velangani
-
పులకించిన సాగరతీరం
ముగిసిన వేళాంగణి మహోత్సవాలు తోటపల్లిగూడూరు: కోడూరు వేళాంగణిమాత(మరియమాత) జన్మదిన ఆరాధనోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. యేసుక్రీస్తు తల్లి వేళాంగణిమాత జన్మదినోత్సవాలు ఈ నెల 6 నుంచి జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఉత్సవాల్లో చివరి రోజు గురువారం రాత్రి అమ్మవారికి సమిష్ట దివ్యబలిపూజ, తేరు ప్రదక్షిణ కార్యక్రమాలు అత్యంత వేడుకగా జరిగాయి. భక్తులు అమ్మవారి పుణ్యక్షేత్ర ఆవరణలో రాత్రి జాగారాలు చేశారు. అనంతరం ఉత్సవాల్లో చివరి ఘట్టమైన సముద్ర స్నానాలకు భక్తులు ఆసక్తి చూపారు. ఆలయంలో రాత్రి జాగరణ చేసిన వేలాది మంది భక్తులు శుక్రవారం వేకువజాము నుంచి స్థానికంగా ఉన్న కోడూరు బీచ్‌లో పుణ్యస్నానాలకు బయల్దేరారు. భక్తుల పుణ్యస్నానాలతో కోడూరు సాగర తీరం పులకించిపోయింది. వేళాంగణి చర్చి ప్రాంతం భక్తులతో కిక్కిరిసింది. -
వేళాంగణిమాత ఉత్సవాలు ప్రారంభం
కోడూరు తీరంలో కోలాహలం తోటపల్లిగూడూరు: కోడూరు వేళాంగణిమాత(మరియమాత) ఉత్సవాలు మంగళవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. కులమతాలకతీతంగా పూజలందుకొంటున్న వేళాంగణి మాత జన్మదినం సెప్టెంబర్ 8న పురష్కరించుకొని మూడు రోజుల పాటు వేళాంగణిమాత ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో మంగళవారం వేళాంగణి చర్చి డైరెక్టర్ ఫాదర్ తామస్ అగస్టీన్ ఆధ్వర్యంలో ప్రారంభ ప్రార్థనలు నిర్వహించారు. ‘దేవమాత వేళాంగణి అద్భుతాల మాత’ అనే అంశంపై భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు ఈ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం భక్తులు కోడూరు బీచ్‌లో సముద్ర స్నానాలను ఆచరించారు. సాయంత్రం సర్వాంగసుందరంగా కొలువుదీరిన వేళాంగణిమాత తేరు ప్రదక్షణ చర్చి నుంచి ముత్యాలతోపు పట్టపుపాళెం వరకు సాగింది. ఉత్సవాల్లో నేడు వేళాంగణిమాత ఉత్సవాల్లో బుధవారం ఉదయం 7గంటలకు జపమాల–నవదిన ప్రార్ధనలు, 9 గంటలకు ఆరాధన–స్వస్థత ప్రార్ధనలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు సింహపురి పీఠాధిపతులు డాక్టర్ ప్రకాశం వేళాంగణిమాతకు దివ్యబలిపూజను సమర్పిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు అమ్మవారి చర్చి నుంచి కొత్తకోడూరు వరకు విగ్రహ తేరుప్రదక్షణ సాగుతుంది. -
వెలంగణి మాత ఉత్సవాలు ప్రారంభం
హాజరైన బిషప్ ఉడుముల బాల తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు \కాజీపేట రూరల్ : కాజీపేట డీజిల్‌కాలనీలోని వెలంగణి ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో వెలంగణి మాత ఉత్సవాలు ప్రా రంభమయ్యాయి. సోమవారం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగే వేడుకలను వరంగల్ పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల జెండాను ఎగురవేసి ప్రారంభించారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 8 వరకు ప్రత్యక ప్రార్థన ఉంటుం దని, 8వ తేదీన ఉదయం 7 గంటలకు ఆంగ్లంలో ప్రత్యేక పూజ ఉంటుందని, 10 గం టలకు ఫాదర్ బెన్ని ముత్తంగి ఆధ్వర్యంలో పండుగ బలిపూజ, మధ్యాహ్నం 12 గంటలకు డీజిల్‌కాలనీలోని వెలంగణి మాత ఉత్సవ విగ్రహాంతో ఊరే గింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 1 నుంచి 3 గంట ల వరకు స్వస్థత ప్రార్థనలు ఉంటాయని, సాయంత్రం 6 గంటలకు ఫాదర్ సామ్యేల్‌తో ముగింపు పూజ ఉంటుందని వారు పేర్కొన్నారు. వెలంగణి మాత క్షేత్రంలో సౌకర్యాలు వెలంగణి మాత పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించినట్లు వెలంగణì మాత విచారణ గురువు ఫాదర్ గాలి రాయపురెడ్డి తెలిపారు. వాస్తవంగా వెలంగణి మాత భక్తులు చెన్నైలోని నాగపట్నం వద్ద ఉన్న వెలంగణి నగర్‌కు వెళ్లి మాతను దర్శించుకుంటారని.. అయితే అక్కడికి వెళ్లలేని వారి కోసం అధునాతన సదుపాయాలతో డీజిల్‌కాలనీలో చర్చిని అభివృద్ధి చే సినట్లు తెలిపారు. నాగపట్నం మాదిరిగా ఇసుక మార్గంలో వెళ్లి కొవ్వత్తులు వెలిగించుట, ప్రధాన ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.