పిడుగుపాటుకు రైతు మృతి
Published Sun, Jul 17 2016 8:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
బొల్లాపల్లి: పెసర పంటకు కాపలా వెళ్లి పొలంలో పిడుగుపాటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని పలుకూరు పంచాయతీ శివారు సోమ్లావాగుతండాలో చోటుచేసుకుంది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన∙భూక్యా శ్రీరాములు నాయక్(45) తన పొలంలో వేసిన పెసర పైరుకు కాపలాకోసం ఆదివారం వెళ్లాడు. ఇంటికి బయలుదేరే సమయంలో ఉరుములు, మెరుపులు ప్రారంభమై పిడుగుపడి పంట పొలంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ తెలిపారు. మృతునికి భార్య భీఘన బాయి, నలుగురు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అదే పంచాయతీకి చెందిన రామాపురం గ్రామానికి చెందిన పీరయ్య తన ఆవును మేతకు పొలానికి తోలుకెళ్లాడు. పిడుగుపడి ఆవు అక్కడికక్కడే చనిపోగా, పీరయ్య షాక్‌కు గురయ్యాడు. చికిత్స అందించగా కోలుకున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగుపాటుకు మృతి చెందిన భూక్యా శ్రీరాములు నాయక్ మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిlతెలిపారు. పార్టీ నాయకులు మూలె వేంకటేశ్వరెడ్డి, డుమావతు గొవిందు నాయక్, కొత్త కృష్టారెడ్డి, గొలమారి కొండారెడ్డి,అమరేసు నరసింహరావు, ఖజ్జాయం లక్ష్మీనారాయణ, దండు చెన్నయ్య,వేంకటేశ్వర్లు, చిన్నబ్బాయి తదితరులు కూడా రైతు కుటుంబాన్ని పరామర్శించారు.
Advertisement
Advertisement