tribal peoples welfare
-
ఆదిలాబాద్‌లో ప్రగతి బాట ఏది.?
సాక్షి, ఆదిలాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించుకోవ డం.. ఆదివాసీల కోసం ఇది చేస్తాం.. అది చేస్తామని హామీలివ్వడం ప్రజాప్రతినిధులకు, అధికారులకు పరిపాటే.. చివరికొచ్చి ప్రగతి బాటకు ఎదురుచూపే మిగులు తోంది. చేతికొచ్చిన వాటిని అమలుపర్చిన ఆదివాసీలకు మేలు జరుగుతుంది. ఉన్నవాటిని ఉంచిన వారికి లాభం చేకూరుతుం ది. ఆదివాసీలు అందరిని అక్కున చేర్చుకుం టారని, అమాయక జనాలను వల్లే వేసే అధి కార యంత్రాంగం జిల్లాలో వారి సంక్షేమాని కి మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా ప్రధానాస్పత్రి ఏదీ.? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2008 కంటే ముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా జిల్లా ప్రధాన ఆస్పత్రి ఏపీవీవీపీ ఆధీనంలో పనిచేసింది. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఆదిలాబాద్‌లో రిమ్స్ వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి రిమ్స్‌గా మారిపోయి సుమారు 11 ఏళ్లు అవుతుంది. అప్పట్లోనే జిల్లా ప్రధాన ఆస్పత్రిని ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, లేని పక్షంలో ఉట్నూర్ తరలిస్తామని చెప్పారు. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. మంచిర్యాల కొత్త జిల్లా కావడంతో ఇక అక్కడి ఏరియా ఆస్పత్రే జిల్లా ప్రధాన ఆస్పత్రిగా మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ప్రధాన ఆస్పత్రి ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏళ్లుగా నానుతూనే ఉంది. ఉట్నూర్ ఆస్పత్రిలో పడకల సామర్థ్యం పెంచి జిల్లా ప్రధాన ఆస్పత్రిగా దానిని రూపాంతరం చేసిన పక్షంలో ఆదివాసీలకు సమీపంలోనే మెరుగైన వైద్యం లభించే పరిస్థితి ఉంటుంది. వైద్య పోస్టులు, ఏఎన్ఎంల పోస్టులు అనేకంగా ఖాళీగా ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ రిమ్స్‌లో గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన ఆర్వి కర్ణన్ ఐటీడీఏ వార్డును ఏర్పాటు చేశారు. ప్రధానంగా రిమ్స్‌లో వైద్యసేవల కోసం గిరిజనులు అధికంగా రావడం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రత్యేక వార్డులను అప్పట్లో దూరదృష్టితో ఆలోచించి అప్పటి ఐటీడీఏ పీఓ ఏర్పాటు చేశారు. ఆ వార్డులో ఆదివాసీల కోసం అన్ని ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడు ఆ వార్డునే తొలగించారు. ఆ వార్డును ఎందుకు తొలగించారనేది కూడా ఆస్పత్రిలో చెప్పేవారే లేరు. ఈ పరిస్థితుల్లో వారికి సరైన వైద్య చికిత్స ఎలా అందుతుందనేదే ప్రశ్న. మరోపక్క రక్తహీనతతో సతమతమయ్యే ఆదివాసీలకు ఆదిలాబాద్, ఉట్నూర్‌లలో బ్లడ్ బ్యాంకుల్లో సత్వరం రక్తం లభించేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉంది. సీజనల్ వ్యాధుల సమయంలో సరైన వైద్య చికిత్స లభిస్తే వారికి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండదు. విద్యపరంగా ప్రతిపాదనలు... గిరిజనులకు విద్య అవకాశాల పరంగా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేసినప్పటికి మోక్షం రూపం దాల్చడం లేదు. ప్రాథమిక పాఠశాలలను దిశా మోడల్ స్కూల్ పథకంలో భాగంగా ఇంగ్లిష్ మీడియంగా ఆ స్కూళ్లను మార్చాలనే ప్రతిపాదన పూర్తిస్థాయిలో మోక్షం లభించడంలేదు. టీటీసీ, ఏఎన్ఎం శిక్షణ కేంద్రాలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను పరిచయం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివే గిరిజనుల కోసం సరైన కోచింగ్ సెంటర్లు జిల్లాలో అందుబాటులో లేవు. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కార్పొరేట్ కళాశాలల్లో చదువుకొనే పరిస్థితులు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వారికి చదువుల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే దూరదృష్టిలో వ్యవహరించాల్సిన పరిస్థితి. గతంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు మంజూరైన గిరిజన యూనివర్సిటీని ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు తన్నుకపోయారు. అధ్వానంగా రోడ్లు... ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దురావస్థతే. ఒకవైపు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం మూడేళ్లుగా నిర్వహించకపోవడంతో గిరిజనుల అభివృద్ధికి సరైన ప్రణాళికలు లేవు. ఒకవేళ నిధులు మంజూరు జరిగినా అవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడంలేదు. 2017–18లో రూ.97 కోట్లతో ఏజెన్సీ మండలాల్లో పలుచోట్ల 57 రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అవి ఇప్పటికీ టెండర్ దశలోనే ఉండడం గమనార్హం. ఒకవైపు సరైన రోడ్డు మార్గాలు లేక భారీ వర్షాల కారణంగా ఆదివాసీలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మరోపక్క రూ.25 కోట్లతో ఐటీడీఏ పరిధిలోని ఆరు మండలాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నారు. ఈ నిధులు గిరిజనసంక్షేమ శాఖ నుంచి మంజూరయ్యాయి. -
గిరిజనుల సంక్షేమానికి పాటుపడతా
అరకు ఎంపీ కొత్తపల్లి గీత విజయోత్సవ సభకు తరలివెళ్లిన ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబు అడుగడుగునా ఘన స్వాగతం రంపచోడవరం/గంగవరం, న్యూస్‌లైన్ : గిరిజనుల సంక్షేమానికి నిరంత రం పాటుపడతానని వైఎస్సార్ సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత పేర్కొన్నారు. ఆదివారం రంపచోడవరంలోని లెనోరా విద్యా సంస్థల ప్రాంగణంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (బాబు) అధ్యక్షతన విజయోత్సవ సభ నిర్వహించారు. ఇది సమష్టి విజయమని ఎంపీ గీత, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అనంత బాబు పేర్కొన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేశ్వరి అన్నారు. అన్న య్య అనంత బాబు అందించిన సహకారం జీవితంలో మరువలేన న్నారు. అనంత బాబు మాట్లాడుతూ ఎంపీపీగా పనిచేసి, ఉపాధి కూలీగా కూడా చేసిన రాజేశ్వరికి పేదల కష్టాలు తెలుసని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుందని తెలి పారు. రాబోయే రోజుల్లో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడానికి ిసిద్ధంగా ఉండాలని, జనంతో కలిసి పనిచేయాలని ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. అనంత బాబు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు ఇబ్బందులు కలగ కుండా చూడాలన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ, ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు పాల్గొన్నారు. సభకు ర్యాలీగా తరలివెళ్లిన నేతలు రంపచోడవరంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజకవర్గ కన్వీనర్ అనంత బాబు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా తరలివెళ్లారు. ఎల్లవరం మొదలు కొని రంపచోడవరం చేరుకునే వరకు ప్రతి గ్రామం లో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబుకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. మండల కేంద్రమైన గంగవరంలో మండల యువజన అధ్యక్షుడు దిండి నాగమహేష్ , జెడ్పీటీసీ అభ్యర్థిని రామతులసి, సర్పంచ్ అక్కమ్మ తదితరులు స్వాగతం పలికారు. అలాగే రంపచోడవరం మండలంలో బి. వెలమలకోట గ్రామంలో గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామ శివారులో స్వాగతం పలకగా, గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే రాజేశ్వరి ఆవిష్కరించారు. ఇక్కడ కొద్దిసేపు కార్యకర్తలను ఉద్దేశించి అనంత బాబు ప్రసంగించారు. అనంతరం ఐ.పోలవరం గ్రామంలో ఎమ్మెల్యే రాజేశ్వరికి, అనంత బాబుకు అపూర్వ స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నాయకులు, కార్యకర్తలు జేజేలు కొడుతూ రంపచోడవరం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. పందిరి మామిడి నుంచి సభాప్రాంగణం వరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబులు ప్రజలకు అభివాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రంపచోడవరం వారపు సంతలోని ఆలయం లో కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు.