కైలాస్‌నగర్: దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ఇంటింటా సిరుల పంట కురి పించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
నవంబర్ 3 వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేత
ఆదిలాబాద్‌టౌన్: దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈనెల 31 నుంచి నవంబర్ 3 వరకు నాలు గు రోజుల పాటు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మధుకర్ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి యార్డులో యథావిధిగా పత్తి కొనుగోళ్లు ఉంటాయని పేర్కొన్నారు. విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు.
ప్రొవిజినల్ జాబితా విడుదల
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ లో భర్తీ చేయనున్న ల్యాబ్ టెక్నీషియన్ 3, పీఎండీటీటీబీహెచ్‌వీ కోఆర్డినేటర్ ఒకటి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఒకటి, సీనియర్ డాట్‌ప్లస్ టీబీహెచ్‌ఐవీ ఒకటి, టీబీహెచ్‌వీ ఒక పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ జాబితాను బుధవారం విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో కృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాను కార్యాలయ నోటీసు బోర్డుతోపాటుhttp://adilabad. telangana. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment