venkaiah swamy
-
సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి
గొలగమూడి(వెంకటాచలం): గొలగమూడి వెంకయ్యస్వామి 34వ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. ఉదయం స్వామికి నిత్య పూజల అనంతరం వాహనంపై ఆశీనులను చేసి పూలతో అలంకరిచారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి ఆశ్రమ భజన బృందం కోలాట ప్రదర్శన నిర్వహించింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనసేవకు నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి కృష్ణారెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. వేడుకగా గజ వాహనసేవ ఆరాధనోత్సవాల్లో ఆదివారం రాత్రి గజ వాహనసేవ నిర్వహించారు. గజ వాహనంపై స్వామివారిని ఆశీనులను చేసి పూల, విద్యుద్దీపాలంకరణ చేశారు. పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. గ్రామోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆమంచర్లకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు గజ వాహనసేవకు ఉభయకర్తగా వ్యవహరించారు. నాట్యాచార్యులు జె.శ్రీరామచంద్రమూర్తి(విజయవాడ) శిష్యులచేత భరతనాట్య ప్రదర్శన చేశారు. ఉత్సవ ఏర్పాట్లను ఆశ్రమ కార్యనిర్వాహణాధికారి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. ఉత్సవాల్లో నేడు సోమవారం ఉదయం అశ్వవాహనసేవ, రాత్రి పెదశేషవాహనసేవ నిర్వహించనున్నారు. అనంతరం వేదాంతం విజయలక్ష్మి శిష్యులచే కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్దం వార్సీను, సత్యహరిశ్చంద్ర పూర్తినాటకం ప్రదర్శించనున్నారు. -
వెంకయ్యస్వామి అరాధన ఉత్సవాలు ప్రారంభం
సర్వభూపాల వాహనంపై విహరించిన స్వామివారు వెంకటాచలం: గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి 34వ ఆరాధన మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నిత్యపూజ అనంతరం గణపతి పూజ, స్వస్తి వాచనము, అంకురార్పణ, దీక్షావస్త్రధారణ, కంకణధారణ, కలశస్థాపన, శిఖర సంప్రోక్షణలతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు సర్వభూపాల వాహనంపై విశేష పుష్పాలంకరణతో కొలువుదీరిన వెంకయ్యస్వామి మంగళవాయిద్యాల, ఓంనారాయణ..ఆదినారాయణ నామస్మరణ మధ్య గొలగమూడి వీధుల్లో విహరించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వభూపాల వాహనసేవకు ఉభయకర్తలుగా గొలగమూడి వాసులు వ్యవహరించారు. ఏర్పాట్లును ఆశ్రమ కార్యనిర్వాహణాధికారి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. ఉత్సవాల్లో నేడు ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం హనుమంత సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9గంటలకు చంద్రప్రభ వాహనసేవ నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామాజంనేయ యుద్ధం వార్సీను, గయోపాఖ్యానం వార్సీను, శ్రీ వీరబ్రహ్మంద్రస్వాముల వారి సమాధిసీను, సత్యహరిశ్చంద్ర కాటిసీను నాటకాలు ప్రదర్శించనున్నారు.