Telangana govt
-
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ జరిగింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు బదిలీ కాగా, సుధీర్‌బాబును హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా నియమించారు. ఇక రాచకొండ సీపీగా తరుణ్జోషిని నియమించారు. రామగుండం సీపీగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్, టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ సౌత్‌వెస్ట్ డీసీపీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఉద్యమంతో మొదలై... ఉజ్వలమై..
త్వరలో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ అర్హులైన పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించాం. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తాం. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉద్యమ ప్రస్థానంతో మొదలై.. ఉజ్వల ప్రగతి వైపు తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని.. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగిడుతున్న రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే తక్కువ వయసున్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి పరుగులో ముందు వరుసలో నిలబడిందని.. తొమ్మిదేళ్లలోనే ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధించి, పదో సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఒక మైలురాయి అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెబుదామని పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాలకు కొత్త పథకాలను ప్రకటించారు. కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రిగా నేను వాగ్దానం చేశాను. తెలంగాణను దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ తొమ్మిదేళ్లలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ల కాలం వృధాగా పోయింది. మిగతా ఆరేళ్లలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మారుమోగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలు అందుకుంటోంది. అనేక సవాళ్లు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. ఇప్పుడు పరుగులు తీస్తోందంటే అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజల సహకారమే కారణం. బీసీల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా గొల్ల, కురుమలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం. ఈ నెల 24 నుంచి పోడు పట్టాలు రాష్ట్రంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం తీరుస్తోంది. ఈ నెల జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. అటవీ భూములపై ఆధారపడిన 15 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కలి్పంచనున్నాం. అదేవిధంగా వారికి రైతుబంధు పథకాన్ని కూడా వర్తింపజేస్తాం. అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పేదల ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని 9 జిల్లాల్లో ప్రారంభించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభిస్తాం. ఉద్యమంలా దళితబంధు దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30లక్షల మందికి దళిత బంధు అందించనున్నాం. రైతు బంధువులకు రూ.65 వేల కోట్ల సాయం రాష్ట్రంలో రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై వచి్చన స్పష్టత ఆధారంగా.. నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదు. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం. నూతన సచివాలయం.. భారీ అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయ సౌధం రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. గతంలో ముఖ్యమంత్రి కూర్చునే చాంబర్‌కు వెళ్లేదారి ఒక చీకటి గుహలోకి ప్రవేశించినట్టుగా ఉండేది. ఉద్యోగులు ఆఫీసు టేబుళ్ల మీదనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి ఇక్కట్లేవీ లేకుండా అధునాతన హంగులతో, అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ, వాస్తు నిర్మాణ కౌశలం ఉట్టిపడేలా కొత్త సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. బాబాసాహెబ్ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టుకోవడంతోపాటు.. సచివాలయం సమీపంలోనే 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. సచివాలయానికి మరోవైపు అమరవీరుల స్మారకం నిర్మించుకున్నాం. ఒకవైపు భారీ అంబేడ్కర్ విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుని విగ్రహం, నభూతో న భవిష్యతి అన్నరీతిన నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరులను ప్రతిరోజూ స్మరణకు తెచ్చే అమరజ్యోతి.. ఇవన్నీ మనకు నిత్యం కర్తవ్య బోధ చేస్తుంటాయి. సచివాలయం ఎదురుగా ఉన్న విశాలస్థలంలో తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. నిరంతర ప్రక్రియగా పేదలకు గృహ నిర్మాణం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల సముదాయం ఓ టౌన్íÙప్ను తలపించేలా ఉంది. అక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించాం. ఇదో ఉదాహరణ మాత్రమే. పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగిస్తునే ఉంటాం. సురక్షిత జలాల మిషన్ భగీరథ మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే.. ప్రజలను ఓట్లు అడగబోనని రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉంది. తెలంగాణ ప్రారంభించిన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్ యోజన’ పేరిట పథకాన్ని అమల్లోకి తెచ్చింది. విద్యుత్ విజయం తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుకాగా.. ఇప్పుడు 18,453 మెగావాట్లకు పెంచుకున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లే ఉండగా.. ఇప్పుడు 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. సాగునీటి రంగంలో స్వర్ణయుగం సమైక్య రాష్ట్రంలో మూలనపడ్డ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయడంతో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. వలసల జిల్లా ఉమ్మడి పాలమూరు ఈరోజు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతోంది. వలస వెళ్లిన జనం సొంతూర్లకు తిరిగి వచి్చ.. పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దంపడుతూ ‘‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసి, చెరువులన్ని నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది..’’ అని నేనే స్వయంగా పాట రాశాను. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతానికిపైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీక అయిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని యావన్మందీ కొనియాడుతున్నారు. అలాగే కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఇటీవల నేను స్వయంగా ఆ ఆలయానికి వెళ్లి పరిశీలించి, దేశంలో కెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల చొప్పున కేటాయించాం. పనులు పురోగతిలో ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయం సైతం ఇదేవిధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మన రాష్ట్రంలో కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉంది. రైతుబంధుకు రూ. 65 వేల కోట్ల సాయం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై స్పష్టత ఆధారంగా.. నగదును రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందట్లేదు. ఒకవేళ రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన 10 రోజుల్లోపే రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నాం. బీసీల్లోని కులవృత్తిదారులకు రూ. లక్ష సాయం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. గొల్ల, కురుమలకు భారీగా గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం. ఉద్యమంలా దళితబంధు దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కో ట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30 లక్షల మందికి దళితబంధు అందించనున్నాం. కాశీ, శబరిమలలో వసతిగృహాలు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ నుంచి కాశీకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహం నిర్మించబోతున్నాం. అదేవిధంగా శబరిమలకు వెళ్లే తెలంగాణ భక్తుల కోసం అక్కడ వసతి గృహం నిర్మిస్తున్నాం. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చివరిగా ‘ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు.. ప్రాణిషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు..’ అని శ్లోకంతో ప్రసంగం ముగించారు. -
రిమాండ్‌ను సవాల్ చేస్తూ బండి సంజయ్ పిటిషన్
-
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం ఖాయం : మల్లారెడ్డి
-
'ఆచార్య' టీంకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన చిత్రం ఆచార్య. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆచార్య టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 29 నుంచి మే 5వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. -
అందరి ఆకాంక్షల చదువు
ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఇప్పటికే ఈ విషయంలో చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటిదాకా విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవంతులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలిప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలవు. విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అధ్యాపకులందరినీ వృత్తిపరమైన క్రమశిక్షణను అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయం భారతీయ జనతా పార్టీ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వేసిన మాస్టర్ స్ట్రోక్! ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మ ఒడి వంటి పథకాలు జనసామాన్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అటు పట్ట ణాలు, నగరాల్లో మాత్రమే కాదు... పల్లెపట్టుల్లోనూ వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ప్రజల్లోనూ అలాంటి పథకాలు తమకూ అందుబాటులోకి వస్తే బాగుంటుందన్న కాంక్ష బలపడటం అసహజమేమీ కాదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు ఈ రెండు పథకాలు కలిసివస్తాయనడం లోనూ ఎలాంటి సందేహం లేదు; 2018 ఎన్నికల్లో రైతు బంధు మాదిరిగా! జాతీయ పార్టీల తీరు అటు బీజేపీ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అంగీకరించలేవు. ఎందుకంటే ప్రాంతీయ భాషల సెంటిమెంటుతోనే ఈ పార్టీలు 70 ఏళ్లుగా తమను తాము బలపరుచుకుంటున్నాయి మరి! కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతో ఈ అంశంపై ఒకసారి చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం ఇంగ్లిష్ మీడియం బోధనపై సమస్యలు సృష్టిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేరళ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని నాతో వ్యక్తం చేశారు. అయితే... ఈ మేధా వులు, చదువుకున్న వారందరూ కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారన్న సంగతి మరచిపోకూడదు. భారతీయ జనతా పార్టీని తీసుకుంటే... రాష్ట్ర, జాతీయ స్థాయిలు రెండింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై ఆలోచన చేయడం లేదు. కానీ.. ధనికుల పిల్లలు చదువుకునేందుకు ప్రైవేట్ స్కూళ్లు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే నడిపేందుకు మాత్రం ఓకే చేస్తుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ శాలల, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్య పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలని అంటోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. ఆ పార్టీకి ఆర్థికంగా మద్దతిచ్చే పారిశ్రామిక వేత్తలు, భూస్వామ్య పోకడలున్న వారు సులువుగా డబ్బు సంపా దించేందుకు దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియం విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర విభాగాలేవీ కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాము ఇంగ్లిష్ బోధన అందిస్తామని చెప్పలేక పోతు న్నాయి. మతం, కమ్యూనలిజంల చుట్టే ఆ పార్టీ అజెండా ఉంటుం దన్నది వేరే సంగతి. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని ఇప్పుడు గ్రామీణ ప్రజలు సైతం అర్థం చేసుకున్నారు. పేద, ధనిక తార తమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలి ప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. మౌలిక సదుపాయాలు తోడైతేనే... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు మౌలిక సదు పాయాలూ తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలిగే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలంటే ఎయిర్ కండీషన్ ఉన్న తరగతి గదులు కావాలని కాదు. ఈ దేశానికి అలాంటివి అస్సలు అవసరం లేదు. కావాల్సిందల్లా ప్రాథమిక అవసరాలను తీర్చగలిగేవి మాత్రమే. మంచి తరగతి గదులు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివన్నమాట. వీటన్నింటికీ మించి నిబద్ధతతో పాఠాలు బోధించే మంచి ఉపాధ్యాయుల అవసరమూ ఎంతో ఉంది. పాఠ్యపుస్తకాల్లోనివి వల్లెవేసే వారు కాకుండా... పరిస రాలను అర్థం చేసుకుని కనీస జ్ఞానంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జా తీయ అంశాలను పిల్లలకు పరిచయం చేయగలిగిన వారు కావాలి. పాఠ్యపుస్తకాలు ఇతర టీచింగ్ మెటీరియల్ సరఫరా కూడా కీలకమే. 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలు... దేశంలో విద్యకు సంబంధించి గత 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలే అమల్లో ఉన్నాయి. ధనికులకు ఇంగ్లిష్‌లో, పేదలకు ప్రాంతీయ భాషల్లో బోధన సాగుతూ వచ్చింది. ఇరు వర్గాల మధ్య సౌకర్యాల అంతరమూ చాలా ఎక్కువే. ఫలితంగా పేదవారు, గ్రామీణ విద్యా ర్థులు జీవితంలో అన్ని దశల్లోనూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఈ విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవం తులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులకు ధైర్యంగా నిర్ణయించడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటివరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇంతటి వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పుకు యోచన కూడా చేయలేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని ప్రకటించినా ఏడేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన గురించి ఆలోచన కూడా చేయలేకపోయారు. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థలను బలపరిచే చర్యలు చేపట్టినా... గ్రామీణ స్థాయిలో పాఠశాల విద్యా బోధన నాణ్యత పెంచడం పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఒక దశలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంతో బలహీనమైంది కూడా. పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్యోగాలకు పోటీ పడే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటర్మీడియెట్ స్థాయిలో బోధన సక్రమంగా లేకపోవడంతో కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపింది. పాఠశాల స్థాయి ఉపా ధ్యాయులు మాత్రమే కాదు.. విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకుల ఇంగ్లిష్ ప్రావీణ్యత అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఆహ్వానించదగ్గ పరిణామం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ తగిన మౌలిక సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియం వైపు మళ్లించడం ఈ మార్పుల దిశగా వేసే తొలి అడుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలు పెట్టడం ఎంతైనా ఆహ్వానించదగ్గది. అయితే ఇది ఇక్కడితో ఆగి పోరాదు. పాఠశాల ఉపాధ్యాయులకు భాషతోపాటు కంటెంట్‌కు సంబంధించి తగిన శిక్షణ ఇవ్వడం ఒక పార్శ్వమైతే... టీచింగ్ వ్యవ స్థకు కొంత క్రమశిక్షణ నేర్పటం ఇంకోటి. ఉపాధ్యాయులు, అధ్యాప కుల ప్రజాస్వామ్య హక్కులకు గౌరవమిస్తూనే... విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అందరినీ వృత్తి పరమైన క్రమశిక్షణ అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. చైనీయుల మాదిరిగా విద్య నాణ్యత పెంచాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి అంతగా ఉన్నట్లు లేదు. జాతీయ విద్యా విధానం ఒక్కటే వ్యవస్థలో అన్ని మార్పులూ తీసుకురాదు. బీజేపీ మతతత్వ వాదం మైనార్టీలను ఆ పార్టీకి దూరం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలో విద్యావ్యవస్థనేమీ అంతర్జాతీయ స్థాయికి చేర్చలేదు. లేదా గ్రామీణ విద్యావ్యవస్థను చైనా మాదిరిగా మెరుగు పరచలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలు ఈ దిశగా వేస్తున్న అడుగు లకు అందరూ తమవంతు మద్దతివ్వాల్సి ఉంది. వ్యాసకర్త: ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
నాది హామీ..కోటి టన్నులైనా కొంటాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘వానాకాలానికి సంబంధించి తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజను చివరివరకు కొంటాం. ఈ సీజన్లో ఎంతమేర ధాన్యం సేకరించాలన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి మించి ధాన్యం వచ్చినా సేకరిస్తాం. ఎంతైనా కొంటాం.. అది కోటి మెట్రిక్ టన్నులు అయినాసరే. పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం అన్నతేడా లేకుండా కనీస మద్దతు ధరలతో తీసుకునేందుకు సిద్ధం. ఈ విషయంలో తెలంగాణ రైతాంగానికి కేంద్రమంత్రిగా నాది హామీ’’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, సోయం బాపూరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్లో ధాన్యం కొనబోమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా, చెపితే చూపించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 25 రోజులుగా కొనుగోళ్లను నిలిపేయడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని.. ధాన్యాన్ని మిల్లులకు పంపించే సోయి లేదుగానీ కేంద్రాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాల వల్లే రైతులు గందరగోళంలో పడ్డారని.. కొనుగోళ్లు జరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అనంతరం కేసీఆర్ తీవ్రంగా భయపడుతున్నారని.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవుతాడో లేడో అన్న ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పుత్ర వాత్సల్యం ప్రగతిభవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకుందని, అందుకే లేని సమస్యను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. యాసంగి ప్రణాళిక రాష్ట్రానిదే.. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం చెప్పిందని.. రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటలకు విత్తనాలు, ఎరువులు, రుణాలపై ఓ విధానం రూపొం దించుకోవాల్సింది రాష్ట్రమేనని.. దానిని వదిలేసి కేంద్రంపై విమర్శలు చేయడం ఏమిటని నిలదీశారు. పంజాబ్‌లోనైనా, తెలంగాణలోనైనా కేంద్రం ఒకే విధానంతో ముందుకెళుతుందని.. సీఎం కేసీఆర్ తరహాలో గజ్వేల్‌కు ఓ న్యాయం, దుబ్బాకకు మరో న్యాయం ఉండదని వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..!
సాక్షి, హైదరాబాద్: భూముల వేలం ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుండటంతో తాజాగా మరో 117.35 ఎకరాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్, పుప్పాలగూడలోని 35 ప్లాట్లను వచ్చే నెల 27, 29 తేదీల్లో వేలం వేసేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆదివారం సాయంత్రం నుంచే ఆన్లైన్లో వేలం వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఖానామెట్‌లో 22.79 ఎకరాల విస్తీర్ణంలో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 94.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 26 ప్లాట్లు వేలం వేయనున్నారు. సెప్టెంబర్ 27న ఖానామెట్, 29న పుప్పాలగూడలో ఈ వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ నిర్వహణకు టీఎస్ఐఐసీని రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు విధానం, వేలం ప్రక్రియ తదితరాలపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో టీఎస్ఐఐసీ ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం తేదీలు, అప్సెట్ ధర, ఈఎండీ, ఇతర నిబంధనలు సోమవారం వెలువడే నోటిఫికేషన్లో ఉంటాయని టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే 6 నెలల్లో మరిన్ని భూములు సైతం! ప్రభుత్వ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ.20వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కరోనా, లాక్డౌన్ తదితర పరిస్థితుల్లో గత నెలలో జరిగిన వేలం పాటలో రూ.2729.78 కోట్లు సమకూరాయి. ప్రస్తుత వేలం ద్వారా సుమారు రూ. 6 వేల కోట్లు సమకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే 6 నెలల్లో ఉప్పల్ భగాయత్ పరిధిలో ఖాళీగా ఉన్న ప్లాట్లతోపాటు మియాపూర్ మెట్రో సమీపంలోని స్థలాలను కూడా వేలం వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మియాపూర్ సమీపంలోని హెచ్ఎండీఏ భూములతోపాటు జవహర్‌నగర్, బుద్వేల్, రావిర్యాల, కొంగర ఖుర్ద్, మహేశ్వరం, తుమ్మలూరు ప్రాంతాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్లాట్లను రాబోయే రోజుల్లో వేలం వేసే అవకాశమున్నట్లు తెలిసింది. -
ఒక్క మెట్టు ఎక్కితే ‘వారసత్వ’ హోదా!
వెబ్‌డెస్క్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. కాకతీయ వైభవం వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను పాలించిన కాకతీయులు ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. వరంగల్ ఖిల్లా, వేయిస్థంభాలగుడి, పానగల్ దేవాలయం, గొలుసుకట్టు చెరువులు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నింటీలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ కట్టడానికి వారసత్వ హోదా తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. జులై 16న ప్రపంచంలోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు హెరిటేజ్ హోదా ఇచ్చే యునెస్కో హెరిటేజ్ కమిటీ 2021 జులై 16న చైనా కేంద్రంగా వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో 21 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని వారసత్వ హోదా ప్రదానంపై ఆన్లైన్లోనే తమ ఓట్లు వేయనున్నారు. 16న జరిగే రామప్ప ఆలయానికి హోదా రావాలంటే మెజారిటీ ఓట్లు రావాల్సి ఉంటుంది బరిలో 255 కట్టడాలు ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉండగా భారతదేశం నుంచి 38 కట్టడాలకు, ప్రదేశాలకు చోటుదక్కింది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి 255 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతున్నాయి. భారతదేశం నుంచి 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించగా, 2021 సంవత్సరానికి గాను గుజరాత్ రాష్ట్రంలోని హరప్పా నాగరికతలో భాగమైన ధోలవీర ఆలయాన్ని ప్రతిపాదించారు. శిల్పి పేరుతోనే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. శాండ్బాక్స్ టెక్నాలజీ రామప్ప ఆలయాన్ని నిర్మించి 808 ఏళ్లు కావస్తున్నప్పటికీ చెక్కు చెదరకుండా చూపరులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఇసుకపై ఆలయాన్ని నిర్మించారన్నమాట. మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపి దానిపై రాళ్లను, శిలలను పేర్చుకుంటూ పోయి ఆలయాన్ని నిర్మించారు. నీటిపై తేలియాడే ఇటుకలు ఆలయ గోపురం బరువు తగ్గించేందుకు తేలికైన ఇటుకలు ఉపయోగించారు. వీటిని ప్రత్యేక పద్దతిలో తయారు చేశారు. ఈ ఇటుకలు నీటిలో తేలియాడుతాయి. సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకల సాంద్రత కేవలం 0.8 . దీంతో ఇవి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ విశేషాలు ఆలయానికి లేత ఎరుపువర్ణం కలిగిన అరుదైన రాయిని వినియోగించడంతో నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండటానికి కారణంగా పేర్కొంటున్నారు. కట్టడం బరువు ఎక్కువగా ఉన్న చోట తేలికగా ఉండే గ్రానైట్, డోలమైట్, బ్లాక్ గ్రానైట్లను వినియోగించి ఆలయాన్ని నిర్మించడం రామప్ప శిల్పికే సాధ్యమైంది. శిల్పకళ ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఐదేళ్ల శ్రమ రామప్ప ఆలయాన్ని యునెస్కో జాబితాలో చోటు కల్పించేందుకు కాతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్ వరంగల్ చాప్టర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లుగా కృషి చేస్తున్నాయి. దీంతో 2017లో యూనెస్కో హెరిటేజ్ సైట్ టెంటిటీవ్ లిస్టులో చోటు సాధించింది. ఆ తర్వాత ఐకోమాస్ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్) సభ్యుడు, యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన (థాయ్‌లాండ్) 2019 సెప్టెంబర్‌లో ఆలయాన్ని సందర్శించారు. ప్రతి ఆంశాన్ని క్షుణ్ణంగా పరీశీలించి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామప్ప ఆలయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం (డోషియర్) రూపొందించి యూనెస్కోకు సమర్పించారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి యునెస్కో గుర్తింపుకోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడంతో, దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌లతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం జూన్ 24న ఢిల్లీకి వెళ్లింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం అందించింది. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చరిత్రకు సత్కారం ఈ హోదా లభిస్తే ఘనమైన కాకతీయుల చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతుంది. ఆలయం పూర్తిగా యునెస్కో అధీనంలోకి వెళుతుంది. ప్రత్యేకంగా నిధులు అందే అవకాశంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది. యునెస్కో గుర్తింపు నేపథ్యంలో విదేశీ పర్యాటకులు పెరుగుతారు. స్థానికులకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. -
నీళ్లను ఆంధ్రాకు అమ్మేశారు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొదటి నినాదమైన నీళ్లను ఆంధ్రాకు అమ్మేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ నంబర్ 1 ద్రోహిగా కేసీఆర్ నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి అపెక్స్ కమిటీలోనే ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుని ద్రోహం చేశారని, ఏ సోయితో కేసీఆర్ ఒప్పుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ల కేటాయింపులు, ప్రాజెక్ట్‌ల విషయంలో తాము చెప్పిన విషయాలపై శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాము చెప్పినవి తప్పయితే ముక్కు నేలకు రాయడమే కాదు శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లలో దూకి చావడానికి సిద్ధమన్నారు. వాస్తవాలని నిరూపిస్తే.. కేసీఆర్ తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కంటే ఏడాది ముందే పాలమూరు–రంగారెడ్డి పనులకు శంకుస్థాపన చేసినా ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన దద్దమ్మ కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించాలి... దళిత సాధికారత సమావేశంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం తక్షణమే పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సంజయ్‌ను కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కళ్యాణ్ నాయక్ మంగళవారం కలిశారు. పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, సీఎంకు కళ్యాణ్‌నాయక్ పంపించిన వినతిపత్రం ప్రతులను జతచేసి సీఎంకు సంజయ్ లేఖ రాశారు. -
ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఒప్పందాలు కుదిరాకే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని.. కానీ ఏపీ మాత్రం ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టును విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారని.. కానీ తాగునీటి కోసమనే పేరిట ఈ ప్రాజెక్టు నుంచి రాయలసీమ, నెల్లూరుకు సాగునీరు తరలిస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణ కంటే తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించడం అన్యాయమన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 300 మీటర్ల వెడల్పుతో కాల్వలు తవ్వుతోందని.. మొత్తం నదినే మళ్లించి, రిజర్వాయర్‌ను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వాడుకునేందుకే జోగుళాంబ బ్యారేజీ, భీమా ఇరిగేషన్ కాల్వను ప్రతిపాదించామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేయరేం.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. మరి ఏపీ అక్రమ ప్రాజెక్టుల మీద ఎందుకు కేసులు వేయడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయి కేసీఆర్‌కు మంచి పేరు వస్తే ఎలాగనే దురుద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని ఆరోపించారు. నదీ జలాలు, ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని విమర్శించారు. -
అంబులెన్స్‌లను ఆపడం విజ్ఞతేనా?
హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తికి దారి తీసింది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లవచ్చు. కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది. ఒక నాయకుడు చేసే తప్పు ప్రజలకు ఎంత అనర్థంగా మారుతుందో చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి పార్లమెంటు చట్టం చేసింది. దాని ప్రకారం 2024 వరకు హైదరాబాద్ తెలంగాణతో పాటు ఏపీకి కూడా రాజధానిగా కొనసాగవచ్చు. కాని ఆ అవకాశాన్ని ఆనాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేజేతులారా వదులుకుంది. దాని విపరిణామాలను ఆంధ్రా ప్రజలు అనుభవించవలసిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. కరోనా సంక్షోభం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతుందని ఎవరైనా ఊహించగలరా? కరోనా బారిన పడినవారు హైదరాబాద్‌లో అయితే మరింత మంచి వైద్యం లభిస్తుందన్న నమ్మకమో, లేక వారికి ఉన్న పరిచయాల రీత్యా హైదరాబాద్ బెటర్ అనుకునో అంబులెన్స్‌ల ద్వారా ట్రీట్మెంట్ కోసం వస్తుంటే తెలంగాణ పోలీసులు వాటిని నిలుపుదల చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా ఇది మంచి పద్ధతి కాదని, మానవత్వంతో వ్యవహరించాలని సూచించింది. అయినా మే 14వ తేదీన మళ్లీ తెలంగాణ పోలీసులు ఆయా సరిహద్దులలో ఏపీ అంబులెన్స్‌లను ఆపివేశారు. ఆయా చోట్ల ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడినా ప్రయోజనం దక్కలేదు. ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరుపవలసి వచ్చింది. అలాగే రాజకీయపరంగా కూడా తెలంగాణ నేతలతో ఏపీ నేతలు మాట్లాడారు. చివరికి హైకోర్టు తలుపు తడితే కానీ అంబులెన్స్‌లకు దారి వదలలేదు. హైకోర్టు వారు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఎందుకు ఏపీ అంబులెన్స్‌లను నిలుపుదల చేస్తున్నారు? దానికి ఒకటే కారణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో అనేక ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా బాధితులతో బెడ్స్ అన్నీ నిండిపోయాయి. దాంతో కొత్త పేషంట్లు వచ్చినా చేర్చుకునే పరిస్థితి కనిపిం చడం లేదు. ఏపీ వారు కాబట్టి సహజంగానే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకపోవచ్చు. అసలే హైదరాబాద్‌లో బెడ్స్ రద్దీ ఏర్పడితే, పొరుగు రాష్ట్రాల బాధితులు కూడా ఇక్కడకే వస్తే, తెలంగాణలో కరోనా బారినపడ్డ బాధితులకు బెడ్స్ దొరకవన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన కావచ్చు. అయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చేవారిని అనుమతించక తప్పదు. రాష్ట్రాల సరిహద్దులను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే మిగిలిన రాష్ట్రాలకు, ఏపీకి తేడా ఉంది. ఏపీ ప్రజలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. మొదటి వేవ్ సమయంలో కొన్ని వేల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు. అప్పుడు సరిహద్దులు మూసివేయడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏపీలోకి అనుమతించారు. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ప్రస్తుతం అంబులెన్స్‌లనే నిరోధిస్తున్నారు. దీనివల్ల కొందరు బాధితులు అంబులెన్స్లలోనే ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. గతంలో సాగర్ వద్ద కూడా రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన తోపులాట ఆందోళన కలిగించింది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఆయా సంస్థల విభజన పూర్తి కాలేదు. ఆస్తుల పంపిణీ జరగడం లేదు. వీటన్నిటికి మూలం ఏమిటి? పదేళ్ల ఉమ్మడి రాజధానిని ఎవరు, ఎందుకు వదులుకున్నారు? వీటన్నిటికీ ఒకటే కారణం కనిపిస్తుంది. 