vykthigatham
-
వ్యక్తిగతం : ఆపరేషన్ తప్పదా?
హలో డాక్టర్! నేను వివాహితుణ్ని. నా వయసు 29 ఏళ్లు. సంభోగంలో పాల్గొన్న వెంటనే స్ఖలనం అవుతోంది. శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి డీ-సెన్సిటైజర్ క్రీమ్స్, లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ దొరుకుతాయుని చెబుతారుగదా! వాటిని నేను వాడొచ్చా? సలహా ఇవ్వగలరు. - ఎన్.డి.ఆర్., హైదరాబాద్ శీఘ్రస్ఖలనం చాలా సాధారణ సమస్య. మీ వయసులో ఉన్నవారు చాలామంది ఈ కంప్లయింట్ చేస్తుంటారు. ఈ సమస్యను నివారించేందుకు మీరు రాసినట్టుగానే లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఉంటాయి. అరుుతే మీకు ఉన్న సమస్యకు అదే చికిత్స (ప్రైవురీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) కాదు. శృంగారం జరుపుతున్నప్పుడు పురుషాంగం మీద ఉండే నరాలు త్వరగా స్పందించడం అంటే స్టిమ్యులేట్ అవడం వల్ల మీకు స్ఖలనం త్వరగా అయిపోతోంది. అనస్థీషియా క్రీమ్స్గానీ, డీ సెన్సిటైజర్స్గానీ ఏం చేస్తాయంటే పురుషాంగం మీది నరాలను మొద్దుబారేలా చేస్తాయి. కాబట్టి స్ఖలనం ఆలస్యమవుతుంది. కానీ దీనివల్ల లైంగిక సుఖం తగ్గుతుంది. అందుకే ఈ క్రీమ్స్ వాడటం కంటే, స్ఖలనం అవబోతున్న సమయంలో పురుషాంగం చివరను చేతి వేళ్లతో బిగించి పట్టుకుని, మళ్లీ ఆ ఫీలింగ్ తగ్గిన వెంటనే శృంగారాన్ని కొనసాగించే పించ్ టెక్నిక్, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ వంటి వాటిని అనుసరించడం ఉత్తమం. నా వయస్సు 25 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు రెండువైపులా వేరికోసిల్ ఉంది. దీనికి నేను ఆపరేషన్ చేయించుకోవాలా? ఆపరేషన్ తప్ప ఇంకో మార్గం ఏమైనా ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఎస్.కె.వై., సూర్యాపేట వేరికోసిల్ రావడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. వేరికోసిల్ ఉన్నప్పుడు పెళ్లి కాకుండా ఉండి, నొప్పి లేకుండా ఉంటే వెంటనే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వివాహం అయిన వ్యక్తుల్లో గనక వేరికోసిల్ ఉండి, పిల్లలు లేకపోతే... ముందుగా వీర్య పరీక్ష చేయించుకోవాల్సిందిగా చెబుతాం. ఈ సమస్య ఉన్నవాళ్లలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటమేగాకుండా, కణాల కదలికలు చురుకుగా ఉండవు. అలాంటప్పుడు డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష ద్వారా వేరికోసిల్ కండిషన్‌ను నిర్ధారించి, సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. మీకింకా పెళ్లి కాలేదు కాబట్టి, అప్పుడే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మరీ తీవ్రమైన నొప్పిగానీ, గ్రేడ్-3 వేరికోసిల్ కండిషన్గానీ ఉంటే మాత్రం శస్త్రచికిత్సతో ఉపశమనం లభిస్తుంది. మాకు పెళ్లయి ఎంతో కాలం కాలేదు. పిల్లలు పుట్టకుండా ఏ జాగ్రత్తా తీసుకోకపోవడం వల్ల నా భార్య వెంటనే గర్భం దాల్చింది. లైంగిక జీవితం తృప్తిగా అనుభవించినట్టు లేదు. మేము ఎప్పటి వరకు శృంగారంలో పాల్గొనవచ్చు? ప్రసవానంతరం మళ్లీ ఎప్పుడు మొదలుపెట్టవచ్చు? - డి.బి., వరంగల్ గర్భంతో ఉన్నప్పుడు మొదటి మూడు నెలలూ, చివరి మూడు నెలలూ శృంగారంలో అంతగా పాల్గొనకపోవడమే మంచిది. మధ్యలో మూడు నెలలు మాత్రం మామూలుగానే గడపవచ్చు. అయితే, శృంగారంలో పాల్గొన్నా అంత సమస్యేమీ ఉండదుగానీ, ఇన్ఫెక్షన్స్, నొప్పి, బ్లీడింగ్ అయితే అబార్షన్ అవుతుందేమోననే అనుమానంతో వైద్యులు ఈ సలహా ఇస్తుంటారు. ఇక ప్రసవం అయిన ఒక్క నెల తర్వాత మీరూ, మీ భాగస్వామీ ఇద్దరూ శారీరకంగా, మానసికంగా ఎప్పుడు సుముఖంగా ఉంటే అప్పుడే పాల్గొనవచ్చు. మీ వయసులో ఉన్నవారు చాలామంది ఈ కంప్లయింట్ చేస్తుంటారు. ఈ సమస్యను నివారించేందుకు మీరు రాసినట్టుగానే క్రీమ్స్ ఉంటాయి. అరుుతే అదే చికిత్స (ప్రైవురీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) కాదు. డా. వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వ్యక్తిగతం: అలా చేయడం మంచిది కాదు!
సమస్య గురించి అదే పనిగా అలోచిస్తుంటే... ఆలోచన ఔషధమైపోదు. ప్రతి సమస్యకూ తప్పకుండా పరిష్కారం ఉంటుందని మరచిపోకండి. నా వయసు 42 ఏళ్లు. కొన్ని నెలల కిందట వరిబీజం వస్తే, నాకు తెలిసిన ఆర్ఎంపీ సిరంజీతో వృషణాల్లో నీరు తీసేశాడు. ఇప్పుడు మళ్లీ అక్కడ వాపుగా ఉంది. తగు సలహా ఇవ్వగలరు. - ఎం.ఎస్., శ్రీకాకుళం జిల్లా వృషణాల చుట్టూ నీరు చేరితే దాన్ని హైడ్రోసిల్ అంటారు. ఈ సవుస్య వచ్చినప్పుడు వైద్యుడు శస్త్రచికిత్స చేసి అక్కడి నీటిని తొలగిస్తాడు. అలాగే, నీరు మాటిమాటికీ వచ్చే సంబంధిత పొరను తీసి దాన్ని వెనక్కి మడతపెట్టడం కూడా చేస్తాడు. మీరు చేయించుకున్నట్టుగా సిరంజీతో నీటిని తీసేస్తే తాత్కాలికంగానే ఫలితం ఉంటుంది. అప్పటికి వృషణాల పరిమాణం తగ్గినట్టు అనిపించినా, మళ్లీ నీరు చేరుతుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి సిరంజీ విధానం ఎంతమాత్రమూ సురక్షితం కాదు. వరిబీజానికి చేసే ఆపరేషన్ చాలా చిన్నది. భయపడకుండా వెంటనే చేయించుకోండి. నాకు అరవై ఏళ్ల వయసు. రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలేమీ లేవు. ఇప్పటికీ మా లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉంది. కాకపోతే ఇటీవల రాత్రి పూట మూత్రం ఎక్కువగా వస్తోంది. డాక్టర్ని కలిస్తే ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందన్నారు. శృంగారానికీ దీనికీ ఏమైనా సంబంధం ఉందా? దీనికి వయసు పరమైన హద్దులు ఏమైనా ఉంటాయా? - కె.ఎస్.కె., హైదరాబాద్ శృంగారానికి ఎలాంటి వయోపరిమితీ లేదు. మీరు ఇప్పటికీ సంభోగించగలగడం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ప్రోస్టేట్ గ్రంధి పెరగడానికి, శృంగారానికీ ఎటువంటి సంబంధమూ లేదు. జన్యుపరంగా కొందరిలో ఈ గ్రంథి వయసు పైబడిన వారిలో పెరిగి, మూత్ర సమస్యలు వస్తూంటాయి. దానికి ఎక్కువమందికి మందులతోనే నయం చేయవచ్చు. మూత్రం అసలు రానివాళ్లకు ఆపరేషన్ లేకుండానే ప్రోస్టేట్ గ్రంధిని లేజర్‌తో తొలగించినా, శృంగారపరమైన ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే వీర్యం తక్కువగా వస్తుంది. ఇది మినహా సమస్యేమీ ఉండదు. కాబట్టి, మీ అపోహలన్నీ వదిలేసుకుని మీ లైంగిక జీవితాన్ని ఆనందించండి. ప్రోస్టేట్ విషయంలో మాత్రం యూరాలజిస్టు దగ్గర చికిత్స తీసుకోండి. నాకు వివాహమై పదేళ్లు దాటింది. శృంగారం తర్వాత ఒకటే నీరసంగా ఉంటోంది. సంభోగానికీ సంభోగానికీ మధ్య గ్యాప్ కూడా బాగా పెరుగుతోంది. ఇంతకుముందు రోజుకు ఒక్కసారి పాల్గొనేది, ఇప్పుడు వారానికి రెండుసార్లు కూడా పాల్గొనడం లేదు. నాకు మధుమేహం ఉందని ఇటీవలే తెలిసింది. దానివల్లే ఇలా జరుగుతోందా? - బి.బి.కె., హైదరాబాద్ శృంగారపరమైన కోరికలు సాధారణంగా 20- 30 ఏళ్ల మధ్య ఎక్కువగా ఉంటాయి. పెళ్లయి పదేళ్లు అవుతోంది కాబట్టి, మునుపటి ఉత్సాహం ఉండకపోవడం సహజమే. మధుమేహం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట అదేపనిగా కూర్చుని పనిచేసేవాళ్లలో లైంగిక సామర్థ్యం కొంచెం తగ్గుతుంది. అలాగే వయసుతో పాటు వచ్చే బాధ్యతలు, మానసిక ఇబ్బందులు కూడా లైంగిక జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. దీనికి కొన్నిసార్లు కౌన్సిలింగ్గానీ, మరికొన్నిసార్లు మందులుగానీ అవసరం అవుతాయి. మధుమేహాన్ని నియంత్రించుకోండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడం ద్వారా మీరు మునుపటి శృంగార జీవితాన్ని పొందగలరు. మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com డా. వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్