Volvo India
-
మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్స్ భారత్‌లో ఏటా ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో 2025 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా అవతరించనున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా ఈ లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకోనున్నట్టు తెలిపింది. వోల్వో ఇండియా సి–40 బీఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 అక్టోబర్–డిసెంబర్లో విడుదల చేస్తోంది. తమ కంపెనీకి మూడేళ్లలో అంతర్జాతీయంగా సగం మోడళ్లు ఈవీలు ఉంటాయని వోల్వో కార్స్ కమర్షియల్ ఆపరేషన్స్ హెడ్ నిక్ కానర్ తెలిపారు. సి–40 బీఈవీ మోడల్‌కు ఇతర మార్కెట్లలో అధిక డిమాండ్ ఉందన్నారు. భారత్‌లోనూ అటువంటి డిమాండ్‌ను ఆశిస్తున్నట్టు చెప్పారు. 2022లో కంపెనీ దేశంలో అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయించింది. 2018లో నమోదైన 2,600 యూనిట్లను మించి ఈ ఏడాది అమ్మకాలు ఉంటాయని భావిస్తోంది. (ఇదీ చదవండి: జోరు మీదున్న ఫోన్‌పే... రూ.828 కోట్లు!) -
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్
స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మగ వాళ్లు కూడా ప్రసూతి సెలవులు తీసుకునేందుకు వీలు కల్పించింది. లింగ విషయంలో తటస్థ విధానాన్నిపాటిస్తూ 'ఫ్యామిలీ బాండ్'ను తీసుకొచ్చినట్లు వోల్వో ఇండియా ప్రకటించింది. వోల్వో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని పురుష ఉద్యోగులు మొత్తం జీతంలో 80 శాతంతో 24 వారాల(120 పని దినాలు) పేరెంటల్ లీవ్ తీసుకోవచ్చు. ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం, 2017 ప్రకారం మహిళా ఉద్యోగులు 26 వారాల పూర్తి చెల్లింపుతో ప్రసూతి సెలవులను ఇవ్వనున్నట్లు వోల్వో కార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. వోల్వో కార్ ఇండియా గ్లోబల్ ఆదేశాలకు అనుగుణంగా భారతదేశంలోని తల్లులు, తండ్రులు, ఒకే సెక్స్ తల్లిదండ్రులు, పిల్లలను దత్తత తీసుకున్న, సర్రోగసీ ద్వారా కన్నా భారతదేశంలోని అందరి(ఆన్-రోల్, పూర్తి సమయం) ఉద్యోగులకు వర్తిస్తుంది అని ప్రకటనలో తెలిపింది. వయస్సు లేదా వైవాహిక స్థితిపై పరిమితులు లేవు. "వోల్వో, ఉద్యోగి-స్నేహపూర్వక సంస్థ కావడంతో తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉండాలని, ఇద్దరు భాగస్వాములు ఆనందాలను పంచుకోవాలని నమ్ముతాము" అని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. ఈ విధానంతో వోల్వో మరింత మంది ఉద్యోగులను తల్లిదండ్రుల సెలవు తీసుకోవటానికి ప్రోత్సహిస్తుందని జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు. చదవండి: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి! -
వోల్వో.. ‘ఎస్60 క్రాస్ కంట్రీ’ లగ్జరీ సెడాన్
ముంబై: స్వీడన్‌కు చెందిన దిగ్గజ వాహన కంపెనీ వోల్వో ఇండియా తాజాగా ‘ఎస్60 క్రాస్ కంట్రీ’ లగ్జరీ సెడాన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.38.9 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబై). ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, లగ్జరీ ఇంటీరియర్, 20 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, నావిగేషన్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్, 2.4 లీటర్ 5 సిలిండర్ డీ4 డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఏడబ్ల్యూడీ వ్యవస్థ (ఆల్-వీల్-డ్రైవ్) వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వోల్వో కంపెనీ భారత్‌లో స్పోర్ట్ సెడాన్ ఎస్60, సలూన్ ఎస్80, క్రాస్ కంట్రీ వీ40, ఎస్యూవీ ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ90 వంటి తదితర మోడళ్లను విక్రయిస్తోంది. -
వోల్వో వీ40 క్రాస్ కంట్రీ.. పెట్రోల్ వెర్షన్
ధర రూ. 27 లక్షలు ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా(వీఏఐ) సోమవారం వీ40 క్రాస్ కంట్రీ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.27 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని వోల్వో ఇండియా ఎండీ థామస్ ఎర్న్బెర్గ్ చెప్పారు. టీ4 ఇంజిన్, 1.6 జీడీటీఐ(గ్యాసోలిన్ టర్బోచార్జ్డ్ డెరైక్ట్ ఇంజెక్షన్) 4 సిలిండర్‌తో రూపొందిన ఈ కారులో 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. సోమవారం నుంచే ఈ కార్ల విక్రయాలను దేశవ్యాప్తంగా ఉన్న తమ వోల్వో డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభించామని పేర్కొన్నారు. 2013 జూన్‌లో వీ40 క్రాస్ కంట్రీలో డీజిల్ వేరియంట్‌ను భారత్‌లోకి తెచ్చామని, మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు పెట్రోల్ వేరియంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. అధిక అమ్మకాల కోసం ధరను ఆకర్షణీయంగా నిర్ణయించామని పేర్కొన్నారు. భారత్‌లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తున్న ఏకైక వోల్వో కారు ఇదే కావడం గమనార్హం.