white cells
-
పగటివేళ గుండెపోటు ప్రమాదం
స్విట్జర్లాండ్: సాధారణంగా ఏ వ్యక్తికి అయినా గుండెపోటు అంటేనే ప్రమాదకరం. అయితే, పగటి వేళల్లో వచ్చే గుండెపోటు అత్యంత ప్రమాదకరమని అంటున్నారు స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జనీవా శాస్త్రవేత్తలు. గుండెపోటు సాధారణంగా పగటి వేళల్లోనే ఎక్కువగా వస్తుందని, అయితే, రాత్రి వేళలో వచ్చే గుండె పోటు కంటే ఇది ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ మేరకు తమ అధ్యయన వివరాలను ‘ట్రెండ్స్ ఇన్ ఇమ్యునాలజీ’జర్నల్‌లో ప్రచురించినట్టు తెలిపారు. చుంచులపై చేసిన ప్రయోగ వివరాలను పేర్కొన్నారు. చుంచులు, మానవుల్లో తెల్ల రక్త కణాలు సిర్కాడియన్ పద్ధతిలో ఊగిసలాడుతూ ఉంటాయని, రోగనిరోధక శక్తిని ఆప్టిమైజ్ చేసేందుకు ఒక రోజు సమయం పడుతుందని తెలిపారు. అదే సమయంలో పగటి వేళల్లో రోగనిరోధక కణాల రిథమ్ సాధారణం కన్నా తక్కువస్థాయిలో ఉంటాయని, దీనివల్ల పగటి వేళల్లో సంభవించే గుండెపోటును నియంత్రించడం కష్టతరమని శాస్త్రవేత్తలు వివరించారు. -
లుకేమియాకు అద్భుత ఔషధం
న్యూయార్క్: లుకేమియా(బ్లడ్ కేన్సర్) వ్యాధిని నివారించే దిశగా న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోవన్ కెటరింగ్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఔషధాన్ని కనుగొన్నారు. ‘ఏజీ-221’ అనే ఈ మందుతో తొలిదశ ఔషధ పరీక్షల్లో అడ్వాన్స్డ్ స్టేజీలో కేన్సర్ ఉన్న రోగులకు కూడా విజయవంతంగా చికిత్స చేశారు. మైలాయిడ్ లుకేమియా ఉన్న రోగుల్లో 15 శాతం మందిలో ‘ఐడీహెచ్2’ అనే జన్యువు మార్పునకు గురైనట్లు వీరు తొలుత గుర్తించారు. ఫలితంగా తెల్లరక్త కణాలు అభివృద్ధి చెందకుండా అపరిణిత కణాలుగా పోగుపడి, చివరకు కేన్సర్ కణాలుగా రూపాంతరం చెందుతున్నాయని కనుగొన్నారు. అయితే ‘ఏజీ-221’ ఔషధం ఉత్పరివర్తనం చెందిన ఐడీహెచ్2 ప్రొటీన్‌ను అడ్డుకుని, తెల్లరక్తకణాలు అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని గుర్తించారు.