Veerababu
-
పకోడి బండి వద్ద వివాదం.. టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: కిర్లంపూడి మండలంలోని వీరవరంలో దారుణం చోటుచేసుకుంది. వీరబాబు అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో పకోడి బండి వద్ద స్వల్ప వివాదం చోటకోవటంతో వీరబాబు ఆ పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో బండి యజమాని ఏసు, ఆయన కొడుకు శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో శివను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న శివ తన తండ్రికి వ్యాపారంలో పకోడి బండి వద్ద సహాయంగా ఉంటున్నాడని తెలుస్తోంది. బాలుడు మృతి చెందడంతో వీరవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీరవరం గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. చదవండి: రెండు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు.. 11 మంది దుర్మరణం -
2014 ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి
ఖమ్మం జెడ్పీసెంటర్ : 2014 సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి తక్షణమే డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత ఎన్నికల అధికారులను టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గతేడాది మార్చిలో డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వాటిని జారీ చేయకుండా అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. గత సంవత్సరం జూలైలో ఖమ్మం, పాలేరు డివిజన్ సంఘం నేతలు సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత అధికారులను కోరినప్పటికీ అధికారులు ఖాతరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే కలెక్టర్ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25లోగా సర్టిఫికెట్లు జారీ చేయాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మహబూబ్అలీ, జిల్లా కార్యదర్శి కృష్ణారావు, మండల కార్యదర్శి శంకర్రావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
చిలుకూరు: నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం ఉదయం పిడుగుపడి వీరబాబు(32) అనే రైతు మృతి చెందాడు. వీరబాబు పొలంలో పనిచేసుకుంటుండగా పిడుగుపడింది. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వైపు మునగాలలో పిడుగుపడి బాలకృష్ణ(28) అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. మునగాల హైస్కూల్ పక్కన నీళ్లు పడుతుండగా పిడుగుపడి బాలకృష్ణ మృతిచెందాడు. -
ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం
మహిళా దినోత్సవం నాడు ఓ మహిళ తనకు న్యాయం చేయా లని వేడుకొంటూ రోడ్డెక్కింది ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది నక్కపల్లి: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ వివాహిత మొదట ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, తరువాత కుటుం బ సభ్యులు, కొంతమంది గ్రామస్తులతో కలసి అతని ఇంటిముందు మౌన దీక్షకు దిగింది. మంగళవారం న్యాయంపూడిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. న్యాయంపూడికి చెందిన గోరింట లోవలక్ష్మి అనే మహిళకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తతో విడాకులు తీసుకుంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో నాలుగేళ్ల క్రితం నుంచి ఈమె ఇదే గ్రామానికి చెందిన పెదపూడి వీరబాబు అనే వ్యక్తితో సఖ్యతగా ఉం టోంది. వీరబాబుకు, అతని కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి నిర్ణయించారు. రెండు రోజుల క్రితం వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలిసిన లోవలక్ష్మి అతనిని నిలదీసింది. అయితే వీరబాబు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మి సోమవారం రాత్రి చీమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె వీరబాబు ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. కొంతమంది గ్రామస్తులు, లక్ష్మి కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతుగా వీరబాబు ఇంటి ముందు ధర్నాకు దిగారు. వీరబాబు తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతనితో సఖ్యతగా ఉన్నానని, ఇప్పుడు మోసం చేసేందుకు యత్నిస్తున్నాడని లోవలక్ష్మి తెలిపింది.