విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలి
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూమ్‌టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రెరీని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా జిల్లాలోని ప్రతీ మండలానికి ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవీందర్, సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్, ఎంఈవో శ్రీని వాస్, విజయసారధి, మహేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా పత్తికి ఒకే మద్దతు ధర●
● అధిక ధర ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
● జోగు రామన్నపై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం
ఆదిలాబాద్: సీసీఐ దేశమంతా ఒకే మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేస్తుందని ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి జోగు రామన్న తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పత్తి కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు తాను హైదరాబాద్ నుంచి వచ్చి అధికారులు, వ్యాపారులు, రైతులతో కలిసి చర్చించి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చొరవ చూపానన్నారు. అయినప్పటికీ తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సీసీఐ తక్కువ మద్దతు ధరకు పత్తిని కొంటుందని, అదే గుజరాత్‌లో ఎక్కువ ధరతో కొనుగోలు చేస్తుందని ఆయన విమర్శించడం సరికాదన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గుజరాత్ రాష్ట్రంలోనూ సీసీఐ ఒకే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, ఈ విషయమై స్వయంగా మాజీ మంత్రిని తీసుకువెళ్లి చూయిస్తానని పేర్కొన్నా రు. అక్కడ అధిక మద్దతు ధర ఉంటే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేస్తూ లేఖను అక్కడి నుంచే అసెంబ్లీకి పంపిస్తానన్నారు. ఇందులో నాయకులు అయ్యన్న గారి భూమన్న, బ్రహ్మానంద్, ఆదినాథ్, లాలా మున్నా తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment