vanasthalipuram
-
HYD: టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురంలో పెను ప్రమాదం తప్పింది. రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్లో బుధవారం సాయంత్రంగ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల్లో టిఫిన్ సెంటర్ పూర్తిగా దగ్గమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: Telangana: DME వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు -
హైదరాబాద్ వనస్థలిపురంలో పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం
-
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
-
sreeleela : వనస్థలిపురంలో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు)
-
భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్ గోదాంతో పాటు పక్కనే ఉన్న బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. -
Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అరుదైన జాతికి చెందిన ఓ పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చింతలకుంట జహంగీర్‌కాలనీలో ఎస్.కె.గజాన మహ్మద్(22) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. థాయిలాండ్‌లోని కాహో మనీ బ్రీడ్‌కు చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్లో, మరొకటి బ్లూ కలర్లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆదివారం రాత్రి పిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త కోణం
-
వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్లు తేలింది. మూడు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా హవాలా లింక్స్ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్‌తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్రామిరెడ్డి, ఫారుక్‌ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్
-
హైదరాబాద్ వనస్థలీపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
Hyderabad: పరోటాలో ప్లాస్టిక్ కవర్.. ఇదేమని అడిగితే!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారం తిందామని హోటల్‌కు వెళ్లి పరోటా ఆర్డర్ ఇస్తే అందులో ప్లాస్టిక్ కవర్ దర్శనమిచ్చింది. ఇదేమని హోటల్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... జి.గణేష్ అనే యువకుడు గురువారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో పరోటా ఆర్డర్ చేశాడు. తింటుండగా మధ్యలో ప్లాస్టిక్ కవర్ వచ్చింది. ఇదేమని అడిగితే హోటల్ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆన్లైన్లో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. -
Hyderabad: స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. కస్టమర్లు, యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: స్పాసెంటర్పై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ముగ్గురు కస్టమర్లు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం నాగోలు మమతానగర్‌కు చెందిన నాగోజు విగ్నేష్‌రాజు(32) వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఫ్యూజియన్ హునిక్స్ స్పాసెలూన్ నిర్వహిస్తున్నాడు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడిచేసి అత్తాపూర్‌కు చెందిన ఎల్లమద్ది నగేశ్(27) జగదీష్Ù(37) అశోక్(40)తో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఈ సెంటర్‌పై కేసు నమోదైందని, అయినా వారు నిబందనలు పాటించకపోవడంతో మరోసారి ఎస్వోటీ పోలీసులు దాడి చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్పాసెంటర్‌ను తక్షణమే ఖాళీ చేయించాలని, లేదంటే ఆ అంతస్తును సీజ్ చేయిస్తామని భవన యజమానిని వనస్థలిపురం సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. -
హైదరాబాద్: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం
-
మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా
హస్తినాపురం(హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శారదానగర్ కాలనీ ఫేజ్–3లో ఉండే వరదవాణి(60) తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆ మహిళ వ్యభిచారం చేస్తుండగా, పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 సెల్ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. -
Hyderabad: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీసులు ఓ వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతలకుంటలోని అభ్యుదయనగర్ కాలనీలో వేముల కళ్యాణి (41) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు కళ్యాణితోపాటు శ్రావణి (27) అనే యువతితో పాటు బహదూర్‌గూడకు చెందిన వినోద్‌కుమార్ (40)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
వనస్థలిపురంలో కలకలం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సహారా మొదటి గేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం ఉదయం మృత శిశువు తలను కుక్కలు తీసుకువచ్చాయి. దీనిని గుర్తించిన స్థానిక పాలబూత్ యజమాని కుక్కను తరిమి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మొండెం కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్ జగదీష్
