర్నరీ సబ్ సెంటర్లో ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఇబ్బందిగా ఉందన్నాడు. దీంతో మంత్రి తలసాని ఆగ్రహానికి గురయ్యారు. పర్వతాలను పిలిచి ‘నీవు కాంగ్రెస్ పార్టీ నాయకుడివా... రా పైకి అంటు స్టేజీ మీదికి’ అంటూ పిలిచారు. మంత్రి సూచన మేరకు పర్వతాలు తన ఫోన్ ద్వారా 1962కు కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులు తమ ఫోన్ ద్వారా కాల్ చేయగా స్పందించారు. మంత్రి వారితో మాట్లాడి రైతులు ఫోన్ చేస్తే ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై క్ష్రేతస్థాయిలో ఏ సెంటర్‌లోనైనా రైతులకు కావాల్సిన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో ఫోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన జనాలతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. చేప ప్రసాదం కోసం ఈ రోజు 32 వేల చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ రేపు సాయంత్రం వరకూ మరో 1.28 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. 32 కేంద్రాల ద్వారా చేప ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు. -
ఇబ్బందులు కలగకుండా చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : చేప మందు ప్రసాదం కోసం వచ్చే వారికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 173 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా బత్తిని హరనాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేపమందు ప్రసాదం కోసం మన రాష్ట్రం నుంచే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకునేలా సీఎస్‌తో చర్చింమన్నారు. చేపమందు ప్రసాదం కోసం వచ్చేవారికి జీహెచ్ఎంసీ అధ్వర్యంలో రూ.5కే భోజన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ అధ్వర్యంలో రవాణా ఏర్పాట్లు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే వారందరికి సరిపడా చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు భేష్ : బత్తిని ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేప మందు ప్రసాదం కార్యక్రమం కోసం అనేక ఏర్పాట్లు చేస్తోందన్నారు బత్తిని హరనాథ్ గౌడ్. 8వ తేదీ సాయంత్రం మొదలై 9వ తేదీ రాత్రి వరకూ చేప ప్రసాదం అందజేస్తామన్నారు. ఒక వేళ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దొరక్కపోతే.. తమ నివాస గృహాల్లో.. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రసాదం అందజేస్తారని తెలిపారు. చేప ప్రసాదం కోసం గత ఏడాది లానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలందరికి సరిపోయే విధంగా చేప ప్రసాదం తయారు చేస్తామన్నారు. -
ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బాధ్యతగా వ్యవహరించాలని కౌంటింగ్ ఏజెంట్లకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సికింద్రా బాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లు, కార్పొరేటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6.30 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో ఎలాంటి సందేహాలు వచ్చినా... అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల బాధ్యతల గురించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ అవగాహన కల్పించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, స్టీఫెన్ సన్, పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే గవర్నర్‌ను కలిశాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తాజా ఎన్నికల్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి.. పార్టీ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను అందజేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను గవర్నర్‌కు అందజేశామని తెలిపిన ఎమ్మెల్యేలు.. పరిచయం కోసం మాత్రమే గవర్నర్‌ను కలిశామంటూ.. తాము గవర్నర్‌ను కలువడంలో ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. మరోవైపు కొత్తగా కొలువుదీరనున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తిగా మారింది. కొత్త మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. వీరు గవర్నర్‌ను కలువడం కూడా ఊహాగానాలకు తావిస్తోంది. -
తగు చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 1న పాడి గేదెల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో పశుసంవర్థకశాఖ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, విజయ డెయిరీ, మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ చైర్మన్లు శ్రీనివాసరావు, గుత్తా జితేందర్‌రెడ్డి, రాజేశ్వరరావులతో పాడిగేదెల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష జరిపారు. కలెక్టర్ల ఖాతాలకు ఈ పథకం నిధులు నేడో రేపో జమచేస్తామని మంత్రి తెలిపారు. డెయిరీలు వారి సభ్యుల ఆధ్వర్యంలో గేదెలు కొనుగోలు చేయడానికి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారుడు కోరుకున్న ప్రాంతం, ఎంపిక చేసుకున్న గేదెను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందని, గేదె ఆరోగ్య పరిస్థితిని వైద్యుడు పరీక్ష చేసి నిర్ధారణ చేసి ఇస్తారన్నారు. యూనిట్ కాస్ట్ రూ.80 వేలుగా నిర్ణ యించామని, ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ, బీసీ లకు 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. దీనిపై డెయిరీల ప్రతినిధులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయ బ్రాండ్‌కు ప్రచారం కల్పించండి విజయ డెయిరీ బ్రాండ్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, దీని కోసం భారీ ఎత్తున ప్రచారం కల్పించాలని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. విజయ డెయిరీని ప్రైవేటు సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయాలని సూచించారు. సచివాలయంలోని తన చాంబర్లో సందీప్‌కుమార్ సుల్తానియా, విజయ డెయిరీ చైర్మన్లతో దీనిపై మంత్రి సమావేశం నిర్వహించారు. -
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, కె.పి.వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేయడంతో పాటు, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయహోదా రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేస్తున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజల అవసరాలను కేంద్రం గుర్తించడం లేదన్నారు. అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమానంగా చూడటంలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఇప్పుడున్న సీట్లు కూడా రావని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలను పార్లమెంటులో అవిశ్వాస చర్చ సందర్భంగా దేశమంతా గమనించిందని, కౌగిలింతలు, కన్నుగొట్టడాలేనా రాహుల్ చేయగలిగిందని తలసాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి ప్రమాదమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీ వైపే మొగ్గుచూపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వాదనను దేశం ముందుకు తెచ్చారని తలసాని చెప్పారు. కాంగ్రెస్ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై రాజకీయాలు చేస్తున్నదన్నారు. దేశానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపులో టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష పాటించడం లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు సీట్ల దందానే: శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ నష్టపోయినా పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు సీట్లదందాలో మునిగిపోయారని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. సమైక్యరాష్ట్రంలో లాభపడిన ఆంధ్రాకే మరోసారి ప్రత్యేకహోదా పేరిట లాభం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందా అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా ఉన్నా పార్టీ నిర్ణయాలను ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలకు పదవుల ధ్యాస, సీట్ల దందా తప్ప ప్రజలపై ధ్యాసలేదని, ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కి వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావని, వారు ఏం చేసినా తెలంగాణలో టీఆర్ఎస్దే మళ్లీ అధికారం అని చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రా పార్టీ: జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కేవలం ఏపీ పార్టీ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలసి తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుత తెలంగాణకు వ్యతిరేకంగా అప్పటి సమైక్య రాష్ట్ర సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఏపీ ప్రయోజనాలను తప్ప తెలంగాణను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు, నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు మెదిపిన పాపాన పోలేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా పక్షపాతి అని తేలిపోయిందన్నారు. రాహుల్‌గాంధీ ఒక ప్రాంతీయ పార్టీలో సాధారణ నాయకునిలా మాట్లాడారని, అలాంటి తెలివితక్కువ నాయకుడ్ని ఏనాడూ, ఎక్కడా చూడలేదని అన్నారు. -
పాడి గేదెల పంపిణీకి రూ.800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు త్వరలో రూ.800 కోట్లతో 50% సబ్సిడీపై పాడిగేదెలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విజయ డెయిరీతోపాటు నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్ డెయిరీలకు పాలుపోసే 2.17 లక్షల మందికి పాడిగేదెలను పంపిణీ చేస్తామని, ఇప్పటికే సీఎం ఈ ఫైల్‌పై సంతకం చేశారని ప్రకటించారు. రైతులకు లీటరు పాలకు రూ.4 చొప్పున ప్రోత్సాహకానికి ఏడాదికి రూ. 100 కోట్లు అందిస్తున్నామని, రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపునకు రూ.50 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది 80 కోట్ల చేపపిల్లలు.. ఈ ఏడాది 80 కోట్ల చేపపిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారిగా 22 కోట్లు, గతేడాది 51 కోట్ల చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేశామని పేర్కొన్నారు. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 9 రిజర్వాయర్లలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకంతో సత్ఫలితాలు ఇచ్చిందని, ఈ ఏడాది మరిన్ని రిజర్వాయర్లలో రొయ్యల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు, బ్లూ రెవల్యూషన్ కింద హేచరీల ఏర్పాటుకు ముందు కొచ్చే వారికి రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 మొబైల్ ఫిష్ ఔట్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పశువైద్యశాలల్లో మరమ్మతులు రాష్ట్రంలోని వివిధ పశువైద్యశాలల్లో సరైన వసతులు లేవని, మరమ్మతులు, విద్యుత్, పెయింటింగ్, ప్రహరీల పనులను పంచాయతీ రాజ్, పశుసంవర్థకశాఖ అధికారులు కలసి గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించే విధంగా త్వరలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. -
వారికి పుట్టగతులు లేకుండా చేస్తాం: తలసాని
సాక్షి, మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, డీకే అరుణకు మహబుబ్‌నగర్‌లో పుట్టగతులు లేకుండా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక్కడి నుంచి గెలిచి, ఒక్క పని చేయకుండా ఎన్నికల కోసం మళ్లీ వచ్చి పేదలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలకుంటున్నారని విమర్శించారు. సోమవారం జిల్లాలోని హన్వాడలో గొర్రెల దాణా పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్ నగర్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్సిడీపై ఇచ్చిన గొర్రెలు చనిపోతే ఐదు రోజుల్లో మరో గొర్రెను ఇస్తామని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే పాత జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కానీ అలా జరగకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్రలు, పాదయాత్రలు చేపట్టి వారికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఏనాడు ప్రజల కోసం పనిచేయని వారు ఇప్పుడు కాగ్ నివేదిక గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందని మండిపడ్డారు.