Theresa May
-
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్‌లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
జాన్సన్ దారెటు?
నాలుగేళ్లనాడు జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలన్న ఆత్రుతలో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ ఇచ్చిన ఒక హామీ కన్సర్వేటివ్ పార్టీకి దండిగా సీట్లు సాధించిపెట్టింది. అంతక్రితం తమకున్న 306 స్థానాలనూ 331కి పెంచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకి లభించింది. కానీ ఆ హామీయే తమను క్రమేపీ సంక్షోభం వైపు నెడుతుందని పార్టీ నేతలు అనుకొని ఉండరు. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఏడాదిలో నిర్వహించిన బ్రెగ్జిట్ రెఫరెండం మూడేళ్లకు ముగ్గురు ప్రధానుల్ని మార్చేలా చేసింది. కామెరాన్ తప్పుకున్నాక థెరిసా మే ప్రధాని కాగా, రెండేళ్లు గడిచేసరికి ఆమె కూడా రాజీనామా చేయాల్సివచ్చింది. తాజాగా ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు కన్సర్వేటివ్ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. బ్రిటన్‌కు మేలు చేకూరేవిధంగా ఈయూతో మాట్లాడి మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందానికి కృషి చేస్తాననడా నికి బదులు, అసలు ఏ ఒప్పందమూ అవసరం లేదంటూ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. బ్రెగ్జిట్ వ్యవహారం నిప్పుతో చెలగాటం వంటిది. ఈ సంగతి మొదట కామెరాన్, తర్వాత థెరిసా మే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈయూతో ఒప్పందంలో ఎన్ని సంక్లిష్టతలున్నాయో రెండేళ్లకు మే గ్రహించారు. ఈయూతో ఆమె కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందాన్ని ఈ ఏడాది జనవరిలో బ్రిటన్ పార్లమెంటు తోసిపుచ్చింది. ఆ తర్వాత మార్చిలో ఆమె మరో ముసా యిదా ఒప్పందానికి ఈయూను ఒప్పించారు. కానీ దాన్ని సైతం పార్లమెంటు తోసిపుచ్చింది. ఆమె వ్యవహారశైలిపై సొంత పార్టీలో అసంతృప్తి నానాటికీ తీవ్రమై చివరకు ఆమె రాజీనామా చేశారు. వచ్చే అక్టోబర్ 31నాటికి ఏదో ఒప్పందానికి రాకపోతే బ్రిటన్‌పై దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న సంగతిని జాన్సన్ గ్రహించలేకపోతున్నారో లేక అప్పటివరకూ ఏదో రకంగా నెట్టుకు రావొచ్చునని భావిస్తున్నారో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఒప్పందం కుదుర్చుకుని తప్పుకుంటే బ్రిటన్కొచ్చే లాభం ఒకటుంది. అది కొత్త విధానంలోకి పరివర్తన చెందడానికి 21 నెలల సమ యాన్ని... అంటే దాదాపు రెండేళ్ల గడువు తీసుకోవచ్చు. ఈలోగా ఎదురయ్యే సమస్యలను ఒక్కొ క్కటిగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఒప్పందం లేకుంటే ఒక్కసారిగా బ్రిటన్ అనిశ్చితిలోకి జారు కుంటుంది. బ్రిటన్, ఈయూల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి దేశ పౌరులకు సమస్యలేర్పడతాయి. తమ సభ్య దేశం కాదు గనుక బ్రిటన్‌పై ఈయూ భారీ సుంకాలు విధిస్తుంది. ఫలితంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. కొత్త నిబంధనలు రూపొందించుకునేవరకూ బ్రిటన్ నుంచి వచ్చే ఉత్పత్తులకు ఈయూ అనుమతి నిరాకరిస్తుంది. దేశం వెలుపలి నుంచి రావా ల్సిన విడి భాగాలు, ముడి సరుకు వగైరాల దిగుమతికి సమస్యలేర్పడతాయి గనుక ఉత్పత్తిదారులు బ్రిటన్ వదిలిపోవచ్చు. దానివల్ల లక్షలాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. అటు ఈయూ, ఇటు బ్రిటన్ కొత్త విధానాలు రూపొందించుకునే వరకూ రెండు ప్రాంతాల్లోనూ వలసదారులకు తిప్పలు తప్పవు. బ్రిటన్‌లో 37 లక్షలమంది యూరపియన్లు ఉంటే... ఈయూ దేశాల్లో 13 లక్షలమంది బ్రిటన్ పౌరులున్నారు. వీరంతా కొత్తగా రూపొందబోయే నిబంధనలకు అనుగుణంగా తమ స్థితి గతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈయూ బడ్జెట్ కోసం ఏటా చెల్లించాల్సిన 1,300 కోట్ల పౌండ్ల భారం నుంచి బ్రిటన్ తప్పుకోవచ్చు. కానీ అటు నుంచి వచ్చే సబ్సిడీలన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా ఉమ్మడి వ్యవసాయ విధానం కింద బ్రిటన్ రైతులకిచ్చే 300 కోట్ల పౌండ్లు ఆగిపోతాయి. ఇప్పటికే ఆమోదించిన ఈయూ బడ్జెట్‌కు, దానికింద పరస్పరం చేసుకునే చెల్లింపులకూ ఇరు దేశాలూ కట్టుబడి ఉండాలి. ఈయూ న్యాయస్థానం తీర్పులను బ్రిటన్ పాటించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈయూ దేశాలతో బ్రిటన్ వేర్వేరుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుంది. అందుకు చాన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ ఇకపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం నడుచుకుంటుంది. ఇందువల్ల కొన్ని రంగాల్లో బ్రిటన్ మెరుగైన స్థితిలో ఉండే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో సమస్యలేర్పడతాయి. కన్సర్వేటివ్ ఎంపీల్లో బ్రెగ్జిట్‌పై స్పష్టత లేకపోవడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. ఆ పార్టీలో ఒప్పందం వద్దనే వారితోపాటే, దాన్ని గట్టిగా సమర్థిస్తున్నవారున్నారు. ఆ అస్పష్టతే పార్టీలో ప్రధాని పదవికి పోటీపడిన జెరిమీ హంట్‌కు బదులు జాన్సన్‌ను ఎన్నుకోవడానికి కారణ మైంది. ఈయూతో సమర్థవంతంగా సంప్రదింపులు జరిపి దేశానికి లాభం చేకూర్చే ఒప్పందానికి వారిని ఒప్పిస్తానని హంట్ చెప్పినా అత్యధికులు ఆయన్ను విశ్వసించలేదు. కానీ జాన్సన్లో మరో డోనాల్డ్ ట్రంప్ ఉన్నారని వారు గ్రహించలేకపోయారు. అట్లాంటిక్ మహా సముద్రానికి అటున్న ట్రంప్, ఇటువైపున్న జాన్సన్ చూడటానికి కవలల్లా ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అప్పటికి లండన్ మేయర్‌గా ఉన్న జాన్సన్ న్యూయార్క్ వెళ్లినప్పుడు ఆయన్ను చాలా మంది ట్రంప్‌గా పొరబడ్డారు. అప్పట్లో ఆయన విపరీత వ్యాఖ్యలను తప్పుబట్టిన జాన్సన్ ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నారు. జాత్యహంకార వ్యాఖ్యల్లో, మహిళలను కించేపరిచేలా మాట్లాడటంలో, ఇస్లాంను భూతంగా చూడటంలో ఆయన ట్రంప్కెక్కడా తీసిపోరు. ఈయూతో ఒప్పందం లేకపో యినా మిన్ను విరిగి మీద పడబోదని జాన్సన్ చేసిన వ్యాఖ్య కూడా ఆ కోవలోనిదే. ఈయూతో ఏ ఒప్పందమూ ఉండబోదన్న అనుమానం వస్తే పార్లమెంటులో జాన్సన్‌పై సొంత పార్టీవారే అవి శ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోలేదు. తాననుకున్నది సాధించడానికి పార్లమెంటును ఆయన సస్పెండ్ చేస్తే పార్టీ ఉనికికే ముప్పు ముంచుకొస్తుంది. ఎలా చూసినా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో బ్రిటన్ సంక్షోభం ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీన్నుంచి ఆ దేశం ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. -
పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!
మగవాళ్లు ఆడవాళ్ల మీద వేసుకునే జోకులు ‘బాయిష్’గా ఉంటాయి. కానీ, ఆడవాళ్లు మగవాళ్ల మీద వేసుకునే జోకులు ‘గర్లిష్’గా ఉండవు. మెచ్యూరిటీతో ఉంటాయి. మగవాళ్లకు ప్రకృతి ప్రసాదించిన ఈ ఎదుగుదల లేమి ఆడవాళ్ల పనితీరుపై నెగటివ్‌గా ప్రభావం చూపితే, ఆడవాళ్లకున్న ఈ మెచ్యూరిటీ మగవాళ్ల పనితీరును మెరుగుపరిచేలా ఉంటుంది! బ్రిటన్‌లో బుధవారం ప్రభుత్వం మారింది. పార్టీ అదే. కన్సర్వేటివ్ పార్టీ. థెరెసా మే తప్పుకుని, ఆమె ప్లేస్‌లోకి బోరిస్ జాన్సన్ అనే ఆయన ప్రధానిగా వచ్చారు. ఆయన జుట్టు పాలిపోయిన పసుపు రంగులో (బ్లాండ్) ఉంటుంది. మనిషి పరుగులు తీసే (బాయెంట్) పాదరసంలా ఉంటారు. ఇక ఆయన మూడో ఆనవాలు విదూషకత్వం (బఫూనిష్). ఈ మూడు గుర్తింపులను కలిపి అక్కడవాళ్లకు జాన్స¯Œ తరచూ బ్లాండ్, బాయంట్, బఫూనిష్గా ప్రస్తావనలోకి వస్తుంటారు. థెరెసా మే ప్రధానిగా ఉన్న ఈ మూడేళ్లూ వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో ఆమెను వేపుకు తినేందుకు విఫలయత్నం చేసిన ఐడెంటిటీ కూడా జాన్సన్‌కి ఉంది. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్ ఆ దేశ పార్లమెంటు భవనం. ప్రధాని పదవీకాలం ఐదేళ్లు అయినప్పటికీ థెరిసా మే మూడేళ్లకే మెట్లు దిగేయడానికి పార్టీలో ప్రధాన కారకుడు జాన్సనే! థెరెసా మంత్రివర్గంలో జాన్సన్ విదేశాంగ కార్యదర్శిగా ఉండేవారు. గత ఏడాది జూలైలో ‘నాకు ఈ మంత్రి పదవి వద్దు. థెరెసా ‘బ్రెగ్జిట్’ విధానాలు నచ్చడం లేదు’ అని జాన్సన్ బయటికి వచ్చేశారు. తర్వాత తన వాదనకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని అయ్యారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ను నష్టం, కష్టం లేకుండా థెరెసా బయటికి తీసుకురాలేక పోతున్నారని జాన్సన్ ఆరోపించారు కనుక ఇకపై ఆయనే బ్రిటన్ను సమాఖ్య నుంచి లాభంగా, లాఘవంగా బయటికి తెప్పించాలి. థెరెసా వల్ల కానిది జాన్సన్ వల్ల అవుతుందా! విదేశాంగ కార్యదర్శిగా ఉన్న రెండేళ్లూ జాన్సన్ బఫూనిష్గానే ఉన్నారు. లిబియాలో మారణ హోమం జరుగుతుంటే.. ‘కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాలనన్నింటినీ ఎత్తి పారేస్తే లిబియన్ నగరాలు మంచి టూరిస్ట్ స్పాట్లు అవుతాయి’ అని ఆయన అనడం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు! క్రిటిక్స్ ఆయన్ని ‘బ్రిటన్ ట్రంప్’ అంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవిని వదులుకున్నాక లార్డ్ గ్రౌండ్లో ఉల్లాసంగా క్రికెట్ చూస్తున్న థెరెసా మే థెరెసా తప్పుకుని, జాన్సన్ ఎన్నికను ఎలిజబెత్ మహారాణి ఆమోదించాక గురువారం నాడు జాన్సన్ బ్రిటన్ కొత్త ప్రధానిగా తొలి ప్రసంగం చేస్తున్నప్పుడు థెరెసా పార్లమెంటు భవనంలోనే లేరు! ఆ సమయానికి ఆమె లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఐర్లండ్‌పై ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్న దృశ్యాలను ఎంతో ఇష్టంగా వీక్షిస్తూ కూర్చున్నారు. బ్రిటన్‌లో ఎన్నడూ లేనంతగా కాస్తున్న ఆ ఎండ పూట, నీడ పడుతున్న చోట ప్రత్యేక ఆతిథ్యంతో ఆసీనురాలై, అంచుకు చిన్న నిమ్మ చెక్క గుచ్చి తెచ్చిన గ్లాసులోని నిమ్మరసాన్ని స్ట్రాతో పీలుస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఆటను మొత్తం ఆస్వాదించారు. జాన్సన్ బాయిష్ టాక్‌లో వినేందుకు ఏముంటుందని ఆమె అనుకున్నట్లున్నారు. అంతకన్నా విశేషం ఆ ముందు రోజు జరిగింది. బయటికి వెళుతున్న బ్రిటన్ ప్రధాని ఎవరైనా చివరి ప్రసంగం ఇవ్వవలసి ఉంటుంది. ప్రసంగం తర్వాత ‘ప్రశ్నలు–జవాబుల’ కార్యక్రమం ఉంటుంది. సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. ప్రధాని సమాధానాలు ఇవ్వాలి. ఆ సెషన్లో జో స్విన్సన్ అనే ఒక మహిళా ఎంపీ థెరెసాను అడిగారు.. ‘‘దేశంలోని మహిళలకు మీరేం సలహా ఇస్తారు? పనిలో తమను మించినవారు లేరని ఊరికే చెప్పుకుంటూ తిరిగే మగాళ్లతో కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు మహిళలు ఎలా డీల్ చెయ్యాలి?’’ అని! ఒక్కసారిగా అంతా నవ్వేశారు. జాన్సన్‌ని దృష్టిలో పెట్టుకునే ఆమె ఆ ప్రశ్న అడిగారని అర్థమై థెరెసా నవ్వు ఆపుకున్నారు. సమాధానం చెప్పబోతుంటే నవ్వు అడ్డు పడి కాస్త ఆగారు. తర్వాత చెప్పారు. ‘‘మై అడ్వైజ్.. (మళ్లీ నవ్వు).. మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే. నిజాయతీగా పని చేయండి. పని చేస్తూనే ఉండండి. మీరు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారో ఆ పనిని చేయడమే మీ లక్ష్యంగా చేసుకోండి’’ అన్నారు. ప్రశ్న అడిగిన జో స్విన్సన్ ‘లిబరల్ డెమోక్రాట్’ పార్టీ తొలి మహిళా నాయకురాలు. ఈ వారంలోనే ఆమె తన పార్టీ లీడర్‌గా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్న ‘కన్జర్వేటివ్’, అపోజిషన్‌లో ఉన్న ‘లేబర్’ పార్టీలు కాకుండా బ్రిటన్ పార్లమెంటులో ఉన్న అనేక ఇతర పార్టీలలో లిబరల్ డెమోక్రాట్ కూడా ఒకటి. ఆ పార్టీ లీడర్‌గా ఎన్నికైనందుకు జో స్విన్సన్కు ‘ప్రశ్నలు–సమాధానాలు’ సెషన్లో థెరెసా అభినందనలు తెలిపారు. మిగతా పార్టీలలో కూడా చాలా వాటికి మహిళలు ఫ్లోర్ లీడర్లుగా ఉన్నారు. ఆ సంగతిని కూడా థెరెసా గుర్తు చేశారు. ‘‘పని పట్ల మహిళల్లో ఉండే నిబద్ధతే వాళ్లకు పార్టీ నాయకత్వాన్ని దక్కిస్తుంది’’ అన్నారు. అవన్నీ సున్నితంగా జాన్సన్‌ను ఉద్దేశించి అన్నవే. మరి నిబద్ధత ఉన్న థెరెసా ఎందుకని పార్టీ నాయకత్వం నుంచి, ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది! గత ఏడాది డిసెంబరులో, ఈ ఏడాది జనవరిలో ఆమె రెండుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గినప్పటికీ.. బ్రెగ్జిట్ నిబంధనలు, షరతులపై ఏకాభిప్రాయం సాధించకపోతే కనుక ప్రధానిగా తప్పుకుంటానని గత మార్చిలో ప్రకటించారు కనుక ఆ మాటకు నిబద్ధురాలై ఆమె తన పదవిని వదులుకున్నారు. ఇక ఇప్పుడు ఎంపీగా మాత్రమే థెరెసా వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌కు వెళ్లి వస్తుంటారు. బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుంచి విడిపించడం కన్నా తక్కువ పనేం కాదు బాయిష్ టాక్‌ను కట్టడి చెయ్యడం. ఇక ఇప్పుడు ఎంపీగా మాత్రమే థెరెసా వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌కు వెళ్లి వస్తుంటారు. బ్రిటన్ను ఐరోపా సమాఖ్య నుంచి విడిపించడం కన్నా తక్కువ పనేం కాదు.. పని చేసే చోట బాయిష్ టాక్నుకట్టడి చెయ్యడం. -
బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్ (55) ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ మంగళవారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. కాగా బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో మాజీ ప్రధాని థెరిసా మేకి పలుమార్లు ఎదురుదెబ్బలు తగలడంతో ఆమె పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో నూతన ప్రధానని ఎన్నుకున్నారు. దీని కోసం కేంద్రమంత్రుల నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో రహస్య ఓటింగ్ పద్దతి జరపగా.. దానిలో బోరిస్ జాన్సన్ విజయం సాధించారు. బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు బుధవారం మధ్యాహ్నాం చేపట్టనున్నారు. గతంలో ఆయన విదేశాంగ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. కాగా నూతన ప్రధాని జాన్సన్ కూడా బ్రెగ్జిట్‌కు తొలినుంచి అనుకూలంగా ఉన్నారు. మే కూడా మొదటి నుంచి ఆయనకే మద్దతు ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. జాన్సన్ 2001 నుంచి బ్రిటన్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతూ వస్తున్నారు. -
ప్రధానితో ప్రపంచకప్ విజేత
లండన్ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి టైటిల్ గెలిచిన మోర్గాన్ సేన మంగళవారం దేశ ప్రధాని థెరెసా మే ను మర్యాదపూర్వకంగా కలిశారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధాని అధికారిక కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్ ప్రజలు క్రికెట్‌పై మళ్లీ ప్రేమను పెంచుకునేలా మీరు చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను అత్యుత్తమ క్రీడా ఘట్టాల్లో ఒకటిగా చెప్పగలను. ఇరు జట్ల అద్భుతమైన ఆటతో పాటు కొంత అదృష్టం కూడా కలగలిసి ఒక థ్రిల్లర్‌ను మనకు అందించాయి. ఇంత గొప్ప టోర్నీకి ఇది సరైన ముగింపు. మన దేశాన్ని క్రీడల్లో ప్రముఖంగా నిలిపిన అందరికీ అభినందనలు’ అని ఈ సందర్భంగా ప్రధాని థెరెసా వ్యాఖ్యానించారు. కార్యాలయ గార్డెన్స్‌లో జరిగిన ‘షాంపేన్ రిసెప్షన్’లో క్రికెటర్లు ప్రధానితో సరదాగా కబుర్లు చెబుతూ తమ గెలుపును ఆస్వాదించడం విశేషం. -
తుది దశకు బ్రిటన్ ప్రధాని రేసు
లండన్: బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే స్థానంలో కొత్త కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ గురువారం తుది దశకు చేరుకుంది. పాకిస్తాన్ సంతతికి చెందిన హోం మంత్రి సాజిద్ జావిద్ పోటీ నుంచి నిష్క్రమించగా ఈ పదవికి రేసులో ఉన్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ తిరుగులేని మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. రహస్య బ్యాలెట్ల తుది రౌండ్లో బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి జెరెమై హంట్‌ను పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్ వెనక్కినెట్టడంతో ఈ రేసులో రెండో స్థానం కోసం జరుగుతున్న యుద్ధం మలుపు తిరిగింది. తాజా సమాచారం ప్రకారం జాన్సన్ 157 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా గోవ్ (61) హంట్ (59) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రిటన్ సీనియర్ మోస్ట్ మంత్రి అయిన జావిద్‌కు మూడవ దశలో కేవలం 34 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో జాన్సన్, గోవ్ ప్రధాని పదవికి పోటీ పడనున్నారు. తుది ప్రక్రియలో భాగంగా వారు పలు సమావేశాల్లో ఓటర్లనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. రెండు టీవీ చర్చల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. జూలై 22న విజేతను ప్రకటించే అవకాశం ఉంది. -
బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే కీలక నిర్ణయం
-
బ్రిటన్ చేరుకున్న ట్రంప్
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా సోమవారం లండన్ చేరుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2ను ఆయన సతీసమేతంగా కలుసుకున్నారు.అనంతరం ప్రిన్స్ చార్లెస్‌ను కూడా ట్రంప్ కలిశారు. త్వరలో పదవి నుంచి దిగిపోబోతున్న బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యి, చైనా సంస్థ హువావే వివాదం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, తన పాత శత్రువు, లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ట్రంప్ లండన్‌లో దిగగానే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. -
బ్రిటన్ ప్రధాని రేసులో ఎనిమిది మంది!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ప్రధాని పదవికోసం చాలా మంది ఆశావాహులు పోటీపడుతున్నారు. జూన్ 7న తాను పదవి నుంచి వైదొలగుతానని తేల్చడంతో.. మే నుంచి అధికార పగ్గాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతలు పోటీపడుతున్నారు. బ్రిటన్ ప్రధాని పదవి కోసం దాదాపు ఎనిమిది మంది నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో బ్రెగ్జిట్‌ను సమర్ధించే బోరిస్ జాన్సన్‌తో ముందంజలో ఉన్నారు. గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బోరిస్ జాన్సన్ ఈ బరిలో ముందున్నా మరో ఏడుగురు రంగంలోకి దిగడంతో పోటీ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌లో జరుపనున్న మూడురోజుల అధికార పర్యటన ముగిసిన తర్వాత జూన్ 7న ప్రధాని పదవి నుంచి వైదొలుగుతానని థెరెసా మే ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ నాయకుల్లో బోరిస్ జాన్సన్, బ్రిటన్ పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్, బ్రెగ్జిట్ మాజీ మంత్రి డొమినిక్ రాబ్, బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) మాజీ నేత ఆండ్రియా లీడ్సమ్, విదేశాంగ శాఖ మంత్రి జెరేమీ హంట్, అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి రోరీ స్టీవర్ట్, ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హంకాక్, ప్రజా పనులు, పెన్షన్ల శాఖ మాజీ మంత్రి ఎస్థర్ మెక్వే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా జూన్ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. -
బ్రిటన్ ప్రధాని రాజీనామా
లండన్: కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే శుక్రవారం ప్రకటించారు. జూన్ 7న తాను పదవి నుంచి వైదొలగుతాననీ, తమ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానన్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి తమ సొంత పార్టీ ఎంపీల నుంచే తాను మద్దతు కూడగట్టలేకపోయాననీ, దేశ ప్రయోజనాల కోసం పదవి నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూన్ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. ‘నా జీవితకాలంలో నాకు దక్కిన గొప్ప గౌరవం ఈ పదవి. త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నాను. నేను ప్రేమించే ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో కృతజ్ఞత చూపుతూ పదవికి రాజీనామా చేస్తున్నాను తప్ప ఏ రకమైన దురుద్దేశంతో కాదు’ అని మే వెల్లడించారు. తన రాజీనామా విషయాన్ని రాణి ఎలిజబెత్–2కి ఇప్పటికే తెలియజేశాననీ, జూన్ 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమావేశాలకు తానే అధ్యక్షత వహిస్తానని మే తెలిపారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్ మాట్లాడుతూ మే ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నారనీ, ఆమెతోపాటు ఆమె పార్టీకి కూడా దేశాన్ని పాలించే బలం లేదని అన్నారు. కాగా, తదుపరి ప్రధాని రేసులో మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ముందంజలో ఉన్నారు. -
ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్ ప్రధాని
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగే విషయమై ప్రధాని థెరెసా మే మంగళవారం పార్లమెంటులో నూతన బ్రెగ్జిట్ విధానాన్ని ప్రతిపాదించారు. దీనిపై అవసరమైతే రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలన్న అంశాన్నీ పొందుపరిచారు. ప్రతిపక్షాలు కోరుతున్న డిమాండ్లకు చోటు కల్పించారు. బిల్లులో కార్మికులు, దేశ రక్షణ, పర్యావరణం, వలసలకు సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈయూ నుంచి వైదొలగాలన్న తమ నిర్ణయానికి చివరి అవకాశం ఇవ్వాలని బ్రిటన్ ఎంపీలను థెరిసా కోరారు. ప్రజల నిర్ణయం కొరకు అవసరమైతే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడదామని, దీనికి సంబందించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈయూ నుంచి బయటకు రావాలంటూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు పలుమార్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆమె సొంత పార్టీ సభ్యులే ఓటింగ్‌లో ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది.మరోవైపు ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై పార్లమెంట్లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ నుంచి వైదొలగాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. -
‘విషాదానికి చింతిస్తూ..షో నిలిపివేస్తున్నాం’
లండన్ : పాపులర్ బ్రిటీష్ టాక్ షో ‘ది జెరెమీ కైలే షో’ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ పార్టిసిపెంట్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐటీవీలో ప్రసారమయ్యే జెరెమీ షోలో ప్రతీ ఎపిసోడ్‌కు ఇద్దరు పార్టిసిపెంట్లను ఆహ్వానిస్తారు. జీవిత భాగస్వాములు, ప్రేమికులే నిర్వాహకుల ప్రధాన టార్గెట్. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎదుటి వారిపై తమకున్న అభిప్రాయాలు, తమ బంధం గురించి చెప్పాల్సిందిగా కోరతారు. ఈ క్రమంలో స్టీవ్ డైమండ్(63) అనే వ్యక్తి తన ఫియాన్సితో కలిసి జెరెమీ షోకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా నిర్వహించిన లై డిటెక్టర్ పరీక్షలో అతడు విఫలమయ్యాడు. దీంతో స్టీవ్ తనను మోసం చేశాడని భావించిన ఫియాన్సీ అతడితో తెగదెంపులు చేసుకుంది. ఆమె దూరమవ్వడంతో ఈ కలత చెందిన స్టీవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే సహా వివిధ వర్గాల నుంచి ఈ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందించిన ఐటీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..‘ ఇటీవల చోటుచేసుకున్న విషాదాన్ని దృష్టిలో పెట్టుకుని జెరెమీ షోను నిలిపివేస్తున్నాం. 14 ఏళ్లుగా మిమ్మల్ని అలరించిన షో ఇకపై ప్రసారం కాబోదు. స్టీవ్ డైమండ్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాభ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో టీవీ షోల కారణంగా బ్రిటన్‌లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాపులర్ షో లవ్ ఐలాండ్‌లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై స్పందించిన ప్రధాని అధికార ప్రతినిధి వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బ్రిటన్ ప్రధాని రాజీనామాపై నిర్ణయం..!
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆమె పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేత గ్రాహమ్ బ్రాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యురోపియన్ దేశాల్లో చర్చంతా బ్రెగ్జిట్ చుట్టూనే నడుస్తోన్న విషయం తెలిసిందే. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో థెరిసా మే తీవ్రంగా విఫలమయ్యారని సొంత పార్టీ సభ్యులే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజీనామాపై వచ్చే వారం ఆమె కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్ ప్రధాని నిర్ణయం వీగిపోయిన విషయం తెలిసిందే. వాస్తవానికి రెండేళ్ల బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ మార్చి 29నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్లో ఆమె అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాడే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంచరించుకున్నాయి. ఒకవేళ మే రాజీనామా చేస్తే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. -
బ్రెగ్జిట్‌పై ఓ ఒప్పందానికి వద్దాం: థెరిసా మే
లండన్: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు అధికార కన్జర్వేటివ్ ప్రభుత్వం, విపక్ష లేబర్ పార్టీ ఒక రాజీ బ్రెగ్జిట్ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఆదివారం పార్టీ పత్రిక మెయిల్ ఆన్ సండేలో ఆమె ఈ మేరకు రాశారు. ‘ఓ ఒప్పందానికి వద్దాం’అని లేబర్ పార్టీ నేత జెర్మయి కార్బైన్‌ను ఉద్దేశించి ఆమె పిలుపునిచ్చారు. పార్టీల రాజీ అవకాశంపై అధికార పార్టీ నేతల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. చివరకు మే కూడా తాను కూడా అలా కోరుకోవడం లేదన్నారు. ‘కానీ సంక్షోభాన్ని సడలించే మార్గాన్ని కనుక్కోవాల్సి ఉంది. అంతేకాదు స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా దాని అత్యవసరతను పేర్కొంటున్నాయి..’అని బ్రిటన్ ప్రధాని లేఖ రాశారు. -
‘జలియన్‌వాలాబాగ్ అవమానకరం’
లండన్: 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతం బ్రిటిష్ పాలనలోని భారత చరిత్రలో అవమానకర మరకగా మిగిలిపోతుందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. పలువురు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేసినట్లుగా ఈ ఘటనపై అధికారికంగా క్షమాపణ చెప్పడానికి ఆమె నిరాకరించారు. ఈ నెల 13న జలియన్‌వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్లో చర్చలో ఆమె మాట్లాడారు. ‘ఆనాటి ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నాం. అయినా నేడు భారత్–బ్రిటన్ సంబంధాలు సంతృప్తికరం. బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల కృషి అమోఘం’ అని అన్నారు. స్వాతంత్య్రపోరాటంలో భాగంగా భారతీయులు రహస్యంగా సమావేశమైనప్పుడు జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సేనలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు. -
మూడోసారీ బ్రెగ్జిట్‌కు తిరస్కరణే
లండన్: మూడోసారి కూడా బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్ బిల్లును ఆ దేశ పార్లమెంటు శుక్రవారం తిరస్కరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చే పద్ధతి మరింత సంక్లిష్టమైంది. మే తెచ్చిన తాజా బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా 286 ఓట్లు, వ్యతిరేకంగా 344 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే బ్రెగ్జిట్‌కు సంబంధించిన అన్ని బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు థెరెసాకు మే 22వ తేదీ వరకు సమయం దొరికేది. వాస్తవానికి గత ప్రణాళిక ప్రకారం శుక్రవారం నుంచే (మార్చి 29) బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. బ్రెగ్జిట్ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందక పోవడంతో అది వాయిదా పడింది. -
బ్రెగ్జిట్ అనిశ్చితి.. మే రాజీనామాకు ఒత్తిడి
లండన్: బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై వచ్చే వారం పార్లమెంట్లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దిగిపోవాలంటూ మే ను హెచ్చరించాలని వారు భావిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం. అలా జరిగితే, ఆమె స్థానంలో డిప్యూటీ ప్రధానిగా ఉన్న డేవిడ్ లిడింగ్టన్ ఆపద్ధర్మ ప్రధానిగా అవుతారని పేర్కొన్నాయి. -
బ్రెగ్జిట్‌కు జూన్ 30 దాకా గడువివ్వండి
లండన్: యురోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని బ్రిటన్ ఈయూ నాయకులను కోరింది. ఈ మేరకు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు లేఖ రాసినట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం పార్లమెంట్లో చెప్పారు. జూన్ 30కి మించి గడువు కోరుకోవడం లేదని, అంతకన్నా ఆలస్యమైతే మే నెల చివరన ఈయూ పార్లమెంట్ ఎన్నికలను బ్రిటనే నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, గురువారం, శుక్రవారం బ్రసెల్స్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ సభ్య దేశాలు బ్రిటన్ వినతిపై ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. -
డీల్ లేని ‘బ్రెగ్జిట్’ వద్దు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనుదిరిగే బ్రెగ్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని థెరిసా మే చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో గట్టెక్కలేకపోయింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం 43 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. 321 మంది సభ్యులు అనుకూలంగా, 278 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి మే ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలు రెండుసార్లు వీగిపోయినట్లయింది.షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 29న యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావాల్సి ఉంది. కానీ తాజా పరిణామం నేపథ్యంలో ఆ తేదీన ఒప్పందం లేకుండా నిష్క్రమించడం సాధ్యం కాదని ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పర్యవేక్షణను పార్లమెంట్‌కు అప్పగించాలని విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని చెప్పారు. రెండో రెఫరెండానికి తిరస్కరణ బ్రెగ్జిట్ కోసం రెండో రెఫరెండం నిర్వహించాలన్న ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంట్ గురువారం భారీ మెజారిటీతో తిరస్కరించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 334 మంది, అనుకూలంగా 85 మంది ఓటేశారు. విపక్ష లేబర్ పార్టీ సభ్యులు చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకవేళ ఈ సవరణ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గట్టెక్కినా, ప్రభుత్వం దానిని తప్పకుండా అమలుచేయాల్సిన అవసరం లేదు. -
‘బ్రెగ్జిట్ జరగకుంటే సంక్షోభమే’
గ్రిమ్స్బై: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకేయాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. లేదంటే బ్రెగ్జిట్ ఎన్నటికీ జరగదనీ, సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు తిరస్కరించింది. ‘వచ్చే మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే మిగిలేది సంక్షోభమే. అంతిమంగా బ్రిటన్ ఈయూ నుంచి ఎన్నటికీ విడిపోదు’ అని మే అన్నారు. 2016లో జరిగిన బ్రెగ్టిట్ లో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 51.9 శాతం మంది బ్రిటిషర్లు ఓటేశారు. -
పాక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిందే : బ్రిటన్
లండన్ : పాక్ ఉగ్రవాద సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిదేనంటూ బ్రిటన్ ప్రధాని థెరిసా మే సూచించారు. పుల్వామా ఉగ్ర దాడులు - మెరుపు దాడుల ఫలితంగా భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థెరిసా, ఆదివారం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. ఈ విషయం గురించి బ్రిటన్ ప్రధాని కార్యలయ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రధాని థెరిసా మే పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను చక్కదిద్దేందుకు పాక్ ప్రధాని చూపిన చొరవను థెరిసా స్వాగతించారు. అంతేకాక ఉగ్రవాద సంస్థల పట్ల పాక్ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. పాక్ కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలని థెరిసా, ఇమ్రాన్ ఖాన్‌కు తెలిపారన్నా’రు. పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను యూకే 2001లోనే బ్యాన్ చేసింది. బాలాకోట్ మెరుపు దాడి అనంతరం థెరిసా మే పరిస్థితులను గమనిస్తున్నామని.. తాము ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నామని తెలిపారు. భారత్ - పాక్ దౌత్యపరమైన విధానాలతో ముందుకు వెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని థెరిసా కోరారు. (మసూద్ బతికేఉన్నాడు : పాక్ మీడియా) -
అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిన థెరిస్సామే
-
థెరెసా మేకు ఊరట
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకు స్వల్ప ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 19 ఓట్ల తేడాతో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఈ అవిశ్వాస పరీక్షను నెగ్గింది. అంతకు ముందు మంగళవారం ఈయూతో బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించిన సంగతి తెలిసిందే. వంద మందికి పైగా సొంత పార్టీకి చెందిన ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆమెపై హాజ్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెగ్జిట్ ప్రక్రియ మరో రెండు నెలల గడువే ఉండటంతో.. అవిశ్వాస పరీక్ష నెగ్గిన మే వేగంగా స్పందించారు. మూడు పార్లమెంటు పనిదినాల్లో ప్రత్యామ్నాయ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రతిపక్ష నేతలను థెరెసా మే ఆహ్వానించారు. బ్రిటన్ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. ఒకవేళ ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
తీవ్ర ఒడిదుడుకులు
తీవ్ర హెచ్చుతగ్గుల్లో సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితిల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ట్రేడింగ్ మొత్తంలో 184 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 3 పాయింట్ల లాభంతో 36,321 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 3 పాయింట్లు పెరిగి 10,890 పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ లాభాలు ఆవిరి... చైనా కేంద్ర బ్యాంక్ బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా 8,300 కోట్ల డాలర్ల నిధులను గుమ్మరించనున్నదన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్రెగ్జిట్ బిల్లు వీగిపోవడంతో యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. దీంతో మన మార్కెట్లో ఆటు పోట్లు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 144 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 40 పాయింట్ల వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 184 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్రిటన్‌లో అనిశ్చితి... యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంట్లో భారీ మెజారిటీతో వీగిపోయింది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముందని, ఎన్నికలు కూడా రావచ్చనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. లండన్ ఎఫ్టీఎస్ఈ 0.6 శాతం పతనం కాగా, ఇతర యూరప్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ల లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ విలీనం కారణంగా ఏర్పడిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఎస్ఈలో ఈ షేర్ రూ.47 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2.7 శాతం లాభంతో రూ.48 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.23,071 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్ రుణాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 32 శాతంగా ఉన్నాయి. ► జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుజ్జీవన ప్రణాళికపై అనిశ్చితి నెలకొనడంతో జెట్ ఎయిర్వేస్ షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీ భాగస్వామి ఎతిహాద్ జెట్ ఎయిర్వేస్లో మరింత వాటాను కొనుగోలు చేయనున్నదని, అయితే ఒక్కో షేర్‌ను రూ.150కు మాత్రమే ఆఫర్ ఇచ్చిందన్న వార్తల కారణంగా ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 8 శాతం తగ్గి రూ.271 వద్ద ముగిసింది. ► క్యూ3లో ఆర్థిక ఫలితాలు అదిరిపోవడంతో స్పెషాల్టీ రెస్టారెంట్ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.98 వద్ద ముగిసింది. -
బ్రిటన్‌కు అగ్ని పరీక్ష!
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ నిష్క్రమించాల్సిన గడువు ముంచుకొస్తుండగా ఆ దేశ ప్రధాని థెరిస్సా మే ఈయూతో కుదుర్చుకొచ్చిన ముసాయిదా ఒప్పందం వీగిపోయింది. బ్రిటన్ దిగువ సభ కామన్స్‌లో మంగళవారం దానికి చుక్కెదురైంది. ఆ ప్రతిపాదనకు అనుకూ లంగా కేవలం 202 ఓట్లు మాత్రమే లభించగా, 432మంది వ్యతిరేకించారు. దేశ ప్రధాని ప్రతిపాద నకు ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీనికి కొనసాగిం పుగా ఆమె ప్రభుత్వంపై విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. అందులో సైతం థెరిస్సా ఓడితే ఆమె ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకొనేందుకు గడువు తేదీ మార్చి 29. అంటే... ఇక కేవలం 72 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆలోగా ఈయూతో అది ఒప్పందానికి రాలేకపోతే బ్రిటన్ తెగదెంపులు పూర్తయినట్టే భావిస్తారు. సంస్థనుంచి బయటికొచ్చాక అనుసరించాల్సిన విధి విధానాలపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఈ ప్రక్రియ ముగిసిపోతే బ్రిటన్ను అది తీవ్ర సంక్షోభంలో పడేస్తుంది. దాని పర్యవసానంగా ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు పెను విపత్తుకు దారి తీస్తాయి. ఆహారం, మందులు వగైరాల కొరతతో మొదలుపెట్టి విమాన రాకపోకలు స్తంభించిపోవ డంతోసహా ఎన్నో సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత దేశంలో బద్దలయ్యే అశాంతిని అదుపు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుంది. అయితే ఇదంతా సజావుగా పూర్త వుతుందని, సమస్యలేమీ ఎదురుకావన్న భావనతోనే మార్కెట్లున్నాయి. అందుకే బ్రిటన్‌లోని తాజా పరిణామాల ప్రభావం వాటిపై పెద్దగా పడలేదు. థెరిస్సా మే గత కొన్ని నెలలుగా ఈయూ బాధ్యులతో బ్రెగ్జిట్‌పై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. వాటి పర్యవసానంగా గత నవంబర్‌లో ముసాయిదా ఒప్పందం ఖరారైంది. దీనికి కన్సర్వేటివ్ పార్టీలోనేకాక, తమకు మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్ పార్టీ డీయూపీనుంచి సైతం అసమ్మతి స్వరాలు వినిపించాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అవి పెరిగాయి. అటు విపక్ష లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పీ)లు సరేసరి. ఆ ముసాయిదా ఒప్పందం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి. ఈ స్థితిలో డిసెంబర్లో జరగాల్సిన ఓటింగ్‌ను ఆమె వాయిదా వేశారు. ఆ తర్వాత మరిన్ని రాయితీలివ్వాలని ఈయూను ప్రాధేయపడ్డారు. కానీ ఆ సంస్థను నడిపిస్తున్న జర్మనీ ఏంజెలా మెర్కల్ అందుకు సిద్ధంగా లేరు. అందుకే యూరొపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జుంకర్, యూరొపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌లు అందుకు తిరస్కరించారు. ఇదే బ్రిటన్ పౌరులను కలవరపరిచింది. 2016 జూన్‌లో బ్రెగ్జిట్‌పై రిఫరెండం జరిగినప్పుడు అత్యధి కులు స్వాగతించిన విషయాన్ని గుర్తుంచుకుంటే ప్రస్తుత వ్యతిరేకత తీవ్రతేమిటో అర్థమవుతుంది. అప్పట్లో 51.9 శాతంమంది రిఫరెండానికి అనుకూలత వ్యక్తం చేశారు. 48.1 శాతంమంది ఈయూ లోనే కొనసాగాలని కోరారు. రెండున్నరేళ్లు గడిచేసరికల్లా బ్రెగ్జిట్ అనుకూలురు, దాని వ్యతిరేకులు కూడా ఒకే దోవకొచ్చారు. ఫలితంగా ముసాయిదాకు కేవలం 20 శాతంమంది మాత్రమే అనుకూల మని సర్వేలు తేల్చిచెప్పాయి. ఒప్పందం మరీ కఠినంగా ఉండరాదని అనేకులు ఆశించారు. కానీ దానికి భిన్నంగా జరగడమేకాక ముసాయిదా బ్రిటన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని ఇది శాశ్వతంగా అప్రజాస్వామిక ఈయూకు బానిసను చేస్తుందన్నది వారి విశ్లేషణ. ఈ ముసాయిదా ఒప్పందం ఖరారైతే ఈయూ ఆమోదం లేకుండా అమెరికాతో సహా ఏ దేశంతోనూ భవిష్యత్తులో బ్రిటన్ వాణిజ్య ఒప్పందాలకు రావడం సాధ్యపడ దని వారంటున్నారు. తమనుంచి దూరమైతే ఎలాంటి దుర్గతి పడుతుందో సంస్థలోని ఇతర సభ్య దేశాలకు చూపడమే ఈయూ అధినేతల ఆంతర్యంగా కనబడుతున్నదన్న విమర్శలున్నాయి. అందుకే థెరిస్సా మే తీరును నిరసిస్తూ ఈమధ్యకాలంలో పలువురు మంత్రులు, డిప్యూటీలు ఆమె ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పారు. బ్రెగ్జిట్ చర్చల్లో మొదటినుంచీ కీలకపాత్ర పోషిస్తున్న డొమినిక్ రాబ్ కూడా వారిలో ఉన్నారు. ఒక దేశం సంస్థలో సభ్యత్వం తీసుకున్ననాటికి ఎలా ఉందో, విడిపోయాక కూడా అలా కొనసాగుతామంటే ఈయూ పెద్దలకు అభ్యంతరం ఎందుకుండాలి? సంస్థ ఆలంబనతో అన్నివి ధాలా ఎదిగాక మధ్యలో విడిచిపోతానంటే ఈయూ సంకటస్థితిలో పడుతుందన్నది జర్మన్ కార్పొ రేట్ల వాదన. అయితే యూరప్‌పై తమ ఆర్థిక పెత్తనాన్ని కొనసాగించడానికే జర్మన్లు ఇలాంటి అర్ధర హిత వాదనలు చేస్తున్నారని బ్రిటన్ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం ఖరారు కాకపోతే అటు బ్రిటన్‌కు మాత్రమే కాదు...ఇటు ఈయూ దేశాలకూ బోలెడు సమస్యలు ఎదురవుతాయి. ఈయూ సభ్యదేశాల పౌరులు ఇన్నాళ్లూ యూరప్లోఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఉపాధి వెదుక్కోవచ్చు. కానీ ఏ ఒప్పందమూ లేకుండా బ్రిటన్ విడిపోయే పరిస్థితి ఏర్పడితే వేరే దేశాల్లో ఉండే బ్రిటన్ పౌరులు అక్కడ నివసించేందుకు పర్మిట్లకు దరఖాస్తు చేయాలి. ఫిన్లాండ్లో ఉన్న 5,000మంది బ్రిటన్ పౌరులకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అలాగే బ్రిటన్‌లో ఉండే వేరే దేశాల పౌరులు సైతం ఆ పనే చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు వైన్ ఎగుమతులు... బ్రిటన్నుంచి ఫ్రాన్స్‌కు మద్యం ఎగుమతులు నిలిచిపోతాయి. ఆ రెండు దేశాలూ ఆర్థిక సంక్షో భంలో పడతాయి. ఏదేమైనా బ్రిటన్ పరిస్థితి ‘ముందు నుయ్యి–వెనక గొయ్యి’ అన్నట్టుంది. పాత ముసాయిదాలో మార్పులు కావాలని బ్రిటన్ సంప్రదిస్తే కొత్త ఒప్పందానికి ఆమోదం పొందుతా మన్న ముందస్తు హామీ ఇచ్చే షరతు విధిస్తామని ఈయూ బాధ్యులు అంటున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యానికి’ అధిపతిగా ఉన్న బ్రిటన్‌కు ఈ బ్రెగ్జిట్ వ్యవహారం అగ్నిపరీక్షగా మారింది. దీన్నుంచి అది గౌరవంగా ఎలా బయటపడగలదో మున్ముందు చూడాలి.