విధులు అప్రమత్తంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

విధులు అప్రమత్తంగా నిర్వహించాలి

Published Fri, Sep 27 2024 3:36 AM | Last Updated on Fri, Sep 27 2024 3:36 AM

విధులు అప్రమత్తంగా నిర్వహించాలి

● ఎస్పీ గౌస్‌ ఆలం

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పోలీసులు త్వరితగతిన స్పందించాలని ఎస్పీ గౌస్‌ ఆలం అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గల సమావేశ మందిరంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలను సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. పల్లెల్లో వైద్యశిబిరాలు, యువతకు స్పోర్ట్స్‌ కిట్లు అందజేస్తూ టోర్నమెంట్‌ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ ఎస్సై పోలీసు ఉన్నతాధికారి వాహనంలో హెల్మెట్‌, లాఠీ, డాల్‌, బాడీ ప్రొటెక్టర్‌ తదితర వాటిని వెంట ఉంచుకోవాలన్నారు. ప్రతీ స్టేషన్‌లో సోమవారం కవాతు, లాఠీ ఉపయోగం, అత్యవసర సమయంలో స్పందించే విషయాలపై శిక్షణ అందించాలని తెలిపారు. గంజాయి కేసులు, రౌడీ షీట్‌, సస్పెక్ట్‌ షీట్లు, బైండోవర్లు, అట్రాసిటీ, పోక్సో కేసులు, దొంగతనాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు తదితర వాటిపై సమీక్షించారు. పోలీసు స్టేషన్‌లో రికార్డులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్‌, నాగేందర్‌, బి.సురేందర్‌రెడ్డి, సీఐ, ఎస్సైలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement