trusted brand
-
అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ ‘శాంసంగ్’
ముంబై: దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ డ్యూరబుల్స్ సంస్థ శాంసంగ్ తాజాగా భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో సోనీ, ఎల్జీ ఉన్నాయి. ఇక నాల్గవ స్థానంలో యాపిల్ ఉంది. కాగా టాప్–5లో కేవలం ఒకే ఒక దేశీ కంపెనీ టాటా గ్రూప్ మాత్రమే స్థానం పొందగలిగింది. ఇది ఐదో స్థానంలో ఉంది. ఇక ఆరవ స్థానంలో హోండా కొనసాగుతోంది. దేశీ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. పీసీ తయారీ కంపెనీ డెల్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక లెనొవొ తొమ్మిదో స్థానంలో, బజాజ్ పదో స్థానంలో ఉంది. కాగా గతేడాది జాబితాలో టాప్–10లో నిలిచిన శాంసంగ్ మొబైల్స్, నోకియా, గోద్రెజ్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఈసారి జాబితాలో మాత్రం స్థానం కోల్పోయాయి. బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్–2017లో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. టీఆర్ఏ రీసెర్చ్ ఈ నివేదికను రూపొందించింది. -
ఇండియన్స్ మెచ్చే బ్రాండ్ ఏంటో తెలుసా...
కోల్ కతా: కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ భారతీయులు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే ఫోన్ అని టీఆర్ఏ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశంలో వినియోగదారులు నమ్మే అన్ని కంపెనీలలోకెల్లా మొబైల్ కంపెనీ శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు శాంసంగ్ మొబైల్స్ నే నమ్ముతారని, ఆ తర్వాత సోనీ, ఎల్జీ, నోకియా, టాటా మొబైల్స్ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా సర్వే స్టడీ 2016' లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తొలి ఐదు స్థానాలు మొబైల్స్ బ్రాండ్ కంపెనీలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆరో స్థానంలో హోండా కంపెనీ, ఏడో స్థానంలో బజాజ్, ల్యాప్ టాప్ తయారీ సంస్థ డెల్ ఎనిమిదో స్థానంలో నిలవగా గోద్రెజ్ తొమ్మిదో స్థానం సంపాదించి టాప్ టెన్ బ్రాండ్లలో నిలిచింది. దేశవ్యాప్తంగా 16 నగరాలలో 267 రకాల బ్రాండ్ ప్రొడక్ట్స్ పై సర్వే చేసి ఈ వివరాలు ప్రకటించారు. కింగ్ ఫిషర్ ఎక్కువ మంది మెచ్చే బీర్ బ్రాండ్ కాగా, ఇంటర్నెట్ విభాగంలో గూగుల్ తొలి స్థానంలో నిలిచింది. -
శాంసంగ్.. 2016 విశ్వసనీయమైన బ్రాండ్ ..
ముంబై: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మొబైల్స్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. టాప్-5లో కేవలం ఒకే ఒక దేశీ సంస్థ టాటా గ్రూప్ చోటు దక్కించుకుంది. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్-ఇండియా స్టడీ 2016’ పేరుతో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) ఒక సర్వే నిర్వహించింది. విశ్వసనీయమైన టాప్-5 బ్రాండ్స్‌లో శాంసంగ్ మొబైల్స్, సోనీ, ఎల్జీ, నోకియా, టాటా కంపెనీలు ఉన్నాయి. గతేడాది ఎల్జీ అగ్ర స్థానంలో, శాంసంగ్ రెండోస్థానంలో ఉండేవి. ఈ ఏడాది శాంసంగ్ టాప్‌లోకి వెళ్లింది. ఇక టాటా స్థానం 4 నుంచి 5కి పడింది. రిలయన్స్ స్థానం 14 నుంచి 22కు క్షీణించింది. మారుతీ సుజుకీ స్థానం మాత్రం 16 నుంచి 11కి మెరుగుపడింది. హీరో మోటోకార్ప్ 14వ స్థానంలో నిలిచింది.