● కలెక్టర్ రాజర్షిషా ● తుమ్మగూడలో దండారీ ఉత్సవాలకు హాజ
ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి●
ఇంద్రవెల్లి: ఆదివాసీ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని తుమ్మగూడ గ్రామంలో బుధవారం రాత్రి దండారీ ఉత్సవాలు నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అతిథులుగా హాజరయ్యారు. అలాగే కుమురంభీం అసిస్టెంట్ కలెక్టర్ దీపక్‌తివారి, నిజామబాద్ ట్రెయినీ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ముందు గా గ్రామస్తులు అతిథులను సంప్రదాయ వా యిద్యాలు, గుస్సాడీ నృత్యాల నడుమ స్వాగ తం పలికారు. అనంతరం ఏత్మసూర్ దేవతలకు పూజలు నిర్వహించారు. అనంతరం దండారీ ఉత్సవాల నిర్వహణకు ఐటీడీఏ ద్వారా మంజూరు చేసిన రూ.15 వేల చెక్కులను నిర్వహకులకు అందించారు. ఇందులో రాయిసెంటర్ జిల్లా సార్‌మేడీ మెస్రం దుర్గు, ఉట్నూర్ బీఈడ్ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, గ్రామపెద్దలు మాన్కు, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment