శృంగేరి పీఠం ఉత్తరాధికారిగా తిరుపతి బిడ్డ
సాక్షి, తిరుమల: కర్ణాటకలోని శృంగేరి పీఠానికి ఉత్తరాధికారి (తదుపరి పీఠాధిపతి)గా తిరుపతికి చెందిన కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ(22) నియమితులయ్యా రు. ప్రసాద శర్మను ఉత్తరాధికారిగా ఆ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆదివారం ప్రక టించారు.
ఆయన తండ్రి శివ సుబ్రహ్మణ్య అవధాని తిరుమలలోని వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్‌గా, తిరుపతిలోని ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 23న ఉత్తరాధికారి బాధ్యతలు చేపట్టనున్నారు.