అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌ ‘శాంసంగ్‌’ | Samsung: Samsung most trusted brand in India | Sakshi
Sakshi News home page

అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌ ‘శాంసంగ్‌’

Published Thu, Apr 6 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌ ‘శాంసంగ్‌’

అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌ ‘శాంసంగ్‌’

ముంబై: దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ సంస్థ శాంసంగ్‌ తాజాగా భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో సోనీ, ఎల్‌జీ ఉన్నాయి. ఇక నాల్గవ స్థానంలో యాపిల్‌ ఉంది. కాగా టాప్‌–5లో కేవలం ఒకే ఒక దేశీ కంపెనీ టాటా గ్రూప్‌ మాత్రమే స్థానం పొందగలిగింది. ఇది ఐదో స్థానంలో ఉంది.

ఇక ఆరవ స్థానంలో హోండా కొనసాగుతోంది. దేశీ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. పీసీ తయారీ కంపెనీ డెల్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక లెనొవొ తొమ్మిదో స్థానంలో, బజాజ్‌ పదో స్థానంలో ఉంది. కాగా గతేడాది జాబితాలో టాప్‌–10లో నిలిచిన శాంసంగ్‌ మొబైల్స్, నోకియా, గోద్రెజ్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఈసారి జాబితాలో మాత్రం స్థానం కోల్పోయాయి. బ్రాండ్‌ ట్రస్ట్‌ రిపోర్ట్‌–2017లో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. టీఆర్‌ఏ రీసెర్చ్‌ ఈ నివేదికను రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement