yanama
-
ఎమ్మెల్యేల షాక్: సంక్షోభంలో కాంగ్రెస్ సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్ మైనార్టీలో పడిపోయింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఎన్నికలపై సమీక్ష జరిపేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితమే యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మంగళవారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుద్దుచ్చేరి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి అప్రమత్తం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కెబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు, సీనియర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. కాగా మొత్తం 30 మంది శాసనసభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాజా రాజీనామాలతో అధికార పార్టీ బలం 11కి పడిపోయింది. కాగా యానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. పుదుచ్చేరిలో అనేక పదవులు చేపట్టారు. యానాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజల మనిషిగా పేరు పొందారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తరువాత ఏ పార్టీలో చేరతారు అనేది ఇంకా ప్రకటించలేదు. -
కోనప్రాంత మహిళలకు యనమల క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కోటనందూరు : తొండంగి మండలంలో కోనప్రాంత మహిళలపై అమానుషంగా వ్యవహరిస్తున్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. శుక్రవారం కోపరేటివ్ సొసైటీ ఆవరణలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. దివిస్ కంపెనీ ఏర్పాటుకు అన్నీ తానుగా మారి, 144 సెక్ష¯ŒS విధించడం, మహిళలని కూడా చూడకుండా పోలీసులతో వారిని భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. గురువారం 40 మంది మహిళలపై కేసులు నమోదు చేసి, అన్నవరం పోలీస్‌స్టేçÙ¯ŒSలో నిర్బంధించడంపై మండిపడ్డారు. సమాజనంలో ఏ ప్రాంత ప్రజలు నీకు గెలుపునిచ్చారో ఆ ప్రాంత ప్రజల రుణం ఈవిధంగా తీర్చుకుంటున్నావా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా దివిస్ కంపెనీని వదిలి ప్రజల పక్షాన పోరాటం చేయాలని సూచించారు. తొండంగి మండలానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ట్రిపుల్ ఐటీకి కనీసం 60 ఎకరాలు సేకరించకుండా కలెక్టర్‌తో కలిసి నాటకాలాడిన పెద్ద మనిషి దివిస్‌కు670 ఎకరాలను కేటాయించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దివిస్ కంపెనీ ఏర్పాటుతో అనేక అనర్థాలు ఉన్నాయని దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు తాను తమ పార్టీ తరపున పూర్తిస్థాయి మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ఆంధ్రరాష్ట్రంలోనే అతిపెద్దదైన హేచరీ వ్యాపారం పూర్తిగా దెబ్బతిని వేలాది మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాతో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న బుణాలకు 90శాతం రాయితీ లభిస్తుందని, ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ప్రత్యేక హోదాపై తమపార్టీ ప్రజల పక్షాన పూర్తిస్థాయి పోరాటం కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంటష్, పార్టీ మండలాధ్యక్షడు గొర్లి రామచంద్రరావు, పార్టీ ప్రతినిధులు గొర్లి అచ్చియ్యనాయుడు, లగుడు శ్రీను, లంక ప్రసాద్, కొరుప్రోలు కృష్ణ, గుడివాడ ఆదినారాయణ, అంకంరెడ్డి బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.