● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్‌ 6 నుంచి ప్రారంభం ● తొలి విడతలో గ్రామాలు, వార్డుల వారీగా ఇళ్ల గుర్తింపు ● ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్‌ 6 నుంచి ప్రారంభం ● తొలి విడతలో గ్రామాలు, వార్డుల వారీగా ఇళ్ల గుర్తింపు ● ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ

Published Thu, Oct 31 2024 2:46 AM | Last Updated on Thu, Oct 31 2024 2:46 AM

● రెం

● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్‌ 6 నుంచి ప్రారంభం ● త

పారదర్శకంగా నిర్వహించాలి

కై లాస్‌నగర్‌: నవంబర్‌ 6నుంచి ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి అన్నారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో సర్వేకోసం ఎంపికై న 370 మంది ఎన్యూమరేటర్లు, 37 మంది సూపర్‌వైజర్లకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం శిక్షణఇచ్చారు. మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా అందించిన శిక్షణను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రోజుకు పది కుటుంబాల సమాచారం సేకరించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సర్వేకు అవసరమైన సామగ్రిని అందజేశారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు, అర్బన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, డీఈ తిరుపతి, అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తాంసి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఎన్యూమరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణను అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, ఎంపీడీవో మోహన్‌ రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మి, ఎంపీవో లింగయ్య తదితరులున్నారు.

జైనథ్‌లో ఎన్యూమరేటర్ల శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజర్షి షా

శిక్షణకు హాజరైన ఎన్యూమరేటర్లు

కై లాస్‌నగర్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దా మాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేదిశగా రాష్ట్ర ప్ర భుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. రెండు విడతలుగా నిర్వహించనున్న సర్వేను విజయవంతం చేసేదిశగా యంత్రాంగం సమాయత్తమవుతుంది. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను ఎంపిక చేసిన అధికారులు సర్వే నిర్వహణ తీరుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్యూమరేట్లకు నిర్ణీత ప్రొఫార్మాతో పాటు సర్వేకు అవసరమైన సామగ్రిని అందజేశారు.

రెండు విడతలుగా..

సమగ్ర కుటుంబ సర్వేను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. నవంబర్‌ 1నుంచి 3వరకు తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా (హౌస్‌ లిస్టింగ్‌) చేపట్టనున్నారు. ఎన్యూమరేటర్లు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణంలోని నిర్దేశిత వార్డుల్లో గల కుటుంబాల సమాచారం సేకరించనున్నారు. ఇంటి నంబర్‌, యజమాని పేరు, చిరునామా వంటి వివరాలను నమోదు చేస్తారు. ఆ ఇంటిని సందర్శించినట్లుగా రూపొందించిన ప్రత్యేక స్టిక్కర్‌ను అతికిస్తారు. ఈ సర్వేలో గుర్తించిన ఇళ్ల సంఖ్యకనుగుణంగా 4, 5వ తేదీల్లో సర్వేకు సంబంధించిన ప్రొఫార్మాలను ముద్రించనున్నారు.

6 నుంచి రెండో విడత

రెండో విడతలో భాగంగా నవంబర్‌ 6నుంచి 18 వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీ, వార్డుల డిమాండ్‌ రిజిస్టర్‌ ఆధారంగా కుటుంబాలను నిర్ధారించనున్నారు. వివరాల నమోదు సమయంలో కుటుంబాల సంఖ్య పెరిగినట్‌లైతే బై నంబర్‌తో వారి వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. వీరు ఆయా తేదీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన 56 ప్రశ్నలతో 75 అంశాలతో కూడిన సమ స్త సమాచారాన్ని సేకరించనున్నారు. ఎలాంటి వివరాలు సేకరించాలి, వాటిని ప్రొఫార్మాలో ఏ విధంగా నమోదు చేయాలనే దానిపై జిల్లాలోని ఎన్యూమరేటర్లందరికీ మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పది మంది ఎన్యూమరేటర్లకు సంబంధించిన కుటుంబాలను ఒక బ్లాక్‌గా గుర్తిస్తూ సూపర్‌వైజర్లను నియమించారు. పట్ట ణాల్లో మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు సూపర్‌వైజర్లుగా పర్యవేక్షించనుండగా మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీవోలు, తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు.

నోడల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌

కలెక్టర్‌ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించనున్న స మగ్ర కుటుంబ సర్వే జిల్లా నోడల్‌ అధికారిగా స్థాని క సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా వ్యవహరించనున్నారు. మండల నోడల్‌ అధికారులుగా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు వ్యవహరించనున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే తీరును వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలెక్టర్‌కు వివరాలు నివేదించనున్నారు.

జిల్లా సమాచారం

మండలాలు : 18

కుటుంబాలు : 162,046

జనాభా : 7,08, 972

ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లు : 1816

కేటాయించిన ఎన్యూమరేటర్లు : 1901

సూపర్‌వైజర్లు : 192

వచ్చేనెల 6 నుంచి ..

ఆదిలాబాద్‌టౌన్‌(జైనథ్‌): నవంబర్‌ 6 నుంచి 18 వరకు ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టనున్నట్లు కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. జైనథ్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హాజరై మా ట్లాడారు. ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే చేయాలని ఆదేశించారు. ప్రజలకు ముందుగానే టాంటాం ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. నవంబర్‌ 1 నుంచి 3 వరకు తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా సిద్ధం చేయాలని, 6 నుంచి 18 వరకు ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ శ్యామ్‌సుందర్‌, ఎంపీడీవో వెంకటరాజు, సూపర్‌వైజ ర్లు, ట్రైనర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఆదిలా బాద్‌ రూరల్‌ ఎంపీడీవో సమావేశ మందిరంలో ఇంటింటి కుటుంబ సర్వేపై ఎన్యుమరేటర్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ రాజర్షి షా పరిశీలించారు. ఇందులో మండల ప్రత్యేకాధి కారి పద్మభూషణ్‌రాజు, ఎంపీడీవో నాగేశ్వర్‌ రెడ్డి, తహసీల్దార్‌ గోవింద్‌, ఎంపీవో ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్‌ 6 నుంచి ప్రారంభం ● త1
1/2

● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్‌ 6 నుంచి ప్రారంభం ● త

● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్‌ 6 నుంచి ప్రారంభం ● త2
2/2

● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్‌ 6 నుంచి ప్రారంభం ● త

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement