telangana agricultural trade union
-
వానమ్మ.. రావమ్మా
బాల్కొండ : మృగశిర కార్తె దాటి వారం గడిచినా వానల జాడలేదు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమైన రైతులు ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. పుడమి తల్లి పులకరించేలా వర్షం కురియక పోవడంతో విత్తనాలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల 46 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు అందులో పాతిక శాతం కూడా పంట విత్తే పనులు ప్రారంభం కాలేదు. గతేడాది మృగశిర కార్తే నుంచే వర్షాలు కురువడంతో దాదాపుగా జూన్ మధ్య మాసం వరకు ఆరు తడి పంటలను విత్తడం పూర్తయింది. ఈసారి జూన్ మధ్య మాసం వచ్చినా పంటలు విత్తుట ప్రారంభం కాలేదు. ఆర్మూర్ విడిజన్‌లో బోరు బావుల ఆధారంగా కొంత మంది రైతులు ముందస్తుగా రోహిణి కార్తే ప్రారంభం నుంచే పంటలు విత్తడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు భారీ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరు బావులు ఎత్తిపోతున్నాయి. ఉన్న నీటికి వర్షాలు తోడు అయితే పంటలు మొలకెత్తుతాయని రైతులు ఆశించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. భానుడి ప్రతాపం తగ్గక పోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి. కొందరు రైతులు పసుపు పంటను కూడా విత్తారు. ప్రస్తుతం వానలు లేక పోవడంతో పరేషాన్ అవుతున్నారు. పసుపు పంట విత్తనం మార్కెట్లో లభించే అవకాశం లేదు. ఒక్కసారి విత్తితే మళ్లీ పంట దిగుబడి వచ్చిన తరువాతనే విత్తనం లభిస్తుంది. వర్షాలు లేక పోవడంతో పూర్తి స్థాయిలో మొలకెత్తే అవకాశం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాన పడుతుందని పంటను విత్తాను బోరుబావుల్లో నీరు ఉండటం, వానలు పడుతాయని ఆశతో పసుపు పంటను విత్తాను. ఇప్పుడు వర్షాలు లేక పోవడంతో నీరు సరిపోవడం లేదు. విత్తిన పంట పూర్తిగా మొలకెత్తుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. వానలు కురువాలని మొక్కుతున్నాం. – దేవేందర్, వన్నెల్(బి), రైతు ఏటా ఇదే దుస్థితి ఉంది వాన కాలం ప్రారంభమైనా వానలు కురవడం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉండటంతో సకాలంలో విత్తనాలు విత్తలేక పోతున్నాం. ఇప్పటి వరకు పసుపు పంట విత్తడం పూర్తి కావాలి. కాని వానలు లేక మొగులుకు మొకం పెట్టి చూస్తున్నాం. – ఎల్లరెడ్డి, రైతు, నాగంపేట్ -
భూ సేకరణ నిబంధనలపై పిటిషన్
- హైకోర్టులో దాఖలు చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం - ముసాయిదా నిబంధనలు జారీ చేయలేదని ఆరోపణ - నిబంధనల తుది నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూ సేకరణ చట్టం 2013కు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర భూ సేకరణ నిబంధనలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నిబంధనలకు సంబం« దించి తుది నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సం ఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు పిటిషన్ దాఖలు చేశారు. కేసు తేలేంత వరకు ఈ నిబంధనలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని ఆయన కోర్టును కోరారు. ఇందులో రెవెన్యూ శాఖ (భూ సేకరణ) ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చారు. ‘చట్ట ప్రకారం ముసాయిదా నిబంధనలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అభ్యంతరాలు సమర్పించేందుకు ప్రజలకు తగిన గడువు ఇవ్వాలి. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆ నిబంధనలకు తుది రూపు ఇవ్వాలి. కాని ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాల సమర్పణకు నాలుగు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఇది సరికాదు’ అని పేర్కొన్నారు. అభ్యంతరాలు పట్టించుకోలేదు.. ప్రస్తుత కేసులో ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది నోటిఫికేషన్ జారీ చేసిందని వెంకటరాములు ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ భూ సేకరణ చట్ట నిబంధనలను జూలై 10వ తేదీ వరకు జారీ చేయలేదు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను, గెజిట్ నోటిఫి కేషన్‌ను వెబ్సైట్లోనూ ఉంచలేదు. అయితే అక స్మాత్తుగా ముసాయిదా నిబంధనలకు సంబంధించిన జీవో 92 జారీ అయింది. ఈ జీవో జూలై 10న ప్రభుత్వ వెబ్సైట్లో దర్శనమిచ్చింది. జూన్ 30న జారీ చేసినట్లు పేర్కొంటూ తుది నిబంధనలకు సంబం ధించిన జీవో 120ని కూడా ప్రభుత్వం జూలై 10నే వెబ్సైట్లో ఉంచింది. ఉద్దేశపూ ర్వకంగానే ఈ రెండు జీవోలను జూలై 10వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంచ లేదు’ అని ఆరోపించారు. స్థానిక భాషల్లో ఉత్తర్వులు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బాధిత వర్గాల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం ఈ నిబంధనలను జారీ చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు.