Teva
-
తెవా చేతికి అలెర్గాన్ జనరిక్స్!
40.5 బిలియన్ డాలర్ల ఒప్పందం టెల్ అవీవ్/న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ఫార్మా దిగ్గజం తెవా.. అంతర్జాతీయ ఔషధ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. ఐర్లాండ్ సంస్థ అలెర్గాన్ జనరిక్స్‌ను ఏకంగా 40.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.63 లక్షల కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో 33.75 బిలియన్ డాలర్లు నగదు రూపంలో, మిగతాది (6.75 బిలియన్ డాలర్లు) తెవా షేర్ల రూపంలో అలెర్గాన్ జనరిక్స్ మాతృసంస్థ అలెర్గాన్ పీఎల్‌సీకి లభిస్తాయి. ఈ డీల్‌కు తెవా, అలెర్గాన్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల ఆమోదం లభించింది. 2016 తొలి క్వార్టర్లో ఒప్పందం పూర్తి కావొచ్చని తెవా పేర్కొంది. ఒప్పందం ప్రకారం అలెర్గాన్కు చెందిన యాక్టావిస్ అంతర్జాతీయ జనరిక్స్ వ్యాపారం, థర్డ్ పార్టీ సప్లయర్ మెడిస్, అంతర్జాతీయ ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) వ్యాపారంతో పాటు కొన్ని ప్రముఖ ఔషధ బ్రాండ్స్ కూడా తెవాకు దక్కుతాయి. ఇటు జనరిక్స్, అటు స్పెషాలిటీ ఔషధాల వ్యాపారాలను మరింతగా వృద్ధి చేసుకునే దిశగా అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెవా ప్రెసిడెంట్ ఎరెజ్ విగోడ్మన్ తెలిపారు. ఇక, మరో ఔషధ దిగ్గజం మైలాన్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు తెవా వెల్లడించింది. మైలాన్‌ను 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు తెవా ఈ ఏప్రిల్‌లో ప్రతిపాదించడం తెలిసిందే. 100 మార్కెట్లలో కార్యకలాపాలు .. తెవా, అలెర్గాన్ జనరిక్స్ రెండూ కలిస్తే 100 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నట్లవుతుంది. దాదాపు 40 మార్కెట్లలో టాప్ మూడు సంస్థల్లో స్థానం లభిస్తుంది. అలెర్గాన్ కొనుగోలు అనంతరం 2016లో తమ అమ్మకాలు దాదాపు 26 బిలియన్ డాలర్ల మేర ఉండగలవని అంచనా వేస్తున్నట్లు తెవా వర్గాలు తెలిపాయి. తద్వారా అంతర్జాతీయంగా టాప్ 10 ఫార్మా సంస్థల్లో ఒకటిగా ఉండగలమని పేర్కొన్నాయి. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన మూడేళ్ల తర్వాత వార్షికంగా వ్యయాలు, పన్నులు సుమారు 1.4 బిలియన్ డాలర్ల మేర ఆదా కాగలవని తెవా వర్గాలు తెలిపాయి. -
తెవా ‘కొనుగోలు’ ఆఫర్‌కు మైలాన్ నో
‘క్యాష్ అండ్ స్టాక్’ ప్రతిపాదన తగినంత లేదని వివరణ న్యూయార్క్: ఇజ్రాయిల్ కేంద్రంగా పనిచేస్తున్న తెవా 40.1 బిలియన్ డాలర్ల కొనుగోలు ఆఫర్‌ను యూకే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ మైలాన్ లాబొరేటరీస్ తిరస్కరించింది. తెవా ‘క్యాష్-అండ్-స్టాక్’ ప్రతిపాదన మైలాన్ విలువను తక్కువగా చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. షేర్‌కు 82 డాలర్ల చొప్పున తెవా ‘బయ్‌అవుట్’ ఆఫర్ ఇచ్చింది. తాజా తిరస్కృతి నేపథ్యంలో... మరో ఆఫర్‌కు మైలాన్ తలుపులు తెరిచే ఉంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలి ఆఫర్ ప్రకారం అప్పటి మైలాన్ షేర్ ధరతో పోల్చితే తెవా ఆఫర్ 21 శాతం అధికం. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో మైలాన్ షేర్ ధర 3.56 డాలర్లు పతనమై (4.7 శాతం) 72.50 డాలర్లుకు తగ్గింది. నేపథ్యం ఇదీ... ఈ వారం మొదట్లో మైలాన్‌ను బలవంతంగా కొనుగోలు చేయడానికి తెవా ఫార్మా ఏకంగా 40.1 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వటంతో సంచలనం మొదలైంది. అయితే ఈ బిడ్‌ను తప్పించుకోడానికి మైలాన్ మొదటినుంచీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే అమెరికన్ ఫార్మా దిగ్గజం పెరిగోను కొనుగోలు చేయడానికి మైలాన్ లాబొరేటరీస్ రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాల కథనం. ఒకవేళ పెరిగోను మైలాన్ కొనుగోలు చేస్తే ఈ రెండింటినీ కలిపి కొనేంత శక్తి తెవాకు ఉండదు. ఈ ఆలోచనతో 29 బిలియన్ డాలర్లకు పెరిగోను కొనుగోలు చేసేలా... ఆ కంపెనీ షేర్ హోల్డర్లకు మైలాన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మేరకు... పెరిగో కంపెనీ వాటాదార్లకు ఒకో వాటాకు 60 డాలర్లతో పాటు మైలాన్‌కు చెందిన 2.2 షేర్లు కూడా ఇస్తారు. దీనిప్రకారం ఒకో పెరిగో షేరుకు 222.12 డాలర్లు చెల్లించినట్లవుతుంది. అయితే పెరిగో యాజమాన్యం మాత్రం ఈ బిడ్ చాలా తక్కువని దీనిని తిరస్కరించింది. తెవా ఆఫర్ వల్లే మైలాన్ షేరు ధర బాగా పెరిగిందని, ఆ పెరిగిన ధర ప్రకారం మైలాన్‌కు చెందిన రెండు షేర్ల విలువను లెక్కిస్తున్నారు తప్ప ఆఫర్‌కన్నా ముందు మైలాన్ ధరను పరిగణనలోకి తీసుకోవటం లేదని పెరిగో పేర్కొంది. తమ కంపెనీకి ఉన్న భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ ధర చాలా తక్కువని వివరించింది. ‘యాంటీట్రస్ట్’ అభ్యంతరాలతో రెగ్యులేటర్లు తెవా ఆఫర్‌ను తిరస్కరించే అవకాశం ఉందని కూడా మైలాన్ అంతక్రితం ప్రకటించడం గమనార్హం. -
పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేటెంట్ ఉల్లంఘన కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై లా సూట్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా ఫార్మా ప్రకటించింది. కొపాగ్జోన్ జెనరిక్ వెర్షన్‌కు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ నుంచి పారా-4 నోటిఫికేషన్ అందిందని, దీన్ని సవాలు చేస్తూ లా సూట్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా తెలిపింది. నాడీ వ్యవస్థ దెబ్బతిని వివిధ భాగాలు పనిచేయని వ్యాధి చికిత్సకు ఈ కొపాగ్జోన్ను వినియోగిస్తారు.