మద్యంపానం ఆడవాళ్లకంటే మగవాళ్లకే ఎక్కువ హాని
లండన్: ఎక్కువ స్థాయిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆడవాళ్లకంటే త్వరగా మగవాళ్లకే ఎక్కువ హాని కలుగుతోందని శాస్త్రవేత్తల తాజా సర్వేలో వెల్లడైంది. యూరోపియన్ కాలేజ్ నిర్వహించిన న్యూరోసైకోఫార్మకాలజీ వార్షిక సదస్సులో ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఎక్కువ స్థాయిలో అల్కాహాలిక్ సేవించే ఆడ, మగవాళ్ల మెదడు పనితీరులో చాల మార్పులు గమనించామని తూర్పు ఫిన్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అవుటి క్యారే తెలిపారు. దీర్ఘకాలికంగా మద్యం సేవించడం యువత ఆరోగ్యానికి హానికరమని, ఆడవాళ్ల మెదడు పనితీరులో కంటే మగవారి మెదడు పనితీరులో సమూల మార్పులు చోటుచేసుకోవడం గుర్తించామని ఆయన పేర్కొన్నారు.
మద్యం ఎక్కువగా సేవించే ఒకే వయస్సు గ్రూప్‌కు చెందని కొంతమంది యువతులను, యువకులను ఒక గ్రూప్‌గా, తక్కువగా ఆల్కహాల్ తీసుకునే మరి కొంతమంది రెండో గ్రూప్‌గా విభజించి వారి మెదళ్లు పనితీరును పరిశీలించమన్నారు. ఆల్కహాల్ తీసుకునే గ్రూప్ కంటే తీసుకునే వారి మెదడు పనితీరులో చాల మార్పులు సంభవించాయని క్యారే తెలిపారు. ఇక ఆల్కహాల్ తీసుకునే గ్రూప్‌లో ఆడవారి కంటే మగవారి మెదడు స్పదించే తీరులో ఎక్కువ వ్యత్యాసం కనపడిందని పేర్కొన్నారు.