సాక్షి, హస్తినాపురం: వనస్థలిపురం సమీపంలోని చింతల్‌కుంటలో శుక్రవారం రాత్రి నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. మహేశ్వరం మండలం మంకాల్ గ్రామానికి చెందిన పి.జగదీష్ (45) భారీ వర్షంలో బైకుపై వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వైపు బయలుదేరాడు. చింతల్‌కుంట వద్దకు రాగానే బైకుతో సహా నాలాలో పడి కొట్టుకుపోయాడు. పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. డ్రైనేజీ నుంచి వాహనాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జగదీష్ ఆచూకీ లభించింది. నాలాలో పడిపోగానే తాడు దొరకడంతో దాని సాయంతో జగదీష్ బయటపడ్డాడు. అనంతరం ఆయన కర్మన్‌ఘాట్ లోని తన సోదరుడి నివాసానికి వెళ్లాడు. ఈ విషయాన్ని జగదీష్ సోదరుడు వెల్లడించారు. చదవండి: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. టైర్ నడుముపై నుంచి వెళ్లడంతో -
వనస్థలిపురం లో రేడియోటవర్ ఎక్కిన వ్యక్తి
-
అంతయ్య మృతదేహం లభ్యం
-
లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్
సాక్షి, వనస్థలిపురం: లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతితో పాటు నలుగురు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌కుంటలోని మనోహర్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుకున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి లాడ్జిపై దాడి చేశారు. ఒక యువతి, విటులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లాడ్జి రూం నం.109పై దాడి చేయగా అందులో ఓ వ్యక్తి, మహిళను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించామన్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి వారి వద్ద నుంచి ఆరు సెల్ఫోన్లు, రూ.6500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం.. -
విక్టోరియా హోమ్‌లో కరోనా కలకలం
-
హైదరాబాద్: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం
-
వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి మహిళ మృతి
సాక్షి, వనస్థలిపురం: వెన్నుపూసకు నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం వనస్థలిపురం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ అప్పలమ్మగూడంకు చెందిన సిరసవాడ నాగేష్, నాగమణి (27) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగమణి కొంతకాలంగా నడుం, వెన్నునొప్పితో బాధపడుతోంది. ఆపరేషన్ నిమిత్తం బుధవారం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం సాయంత్రం ఆమెకు ఆపరేషన్ చేశారు. అనంతరం నాగమణి ఆరోగ్యం క్షీణించడంతో మధ్యరాత్రి ఆమె మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగమణి మృతి చెందిందని ఆపరేషన్ సమయంలో ఆసుపత్రిలో రక్తం నిల్వలు కూడా లేవని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత నాగమణికి కాళ్లు పని చేయక పోవచ్చు అని చెప్పిన వైద్యులు చివరకు ఆమె ప్రాణాలు తీశారని ఆమె భర్త నాగేష్ రోధిస్తూ తెలిపాడు. వైద్యులు హడావిడిగా ఆపరేషన్ చేసి ఆమె మృతికి కారణమయ్యారని బంధువులు పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీ నాయకులు బాధితుల తరపున ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వారికి నష్టపరిహారం అందేలా చేయడంతో గొడవ సద్దుమణిగింది. మా నిర్లక్ష్యం లేదు: ఆసుపత్రి నిర్వాహకులు నాగమణికి ఆపరేషన్ నిర్వహించిన తర్వాత సడెన్‌గా బీపీ డౌన్ అయ్యిందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు మెరుగైన చికిత్సను అందించామని వైద్యులు వేణుగోపాల్ తదితరులు తెలిపారు. ఒకేసారి హార్ట్ మీద ప్రెషర్ పడటంతో ఆమె మృతి చెందిందన్నారు. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుందని వారు తెలిపారు. ఆమె ప్రాణాలు కాపాడడానికి తమ వంతు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమి లేదని వారు పేర్కొన్నారు. -
మాయమాటలు చెప్పి బాలిక కిడ్నాప్!
సాక్షి, హస్తినాపురం: బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు కిడ్నాప్‌కు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వనస్థలిపురం ఎస్సై చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలంలోని కేసీఆర్‌కాలనీకి చెందిన సంకు శ్రీసౌమ్య ఆటోనగర్‌లోని నవతా ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తూ మన్సురాబాద్‌లోని చిత్రసీమకాలనీలో అద్దెకు ఉంటోంది. రెండు నెలల నుంచి తన చెల్లెలు సంకు శ్రీదేవి(17) తన దగ్గరే ఉంటుండగా ఈనెల 24రోజున భద్రాచలం గ్రామానికి చెందిన చెట్ల తరున్‌కుమార్ (20) మాయమాటలు చెప్పి కిడ్నాప్‌కు చేశాడని సౌమ్య వనస్థలిపురం పోలీసులకు 25న ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌కు గురైన శ్రీదేవి సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని తెలిపారు. గతంలో కూడా తరున్‌కుమార్‌పై భద్రాచలం పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య మాడ్గుల: ఓ మైనర్ బాలిక (16).. తండ్రి మందలించాడని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై బద్యానాయక్ కథనం ప్రకారం.. మాడ్గుల మండలంలోని కూబ్యాతండాకు చెందిన మైనర్‌బాలిక అదే తండాకు చెందిన ఓ యువకుడితో మాట్లాడినందుకు గాను తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక మంగళవారం అర్థరాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు భోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుధవారం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్‌లోయువతి కిడ్నాప్ కలకలం