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చడానికి ప్రయత్నించారన్నది అప్పట్లో వచ్చిన అభియోగం. ఆ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి టీడీపీని గెలిపించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అది ఎలాగో కేసీఆర్‌కు తెలిసిపోయింది. ఆయన తెలివిగా, వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వచ్చిన ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పట్టుకుని అరెస్టు చేశారు. అదే తరుణంలో ఈ కేసులో చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఒక ఆడియో సాక్ష్యం కూడా దొరికింది. దాంతో చిక్కుల్లో పడ్డ చంద్రబాబు అప్పట్లో తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పెద్దల ద్వారా కేసీఆర్‌తో రాజీ చేయించుకున్నారు. అప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి ఏపీకి వెళ్లిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కండిషన్ పెట్టారని అంటారు. దాంతో చంద్రబాబు రాత్రికి, రాత్రే తట్టా, బుట్టా సర్దుకుని విజయవాడ వెళ్లిపోయారు. అక్కడ ఒక్క వసతి లేకపోయినా, అతిథి గృహాలలో ఉంటూనో, ఐదు కోట్ల రూపాయల విలువైన బస్‌లో గడుపుతోనో పాలన సాగించారు. పైగా దానికి ఒక బిల్డప్ కూడా ఇచ్చారు. ఏపీ ప్రజలకు దగ్గరగా ఉండడం కోసమే ఏపీకి వెళ్లానని అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత తాత్కాలిక నిర్మాణాలు చేసి సచివాలయాన్ని తరలించారు. ఆ రకంగా హైదరాబాద్‌పై ఏపీ ప్రజలకు ఉన్న హక్కులను వదులుకున్నారు. నిజానికి అప్పట్లో మా బోటివాళ్లం ఏపీ ప్రజలకు హైదరాబాద్‌లో విద్య, వైద్యం, ఉపాధి, నివాస హక్కులు ఉండేలా ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టంగా వాదించేవారం. ఆ హక్కుల సంగతేమో కానీ, ఉన్న హక్కు కూడా వదులుకుని ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాం. ఏపీలో సరైన సదుపాయాలు ఇంకా అభివృద్ధి కాలేదు. అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న సదుపాయాలను ఆంధ్ర నుంచి వచ్చేవారు వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం షరతులు పెడుతోంది. ఇలా ఆయా సందర్భాలలో జరిగే పరిస్థితి రావడం బాధాకరం. హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆం్ర«ధా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్ల్ల వచ్చు. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఒక పరిష్కారం కనుగొని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి. ఇది ఆయన బాధ్యత కూడా. దానిని ఆయన విస్మరిస్తే రాజకీయంగా కూడా అది నష్టం చేస్తుంది. ఆ విషయం ఆయనకు తెలియదని అనలేం. ఉదాహరణకు 2018 శాసనసభ ఎన్నికలలో కాని, ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కాని సెటిలర్లు మెజార్టీ టీఆర్ఎస్కే ఓటు వేశారు. ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో టీడీపీతో కలిసిన కాంగ్రెస్‌కు జనం ఓట్లు వేయలేదు. అలాగే ఇటీవలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కూకట్ పల్లి, శేరీలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాలలోని డివిజన్లలో టీఆర్ఎస్ అత్యధికంగా గెలిచింది. అక్కడి సెటిలర్లు టీఆర్ఎస్కు ఓటువేయడమే కారణం. ఆ విషయాలను టీఆర్ఎస్ విస్మరించరాదు. అనూహ్యంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తి్తకి దారి తీసింది. కానీ చిత్రం ఏమిటంటే ప్రతిదానికీ స్పందించే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అంబులెన్స్‌లను సరిహద్దులలో ఆపడాన్ని ఖండించకపోవడం కూడా అంతా గమనించారు. ఏది ఏమైనా కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు , కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది. మరోసారి ఇలాంటివి జరగరాదని ఆశిద్దాం. వ్యాసకర్త : కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
కోవాగ్జిన్ రెండో డోసుపై ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ నిలిపి వేయగా.. కేంద్రం నుంచి సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి వ్యాక్సినేషన్ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్న ఆరోగ్యశాఖ వెల్లడించింది. ( చదవండి: కరోనాకు ధైర్యమే మందు అంటూ... ) -
మరోసారి 4 లక్షలు దాటిన కేసులు, 4 వేల మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరోసారి దేశంలో 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరింది. గడిచిన 24గంటల్లో 4,092 మంది కోవిడ్ బాధితులు మరణిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,42,362 కు చేరింది. వైరస్ బాధితుల్లో ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 37,36,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,186 కోవిడ్ కేసులు నమోదవడగా.. వైరస్ బాధితుల్లో 38మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,704 పెరిగింది. -
భూదాన్ భూముల కబ్జాపై గురి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉంది. ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూదాన భూములపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తాజాగా అసైన్డ్, దేవాదాయ భూముల కబ్జాలు తెరపైకి రావడంతో పనిలోపనిగా భూదాన భూముల నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని భావిస్తోంది. అక్రమార్కులను గుర్తించేందుకుగాను గతంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనలను, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోనుంది. మరోవైపు భూదాన భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో.. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం నుంచి భూదాన ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలను సేకరించారు. భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం ఈ ఉద్యమం ఉద్దేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2.51 లక్షల ఎకరాలకుపైగా భూమి భూదానోద్యమంలో జమ అయింది. పేదలకు పంపిణీ చేయగా ఇంకా అందులో 1.65 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నాయి. నల్లగొండలో 28 వేలు, ఖమ్మంలో 30 వేలు, మహబూబ్‌నగర్‌లో 40 వేలు, రంగారెడ్డి జిల్లాలో 20 వేలకుపైగా ఎకరాల భూములున్నాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా భూధాన భూములన్నాయని రెవెన్యూ రికార్డులు చెపుతున్నాయి. వీటిలో కొన్ని భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల స్థలాల కోసం భూదాన బోర్డు అప్పట్లో పంపిణీ చేసింది. ఆక్రమణలు.. రియల్ దందాలు పేదలకు పంపిణీ చేయగా మిగిలిన భూములపై అక్రమార్కులు కన్నేసి వేలాది ఎకరాలను కబ్జా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎకరాల కొద్దీ భూములను కొందరు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. మియాపూర్ భూములు, బీబీనగర్‌లలో వేల ఎకరాల భూదాన భూములను కూడా ఇలాగే మింగేశారు. అటు సివిల్ కోర్టుల్లోనూ, ఇటు రెవెన్యూ కోర్టుల్లోనూ కేసులు వేసి ఆ భూములు తమవేనంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. భూదానబోర్డు చాలా భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దానిని రద్దు చేసింది. ఈ భూములపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. రికార్డులు సేకరించే పనిలో... డిజిటల్ సర్వేలో భాగంగా సర్వే నంబర్లవారీగా భూదాన భూముల లెక్క తేల్చేందుకు అవసరమైన రికార్డులన్నింటినీ సేకరించేపనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. భూదాన భూముల ఆక్రమణలపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించి వాటిని ప్రజావసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. సర్వే అనంతరం ఈ భూదాన భూములపై వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వివాదాలన్నింటినీ పరిష్కరించి దశాబ్దాలుగా నలుగుతున్న భూదాన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. -
కరోనా కల్లోలం : తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్లకు అదనంగా, మరో 25 శాతం పెంచాలని అధికారులను ఆదేశించింది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలెక్టివ్ ఆపరేషన్లలను వాయిదా వేసుకోవాలని సూచించింది. అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బెడ్స్ సంఖ్యని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చేందకు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలందరు మాస్క్‌ను విధిగా ధరిస్తూ, సామాజిక దూరంపాటించాలని.. దీనిపై ఏమాత్రం అశ్రధ్ధ చేయోద్దని వైద్యారోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. చదవండి: కొంప ముంచిన అంత్యక్రియలు.. చనిపోయాక పాజిటీవ్.. దీంతో! -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే.. కొత్త ఉద్యోగ నియామకాలకు ఆటంకం కలగదన్నారు. గురువారం శాసనసభలో పెన్షన్ సవరణ బిల్లును, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. అప్పర్ సీలింగ్ రూ.70 వేలుగా ఖరారు చేసినట్లు చెప్పారు. వైద్య చికిత్సల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు పెంచుతున్నట్లు మంత్రి సభకు వివరించారు. ఈ పథకాన్ని మాజీ సభ్యులతో పాటు వారి సహ చరులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భాగన్న వైద్య చికిత్స సమయంలో సీలింగ్ రూ.లక్ష మాత్రమే ఉండటంతో మరింత నగదు చెల్లించాల్సి వచ్చిందని, అప్పట్లో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకూడదని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ 61కి పెంపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదివరకే నాల్గో తరగతి ఉద్యోగులకు అరవై ఏళ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బందికి 65 సంవత్సరాలు, న్యాయ సిబ్బందికి 60 ఏళ్లు పదవీ విరమణ వయోపరిమితి ఉందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో 60 ఏళ్ల వరకు ఉందన్నారు. ఉద్యోగుల సీనియార్టీని, అనుభవాన్ని వినియోగించు కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ సంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మానవుని సగటు జీవిత కాలం కూడా పెరిగిందని, దీంతో ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు పనిచేసే వెసులుబాటు ఇస్తున్నామని ఆయన వివరించారు. -
తెలంగాణపై చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి నిధుల హామీలు పారిస్తున్నారు. తెలంగాణకు నిధులిచ్చేందుకు మాత్రం కేంద్రానికి మనసు రావడం లేదు’ అని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను ఆదుకుని, ప్రాధాన్యతా రంగాలకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తవుతున్నాయని, 70 దేశాల రాయబారులు ఇక్కడి జీనోమ్ వ్యాలీని సందర్శించారని.. ఇంత ప్రాముఖ్యత ఉన్న నగరానికి తగిన సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదేమని నిలదీశారు. బుధవారం శాసనసభలో మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులు.. సీఎం తరఫున ప్రభుత్వ రంగసంస్థలు, ఐఅండ్ పీఆర్ పద్దులపై కేటీఆర్ సమాధానమిచ్చారు. వ్యాక్సిన్ ఇక్కడ.. బాట్లింగ్ అక్కడనా?: అంతర్జాతీయంగా మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారవుతుండగా.. 1,200 కిలోమీటర్ల దూరంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖసోలిలో వ్యాక్సిన్ బాట్లింగ్ను చేపడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నో విషయాల్లో దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ వరదల్లో మునిగిపోతే.. కేంద్రం నుంచి అందిన సాయం సున్నా అని విమర్శించారు. ‘‘104 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా వరదల బారినపడ్డ హైదరాబాద్‌కు రూ.1,350 కోట్ల తక్షణ సాయం అందించాలని సీఎం కేసీఆర్ లేఖ రాసినా కేంద్రం నుంచి ఒక్కపైసా రాలేదు. ఐటీ, ఎయిరోస్పేస్, వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉన్న తెలంగాణకు రూ.832 కోట్లు అందించాలని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరికి లేఖ రాస్తే.. ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదంటూ తిరుగుటపా వచ్చింది. దేశాభివృద్ధిలో హైదరాబాద్ కు ఐదు శాతం జీడీపీ వాటా ఉన్నా.. కేంద్రం ఎందుకు తోడ్పాటు అందించడం లేదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్.. హైదరాబాద్ ఫార్మాసిటీ, బయోటెక్‌పార్క్, మెగా టెక్స్టైల్ తదితరాలపై రాష్ట్రం మొర ఆలకించడం లేదు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై ఉలుకూ పలుకు లేదు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నా కూడా.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఎక్కడో ఉన్న బుందేల్‌ఖండ్‌కు తరలించారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు విస్తారంగా పండుతుంటే.. అక్కడ తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని ఎన్నికల హామీలిస్తారు. ఇవన్నీ చూస్తుంటే అసలు కేంద్రం ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు. ఎదుగుతున్న రాష్ట్రాన్ని వేరుగా చూడటం సరికాదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు ఆధార్ లింకేజీ పొడిగింపు హైదరాబాద్‌లో 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు పొందేందుకు ఆధార్ లింకేజీ తప్పనిసరని, దీనికి తుది గడువును వచ్చేనెల 30 వరకు పొడిగించామని కేటీఆర్ చెప్పారు. ఉచిత నీటికి సంబంధించి ఏడాదికి రూ.480 కోట్లను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రస్తావించిన అంశాలపై ఆయన ఈ సమాధానాలు ఇచ్చారు. మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల పనులను 71 మున్సిపాలిటీల్లో మొదలుపెట్టగా 11 చోట్ల పూర్తయ్యాయని, మిగతా చోట్ల త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరానికి గత ఆరున్నరేళ్లలో వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాల కింద మొత్తం రూ.67,149.23 కోట్లు ఖర్చుచేసినట్టు వెల్లడించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేవించి.. ‘‘మీరు అక్కడే ఉంటారు. మేం ఇక్కడే ఉంటాం. అనుకున్నవన్నీ పూర్తి చేస్తాం. అనుమానం వద్దు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
అసలు ట్రాఫికే లేకుండా గమ్యాన్ని చేరుకోగలిగితే!
ట్రాఫిక్ చిక్కులకు దూరంగా... సీట్లు దొరకని కిక్కిరిసే ప్రయాణాలకు భిన్నంగా... అలసట అనే మాటే వినపడకుండా... కాలుష్యమనేదే లేకుండా... ఆకాశవీధిలో విహరిస్తూ... ‘కాంక్రీట్ జంగల్’ మధ్యలోంచి నిమిషాల వ్యవధిలో గమ్యం చేరుకోగలిగితే..! కలల అలలపై తేలియాడేలా నిత్యం ఈ అనుభూతి కొనసాగితే? పర్యాటక ప్రాంతాలను గగన వీక్షణం ద్వారా తిలకించగలిగితే!! విదేశాల్లోనో లేదా పర్యాటక ప్రాధాన్యతగల రాష్ట్రాల్లోనో ఉండే ఈ సౌకర్యం మనకూ అందుబాటులోకి వస్తే ఎంతటి ‘భాగ్యం’ అనుకుంటున్నారా? సరిగ్గా ఇదే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు, నగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రాఫిక్ నరకప్రాయంగా మారిన సిటీలో మెట్రో రైలు సౌకర్యం వచ్చాక పరిస్థితి కాస్త మెరుగుపడినా కీలక సమయాల్లో మెట్రో రైళ్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే మార్గాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసే దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాల్లో రోప్‌వే మార్గాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో రెండు కారిడార్లతోపాటు యాదాద్రిలో మరో కారిడార్ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అస్సాం, గుజరాత్ గిర్నార్, తూర్పు ముంబైలోని సెవ్రీ నుంచి ఎలిఫెంటా గుహల వరకు ఉన్న రోప్‌వే మార్గాల తరçహాలోనే హైదరాబాద్‌లోనూ రోప్‌వే ఏర్పాటు చేయాలనుకుంటోంది. 50 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే ఈ రవాణా వ్యవస్థలో ఉండే ఒక్కో క్యాబిన్లో 8 మంది ప్రయాణికులు కూర్చొనే డిజైన్‌ను పరిశీలిస్తోంది. అలాగే కేబుల్ రిలే టవర్స్‌లో 30 మంది వరకు కూర్చొనేలా కూడా ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. సింగపూర్‌లో రహదారులపై ఏర్పాటు చేసిన రోప్‌వే మార్గం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే అధ్యయనం చేసింది. ఏయే ప్రాంతాల్లో..? హైదరాబాదీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. అంటే పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల మధ్య రోప్‌వే రవాణా ఏర్పాటు చేయాలని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్ నుంచి సచివాలయం, ప్యారడైజ్ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు ఉన్నాయి. అలాగే పర్యాటకులతోపాటు భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు. -
గణతంత్రంపై కరోనా ఎఫెక్ట్.. సంబరాలు రద్దు
చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మొదలైనా నిబంధనలు... తగు జాగ్రత్తలతో ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వస్తున్న గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. సంబరంగా కాకుండా నామమాత్రంగా వేడుకలు నిర్వహించాలని పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో కాకుండా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో సాదాసీదాగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే యోచనలో ఉంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది. అట్టహాసంగా వేడుకలు వద్దని.. ర్యాలీలు నిషేధమని ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొంటే కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని వేడుకలపై ఆంక్షలు విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే జెండా వందనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్వాతంత్ర్య సమరయోధులను వారి ఇళ్లకే వెళ్లి సన్మానించాలని తెలిపింది. విద్యార్థులు, వయోధికులు, ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా టీవీ, రేడియో, సోషల్ మీడియాలో గణతంత్ర వేడుకలు వీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
హైదరాబాద్‌లో ఉచితంగా 57 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఇకపై ఎక్స్ రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, రేడియాలజీ పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో 8 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. లాలాపేట, శ్రీరాంనగర్, అంబర్పేట్, బార్కాస్, జంగంపేట, పానీపురా, పురానాపూల్, సీతాఫల్‌మండిల్లో ఉప ముఖ్యమంత్రి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితి లేదని, వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని లాలాపేట డయాగ్నొస్టిక్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 57 రకాల పరీక్షలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి పరీక్షలు కూడా అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో మొత్తం 57 రకాల రక్త పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
వ్యాక్సినేషన్‌పై తెలంగాణకు కేంద్రం ప్రశంస
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తోందంటూ కితాబు ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ శాతం మంది వైద్య సిబ్బంది ముందుకు వచ్చి టీకా వేయించుకోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుకు, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి, వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లకు రిజ్వీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి టీకాల పంపిణీ మొదలైంది. 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండో రోజు (18వ తేదీ) 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం (19వ తేదీ) 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,625 మందికి వ్యాక్సిన్లు వేశారు. -
దేశంలోనే తొలిసారి పాలమూరులో అబ్బురం
సాక్షి, మహబూబ్‌నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో బుధవారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఏరో స్పోర్ట్స్, పారా మోటార్ ఛాంపియన్ షిప్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీపడుతున్న ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, వరల్డ్ అడ్వెంచర్స్, ఎయిర్ స్పోర్ట్స్ ఎయిర్ షో ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవింగ్, పారా మోటార్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మోటార్ పైలెట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ షో, పారామోటార్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆరు టాస్క్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. గతేడాది గాలిపటాల ఉత్సవాలను నిర్వహించగా ఈసారి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారు. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. త్వరలోనే అతిపెద్ద పరిశ్రమ మహబూబ్‌నగర్ జిల్లాకు రాబోతుందని ప్రకటించారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
క్షణాల్లో ఈ–పాస్‌బుక్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత వెబ్సైట్ ద్వారానే అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయించే విషయంలో సబ్ రిజిస్ట్రార్లకు గతంలో ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేసినట్లు తెలిపారు. స్లాట్‌లోని తేదీ, సమయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే 5 నుంచి 7 నిమిషాల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆ వెంటనే మొబైల్ ఫోన్‌కు ఈ–పాస్‌బుక్ వస్తుందని, వారం పది రోజుల్లో పోస్టు ద్వారా మెరూన్ రంగు పట్టాదారు పుస్తకం ఇంటికి వస్తుందని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా రూపొందించిన స్లాట్ బుకింగ్ విధానాన్ని శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో ఆవిష్కరించారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరిస్తామన్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల అనుమతి విషయంలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. స్లాట్ బుకింగ్ ఉంటేనే.. స్లాట్ బుక్ చేసుకుంటేనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎస్ స్పష్టం చేశారు. https:// registration.telangana.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్‌లో విక్రయదారు, కొనుగోలుదారు, ఆస్తికి సంబంధించిన వివరాలతో పాటు ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీటిన్) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పీటిన్ లేని వారు ఇదే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రెండ్రోజుల్లోగా వారి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో జారీ అవుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరి కాదని, అయితే ఆధార్ నంబర్ ఇచ్చిన వారికి తక్షణ రిజిస్ట్రేషన్, తక్షణ మ్యూటేషన్ సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వని వారికి ప్రత్యేక ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆధార్ ఉంటే ఆస్తి యజమాని గుర్తింపు నిర్ధారణ సులువు అవుతుందని, మోసాలకు తావుండదని పేర్కొన్నారు. చలాన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు.. రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజులు, డ్యూటీల మొత్తానికి సంబంధించిన చలాన్‌ను ఆటోమెటిక్‌గా సిస్టం జనరేట్ చేస్తుందని సీఎస్ చెప్పారు. రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్ పేపర్, బాండ్ పేపర్లు కొనాల్సిన అవసరం లేదని, చలాన్లో పేర్కొన్న ఫీజు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. చలాన్‌ను తీసుకెళ్లి ఏదైనా ఎస్బీఐ శాఖలో ఫీజు చెల్లించాలని చెప్పారు. ఆన్లైన్ బ్యాకింగ్ ద్వారా కూడా తక్షణమే చెల్లించొచ్చన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎంత మంది సాకు‡్ష్యలను తీసుకెళ్లాలి? ఏమేం తీసుకెళ్లాలన్న వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో దరఖాస్తుదారులకు వస్తుందని చెప్పారు. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండానే సొంతంగా దస్తావేజు రాసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో నమూనా దస్తావేజులు (టెంప్లెట్లు) అందుబాటులో ఉంచామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ సైతం పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. ఒక్కో స్లాట్‌కు 15 నిమిషాల చొప్పున ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు రోజుకు 24 స్లాట్ల రిజిస్ట్రేషన్లను కేటాయించామన్నారు. త్వరలో ఈ సంఖ్యను అవసరం మేరకు 48 నుంచి 100కు పెంచుతామన్నారు. అవసరమున్న చోట ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు డీటీపీ ఆపరేటర్లను నియమిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల డేటా భద్రతకు హైకోర్టు చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. ఎక్కడా డేటా లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అనుమానాలుంటే రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ కార్యాలయం టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 4788కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లకు అవకాశం.. పెండింగ్ మ్యూటేషన్లు పూర్తి చేసేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశం కల్పించామని సీఎస్ తెలిపారు. 16,110 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో 1.24 కోట్ల క్లిక్కులు, 74 వేల స్లాట్ బుకింగ్‌లు, 55,216 లావాదేవీలు జరిగాయని సీఎస్ వెల్లడించారు. పోర్టల్‌కు ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల సర్వర్ స్తంభించగా, వెంటనే పునరుద్ధరించామన్నారు. తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజైన శుక్రవారం సాయంత్రం నాటికి 37 స్లాట్లు బుక్ కాగా, రూ.85 లక్షలు ఫీజులు, సుంకాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 17,567 మంది సైట్‌ను సందర్శించగా, 3,987 వినియోగదారులు సైట్లో తమ పేరున ఖాతాలే రిజిస్టర్ చేసుకున్నారు. 4,143 లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కూడా రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని సీఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బిల్డర్లు, డెవలపర్లు ఒకేసారి బల్క్‌గా అన్ని ఆస్తులనూ అప్లోడ్ చేసేందుకు సైట్లో కొత్త విండో సదుపాయం కల్పించారు. 451 మంది బిల్డర్లు, డెవలపర్లు 93,874 ఆస్తులను అప్లోడ్ చేశారు. 12,699 ఆస్తులకు సంబంధించిన పీటిన్లను స్థానిక సంస్థలు జారీ చేశాయి. ప్రస్తుతం చేపడుతున్న రిజిస్ట్రేషన్లు ఇవే.. సేల్ కేటగిరీ కింద సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ వితౌట్ పొసెషన్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, మార్టగేజ్ కేటగిరీ కింద మార్టగేజ్ వితౌట్ పొసెషన్, మార్టగేజ్ విత్ పొసెషన్, మెమోరాండంఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్, గిఫ్ట్ కేటగిరీ కింద గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలేటివ్ తదితర రిజిస్ట్రేషన్ సేవలను పునరుద్ధరించారు. 97 శాతం రిజిస్ట్రేషన్లు ఈ కేటగిరీకి సంబంధించినవే ఉంటాయని సీఎస్ తెలిపారు. క్రమంగా మిగిలిన రిజిస్ట్రేషన్ సేవలను సైతం పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. -
ఎల్ఆర్ఎస్ గడువు 31 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్కు అంతరాయం కలగడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని, ఈ నేపథ్యంలో గడువు పొడిగిం చాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్.. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లితో సమీక్షించి దరఖాస్తుల గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎల్ఆర్ ఎస్‌కు సంబంధించి గురువారం రాత్రి 9 గంటల వరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో చివరి రోజే గురువారం 2.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ చేయించుకోకుంటే, సదరు అక్రమ ప్లాట్ల తదుపరి క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ జరపబోమని, ఇళ్ల నిర్మాణ అనుమతులు సైతం జారీ చేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో 45 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 19.33 లక్షల దరఖాస్తులు రాగా, గురువారం అర్ధరాత్రికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గడువు పొడిగింపు ఉత్తర్వులు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. (చదవండి: కానిస్టేబుళ్లకు కమిషనర్ సెల్యూట్!) -
పెట్టుబడి అవకాశాలపై ప్రాచుర్యం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలకు విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో మరింత అవగాహన కల్పించడంలో సహకరించాలని ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులను మంత్రి కేటీఆర్ కోరారు. 1992, 93, 94 సంవత్సరాల ఐఎఫ్ఎస్ సీనియర్ అధికారులు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. వీరితో రాష్ట్ర ప్రభుత్వం ఒక విందు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం అనేక వ్యాపార అవకాశాలున్నాయని ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలు వినూత్నమైన పాలసీలతో ముందుకు పోతున్నాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం టీఎస్–ఐపాస్ లాంటి విప్లవాత్మకమైన విధానాలతో పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేపడుతున్న పెట్టుబడుల స్నేహపూర్వక విధానాలను విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో విస్తృత ప్రచారం కల్పించే దిశగా పని చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాక్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ వ్యాలీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉన్న ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూఫ్లెమింగ్, తదితరులు పాల్గొన్నారు. -
చిన్న పరిశ్రమే పెద్దన్న..!
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వాటిని మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శరవేగంగా వృద్ధి చెందుతున్న ఎంఎస్ఎంఈ రంగం తక్కువ పెట్టుబడితో నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. ఇటు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో గ్రామీణ పారిశ్రామికీకరణకు ఎంఎస్ఎంఈ రంగం ఊతమిస్తోంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక సర్వే కూడా వెల్లడిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2015 జనవరి తర్వాత తమ కార్యకలాపాలు ప్రారంభించిన సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమలు రూ.8,885 కోట్ల పెట్టుబడులతో ప్రారంభమై.. ఇప్పటివరకు అదనంగా 1.21 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ పరిశ్రమలే ముందు.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం పురోగతిని విశ్లేషిస్తే.. జనవరి, 2015 నుంచి జూలై, 2019 మధ్య కాలంలో కొత్త యూనిట్ల ఏర్పాటులో సూక్ష్మ పరిశ్రమలు అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన పారిశ్రామిక యూనిట్లలో 56.62 శాతం యూనిట్లు ఎంఎస్ఎంఈ రంగానికి చెందినవే కావడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో సూక్ష్మ పరిశ్రమల వాటా 10.97 శాతం కాగా, ఉపాధి కల్పనలో 27.33 శాతంగా నమోదైంది. రుణ వితరణకు ప్రాధాన్యత.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని.. ఈ రంగానికి అవసరమైనంత మేర రుణ వితరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 వార్షిక రుణ ప్రణాళి కలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ.21,420 కోట్ల రుణ వితరణ చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. ఇక పారిశ్రామిక సరుకుల ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ కీలక రాష్ట్రంగా ఎదుగుతోంది. 2017–18లో రాష్ట్రం నుంచి రూ.42,363 కోట్ల మేర సరుకుల రవాణా జరగ్గా, 2018–19 నాటికి ఇది రూ.50,510 కోట్లకు చేరుకుంది. అంతకుమందు ఏడాదితో పోలిస్తే సరుకుల ఎగుమతిలో ఏకంగా 19 శాతం వృద్ధిరేటు నమోదైంది. రాష్ట్రం నుంచి జరుగుతున్న సరుకుల ఎగుమతిలో ఆర్గానిక్ కెమికల్స్ వాటా 30 శాతం కాగా, ఫార్మాసూటికల్ ఉత్పత్తుల ఎగుమతి శాతం 29గా నమోదైంది. 2019–20 సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి రుణాలు..21,420కోట్లు ఐదేళ్లలో కొత్తగా వచ్చిన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..6,438 ఈ రంగంలో మొత్తం పెట్టుబడులు..9,000 కోట్లు ఈ ఐదేళ్లలో ఉపాధి పొందిన వారి సంఖ్య..1.21లక్షలు ఐదేళ్లలో కొత్తగా వచ్చిన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..50,000 కోట్లు -
మీ లెక్కలు నిజమైతే నిరూపించండి..
సాక్షి, హైదరాబాద్ : ‘గత ఆరేళ్లలో రూ. 2 లక్షల కోట్లు కూడా లేని రాష్ట్ర అప్పు లను రూ. 3 లక్షల కోట్లు అం టారా? అప్పులను ఇలా పెంచి చూపడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. ప్రభుత్వ గ్యారం టీలను కూడా అప్పుగా పరిగణిస్తే ఎలా? ఇవాళ జనం లక్షల సంఖ్యలో టీవీల్లో అసెంబ్లీ లైవ్ చూడాలె.. సభలో హీటెక్కాలె. మీరు చెప్పిన లెక్కలు నిజమే అయితే నిరూపించండి. కాదంటే మీ వ్యాఖ్యలు ఉపసంహరించు కోండి’అని సీఎం కె. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. బడ్జెట్ కూర్పును తప్పుబడుతూ భట్టి చేసిన విమర్శలతోపాటు సంపద సృష్టించే వ్యవస్థలను ఏర్పాటు చేయలేదంటూ ఆయన చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘ప్రపంచంలో రికార్డు బ్రేక్ చేసి యావత్తు దేశం ఆశ్చర్యపోయేలా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీ కళ్లకు కనిపిస్తలేదా? కళ్లులేని కబోదులుగా వాస్తవాలను చూసే సంస్కారం మీకు లేక ఇటు శాసనసభను అటు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడితే సహించం. భలో తప్పులు మాట్లాడితే పదేపదే అడ్డుకుంటం. సభ ఎవరి జాగీరు కాదు’అని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి ప్రారంభించటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సీట్లోంచి లేచి భట్టి ప్రసంగంలోని లెక్కలు, ఆరోపణలు అబద్ధాలంటూ సభ దృష్టికి తెచ్చారు. అవాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాతపెట్టినా కాంగ్రెస్ సభ్యులకు బుద్ధి రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వాడిన పదాలపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేయగా తాను సోయితోనే మాట్లాడుతున్నానని, ఎక్కడా అన్‌పార్లమెంటరీ పదాలు వినియోగించడం లేదన్నారు. ఆ మాటతో మొదలు.... భట్టి విక్రమార్క తన ప్రసంగం ప్రారంభంలోనే ‘మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా మార్చారు. సంపద సృష్టించే వ్యవస్థలు ఏర్పాటు చేయలేదు’అని పేర్కొనడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆయన లేచి వాస్తవాలు మాట్లాడాలని, బడ్జెట్లో ఉన్న విషయం చూసి మాట్లాడితే మంచిదని సూచించారు. బడ్జెట్ పుస్తకంలో పొందుపరిచిన వివరాలు కాగ్ ధ్రువీకరించిన లెక్కలేనని తాను బడ్జెట్ ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పానని, వాటిలో వివాదానికి తావే లేదన్నారు. కానీ భట్టి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పులు మాట్లాడటమే కాకుండా సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలు స్పష్టంగా ఉంటే భట్టి విక్రమార్క పదేపదే ‘రమారమి’అని అనడం సరికాదన్నారు. ఇక మిగులు బడ్జెట్ గురించి ఎలా మాట్లాడతారని, రాష్ట్రమే లేనప్పుడు మిగులు బడ్జెట్ ఎక్కడిదని, తెలంగాణ ఏర్పడ్డాక బడ్జెట్ పెట్టేందుకు ప్రాతిపదికే లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణను దివాలా తీయించామని అంటున్నారని, కానీ అన్ని లెక్కలు సభ ముందున్నాయని స్పష్టం చేశారు. బడ్జెట్లో పదేపదే కోత పెట్టామని అనడం సరికాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయింపుల్లో కోత పెట్టిన ఫలితంగానే రాష్ట్ర బడ్జెట్‌ను తగ్గించినట్లు తాను బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా చెప్పినట్టు సీఎం వెల్లడించారు. ఆ నీళ్లు కనిపించడం లేదా? అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీ కళ్లకు కనిపించడం లేదా? అని భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రాజెక్టు ఒక్కటైనా లేదని భట్టి పేర్కొనడం కళ్లుండీ చూడలేకపోవటమేనని విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా 56 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్న మంచినీళ్లు భట్టి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అలాగే మిషన్ కాకతీయ కింద బాగు చేసుకొని నీళ్లను నింపుకుంటున్న 27 వేల చెరువులను చూడలేదా అని పేర్కొన్నారు. కేవలం ఏడాదిలోనే పూర్తి చేసిన భక్త రామదాసు ప్రాజెక్టు భట్టి జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు. మీలాగా మొబిలైజేషన్ ప్రాజెక్టులు తమవి కావంటూ ఎద్దేవా చేశారు. లక్ష్మీ బ్యారేజీగా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టును ఇప్పటికే 20 లక్షల మంది సందర్శించిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. ‘వాస్తవాలు ఇలా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఇది సభ. ఎవరి జాగీరు కాదు, తప్పులు మాట్లాడితే మా హక్కులు కాపాడాలి అధ్యక్షా’అంటూ పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఇలాగే మాట్లాడారని, ఆ తర్వాత ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా బుద్ధి మారాలేదని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. మూడొంతుల సీట్లు గెలుచుకొని తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈవీఎంలతో గెలిచారని ఆరోపించారంటూ గుర్తు చేశారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లను ఈవీఎంలతోనే గెలిచిందా అని ప్రశ్నించారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెడుతున్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోకుండా మాట్లాడితే చేసేదేమీ లేదని అది వారి కర్మ అని పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల గాలిలో ఉండెనా... కాంగ్రెస్ హయాంలోనే కొన్ని ప్రాజెక్టుల పనులు జరిగాయన్న భట్టి మాటలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఎక్కడుండె.. ఆకాశంలోనా, గాలిలోనా అంటూ ఎద్దేవా చేశారు. అసలు దానికి అగ్రిమెంట్లు కూడా లేవని, దాన్ని రీ డిజైన్ చేసి వివరాలను ఇదే సభలో వివరించామన్నారు. ఆ సమయంలో మాట్లాడలేక కాంగ్రెస్ వాళ్లు పారిపోయారని విమర్శించారు. ఆ తర్వాతే ప్రజలు మళ్లీ తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రశ్నించారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ కూడా తెలంగాణవాసులను వంచించిన ప్రతిపాదననేనని, అసలు అది తెలంగాణ ప్రాజెక్టు కాదని ఇదే సభలో టీఆర్ఎస్ సభ్యులు అరిచినా పట్టించుకోలేదన్నారు. గ్రావిటీతో నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఆంధ్రాకు ఇచ్చి, లిఫ్ట్‌తో నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు తెలంగాణకు ఇచ్చిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. ‘నేను ఉద్యమ నాయకుడిని. నాకు అన్నీ తెలుసు. లేకుంటే మీరు గోల్ తిప్పేటోళ్లు, ఆ ప్రాజెక్టును మీరు ఒప్పుకొని మమ్మల్ని ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. పోలవరంలో హెడ్ వర్క్స్ మునిగిపోయింది మరిచారా’అని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టుల సామర్థ్యం 30 టీఎంసీలైతే తాము ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టు 100 టీఎంసీలని గుర్తుచేశారు. అవసరమైతే మరో రూ. 20 వేల కోట్లు కూడా అప్పు తెస్తామని స్పష్టం చేశారు. ఎన్ని అప్పులు తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్ కాలేదని, దీన్ని గుర్తించాలన్నారు. అనంతరం సీఎం సభ నుంచి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కూడా భట్టి ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు అంటూ భట్టీ చెప్పబోగా ‘ఏదిపడితే అది గాంధీ భవన్లో మాట్లాడుకోండి, సభలో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. మీ ఆరోపణలకు రుజువులు చూపండి. కాదంటే మా నాయకుడికి, మా పార్టీకి క్షమాపణ చెప్పండి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదని, తమ మేనిఫెస్టోలో కూడా లేదన్నారు. -
మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నోఆకాంక్షలు, ఆశలతో తెచ్చుకున్న తెలం గాణను అప్పులకుప్పగా మార్చే శారు. మిగులు రాష్ట్రంగా భాసిల్లా ల్సిన తెలంగాణను దివాలా తీయించారు. దానికి తాజా బడ్జెట్ లెక్కలే సాక్ష్యం. ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తారా? ఇది రాష్ట్రానికి భారం కాదా? ఈ నిజాలు చెప్తే అక్క సెందుకు? సీఎం వయసులో నా కంటే పెద్ద, ఆయన పద్ధతిగా మాట్లాడాలి. అంతకంటే దారు ణంగా మాట్లాడేందుకు నాకు రెండు నిమిషాలు చాలు, కానీ నాకు సంస్కారముంది. ఈ రోజు చర్చలో వాస్తవాలు వెలుగులోకి రావాలి, ప్రజలు వాటిని తెలుసు కోవాలి, అధికారపక్షం బెదిరింపులకు భయపడం’ అంటూ బడ్జెట్‌పై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క శనివారం అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. బడ్జెట్లో అంకెలు ప్రస్తావిస్తూ.. అవి ఏరకంగా వాస్తవ విరుద్ధమో చెప్పే ప్రయత్నం చేశారు. 6 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం తెలంగాణనేనని, ఇదే ఓ వింత అనుకుంటే, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులలో రూ.36 వేలకోట్ల మేర కోతపెడుతూ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడం మరోవింత అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం తెరదీసిందన్నారు. 2014 నుంచి క్రమంగా రాష్ట్ర బడ్జెట్ పెరుగుతూ రాగా, ఈసారి 20 శాతం తగ్గిపోవటం పరిపాలనాతీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చెప్పిన ఏ ఒక్క కారణం కూడా సహేతుకంగా లేదని పేర్కొన్నారు. జీఎస్డీపీలో 10 శాతం వృద్ధి ఉందని బడ్జెట్లో చూపారని, అలాంటప్పుడు రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. దీనిని మాంద్యం ప్రభావం అంటున్నారని, వాస్తవానికి ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ అని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టూ పీజీ విద్య, రెండు పడకగదుల ఇళ్లు, ఇతర ఎన్నికల హామీలను చూసి జనం ఆశపడ్డారని, కనీసం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతన్నా అవి నెరవేరతాయని ఆశించారని, కానీ వాటిని అమలు చేయలేక చేతులెత్తేసినట్టు ఈ బడ్జెట్ తేల్చిచెప్తోందని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తే ఈ పరిస్థితి ఎందుకు? కొత్త రాష్ట్రం ఏర్పాటు కాగానే సంపద సృష్టించుకునే వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ దివాలా పరిస్థితి వచ్చేది కాదని, ప్రాధామ్యాలను గుర్తించి వాటి ప్రాధాన్యతాక్రమంలో ఖర్చు చేసి ఉంటే పరిస్థితి మరోకరంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రాధమ్యాలనే ప్రజల ప్రాధమ్యాలుగా మార్చేసి ఇష్టం వచ్చినట్టు చేయటంవల్లే ఈ దుస్థితి వచ్చిందని భట్టివిక్రమార్క ఆరోపించారు. దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు నాటి ప్రభుత్వం రూ.822 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.859 కోట్లు వ్యయం చేస్తే అవి పూర్తయ్యేవని, వాటివల్ల 4 లక్షల ఎకరాలకు నీళ్లుపారి ఉండేవని అన్నారు. మరో రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాణహిత–చేవెళ్ల పూర్తయి ఉండేదని, దాదాపు రూ.7,200 కోట్లు ఖర్చు పెట్టిన దేవాదుల మరో రూ.2 వేల కోట్లతో సిద్ధమై ఉండేదని.. ఇలా గోదావరిపై రూ.31,421 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 36 లక్షల ఎకరాలకు సాగునీరందించేవని సభ దృష్టికి తెచ్చారు. కృష్ణా నదిపై నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, బీమా, ఏఎంఆర్పీలకు మరో రూ.3 వేల కోట్ల నుంచి రూ.మూడున్నర వేల కోట్లు సరిపోయి ఉండేవని, ఇవి పూర్తి అయితే మరో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలమై ఉండేవన్నారు. ఇలా తక్కువమొత్తంతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాల్సి ఉండగా, రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు, పాలమూరు–రంగారెడ్డి పేరుతో భారీ ఖర్చుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి చుక్కనీరు కూడా ఎల్లంపల్లికి పంప్ చేయలేదని అన్నారు. రూ.3 లక్షల కోట్ల అప్పు నిజం కాదా? తాజా బడ్జెట్ పుస్తకంలోని 11వ పేజీలో... 2016–2019 మధ్య అప్పులు రూ.2.03 లక్షల కోట్లుగా చూపారని, 12వ పేజీలో ప్రభుత్వ గ్యారంటీడ్ పేరుతో రూ.74,314 కోట్లు చూపారని, ఇలా అన్నీ కలిపితే రూ.3 లక్షల కోట్లకు అప్పులు చేరుకున్నాయని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ గ్యారంటీడ్ రుణాలు అప్పు కాదంటే ఎలా కుదురుతుందని, అవి మన కార్పొరేషన్లకు వచ్చిన రుణాలకు సంబంధించినవేనని, వాటిని తీర్చాల్సింది మనమే కదా అని పేర్కొన్నారు. ఆరేళ్లలో ఇంత పెద్దమొత్తంలో అప్పు చేయటం రాష్ట్రానికి భారం కాదా అని ప్రశ్నించారు. వనరులు సృష్టించే ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా లేనప్పుడు, మిగిలేవి అప్పులే కదా అని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ అంతే నిధులు, నియామకాలు, నీళ్లు... ఈ మూడు ప్రధానాంశాలే లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణలో అవన్నీ నిరాశాజనకంగానే మిగిలిపోయాయని భట్టి ఆరోపించారు. ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రంలో 2.40 లక్షల ఖాళీలుంటే కేవలం 56,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని, గ్రూప్–1 కోసం ఎదురుచూసి ఎంతోమంది వయసుమీరిపోయారని అన్నారు. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించి సంబంధిత వర్గాల సంక్షేమంపై దెబ్బకొట్టారని పేర్కొన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దాదాపు రూ.30 వేల కోట్లకుపైబడి మళ్లించి ఉండకపోతే దళితులకు సంబంధించి మూడు ఎకరాల భూపంపిణీ, కేజీ టూ పీజీకి సంబంధించి ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు, డబుల్ బడెరూమ్ ఇళ్లు చాలావరకు సిద్ధమై ఉండేవన్నారు. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నారని, దానికి రూ.7,200 కోట్లు అవసరమని, 20 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం చూస్తున్నారని, అవి పూర్తికావాలంటే రూ.లక్ష కోట్లు కావాలని, మూడు ఎకరాల భూమి కోసం ఏడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం రోగాలమయంగా మారిందని, ఈ పరిస్థితి రాకుండా తాము ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా లెక్కచేయకుండా చేసి ఇప్పుడేమో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారన్నారు. -
బదిలీల టెన్షన్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఆరునెలలకు పైగా కొనసాగిన ఎన్నికల కోడ్ ఇటీవలే ముగిసింది. కోడ్ నేపథ్యంలో ఎన్నికల ముందు బదిలీలు అయిన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డిలను రెండు రోజుల క్రితమే వారి వారి పూర్వస్థానాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని స్పష్టమవుతోంది. పలు ప్రభుత్వ విభాగాల ప్రక్షాళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో పై స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ అధికారుల వరకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు జిల్లా స్థాయి ముఖ్య అధికారులు పలువురు బదిలీలకు సిద్ధమవుతున్నారు. సెలవులో కలెక్టర్, కమిషనర్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని స్పష్టం కావడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యే ఉన్నారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో సాధారణంగా జరిగే బదిలీల్లో భాగంగా వీరికి స్థాన చలనం తప్పనిసరి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీరి బదిలీ జరుగుతుందని ఉన్నత వర్గాల్లో ఇప్పటికే చర్చలు సాగాయి. ఈ మేరకు వారు కూడా అందుకు సిద్ధపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు వ్యక్తిగత పనులపై సెలవుల్లో వెళ్లిపోయారు. కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఈ నెల 16 వరకు సెలవులోనే ఉండడం గమనార్హం. ఈ లోపు బదిలీల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఐజీ, డీఐజీ సైతం.. కరీంనగర్ రేంజ్ ఐజీ వై.నాగిరెడ్డి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఐజీగా వ్యవహరిస్తున్నారు. నార్త్ జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ రేంజ్‌లకు ఆయనే ఐజీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరిగే బదిలీల్లో నాగిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే డీఐజీ ప్రమోద్‌కుమార్‌కు ఇటీవలే ఐజీగా పదోన్నతి లభించింది. ఆయనను ఐజీగా ఏదైనా జోన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం... రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా తిరిగి పాత స్థానానికి వచ్చిన కృష్ణ భాస్కర్‌ను కొనసాగిస్తారా? సాధారణ బదిలీల్లో మారుస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. సిద్దిపేట ప్రత్యేక అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు బదిలీ చేసినప్పటికీ, సిరిసిల్లకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే బదిలీ అయి ఏడాది కూడా పూర్తి కానందున అక్కడే కొనసాగవచ్చు. ఇక జగిత్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుంచి కలెక్టర్‌గా కొనసాగుతున్న శరత్‌కు ఈసారి స్థాన చలనం తప్పనిసరి. ఇక్కడ ఎస్పీగా సింధూశర్మ బాధ్యతలు స్వీకరించి కూడా ఏడాది పూర్తి కాలేదు. అయితే సింధూశర్మ భర్త శశాంక జోగులాంబ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ఆమె హైదరాబాద్ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గత సంవత్సరమే బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన బదిలీ ఉండకపోవచ్చని సమాచారం. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, కలెక్టర్ శ్రీదేవసేన సైతం వచ్చి ఏడాది కూడా కానందున వీరిని యథాస్థానాల్లో కొనసాగించే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు అన్ని జిల్లాల్లోని డీఆర్ఓ, ఆర్డీవో, ఇతర శాఖల్లోని కీలకస్థానాల్లో ఉన్న అధికారులకు సైతం బదిలీ వేటు తప్పదని, ఈ మేరకు పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర స్థాయి బదిలీల తరువాతే జోన్లలో.. రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాతే జిల్లా స్థాయిల్లో అధికారుల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐజీ, డీఐజీ నుంచి కమిషనర్ల వరకు బదిలీల జాబితాలో ఉన్నందు వల్ల కొత్త అధికారులు వచ్చిన తరువాత పోలీస్ శాఖలోని ఏసీపీ తరువాత స్థాయి అధికారులను మార్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌లోని జిల్లా కేంద్రాల్లో, కొన్ని మండలాల్లో సీఐ, ఎస్ఐ స్థాయిల్లో బదిలీలన్నీ వీరి నేతృత్వంలోనే జరుగుతాయి. కరీంనగర్లో కోరుకున్న స్థానాలకు బదిలీ కావాలని కొందరు సీఐలు ప్రయత్నిస్తున్నప్పటికీ, కమిషనర్ కమలాసన్‌రెడ్డి వేచిచూసే ధోరణితోనే ఉన్నట్లు సమాచారం. మండలాల్లో తహసీల్ధార్లు, ఎంపీడీవోల బదిలీలకు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు లింక్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీలపై అధికార యంత్రాంగంలో టెన్షన్ పెరుగుతోంది. -
నల్లగొండ మున్సిపాలిటీలో నర్సరీలు..!
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం కింద ఇకనుంచి మున్సిపాలిటీలో కూడా నర్సరీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీలగిరి మున్సిపాలిటీలో ఈ ఏడాది నర్సరీల ద్వారా ఒక లక్ష మొక్కలు పెంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రతిపానదలు రూపొందించారు. మెప్మా పర్యవేక్షణలో సమభావన సంఘాల మహిళల ద్వార నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. నీలగిరి పట్టణంలో ఉన్న సమభావన సంఘాల్లోని ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే వారిచే నర్సరీల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. సమభావన సంఘాల మహిళలు ఏర్పాటు చేసే నర్సరీలలో మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేయనుంది. గత ఏడాది వరకు ఇతర నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి హరితహారం కింద మొక్కలు నాటే వారు. ఒక్కో మొక్కకు రూ.10 చెల్లింపు నర్సరీలు ఏర్పాటు చేయాలంటే తగినంత స్థలం, నీటి వసతి, వాటి రక్షణ అవసరం ఉంటుంది. ఈ సౌకర్యాలు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారు. నారు కొనుగోలు చేయడంతో పాటు ఎర్రమట్టి, కవర్లు, ఎరువు తదితర వాటిని సంబంధిత మహిళలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నారు గింజలను కూడా మెప్మా సిబ్బంది కొనుగోలు చేయిస్తారు. దాదాపు నాలుగున్నర నెలల పాటు నర్సరీలలో మొక్కలు పెంచాల్సి ఉంటుంది. 2నుంచి 3 ఫీట్లు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేసి పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో నాటుతారు. నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచిన సంబంధిత మహిళలకు ఒక్కో మొక్కకు రూ. 10 ల చొప్పున మున్సిపాలిటీ చెల్లిస్తుంది. మహిళలు ఎన్ని మొక్కలు పెంచినా వాటిలో బతికిన వాటికి మాత్రమే మున్సిపల్ అధికారులు డబ్బులు ఇస్తారు. బ్యాంకు రుణ సౌకర్యం... నర్సరీలను ఏర్పాటు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే సంబంధిత మహిళలకు బ్యాంకు రుణం ఇప్పించాలని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. మహిళా సభ్యులు వ్యక్తి గతంగానైనా, గ్రూపుగానైనా నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి బ్యాంకుల ద్వారా మొక్కలను బట్టి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మొక్కలు విక్రయించిన తర్వాత బ్యాంకులో చెల్లించే విధంగా సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడాలని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. నర్సరీల ద్వారా లక్ష మొక్కలు నీలగిరి పట్టణంలో మొక్కల సరఫరాకు ఇబ్బం ది లేకుండా ఇక్కడే నర్సరీలు ఏర్పాటు చేయాలని సీడీఎంఏ అధికారులు ఆదేశించారు. మహిళా సంఘాల వారి ద్వార నర్సరీలు ఏర్పా టు చేసి లక్ష మొక్కలు పెంచడానికి నిర్ణయిం చాం. వారు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేస్తుంది. – దేవ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ -
సరిహద్దు గ్రామాలపై నిఘా
సాక్షి, కర్నూలు/ మంత్రాలయం: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా వేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంయుక్త చర్యలకు ఉపక్రమించారు. మంత్రాలయంలోని అబోడి ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు, రాయచూరు, జోగులాంబ గద్వాల, బళ్లారి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల సందర్భంగా సాంకేతికతను విరివిగా వినియోగించాలని నిర్ణయించారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి.. పరస్పరం సమాచారాన్ని పంచుకోనున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. డ్రైడే రోజు కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు సరిహద్దుల్లోని మద్యం దుకాణాలను మూసివేయించాలని నిర్ణయించారు. మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసే డీలర్లను గుర్తించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, చీరలు, ముక్కుపుడకలు, ఇతరత్రా కానుకల పంపిణీ, దొంగ ఓట్లు వేయడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ ఫక్కీరప్ప, రాయచూరు కలెక్టర్ శరత్, ఎస్పీ కిషోర్‌బాబు, బళ్లారి అసిస్టెంట్ కమిషనర్ రమేష్, జోగులాంబ గద్వాల జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్‌రావు, ఎస్పీ లక్ష్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్!
సాక్షి, హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విటర్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ డేటా చోరి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను టార్గెట్ చేస్తూ కొందరు అజ్ఞాత వ్యక్తులు ఫేక్ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా బద్నాం చేసేందుకే పనిగట్టుకొని మరి ఈ పనికి పాల్పడుతున్న ఫేక్ ట్విటర్లపై తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనుంది. (చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో.. క్యాష్ ఫర్ ట్వీట్!) డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రెండ్రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. #CashForTweet అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమం ట్వీట్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేశ్ ఆదేశాల మేరకు ఎదురుదాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ ట్వీట్ల వెనుక చంద్రబాబు, లోకేశ్ హస్తమున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. (‘చంద్రబాబు పరోక్షంగా నేరాన్ని అంగీకరించారు’) ఆంధ్ర, తెలంగాణలతో సంబంధంలేని ట్విట్టర్ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ల సారాంశం అంతా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపేలా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేయడం టీఆర్ఎస్ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. -
‘లోక్‌సభ’కు సన్నద్ధం
నిర్మల్: శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో అధికార టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ పోరుకు సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ పోరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన సెంటిమెంట్‌తోనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ అందరికంటే ముందే టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే శనివారం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాన ఎజెండా పార్లమెంట్ ఎన్నికలే కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రతీ సమావేశం, సభలో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన 16స్థానాలను తామే గెలుస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 8న ఆదిలాబాద్‌లో, 9న పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఈ సమావేశాల షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను మళ్లీ తామే కైవసం చేసుకుని పార్టీ అధినేతల మాట నిలుపాలన్న లక్ష్యంతో జిల్లా ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తున్నారు. అటు అధికార పార్టీ ఇప్పటి నుంచే లోక్‌సభ సమరానికి సన్నద్ధమవుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలో మాత్రం ఇంకా కదలిక కనిపించడం లేదు. అధికారులు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండుస్థానాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినవే. ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఆదిలాబాద్ పరిధిలో ఉండగా, తూర్పు ప్రాంతం పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పశ్చిమ ప్రాంతంలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి(ప్రస్తుతం జిల్లాకేంద్రం) కేంద్రంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇక ఈరెండు స్థానాలు ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రకారం ఆదిలాబాద్ ఎస్టీ, పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా గోడెం నగేశ్ ఉండగా, పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి.. నిలబెట్టుకోవాలని.. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను మళ్లీ గెలిచి నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శనివారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా దిశానిర్దేశం చేయా లని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎంపీ సీట్లను గెలిపిస్తే ఢిల్లీస్థాయిలో తెలంగాణ అభివృద్ధి చక్రం తిప్పవచ్చన్న విషయాన్నీ వివరించాలని సూచించారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమష్టికృషితో అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ పరంగా అభ్యర్థుల ఖరారుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేశ్ మళ్లీ పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పెద్దపల్లి స్థానంపైనే పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ స్థానానికి మాజీ ఎంపీ వివేక్‌తో పాటు మరికొందరు పోటీ పడుతున్నట్లు సమాచారం . కేటీఆర్ టూర్ ఖరారు.. టీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 8న ఆదిలాబాద్‌లో, మరుసటి రోజు 9న పెద్దపల్లి జిల్లా రామగుండంలో సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు షురూ చేశారు. స్తబ్ధుగానే ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్లో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ప్రభావం కనిపిస్తుండగా ప్రతిపక్షాల్లో మాత్రం ఆ సందడి ఇంకా మొదలు కాలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఓడినా పార్లమెంట్లో గెలువాలన్న తపనతో ఉంది. ఎలాగైనా అత్యధిక స్థానాలను గెలుచుకుని తమ అధినేత రా>హుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని భావిస్తోంది. కానీ.. అలాంటి పార్టీ ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పనిని మొదలు పెట్టినట్లుగా కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ హవా నడిచిన రోజుల్లో రెండు స్థానాలనూ గెలిచిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ స్థానాన్ని గెలుచుకుని ఉమ్మడి జిల్లాలో పరువు నిలబెట్టుకుంది. ఇక లోక్‌సభ స్థానాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ పరిధిలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి పరిధిలో ప్రేంసాగర్‌రావు వర్గాలు పార్టీలో బలంగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలతో సంబంధం లేకుండా పలువురు అధిష్ఠానంతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక మళ్లీ తమ నరేంద్రుడిని ప్రధాని చేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో బోణి కొట్టలేకపోయింది. ఈసారీ విజయం అంత ఈజీ కాదన్న విషయం ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎంపీ స్థానానికి పోటీ పడేస్థాయి గల నాయకుల కోసం పార్టీ అధినేతలు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల్లోనూ కొందరు ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అధికారులు సిద్ధం.. పార్టీలతోపాటుగా జిల్లాల అధికారులూ లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మం చిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలో ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ పూర్తయ్యింది. త్వరలోనే రెండోసారి పరిశీలన ప్రారంభం కానుంది. మరోవైపు ఈనెల 22న ఓటర్ల తుది జాబితా వచ్చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,63,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,20,320 మంది పురుషులు, 10,43,552మంది మహిళలు, ఇతరులు 91 మంది ఓటర్లు ఉన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్ : మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి కేసీఆర్ సభలో సమాధానమిచ్చారు. తామిచ్చిన హామీలపై ఆందోళన అవసరం లేదని, గత ఎన్నికల మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేసినట్లు ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ పథకాలు చాలా గొప్పవని కేసీఆర్ అభిప్రాయపడ్డాడు. ఈ పథకాలను అమలు చేసిన వైఎస్సార్‌ను అభినందించాల్సిందేనని, దాంట్లో ఎలాంటి భేషజాలు లేవన్నారు. సీఎం ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. -
అందని ‘మధ్యాహ్న’ బిల్లులు
సాక్షి, గుర్రంపోడు : మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక పోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తేవాల్సి వస్తుందని ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. మండలంలో 58 పాఠశాలలకుగాను 58 భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒకటవ తరగతి నుంచి ఐదవతరగతి వరకు వంట వండినందుకుగాను ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.13, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.18 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వంట చెరుకుతో పాటు కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు ఇతర వంట సామగ్రిని ఏజెన్సీలు సమకూర్చుకోవాలి. బియ్యం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు వంద గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ పరిమాణం కూడా సరిపోక తాము నింద మోయాల్సి వస్తుందని వంట ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సోమవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, మంగళవారం అన్నం, ఆకుకూరల పప్పు, బుధవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, గురువారం అన్నం, సాంబారు, కూరగాయల కర్రీ, శుక్రవారం గుడ్డు, అన్నం, పప్పు కూర, శనివారం బఠానీ, ఆలు, క్యారెట్లతో వెజ్ బిర్యాణీ లేదా బగార అన్నం వండాల్సి ఉంది. ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ మెనూ ప్రకారమే వండాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు తరుచూ ఆకస్మిక తనిఖీలతో మధ్యాహ్న భోజన మెనూను పరిశీలిస్తారు. వారానికి మూడు గుడ్ల చొప్పున తప్పనిసరిగా అందించాల్సి ఉంది. గుడ్డుకు నాలుగు రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా ఒక్కోసారి ఐదు రూపాయల వరకు గుడ్డు ధర ఉండి నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వంట సామగ్రితోపాటు గుడ్లకు బిల్లులు అందక గ్రామాల్లో వ్యాపారులు తమకు ఉద్దెరగా సామాను ఇవ్వడం లేదని అంటున్నారు. బిల్లులు అందక వంట చేయలేక, మధ్యలో మానుకోలేక అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. ఎప్పుడు బిల్లు అడిగినా ఎస్టీఓకు వెళ్లిందని, బ్యాంకు వెళ్లిందని చెబుతున్నారని వారు వాపోతున్నారు. కొన్ని చోట్ల వంట గదులు లేవు మండలంలో 31 పాఠశాలలకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. ఇంకా 20 పాఠశాలలకు వంట గదుల అవసరం ఉంది. వంట గదులకు గతంతో మండల పరిషత్ నిధుల నుంచి, ప్రస్తుతం ఉపాధిహామీ నిధుల నుంచి మంజూరు చేస్తున్నా అసంపూర్తి నిర్మాణాలతోనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ స్థాయిలో, మరికొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. గతంతో నిర్మించిన వంట గదులు ఇరుకుగా ఉండి ఆరుబయటే వండాల్సి వస్తుందని, ఉన్నత పాఠశాలల్లో వంట గది నిర్మాణం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విశాలంగా లేవు. కొన్ని చోట్ల ఇంటివద్దనే వండుకుని తీసుకుని వస్తున్నారు. ఏజెన్సీలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. వర్షాకాలంలో వంట చెరుకు తడిసి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై ఎంఈఓ నోముల యాదగిరిని ప్రశ్నించగా జూలై, ఆగస్టు బిల్లు ఎస్టీఓ నుంచి బ్యాంకుకు వెళ్లిందని, ఒకటి, రెండు రోజుల్లో ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. బిల్లులు ప్రతినెలా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లులు అందక తిప్పలు మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా అందించాలి. నాలుగు నెలలుగా బిల్లులు అందక ఇప్పటికే ఎన్నో అప్పులు చేశాం. బిల్లు అందక సకాలంలో డబ్బులు ఇవ్వక అప్పు కూడా పుట్టడం లేదు. బిల్లు రానిదానికి వారానికి మూడు గుడ్లు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. – పెరిగ జంగమ్మ, పిట్టలగూడెం -
