ఆదిలాబాద్ టౌన్: ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నైతం బాలు అన్నారు. ఇంద్రవెల్లి మండలకేంద్రంలో పరిషత్ నాయకులతోసోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏజెన్సీ చట్టా ల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. 1/70చట్ట ప్రకా రం గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు ఉండవన్నారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శి గెడం శ్రీరాం, ఆదివాసీ ఉద్యోగ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలకంఠ్, రామారావు, సంతోష్, గోవింద్ పాల్గొన్నారు.
ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహించాలని ఎస్పీ గౌస్ ఆలం ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా కార్యక్ర మాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 21న స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీ రుల స్తూపం వద్ద కలెక్టర్‌తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. అలాగే 25న జిల్లా కేంద్రంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 26న స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్ పరేడ్ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మిగతా రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఆన్‌లైన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, విధులు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే అంశాలు, పోలీ సుల ప్రతిభ, తదితర అంశాలపై అవగాహ న కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫొటో, వీడియో గ్రాఫర్లకు, చిన్న డైరెక్టర్లకు, ప్రజలందరికీ పోలీసులు చేసిన సేవలకు సంబంధించినఫొటోలు,రోడ్డుప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు ఇతర సామాజిక అంశాలు, పోలీ సుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసులు చేసే సేవ, ఇతర పోలీసు కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా షార్ట్‌ఫిలిం వీడియోలను రూపొందించాలని సూచించా రు. ఈ ఫొటోలు, వీడియోలను ఈ నెల 23 లోగా వివరాలతో సహా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్‌ఐబీ, ఐటీకోర్ కార్యాలయంలో అందించాలని ఎస్పీ పేర్కొన్నారు.
18న ఫొటో ఎగ్జిబిషన్ పోటీలు
ఆదిలాబాద్: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు అంశాలపై ఫొటో ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్, సంస్కృతి అంశాలపై ఈ పోటీలు ఉంటాయని తెలి పారు. ఈనెల 18న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టీటీడీసీ శిక్షణ కేంద్రంలో వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఔత్సాహికులు రెండు ఫొటోలను 8/12 సైజుకి మించకుండా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఫొటో వెనుక భాగంలో ఫొటోగ్రాఫర్ పేరు, ఫోన్ నంబర్ రాసి ఈనెల 17న మధ్యాహ్నం మూడు గంటలలోపు జిల్లా కేంద్రంలోని స్థానిక పెనుగంగ అతిథి గృహంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 9440816087 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment