Thunder shock
-
భార్య హాస్పిటల్‌కు.. భర్త మార్చురీకి
ఆదిలాబాద్: పిడుగుపాటు ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసే సింది. చేను చెలక, ఇద్దరు పిల్లలతో సంతోషంగా కాలం వెళ్లదీస్తున్న ఓ కుటుంబం పిడుగుపాటుతో రోడ్డున పడింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గూడ గ్రామానికి చెందిన షేక్ యాసిన్(41), షేక్ అ ఫ్సానా దంపతులు. వీరికి రియాన్(14), సానియా(12) ఉన్నారు. యాసిన్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. తనకున్న మూడెకరాల్లో ఈ ఏడాది పత్తి వేశాడు. శుక్రవారం భార్యతో కలిసి ఎడ్లబండిపై చేనుకు వెళ్లి, పత్తిలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా, మధ్యాహ్న వర్షం మొదలైంది. ఇంటికి తిరిగి వెళ్లేందుకు యాసిన్ ఎడ్లబండిని సిద్ధం చేయసాగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో రెండు ఎడ్లు, యాసిన్ అక్కడికక్కడే చనిపోగా, కొద్ది దూరంలో అఫ్సానా స్పృహ కోల్పోయింది. గమనించిన చుట్టుపక్కల రైతులు సంఘటన స్థలానికి వెళ్లి అఫ్సానాను రిమ్స్‌కి తరలించారు. యాసిన్ మృతదేహం పోస్టుమార్టం కోసం రిమ్స్‌కి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు అఫ్సానా తలకు గాయాలు కావడంతో ఆమెను కు టుంబీకుల రిమ్స్ నుంచి జిల్లా కేంద్రంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతుండగా బీపీ తరచూ మారుతుండటంతో భర్త చనిపోయిన విషయాన్ని ఆమెకు కుటుంబీకులు చెప్పలేదు. స్పృహలోకి వచ్చిన ఆమె తన భర్త ఎ క్కడ అని అడగగా, గాయాలతో వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రేపు ఉదయం వెళ్లి చూడవచ్చని సర్దిచెప్పారు. అయితే భారీ వర్షానికి గ్రా మంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఆస్కా రం లేకపోవడంతో శవాన్ని మార్చురీలో ఉంచారు. శనివారం పోస్టుమార్టం చేయాలని కుటుంబీకులు వైద్యులను కోరారు. -
పిడుగుపాటుకు రైతు మృతి
బొల్లాపల్లి: పెసర పంటకు కాపలా వెళ్లి పొలంలో పిడుగుపాటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని పలుకూరు పంచాయతీ శివారు సోమ్లావాగుతండాలో చోటుచేసుకుంది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన∙భూక్యా శ్రీరాములు నాయక్(45) తన పొలంలో వేసిన పెసర పైరుకు కాపలాకోసం ఆదివారం వెళ్లాడు. ఇంటికి బయలుదేరే సమయంలో ఉరుములు, మెరుపులు ప్రారంభమై పిడుగుపడి పంట పొలంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ పి.అనిల్‌కుమార్ తెలిపారు. మృతునికి భార్య భీఘన బాయి, నలుగురు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అదే పంచాయతీకి చెందిన రామాపురం గ్రామానికి చెందిన పీరయ్య తన ఆవును మేతకు పొలానికి తోలుకెళ్లాడు. పిడుగుపడి ఆవు అక్కడికక్కడే చనిపోగా, పీరయ్య షాక్‌కు గురయ్యాడు. చికిత్స అందించగా కోలుకున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగుపాటుకు మృతి చెందిన భూక్యా శ్రీరాములు నాయక్ మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిlతెలిపారు. పార్టీ నాయకులు మూలె వేంకటేశ్వరెడ్డి, డుమావతు గొవిందు నాయక్, కొత్త కృష్టారెడ్డి, గొలమారి కొండారెడ్డి,అమరేసు నరసింహరావు, ఖజ్జాయం లక్ష్మీనారాయణ, దండు చెన్నయ్య,వేంకటేశ్వర్లు, చిన్నబ్బాయి తదితరులు కూడా రైతు కుటుంబాన్ని పరామర్శించారు.