సంక్షేమ పథకాల్లో తెలంగాణ ఫస్ట్
బాన్సువాడ: సంక్షేమ రంగంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముందంజలో ఉందని, సంక్షేమ పథకాలు 85శాతం మందికి అందుతున్నాయని ఆపద్ధర్మ మంత్రి పోచారం పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల్లో బూత్‌స్థాయిలో అనుసరించాల్సిన ప్రచార సరళిపై బాన్సువాడ మండల టీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల, బూత్ స్థాయి కమిటీ సభ్యులు, కన్వీనర్లు, పర్యవేక్షణ కమిటీ సభ్యులతో పట్టణంలోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయంలో మంత్రి పోచారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్ల మూడు నెలలు అవుతోందన్నారు. దేశంలో 29 రాష్ట్రాలుండగా, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 36 సంక్షేమ పథకాలకు రూ. 42వేల కోట్లు కేటాయించారన్నారు. 43లక్షల మంది ప్రజలకు రూ. 5,600 కోట్లను పెన్షన్‌గా అందిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆసరా పింఛన్లను రూ. 2016, వికలాంగులకు రూ. 3016కు పెంచుతున్నామన్నారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 70 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం భారీగా నిధులను కేటాయిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంకిత భావంతో పని చేయాలని సూచించారు. అందుకే బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి 60 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించామన్నారు. ఈ 60 మంది కచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనేవిధంగా చూడాలన్నారు. కార్యకర్తల జోష్ చూసుంటే ప్రతిపక్షాల డిపాజిట్లు కూడా గల్లంతవడం ఖాయమని çమంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోహన్ నాయక్, దేశాయ్‌పేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ఎర్వల కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్నార్ల సురేష్, సంగ్రాం నాయక్, మహ్మద్ ఎజాస్, గంగాధర్, గోపాల్‌రెడ్డి, నాగులగామ వెంకన్న గుప్త, నారాయణరెడ్డి, పాత బాలకృష్ణ, కొత్తకొండ భాస్కర్, గురువినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేరళ వరదలు: తెలంగాణ సర్కార్ భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళను అండగా నిలిచేందుకు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ సోదర, సోదరీమణులను అదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. 25కోట్ల రూపాయల భారీ విరాళంతోపాటు, రూ.2.5కోట్ల విలువైన 10 రివర్స్ ఓస్మోసిస్ ప్లాంట్లను కేరళకు అందిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. మరోవైపు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల విరాళం అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. అలాగే కేరళ వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 5 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. To aid & assist our brothers & sisters of Kerala in their hour of grief, Telangana CM Sri KCR Garu has just announced assistance of Rs. 25 Cr & 10 reverse osmosis plants worth 2.5 Cr towards the flood hit Kerala#TelanganaStandsWithKerala Request you all to donate generously🙏 pic.twitter.com/SGHi2kcKjV — KTR (@KTRTRS) August 17, 2018 -
‘సమంతకు రూపాయి కూడా ఇవ్వలేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం కీలకంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనమండలిలో మంగళవారం చేనేత రుణాలు, హ్యాండ్లూమ్ రంగానికి సహాయం అనే అంశంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ చేనేత కార్మికులు ఉన్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చేనేత పనిచేస్తున్న వారి లెక్కలే లేవని, తమది చేనేతల, చేతల సర్కారని స్పష్టం చేశారు. 2002లో చాలా మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2007లో సిరిసిల్లలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న మగ్గాలకు జియో ట్యాగ్ చేశామని వెల్లడించారు. చేనేత రుణమాఫీని ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది సూరత్ నుంచి వచ్చిన చీరల్లో కొన్ని నాసిరకం వచ్చాయని.. అందువల్ల ఈ సారి బతుకమ్మ చీరలు సిరిసిల్లలోనే తయారు చేస్తున్నామన్నారు. చేనేత రంగానికి కేంద్రం నుంచి సహకారం లేదని తెలిపారు. మరో వైపు చేనేత బ్రాండ్ అంబాసిడార్‌గా సినీ నటి సమంత ఉచితంగానే వ్యవహరిస్తున్నారని.. ఆమెకు తెలంగాణ సర్కారు ఒక్క రుపాయి కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని కేటీఆర్ అన్నారు. -
కేన్సర్ కేర్‌పై టాటా ట్రస్ట్‌తో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వ్యాధి, గుర్తింపు, నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమగ్ర క్యాన్సర్ కేర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో అండర్ స్టాండింగ్ మెమోరాండంపై సంతకాలు చేసింది. క్యాన్సర్‌ను ప్రాథమికంగానే గుర్తించాలనే ప్రథాన లక్ష్యంతో పాటు అన్ని స్థాయిల్లోనూ ఆరోగ్య సంరక్షణ అందిచాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. శంషాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కే టి రామారావు, ఆరోగ్య మంత్రి సి. లక్ష్మా రెడ్డి, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టాటా మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, నగరంలోని రెండు ప్రముఖ సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) రెఫరల్ ఆధారంగా క్లిష్టమైన కేసులను పరిశీలిస్తాయి. దీనికి అదనంగా, జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ, కీమోథెరపీ లాంటి సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేన్సర్‌కు సంబంధించిన రాష్ట్రంలో అత్యధికంగా క్యాన్సర్‌కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రారంభ దశలో వివిధ రకాలైన క్యాన్సర్లను మేము నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా నోటి, రొమ్ము , గర్భాశయ కేన్సర్లను ఆరంభ దశలో గుర్తించి, విశ్లేషించడంతోపాటు, రోగులకు మెరుగైన సేవలందించేందకు సహాయపడుతుందన్నారు. క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించిందని ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. రోగులపై మెడికల్ పరీక్షలు జరిపారని ఆమె పేర్కొన్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ రోగులకు క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాలలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్ట్ పబ్లిక్ హెల్త్ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం పట్ల టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందంతో కేన్సర్ రోగులకు ప్రస్తుత ప్రజారోగ్య వ్యవస్థలోనే మెరుగైన చికిత్స లభిస్తుంది. క్యాన్సర్ రోగులు క్లిష్ట సమయాల్లో తప్ప.. ఇతర విషయాలకు హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి తప్పుతుందన్నారు. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేన్సర్ కేర్ కార్యక్రమాల అమలు వివిధ దశల్లో ఉన్నాయని టాటా వివరించారు. -
అంగన్వాడీ పోస్టులకు బీటెక్ గ్రాడ్యుయేట్లు
సాక్షి, రంగారెడ్డి: అంగన్వాడీ ల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నిరు ద్యోగుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. బీటెక్, పీజీ, బీఈడీ చేసిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించినా చదువులకు తగిన ఉద్యోగాలు లభించని కారణంగా అంగన్వాడీ పోస్టులపై ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. వేతనం తక్కువైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అంతేగాక స్థానికంగా ఉద్యోగం లభిస్తుండడం కలిసి వచ్చే అంశంగా వారు భావిస్తున్నారు. వాస్తవంగా టీచర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణతగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పదో తరగతి నుంచి మొదలుకుని పీజీ చేసిన వారంతా దరఖాస్తు చేస్తున్నారు. దరఖాస్తుల వెల్లువ... జిల్లాలో ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,600 అంగన్వాడీల్లో మొత్తం 287 ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి జిల్లా యంత్రాంగం గత నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల్లో ప్రధాన అంగన్వాడీ టీచర్లు 62, మినీ అంగన్వాడీ టీచర్లు 54, ఆయా పోస్టులు 171 ఉన్నాయి. అదే తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 6వ తేదీ తుది గడువు. అయితే ఇప్పటివరకు దరఖాస్తుల సంఖ్య ఐదు వేలు దాటినట్లు అంచనా. దరఖాస్తుల సమర్పణకు మరో రోజు మిగిలి ఉండడంతో వీటి సంఖ్య ఏడు వేలు దాటొచ్చని యంత్రాంగం భావిస్తోంది. గడువు సమీపిస్తున్న సమయంలో అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుండడంతో వెబ్సైట్ మొరాయిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక.. అంగన్వాడీ కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తుల జాబితాను స్థానికంగా ప్రదర్శించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
ప్రాజెక్టులా.. పైసల్లేవ్!
సాక్షి, హైదరాబాద్ : ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశం. అందుకు తగ్గట్టే బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించాం. ప్రతినెలా రూ.2 వేల కోట్లు చెల్లిస్తాం. నిధుల కొరత లేకుండా చేస్తాం’అని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చేసరికి చతికిలపడుతోంది. బడ్జెట్లో భారీ కేటాయింపులతో నీటిపారుదల శాఖను అగ్రస్థానంలో కూర్చోబెట్టినా, నిధుల విడుదలలో మాత్రం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతినెలా రూ.2 వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నా రూ.1,000 కోట్లకు మించి విడుదల చేయట్లేదు. దీంతో సాగు నీటి ప్రాజెక్టుల బిల్లులన్నీ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు రూ.5,659 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖరీఫ్‌కు నీళ్లొచ్చేనా..! సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో రూ.5,659 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ.1,681కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేసి నీళ్లిచ్చే ప్రాజెక్టుల జాబితాలో ఉన్న దేవాదులలో రూ.424 కోట్లు, కల్వకుర్తిలో రూ.308 కోట్లు, నెట్టెంపాడులో రూ.77 కోట్లు, వరద కాల్వలో రూ.196 కోట్లు మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక శాఖను నీటిపారుదల శాఖ అధికారులు అడిగినప్పుడల్లా ఏదో రూ.200 నుంచి రూ.300 కోట్లు విడుదల చేస్తున్నారు. గత ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు నెలకు రూ.400 కోట్లకు మించి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయట్లేదు. ఈ నెల ఉన్నతాధికారుల ఒత్తిడితో రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా, రెండ్రోజుల కింద రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. వీటిని ఏ ప్రాజెక్టులకు సర్దాలో తెలియక నీటి పారుదల శాఖ తలలు పట్టుకుంది. నిధుల లేమితో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, సీతారామ, ఉదయ సముద్రం వంటి ప్రాజెక్టుల భూసేకరణకు పూర్తిగా బ్రేక్‌లు పడగా, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్సారెస్పీ–1, ప్రాణహిత, ఛనాఖా–కొరట, ప్రాజెక్టుల పనుల్లో వేగం తగ్గిపోయింది. మిషన్ కాకతీయకు సైతం రూ.530 కోట్ల మేర బిల్లులు పేరుకుపోవడంతో రెండో, మూడో విడతలో చేపట్టిన చెరువులు, మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత ఏడాది ‘లెక్క’నే! గతేడాదిలో సైతం సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించినా చివరికి రూ.14,918.19 కోట్లకే పరిమితమైంది. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో కొలిక్కి రాని భూసేకరణ, సహాయ పునరావాస ప్రక్రియ, కోర్టు కేసులతో ప్రాజెక్టు పరిధిలో అనుకున్న మేర పనులు జరగలేదు. ప్రాజెక్టుకు రూ.7,860 కోట్లు కేటాయించినా చివరికి రూ.2,851.88 కోట్లకు సవరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సైతం రూ.6,280 కోట్లు కేటాయించినా రూ.2,280 కోట్లకే పరిమితం చేశారు. దేవాదుల, కంతనపల్లి వంటి ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే జరగడంతో బడ్జెట్ కాస్తా రూ.10 వేల కోట్ల మేర తగ్గింది. నెలకు గరిష్టంగా రూ.1,000 కోట్ల చొప్పున ఖర్చు చేసినా ఈ ఏడాది మొత్తం ఖర్చు రూ.15వేల కోట్లు దాటడం గగనమే. కేటాయింపులే ఘనం.. సాగునీటి ప్రాజెక్టుల్లో మెజార్టీ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం, గత ఏడాది మాదిరే ఈ ఏడాది రూ.25వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది. నెలకు రూ.2వేల కోట్లకు తగ్గకుండా నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఘనంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినా, అనుకున్న స్థాయిలో నిధులు విడుదల కావట్లేదు. 9 నెలల్లో రూ.18వేల కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా రూ.11,722 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.4,015 కోట్ల రుణాలు పక్కనపెడితే ప్రభుత్వం నేరుగా రూ.7,707కోట్లే విడుదల చేసింది. ఈ లెక్కన ప్రభుత్వం ప్రతినెలా కేటాయించిన మొత్తం రూ.900 కోట్ల కన్నా తక్కువే. -
వైద్య విద్యలో 2,018 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి పరిధిలో ఖాళీగా ఉన్న 2,018 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. భర్తీలో స్థానికత, రిజర్వేషన్ రోస్టర్ అంశాలను పరిగణన లోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలు... 10 అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు, 9 ఆడియో విజువల్ టెక్నీషియన్, 2 బయో మెడికల్ ఇంజనీర్, 2 బయో మెడికల్ టెక్నీషియన్, 9 చైల్డ్ సైకాలజిస్టు, 4 సీటీ స్కాన్ టెక్నీషియన్, 26 డార్క్‌రూం అసిస్టెంట్, 4 డెంటల్ టెక్నీషియన్, 2 ఎర్లీ ఇంటర్వెంటినిస్టు, 5 ఈఈజీ టెక్నీషియన్, 6 ఈసీజీ టెక్నీషియన్, 1 ఎలక్ట్రిక్ ఇంజనీర్, 2 ఎఫిడమాలజిస్ట్, 30 జూనియర్ అసిస్టెంట్, 1 జూనియర్ బయోస్టాటిస్టిక్స్ ఆఫీసర్, 1 జూనియర్ ఇంజనీర్, 3 జూనియర్ స్టెనో, 39 ల్యాబ్ టెక్నీషియన్, 4 మెడికల్ రికార్డర్ క్లర్క్, 15 మెటర్నిటీ అసిస్టెంట్, 58 ఫార్మాసిస్ట్ గ్రేడ్(2), 1 ఫొటోగ్రాఫర్, 3 ఫిజియోథెరపిస్ట్, 18 రేడియోగ్రాఫర్, 9 రేడియోగ్రఫీ టెక్నీషియన్, 3 రెఫ్రాక్షనిస్ట్/ఆప్టీషియన్, 2 రిహాబిలిటేషన్ అసిస్టెంట్, 5 స్పీచ్ థెరపిస్ట్, 1,603 స్టాఫ్ నర్సు, 3 స్టాటిస్టీషియన్, 1 స్టెరిలైజేషన్ టెక్నీషియన్, 54 స్టోర్ కీపర్/రికార్డు క్లర్కు/కంప్యూటర్ ఆపరేటర్, 2 సిస్టమ్ ఆపరేటర్, 110 టెక్నికల్ అసిస్టెంట్, 61 టెక్నీషియన్ పోస్టులు. -
దేశ చరిత్రలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోమవారం రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజులు అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ తుది ఏర్పాట్లు చేస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై బుధవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రంలో 25 శాతం విద్యుత్ వ్యవసాయ పంపుసెట్ల ద్వారానే వినియోగమవుతోంది. రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజుల నుంచే అన్ని పంపుసెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. గత జూలై నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్ కూడా సమకూర్చుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో 9,500 ఎంవీ గరిష్ట డిమాండ్ ఏర్పడినా ఎక్క డా రెప్పపాటు కోత విధించకుండా 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వచ్చే రబీ సీజన్లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా’’అని పేర్కొన్నా రు. ఆటో స్టార్టర్లను తొలగించి విద్యుత్ ఆదాకు సహకరించాలని రైతులకు పిలుపునిచ్చారు. నాడు చిమ్మచీకట్లు రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. భూగర్భ జలాలున్నా కరెంటు లేక చేతి కొచ్చిన పంట కళ్లెదుట ఎండిపోయే పరిస్థితి ఉండేదని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పట్లో 2,700 మెగావాట్ల విద్యుత్‌లోటును రాష్ట్రం ఎదుర్కొందని, గత పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రణాళికా లోపంతో అనేక రంగాల్లో చిమ్మచీకట్లు అలముకున్నాయన్నారు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడి నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. చిమ్మచీకట్ల నుంచి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి చేశామన్నారు. దాదాపు రూ.94 వేల కోట్ల వ్యయంతో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నత్తనడకన నడుస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించిందని, కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే.. గడిచిన మూడున్నరేళ్లలో మరో 7,981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోగలిగామని చెప్పారు. సింగరేణి పవర్‌ప్లాంట్‌తో 1200ఎంవీ, కేటీపీపీతో 600 ఎంవీ, జూరాలతో 240 మెగావాట్లు, పులిచింతలతో 90 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌తో వెయ్యి మెగావాట్లు, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2 వేల మెగావాట్లు అదనంగా సమకూర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. నేడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు కాగా.. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. విద్యు త్ స్థాపిత సామర్థ్యాన్ని 28 వేల మెగావాట్లకు పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నా రు. రూ.12,136 కోట్లతో పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా 574 సబ్స్టేషన్లు రాష్ట్రం ఏర్పడే నాటికి అన్ని రకాల సబ్స్టేషన్లు కలిపి 2,414 ఉండగా.. 574 సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించి, మొత్తం 2,988 సబ్స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామని సీఎం చెప్పారు. రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు రూ.42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా 400 కేవీ సబ్ స్టేషన్లు 18, 220 కేవీ సబ్ స్టేషన్లు 34, 132 కేవీ సబ్ స్టేషన్లు 90, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 937 నిర్మించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,378 కిలోమీటర్ల హైటెన్షన్ లైన్లు ఉండగా ఇప్పుడు 19,916 కిలోమీటర్లకు పెంచామన్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లను 4,32,968 కిలోమీటర్ల నుంచి 4,84,001 కిలోమీటర్లకు పెంచామన్నారు. హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచామన్నారు. వార్ధా–మహేశ్వరం 765 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ నుంచి రాష్ట్రానికి 2 వేల మెగావాట్ల కారిడార్ కోసం పీజీసీఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం జీహెచ్ఎంసీ చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కేవీ రింగ్సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1,200 యూనిట్లుగా ఉంటే.. ఇప్పుడు 1,505 యూనిట్లకు పెరిగిందన్నారు. 2016–17లో జాతీయ సగటు 1,122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైందన్నారు. మూడున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగిందని తెలిపారు. కొత్తగా 13,357 ఉద్యోగాలు విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి 22,550 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. -
చెరువు నవ్వింది
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితాలు తొలి దశలోనే అందాయి. నీటి వనరులు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయం పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. మిషన్ కాకతీయ తొలి దశలో పునరుద్ధరించిన చెరువుల పరిధిలో.. సాగు, పంటల విస్తీర్ణం, దిగుబడి, రసాయన ఎరువుల వినియోగం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై నాబార్డ్ పరిధిలోని ‘నాబ్కాన్’ సంస్థ అధ్యయనం చేసింది. 42 పేజీల నివేదికను రూపొందించింది. మిషన్ కాకతీయతో విప్లవాత్మక మార్పు వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఇది ఎంతగానో దోహదపడినట్టు అధ్యయనంలో తేలింది. రసాయన ఎరువుల వినియోగం కూడా తగ్గినట్టు నాబ్కాన్ వెల్లడించింది. ఆదివారమిక్కడ జలసౌధలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తమ నివేదికను విడుదల చేసింది. అనంతరం ఈ అధ్యయనం తీరుపై ‘నాబ్కాన్’ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధ్యయనం ఇలా.. మిషన్ కాకతీయ మొదటి దశ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అధ్యయనం చేశారు. చెరువుల కింద ఆయకట్టు రైతు కుటుంబాలు, వారితో చర్చలు, ఉపగ్రహ చిత్రాల పరిశీలన, విశ్లేషణ, కొన్ని చెరువులపై కేస్‌స్టడీ ఇతరత్రా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా మిషన్ కాకతీయ ప్రభావాలపై మదింపు చేశారు. మిషన్ కాకతీయకు ముందు 2013–14లో పరిస్థితులు, కాకతీయ అమలు తర్వాత 2016–17 ఏడాదిలో ఉన్న పరిస్థితులను పోల్చుతూ ఈ అధ్యయనం సాగింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో 400 చెరువుల పరిధిలోని 12 వేల కుటుంబాలను సర్వే కోసం ఎంపిక చేసి అధ్యయనం చేశారు. సర్వే కోసం ఎంపిక చేసిన అన్ని జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, ఆశాజనకంగా లేకపోవడంతో ఖరీఫ్ పంట దెబ్బతింది. దీని ప్రభావం ముఖ్యంగా మెదక్, నల్లగొండ జిల్లాపై అధికంగా ఉన్నట్లు తేలింది. పెరిగిన సాగు విస్తీర్ణం.. 2016 ఖరీఫ్‌లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా.. మిషన్ కాకతీయ కారణంగా పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5% సాగు విస్తీర్ణం పెరిగింది. 2016 సెప్టెంబర్ మూడో వారంలో కురిసిన వర్షాలకు చెరువులు నిండటంతో రబీ విస్తీర్ణం ఎక్కువగా నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఖరీఫ్, రబీ కలిపి సాగు విస్తీర్ణంలో పెరుగుదలను చూస్తే.. కరీంనగర్లో అత్యధికంగా 62.5%, అతి ఎక్కువగా నల్లగొండలో 22.5% నమోదైంది. 2013–14 గ్యాప్ ఆయకట్టు 42.4 శాతంగా ఉండగా, 2016–17లో అది 23.2 శాతానికి తగ్గింది. నీటి వనరుల లభ్యత పెరగడంతో 2013తో పోలిస్తే 2016 ఖరీఫ్‌లో వరి సాగు 11.1 శాతం పెరిగింది. రబీ నాటికి అది 23.7 శాతానికి చేరింది. వరి దిగుబడిపరంగా చూస్తే ఖరీఫ్‌లో 4.4 శాతం, రబీలో 19.6 శాతం అధికంగా వచ్చింది. ఆదాయం పెరిగింది.. సర్వే కోసం ఎంపిక చేసిన ఆయకట్టు రైతు కుటుంబాల్లో 8.5% పూడిక మట్టిని తమ చెలకల్లో, పొలాల్లో చల్లుకున్నారు. పూడిక మట్టి వాడటంతో రైతులకు ప్రధానంగా రసాయనిక, పురుగు మందుల కొనుగోలు ఖర్చు తగ్గింది. పంట దిగుబడి ద్వారా ఆదాయం పెరిగింది. పూడిక మట్టితో రసాయనిక ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గింది. రైతుకు రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గింది. పంటల దిగుబడిపరంగా చూస్తే.. వరి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు పెరిగింది. చెరువు ఆయకట్టు పరిధిలోని కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం పెరగ్గా.. వ్యవసాయ ఆదాయం 47.4 శాతం పెరిగింది. బోరు బావులకు పునరుజ్జీవం ఎండిపోయిన బోరుబావులకు మిషన్ కాకతీయ ప్రాణం పోసింది. చెరువుల ఆయకట్టు కింద.. 17 శాతం ఎండిపోయిన బావులు, బోరు బావులు పునర్జీవం పొందాయి. ఆయకట్టు బయట కూడా ఇలాంటి బావులు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. భూగర్భ జల మట్టాల్లో సరాసరి పెరుగుదల 2013–14లో 6.91 మీటర్లు ఉంటే.. 2016–17లో అది 9.02 మీటర్లకు పెరిగింది. చెరువుల్లో చేపల ఉత్పత్తి 2013–14తో పోలిస్తే 2016–17లో 36 నుంచి 39 శాతానికి పెరిగింది. మారిన చెరువుల రూపురేఖలు మిషన్ కాకతీయ అమలుకు ముందు 63% మంది చెరువులు బాగా లేవని చెప్పారు. మరో 3 శాతం మంది చెరువుల పరిస్థితి దారుణంగా ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ మొదటి దశ తర్వాత 46.7 శాతం మంది చెరువులు చాలా బాగున్నాయన్నారు. 38 శాతం చెరువులు బాగు పడ్డాయని ,11.2 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. 4.1 శాతం మంది చెరువులు బాగా లేవని అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ అమలు తర్వాత చెరువుల నిర్వహణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. చెరువుల బలోపేతం విషయంలోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. 2016–17 సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా చెరువులు తెగిపోవడం వంటి ఘటనలు గణనీయంగా తగ్గాయి. భారీ వర్షాలకు 2009లో 1,107, 2010లో 4,251, 2013లో 1,868, చెరువులు దెబ్బతినగా... 2016లో 571 మాత్రమే దెబ్బతిన్నాయి. మిషన్ కాకతీయలో చెరువు కట్టలను బలోపేతం చేసినందు వల్లే ఇది సాధ్యమైందని నాబ్కాన్ తెలిపింది. చెరువుల పరిరక్షణ చట్టం తెస్తాం: మంత్రి హరీశ్‌రావు మిషన్ కాకతీయకు ప్రజల మద్దతు లభించింది. వారి మన్ననలు పొందింది. ప్రజా ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రభుత్వం ఆశించిన మేర మొదటి దశ చెరువుల ఫలితాలొచ్చాయి. మున్ముందు రెండు, మూడో దశ ఫలితాలపైనా అధ్యయనం చేయిస్తాం. ఆయా సంస్థలు ఇచ్చిన సూచనలు, సలహాలు తీసుకొని మిషన్ కాకతీయను మరింత సమర్థంగా చేపడతాం. చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. చట్టం రూపకల్పన బాధ్యతను నల్సార్ యూనివర్సిటీకి అప్పగించాం. -
వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జోనల్ వ్యవస్థ రద్దు విషయంలో వెనక్కి తగ్గింది. జోనల్ వ్యవస్థ రద్దుతో తీవ్ర ఇబ్బంది తలెత్తుతుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. అలాగే, జోన్ల సంఖ్యను పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం, మంత్రులు ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వ సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జోనళ్ల సంఖ్యను ఎన్ని పెంచాలని, పెంచే జోన్లలో ఏయే జిల్లాలను చేర్చాలనే విషయాలను ఆ కమిటీ నిర్ణయిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ .. 'ఉమ్మడి ఏపీలో ఉద్యోగ నియామకాల కోసం జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్వర్వులు (371డీ)ని సవరించాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిని తెలంగాణకు కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఇవ్వాలన్న ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతాం. జోనల్ వ్యవస్థ ఉండాలా? రద్దు చేయాలా అనే దానిపై అధ్యయనం చేస్తాం. డీఎస్సీని కొత్త జిల్లాల ప్రాతిపదికన వేయాలా ? పాత జిల్లాల ప్రాతిపదికన వేయాలా అనే దానిపై చర్చ జరిగింది. కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యం' అని కేసీఆర్ అన్నారు. ఇక కొత్త జోన్ల ఏర్పాటు కమిటీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్ రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మంత్రి పోచారం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు ఎస్కే జోషి, సురేశ్ చంద్ర, అజయ్ మిశ్రా, బీఆర్ మీనా, రాజీవ్ రంజన్ ఆచార్య, ఆధార్ సిన్హా, డీజీపీ అనురాగ్ శర్మ ఉండనున్నారు. వీరు త్వరలోనే ముసాయిదా సిద్ధం చేయనున్నారు. -
ఆదివాసీలకు అండగా ఉంటాం
సాక్షి, ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంటుందని అటవీ, పర్యాటక, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. 2014 కంటే ముందు పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేసుకునే గిరిజనులకు తప్పకుండా పట్టాలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో జరిగిన కుమురం భీం 77వ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమురం భీం సమాధి వద్ద మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా గిరిజనులంతా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల పట్టాల విషయంలో అక్కడక్కడ సమస్యలు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. -
యాదాద్రిలో సదుపాయాలెలా ఉన్నాయి..?
తెలియజేయాలని దేవాదాయ శాఖకు హైకోర్టు ఆదేశం ‘సాక్షి’ పత్రికలో వార్త.. పిల్‌గా స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తులకు కల్పించే కనీస సౌకర్యాలు, వైద్య సదుపాయా ల కల్పన ఏవిధంగా ఉందో తెలియజేయాలని తెలం గాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. యాదగిరిగుట్టలోని భక్తులు స్నానమాచరించే గుండంలో పడి గత నెల 3న పదేళ్ల బాలుడు మృతి చెందాడు. ‘విష్ణు పుష్కరిణిలో పడి బాలుడి మృతి’ పేరిట జూన్ 4న ‘సాక్షి’లో వచ్చిన వార్తను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఈ పిల్‌ను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం విచారించింది. నాగర్‌కర్నూల్ జిల్లా షాన్‌పల్లికి చెందిన చెవ్వొల బాలస్వామి కుమారుడు శివకుమార్ హైదరాబాద్‌లో ఉండే మేనమామ వీరయ్యతో కలసి యాదాద్రికి వెళ్లాడు. స్నానం చేసేందుకు గుండంలోకి దిగిన బాలుడు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం యాదాద్రిలో భక్తుల సౌకర్యాలు ఏవిధంగా ఉన్నా యో, వైద్య సదుపాయాల కల్పన ఎలా ఉందో తెలపాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది.