చేపల వర్షం గురించి విన్నారా!... నిజంగా ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట!
Fish Fall From Sky During Rain: మనం ఇంతవరకు వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా రకరకాల వర్షాలు పడటం చూశాం. పైగా నిప్పుల వర్షం, యాసిడ్ వర్షం వంటి రకరకాల వర్షాలు గురించి కూడా విన్నాం . అయితే ఇప్పుడు యూఎస్‌లో చేపల వర్షం పడింది. ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట.
(చదవండి: రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..)
అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని టెక్సర్కానా నగరంలో చేపల వర్షం కురిసింది. నిజానికి వరదలు వచ్చినప్పుడు చేపలు, పాములు, పీతలు వంటి రకరకాల జంతువులు కొట్టుకురావడం సహజం. కానీ టెక్సాస్‌లో తుపాను కారణంగా కురిసిన వానకు ఆకాశం నుచి చేపలు పడ్డా వింత సంఘటన చోటుచేసుకుంది. ఒక వేళ వర్షం కారణంగా భూమి నాని ఉపరితలం పైన చిన్న చేపలు, పీతలు వంటివి రావడం వంటివి జరుగుతుంది. కానీ వాటిన్నిటికి భిన్నంగా చేపలు ఆకాశం నుంచి ఊడిపడటమే వింతగా ఉంది. ఈ మేరకు చేపల వర్షం కురిసిందంటూ టెక్సాస్ నగరం ఫేస్బుక్లో ఒక ఫోటో కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఒకరేమో "స్వర్గం నుంచి ఉడిపడ్డ చేప" అని మరోకరేమో "డబ్లు వర్షం కూడా పడితే బాగుండును" అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: రోగిని బ్లాక్ మెయిల్ చేసి రూ 20 లక్షలు దోచుకునేందుకు యత్నంచిన నర్సు)