బాలుడి కిడ్నాప్.. నిందితుల అరెస్ట్
హైదరాబాద్ : ఎల్బీనగర్లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ప్రగతి విజయ్ పాత్రో మార్బుల్ యజమాని ఆశిష్ కుమార్ కుమారుడైన యశేష్ విజయ్ పాత్రోని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడిని వదిలిపెట్టాలంటే రూ.కోటి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ బాబు జాన్సన్ గ్రామర్ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్నాడని, ఇతర వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు రాత్రి బాలుడిని ఇండికా కారులో వచ్చి వనస్థలిపురంలో వదిలివెళ్లారు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మనోహర్, భానుప్రసాద్ లతో పాటు మరో ఇద్దరిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను మంగళవారం మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కిడ్నాపర్లలో బాలుడి సమీప బంధువు కూడా ఉన్నాడని, డబ్బు కోసమే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల నుంచి ఓ కారు, మత్తు పదార్థాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.